’యాదగిరి’ ఆంధ్రోళ్లకు మోటు.. తెలంగాణోళ్లకు మోజు!
`‘యాదాద్రి’ పేరును స్వాగతించలేకపోతున్న ప్రజలు
` ‘యాదగిరి’ ఆన్యపు కాయ.. ‘యాదాద్రి’ సోరకాయ
` సమైక్య రాష్ట్రంలో ‘యాదగిరి’ అంటేనే ఓ కామెడీ
` స్వరాష్ట్రంలో కూడా ‘ఆంధ్ర’తత్వమేనా?!
` ‘ఆంధ్ర స్వావిూజీ మాటలు కాకుండా స్థానికుల అభిప్రాయాన్ని గౌరవించాలి’ అంటున్న నర్సన్న భక్తులు, తెలంగాణావాదులు
` ‘జనంసాక్షి’ సర్వే వెల్లడి
హైదరాబాద్ (జనంసాక్షి) : రాష్ట్ర రాజధాని నగరానికి కేవలం అరవై కిలోవిూటర్ల దూరంలో నెలకొని ఉన్న అతి పురాతనమైన ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రతీయేటా లక్షలాది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. త్రేతాయుగంలోనే నెలకొల్పబడిరదని చెప్పుకునే ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి భక్తుల ఆదరణ గణనీయంగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి పాలకులు దేవాలయ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదు, పైగా యాదగిరి గుట్ట అంటేనే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఆనాడు చిత్రీకరించారు. కనీసం నగరపాలక స్థాయికి కూడా మార్చలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనతికాలంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో ‘యాదగిరి గుట్ట’ మొత్తం రూపురేఖలు మార్చుకొని నేడు ఆహ్లాదకర వాతావరణంలో వర్ధిల్లుతోంది. దాదాపు 1800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్మిర్మించిన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లబోతోంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా భాసిల్లేలా ఈ క్షేత్రాన్ని అభివృద్ది చేశారు. ఆలయ పునర్నిర్మాణం జరిగిన తీరుతో పాటు మొత్తం యాదగిరిగుట్టను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన తీరును స్థానికులతో పాటు ప్రతీ ఒక్కరు ప్రసంశిస్తున్నారు. అదే సమయంలో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మించబడిన ‘యాదగిరి’ గుట్టను స్థానికులతో పాటు యాదగిరి నర్సన్న భక్తులు ‘యాదాద్రి’గా సంబోదించలేకపోతున్నారు. తమ తాత ముత్తాతల కాలం నుండి అనాదిగా పిలుచుకుంటున్న ‘యాదగిరి’ గుట్టను వేరే పేరుతో పిలవలేమని, తమ ప్రాంతంలో దాదాపు ఇంటికో యాదగిరి ఉంటాడని, యాదగిరి పేరుతో తమకు విడదీయలేని అనుబంధమని గుట్ట పరిసరవాసులతో పాటు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి భక్తులు పేర్కొంటున్నారు. మరోవైపు పలువురు సామాజికవాదులతో పాటు తెలంగాణావాదులు కూడా యాదగిరిని యాదాద్రిగా మార్చడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా ఆధిపత్యం చెలాయించిన సినీరంగంలో ‘యాదగిరి’ అంటేనే తెలంగాణగా, తెలంగాణ అంటేనే యాదగిరిగా వెటకార ధోరణిలో చిత్రీకరించారని గుర్తుచేస్తున్నారు. యాదగిరిని ఆంధ్రోళ్లు మోటుగా భావించారని, చారిత్రక నేపథ్యం ఉన్న యాదగిరి పట్ల తెలంగాణోళ్లకు ఎప్పటికీ మోజు తగ్గదని తెలంగాణ అభిమానులు పేర్కొంటున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ‘యాదగిరి’కి కూడా చరిత్రలో సుస్థిర స్థానం కల్పించాలని ‘జనంసాక్షి’ కోరుకుంటోంది.
విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
` రాహుల్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ..
దిల్లీ,(జనంసాక్షి) :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో దిల్లీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రులతో పాటు మొత్తం 39 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న రాహుల్.. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకొని వారికి దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మనస్పర్ధలు, విభేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చెప్పాలని.. ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన మాట్లాడొద్దని హితవుపలికారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. ఏదైనా ఉంటే తనతో గానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో గానీ మాట్లాడాలని నేతలకు సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు విూడియాతో మాట్లాడుతూ.. ‘’రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరికీ రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌కు శషబిషలు లేవు. కేసీఆర్‌ను ఓడిరచడమే లక్ష్యంగా పోరాడతాం. మతం ముసుగులో భాజపా రాజకీయం చేస్తోంది. సమాజంలో చీలిక తెచ్చేందుకు తెరాస, భాజపాలు యత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలందరూ ఒకే గొంతుకై పోరాడుతాం. తెలంగాణలో ప్రతి తలుపు తడతాం. తెరాస, మజ్లిస్‌తో పొత్తు ఉండదని రాహుల్ సమక్షంలో నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ సమక్షంలోనే అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తాం. ఎన్నికలకు 6 నెలల ముందే టికెట్లు కేటాయిస్తాం. ఐకమత్యంతో ఉంటూ తెరాస, భాజపాలను ఓడిస్తాం. రాష్ట్రానికి రావాలని రాహుల్‌గాంధీని ఆహ్వానించాం. వీలైనన్ని ఎక్కువ సార్లు రాష్ట్రంలో పర్యటిస్తానని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం’’ అని నేతలు పేర్కొన్నారు.టికెట్ల ప్రకటనపై భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడారు. పలు విషయాలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చిన కోమటిరెడ్డి.. భేటీ ముగియక ముందే బయటకు వచ్చారు. దీనిపై కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘’దిల్లీ వర్సిటీలో తెలుగు విద్యార్థులతో భేటీ కోసం బయటకు వచ్చాను. జిల్లాల్లో పార్టీ బలోపేతం, పీసీసీ చీఫ్ వ్యవహారశైలిపై రాహుల్‌తో మాట్లాడాను. ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ఖరారు చేసి కార్యాచరణ చేపట్టాలని కోరాను. కరీంనగర్ జిల్లాలో ఒకటి రెండు చోట్ల పీసీసీ చీఫ్ ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాను. కరీంనగర్ జిల్లా నేతలు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డితో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారు. అభ్యర్థుల ప్రకటనకు అధిష్ఠానం అనుమతి ఇచ్చిందా? ముందే అభ్యర్థుల ప్రకటనతో సీనియర్లపై ఒత్తిది పెరుగుతోంది. కాంగ్రెస్ పంథాలోనే ముందుకు పోవాలి కదా’’ అని కోమటిరెడ్డి ఆసహనం వ్యక్తం చేశారు.
1.టీఆర్‌ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ
` 11న నిర్వహించే ఆందోళనపై చర్చ
` లోక్‌సభలో ఆందోళనపై ముఖ్యమంత్రి ఆరా
న్యూఢల్లీి,ఏప్రిల్ 4(జనంసాక్షి): ఢల్లీిలో టీఆర్‌ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించారు. వీటితో పాటు ఢల్లీి వేదికగా టీఆర్‌ఎస్ పార్టీ చేయాల్సిన నిరసనల కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢల్లీిలో నిరసన కార్యక్రమం చేపట్టాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢల్లీి పర్యటనకు ఆదివారం సీఎం కేసీఆర్ వచ్చారు. రైతులు పండిరచిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్‌ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదిలావుంటే వడ్లుకొనాల్సిందే నంటూ సోమవారం లోక్‌సభలో ఎంపిలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేపట్టారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడిరది. అనంతరం విూడియాతో మాట్లాడిన ఎంపిలు కేంద్రం తీరును తప్పుపట్టారు. మంత్రిపీయూష్ గోయల్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.
2.అబద్ధాల పునాదులపై బీజేపీ అధికారంలోకి..
` గోబెల్స్ వారసత్వాన్ని నమ్ముకున్న ఏకైకపార్టీ భాజపా
` మంత్రి నిరంజన్‌రెడ్డి
` పోరుబాటలో టీఆర్‌ఎస్
` రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన దీక్షలు
` వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్
` కేంద్రంతో అవిూతువిూకి సిద్ధమన్న నేతలు
మహబూబ్‌నగర్,ఏప్రిల్ 4(జనంసాక్షి): కేంద్రంలోని బీజేపీ పార్టీ వందేళ్ల అబద్దాలను అప్పుడే చెప్పేసింది. అధికారం కోసం అబద్దాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని మూసాపేట మండల కేంద్రంలో కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలనే నినానదంతో టీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ రైతులతో సమావేశం నిర్వహించి కేంద్రం రైతుల పంటలు కొనడం లేదని, తాము అధికారంలోకి వస్తే రైతులు పండిరచిన అన్ని పంటలు కొంటామని చెప్పారు.కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రణాళికాబద్ధంగా అబద్దాలతో ప్రజలను నమ్మించారని ధ్వజమెత్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ చెప్పిన మాటల ఆధారాలను మంత్రులు, ఎంపీల బృందం చూపితే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మొహంలొ నెత్తురు చుక్క లేదు. కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా దేశంలోని రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలన సరిగా లేకుంటే ప్రజలు శిక్షిస్తారు. విూ శాపనార్థనాలతో కేసీఆర్‌కు ఒరిగేది ఏవిూ లేదన్నారు. వెయ్యేళ్ల కింద రాజులు కట్టిన దానికంటే రెట్టింపుగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు. దేశమంతా తిరిగి బీజేపి బండారాన్ని బయటపెడతామన్నారు. ధాన్యం కొనే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్ ఆందోళనలు
ధాన్యంకొనుగోళ్లపై కేంద్రవైఖరనిని ఎండగడుతూ టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు శ్రీకరాం చుట్టింది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండిరచిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సమాయత్తమైంది. రైతులు పండిరచిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్‌ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు చేపట్టారు.కేంద్రం తీరుపై నేతలు మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతులపై కోకట్టిందని పలువురు మంత్రులు ఆరోపించారు. బిజెపికి బుద్ది చెప్పే రోజు వస్తుందని అన్నారు. మంత్రులు గంగుల కమలాకర్,ఎర్రబెల్లి దయాకర్ రావు,ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరుల ధర్నాల్లో పాల్గొ న్నారు. సోమవారం మండల కేంద్రాల్లో దీక్షలతో మొదలయ్యే పోరాటం 11వ తేదీన ఢల్లీిలో నిర్వహిం చే దీక్షతో రణ నినాదం చేయనున్నది. వడ్ల కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నదే టిఆర్‌ఎస్ లక్ష్యమని నేతలు తెలిపారు. తెలంగాణ పండిరచిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సిద్దమని ప్రకటిం చారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్లపై సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఉద్యమం ప్రారంభం అయ్యింది. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటుగా మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో దీక్షల్లో పాల్గొన్నారు. రైతుల ఆకాంక్షలను కేంద్రానికి తెలిపి, రాజకీయాలను పక్కకు పెట్టి వడ్లను కొనుగోలుచేసే విధంగా నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణపై సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ నాయకులకు దిశానిర్దేశంచేశారు. యాసంగిలో వరి వేయాలని, సీఎం కేసీఆర్‌తో సంబంధం లేకుండా ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టిన వీడియోలను ప్రజలు, రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించడానికి ప్రయత్నిస్తే బీజేపీ నేతలు వరివేసేలా రెచ్చగొట్టి ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తేసిన వైనాన్ని రైతులకు టీఆర్‌ఎస్ నేతలు వివరిస్తున్నారు. తెలంగాణను, ఇక్కడి ప్రజలను, రైతులను పదే పదే అవమానించేలా, అవహేళన చేసేలా మాట్లాడుతున్న నాయకులు, కేంద్రం వైఖరిని రైతులకు వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి, రాష్ట్ర మంత్రులకు పనిలేకుండా ఢల్లీికి వస్తున్నారా అంటూ కేంద్ర మంత్రి గోయల్ చేసిన వ్యాఖ్యలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఆహార భద్రత చట్టానికి మార్పులు తీసుకువస్తే లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని, వన్ నేషన్ వన్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని తీసుకురావాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్నది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉభయ సభలు ముగిసే వరకు నిరసనలను కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి స్పందన వచ్చే వరకు ఇదే విధమైన కార్యాచరణతో ముందుకువెళ్లనున్నారు. కేంద్రం వడ్లను కొనాలని ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్ మొదటి దశ ఉద్యమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ, ఎంపీపీ, జడ్పీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో తీర్మానాలుచేసి ప్రధాని, కేంద్ర మంత్రి గోయల్‌కు పంపించారు. కేంద్రమంత్రిని కలిసి వడ్లను కొనాలని రాష్ట్ర మంత్రుల బృందం కోరిం ది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండో విడత కార్యాచరణను అమలు చేస్తున్నారు. సోమవారం మండల కేంద్రాల్లో నిరసన అనంతరం ఈ నెల 6న రాష్ట్రంలోని ప్రధానమైన నాలుగు జాతీయ రహదారులు నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకో చేపడతామని తెలిపారు. 7న హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నారు. 8న రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తారు. ప్రతి రైతు, ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త, నాయకుల ఇండ్లపై నల్లా జెండాను ఎగురవేస్తారు. ఈనెల 11న ఢల్లీిలో నిరసన దీక్ష చేపట్టనున్నారు.
4.స్థానిక సంస్థల్లో ఖాళీ స్థానాలకు ఎన్నికలు..
` 8న ముసాయిదా :రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
హైదరాబాద్,ఏప్రిల్ 4(జనంసాక్షి):తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న పలు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్ల స్థానాలకు ఎన్నికల నిర్వహణ దిశగా ఎస్‌ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దృశ్యమాధ్యమ సవిూక్ష నిర్వహించారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సవిూక్షలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశామన్న ఎస్‌ఈసీ... ఈ నెల 8వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురించాలని ఆదేశించారు. 2022 జనవరి ఒకటో తేదీ ప్రాతిపదికగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన జాబితా ఆధారంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలు రూపొందించాలని, 24న ఓటర్ల తుది జాబితా విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించారు.వార్డు సరిహద్దులను తప్పక పాటించాలన్న ఎస్‌ఈసీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వార్డు ఓటరును మరో వార్డు జాబితాలో చేర్చరాదని స్పష్టం చేశారు. ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలని.. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి కూడా తీసుకొని పరిష్కరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా ఓటర్ల జాబితా రూపొందించాలన్ని ఆదేశించారు. ఎన్నికలు సాఫీగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ చెప్పారు. ఓటర్ల జాబితా సిద్ధమయ్యాక పోలింగ్ స్టేషన్ల ఖరారు కోసం షెడ్యూలు విడుదల చేస్తామని తెలిపారు. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొంది ఎన్నికల నిర్వహణకు తేదీలు ప్రకటిస్తామని ఎస్‌ఈసీ పార్థసారథి వెల్లడిరచారు.
5.ముదిరిన శ్రీలంక సంక్షోభం
` మంత్రివర్గం రాజీనామా
` మంత్రి పదవులు స్వీకరించాలని ప్రతిపక్షాలను కోరిన శ్రీలంక అద్యక్షుడు
కొలంబో,ఏప్రిల్ 4(జనంసాక్షి): శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం.. రాజకీయ సంక్షోభానికి దారితీస్తోంది. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆదివారం శ్రీలంక పార్లమెంట్‌లో కేబినెట్ మంత్రులందరూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.దీంతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రతిపక్షాల పార్టీలను ఆహ్వానించడం గమనార్హం. కేబినెట్‌లో చేరి పదవులు చేపట్టాలని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోమవారం ప్రతిపక్ష పార్టీలకు లేఖ రాశారు.’’అనేక ఆర్థిక కారణాలు, ప్రపంచ పరిణామాల కారణంగా దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను సత్వరం పరిష్కరించాలంటే మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడిరది. దేశ ప్రజల ప్రయోజనాల కోసం, భావి తరాల అభ్యున్నతి కోసం ప్రభుత్వంతో కలిసేందుకు ముందుకు రండి. కేబినెట్‌లో చేరి మంత్రి పదవులు స్వీకరించండి’’ అని గొటబాయ రాజకపక్స ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.శ్రీలంక కేబినెట్‌లో 26 మంది మంత్రులు నిన్న రాత్రి అనూహ్యంగా తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రుల మూకుమ్మడి రాజీనామాకు ఎవరూ కారణాలను వెల్లడిరచకపోయినా, ప్రజల ఒత్తిడి మేరకే వారు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మహీంద రాజపక్స మాత్రం తన పదవిలో కొనసాగుతున్నారు. సోమవారం నూతన మంత్రివర్గం ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.మంత్రుల రాజీనామా శ్రీలంక స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అటు సంక్షోభం.. ఇటు నిరసన జ్వాలల నేపథ్యంలో సోమవారం ఉదయం శ్రీలంక స్టాక్ ఎక్స్ఛేంజ్ కుప్పకూలింది. ట్రేడిరగ్ మొదలైన క్షణాల్లోనే బ్లూ చిప్ సూచీ 5.92శాతం కుంగింది. దీంతో ట్రేడిరగ్‌ను నిలిపివేశారు.
సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా..
మరోవైపు శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివర్ద్ కాబ్రాల్ తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులందరూ రాజీనామా చేసిన నేపథ్యంలో తాను కూడా గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు.శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. నిత్యావసరాలు, అత్యవసరాల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్, కూరగాయల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహరం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. ప్రధాని, అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.
6.పాక్ ఆపధర్మప్రధానిగా మాజీ న్యాయమూర్తి
మాజీ జడ్జి షేక్ అజ్మత్ సయీద్ పేరును ప్రతిపాదించిన పిటిఐ
రాజకీయ సంక్షోభంపై విచారణ మొదలుపెట్టిన పాక్ సుప్రీంకోర్టు
అవిశ్వాస తీర్మనంపై విచారణ నేటికి వాయిదా
ఇస్లామాబాద్,ఏప్రిల్ 4(జనంసాక్షి): పాకిస్తాన్‌లో తారాస్థాయికి చేరుకున్న రాజకీయ సంక్షోభంతో ఆ దేశ జాతీయ అసెంబ్లీని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి రద్దు చేశారు. అనంతరం పాకిస్తాన్ ఆపధర్మ ప్రధానమంత్రి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. కాగా, సుప్రీంకోర్టు మాజీ జడ్జి షేక్ అజ్మత్ సయీద్ పేరును ఆపధర్మ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీపుల్స్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ప్రతిపాదించింది. మరో 90 రోజుల్లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు అజ్మత్ సయీద్‌నే పాక్ ఆపధర్మ ప్రధనిగా కొనసాగించాలని పీటీఐ భావిస్తోంది. జాతీయ అసెంబ్లీలో విపక్షాలన్నీ ఏకమై ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. ప్రధాని సొంత పార్టీ పీటీఐ నుంచి కూడా అర డజను మందికి పైగా సభ్యులు ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. అయితే ఇమ్రాన్ వారందరికీ షాకిచ్చారు. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సురీ ఆదివారం అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. విపక్షాలు ప్రవేశ పెట్టిన తీర్మానం రాజ్యాంగానికి, పాకిస్తాన్ నిబందనలకు విరుద్ధమని ప్రకటించారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సభను రద్దు చేసే హక్కు డిప్యూటీ స్పీకర్‌కు లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ పక్ష వాదనను సుప్రీం మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు విననుంది. మరోవైపు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు తనపై మూడున్నర ఏళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు కోట్లాది రూపాయలు వెచ్చించి సభ్యులను కొనుగోలు చేసేందుకు యత్నించాయని, తన ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నాయని ఇమ్రాన్ చెప్పారు. ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ఇస్లామాబాద్‌లో నేడు ధర్నా చేస్తానని ఇమ్రాన్ ప్రకటించారు. తాను అమెరికాకు స్నేహ హస్తం అందించినా తనను నమ్మడం లేదని, తనకు విలువ ఇవ్వడం లేదని ఇమ్రాన్ వాపోయారు. 90 రోజుల్లో ఎన్నికలు ఖాయమని భావిస్తోన్న ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ టికెట్లపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ నేతలతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ప్రతిపక్షాలు నిన్న ఉదయం అవిశ్వాస తీర్మానం పెట్టగా పాక్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ తిరస్కరించారు. అనంతరం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభను రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్ అలీకి సిఫార్సు చేశారు. ఇమ్రాన్ ప్రభుత్వ సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అలీ సభను రద్దు చేశారు. ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు సభ రద్దు నేపథ్యంలో ఇమ్రాన్ ప్రధానిగా నిర్ణయాలు తీసుకోలేరని పాక్ కేబినెట్ సెక్రటేరియట్ స్పష్టం చేసింది.
7.ఫుడిరగ్ అండ్ మింక్ పబ్, బార్ లైసెన్స్ రద్దు
హైదరాబాద్,ఏప్రిల్ 4(జనంసాక్షి):బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడిరగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్‌గా స్పందించారు. అయితే ఫుడిరగ్ అండ్ మింక్ పబ్ యాజమాన్యం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో పబ్, బార్ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్.. సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఫుడిరగ్ అండ్ మింక్ పబ్, బార్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా హోటల్‌లో సమన్వయ సమావేశం నిర్వహించామని మంత్రి గుర్తు చేశారు. పబ్‌లలో డ్రగ్స్ వినియోగం జరగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని గత సమావేశంలోనే మంత్రి హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగంపై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. నిబందనలు పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిన్నటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.డ్రగ్స్ నిర్మూలనలో భాగంగానే రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడిరగ్ అండ్ మింక్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిబంధనలు పాటించని అన్ని పబ్‌లు, బార్‌లపై నిరంతరం దాడులను కంటిన్యూ చేస్తామని తేల్చిచెప్పారు. డ్రగ్స్ రాకెట్‌కు సంబంధం ఉన్న ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా శిక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అందులో భాగంగా డ్రగ్స్‌తో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆబ్కారీ శాఖ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కంటిన్యూగా పబ్, బార్లపై నిఘా పెట్టి ఎవరైతే నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
8.మీరే ఉద్యోగాలివ్వాలి
`ఆ స్థాయికి ఎదగాలి
` విద్యార్థులకు కేటీఆర్ ఉద్భోధ
హైదరాబాద్,ఏప్రిల్ 4(జనంసాక్షి): ప్రతి విద్యార్థి, టీచర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రాన్ని మరిచిపోకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ కావాలని, అప్ స్కీల్, రీస్కిల్ చేసుకోకపోతే వెనుకబడిపోతామని కేటీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021`22 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను మంత్రులు పరిశీలించారు. విద్యార్థుల ఆవిష్కరణలను ఆసక్తిగా అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా తర్వాత చాలా పెద్ద ఎత్తున విద్యాశాఖ నేతృత్వంలో, ఐటీ శాఖ సహకారంతో చేసిన ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న పిల్లల్లో సృజనాత్మకత అధికంగా ఉంటుంది. చాలా ప్రయోగాలు చేస్తుంటారు. వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఊరికి వెళ్లినప్పుడు.. చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాళ్లం. చిన్న చిన్న బల్బుల్లో ఫిలమెంట్ తీసేసి, నీళ్లు పోసి, రకరకాల కలర్లు వేసి రిప్లెక్టింగ్ చేసేవాళ్లం. ఆ మాదిరిగానే చాలా మంది చిన్న పిల్లలు ప్రయోగాలు చేసి, అందులో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం, ఉత్సుకతతో ముందుకు వెళ్తుంటారని కేటీఆర్ తెలిపారు. మూడు నాలుగేండ్ల కింద జపాన్‌లోని సుజుకి కంపెనీ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాం. సుజుకి మ్యూజియం చూపించారు. అక్కడ తిరుగుతుంటే.. మొదటి బైక్ తయారీ వివరాలు కనిపించాయి. అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. రెండు, మూడు తరగతులకు చెందిన 30 నుంచి 40 మంది స్కూల్ పిల్లలు ఆ మ్యూజియంలో తిరుగుతున్నారు. వారందర్నీ అక్కడి తిప్పి చూపిస్తున్నారు. ఆ పిల్లలు ఏం పరిశీలిస్తున్నారో అర్థం కాక అక్కడ పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ను అడిగాను. గమనించాలని వారు సూచించారు. వెండిరగ్ మిషిన్స్‌ను పిల్లలు పరిశీలిస్తు న్నారు. ఒక వస్తువు తయారీకి సంబంధించిన వివరాలను చూపిస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఆ దేశంలో భూకంపాలు, సునావిూలు ఉంటాయి. ప్రకృతి అనుకూలతలు లేవు. సరిగా నీళ్లు ఉండవు. ఇవన్నీ లేకున్నప్పటికీ వారికి బ్రెయిన్ పవర్ ఉంది. ఆసియా ఖండంలోనే ఒక శక్తిగా, ఆర్థికంగా ఎదిగారు. జపాన్ పిల్లలకున్న సృజనాత్మకతను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. మన పిల్లలకు బియ్యం ఎక్కడ్నుంచి వస్తాయో తెలియదు. పాల ఉత్పత్తి కూడా తెలియదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు వారిని డాక్టర్, ఇంజినీర్ అవుతావా? అని అడిగి మూస ధోరణిలో వెళ్తారు. సహజంగా ఉండే తెలివికి పదును పెడితే.. విూరు ఒకరి దగ్గర పని చేయడం కాదు.. విూరే వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. పిల్లలకు ఇష్టమున్న కోర్సులను చదివించాలని కేటీఆర్ సూచించారు. ఇన్నోవేషన్‌కు పెద్దపీట వేస్తున్నాం. రూరల్, సోషల్ ఇన్నోవేటర్లు ముందుకు రావాలి. టెక్నాలజీకి సంబంధించి టీ హబ్ ఏర్పాటు చేశాం. హార్డ్ వేర్‌కు సంబంధించి టీ వర్క్స్ ఏర్పాటు చేసుకున్నాం. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీహబ్ అందుబాటులోకి తెచ్చాం. ఇన్నోవేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇండస్ట్రీని సైంటిఫిక్ ల్యాబ్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు రిచ్ అనే సంస్థను ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కొత్తగా యూత్ హబ్ ను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ యూత్ హబ్‌ను రూ. 6 కోట్ల ఫండ్‌తో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయి. టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్‌ను ప్రారంభించుకున్నాం. మన ఊరు `మన బడి కార్యక్రమం కింద 12 రకాల అంశాలను ప్రవేశపెట్టాం. అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. కరోనా సమయంలో తలెత్తిన ఇబ్బందులు భవిష్యత్‌లో రాకుండా అత్యుత్తమ బోధన అందించేందుకు డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. మన ఊరు మన బడి దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు. కొత్త పోకడలు పోతున్న విద్యా వ్యవస్థ పట్ల టీచర్లకు కూడా అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ లో శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా రూపాంతరం చెందే పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారిలో ఉన్న ఆలోచనాశక్తికి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల్లో ఉన్న మేథాశక్తిని వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరికంలో ఉన్న పిల్లలను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారు. యునిసెఫ్ సహకారంతో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాల న్నారు. సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ విజేతలుగా నిలిచిన విద్యార్థులందరూ భవిష్యత్‌లో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.
9.పీయూష్ గోయల్‌పై సభాహక్కుల నోటీసు..
` కేంద్రం ప్రతి అంశాన్నీ వ్యాపార కోణంలోనే చూస్తోంది: కె.కేశవరావు
దిల్లీ,ఏప్రిల్ 4(జనంసాక్షి): కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దేశాన్ని తప్పుదోవ పట్టించారని తెరాస ఎంపీలు ఆరోపించారు. డబ్ల్యూటీవో ఆంక్షలతో పారా బాయిల్డ్ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదంటూ ఇటీవల రాజ్యసభలో పీయూష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు అబద్ధమని పేర్కొంటూ ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన లేఖను రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. రూల్ 187 కింద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెరాస ఎంపీలు తెలిపారు.కాగా బియ్యాన్ని ఎగుమతి చేయట్లేదంటూ కేంద్రం అబద్ధాలు చెప్తోందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) ఆరోపించారు.పారా బాయిల్డ్ రైస్‌ను కేంద్రం ఎగుమతి చేస్తోందని.. అలాంటప్పుడు తెలంగాణలో ధాన్యం ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నించారు. దిల్లీలో తెరాస ఎంపీలతో నిర్వహించిన విూడియా సమావేశంలో కేకే మాట్లాడారు.గత ఏడేళ్లుగా దేశంలో ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందని.. కేంద్రం ప్రతి అంశాన్నీ వ్యాపారం, లాభం కోణంలోనే చూస్తోందని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలును ప్రజా సంక్షేమం కోణంలో చూడాలని కేంద్రాన్ని కోరామన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు పారా బాయిల్డ్ రైస్ అడుగుతున్నాయని.. ఇలాంటి సమయంలో కేంద్రం సేకరించి ఆయా దేశాలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ కేంద్రమంత్రులను బెదిరించలేదని..ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి మాత్రమే చేశామన్నారు.’’తెలంగాణకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ధర్మ యుద్ధం నడుస్తోంది. యాసంగిలో బ్రోకెన్ రైస్ పండుతుందని కేంద్రానికి తెలుసు. దశాబ్దాలుగా ఎఫ్‌సీఐ కూడా సేకరిస్తోంది. ఆహార భద్రతలో సేకరించేది ఎగమతి చేయొద్దని కేంద్ర మంత్రి చెప్పారు. ఎగుమతి అనేది కేంద్రం పరిధిలోని అంశం. రాయితీలు ఉన్నవాటిని ఎగుమతి చేయలేమన్నారు. 110 దేశాలకు పారా బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతికి అవకాశం ఉంది.. అక్కడ మార్కెట్ కూడా ఉంది. పారాబాయిల్డ్ రైస్‌కు బయట దేశాల్లో మార్కెట్ ఉంది. మార్కెట్ ఉన్నప్పటికీ పారా బాయిల్డ్ రైస్ ఎందుకు పంపట్లేదు? కేంద్రం ఒప్పుకునే వరకు మా యుద్ధం కొనసాగుతుంది’’ అని కేకే స్పష్టం చేశారు.
10.రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిస్థాయి అనుమతులివ్వలేదు
` కేంద్రం
దిల్లీ,ఏప్రిల్ 4(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పూర్తిగా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. వైకాపా ఎంపీ మాధవి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సవరణలు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం జగన్ నుంచి 3 లేఖలు వచ్చాయని పేర్కొన్నారు. వాటిలో 4 అంశాలపై వివరణ కోరుతూ రాష్ట్రానికి తిరిగి 2 లేఖలు రాసినట్లు వెల్లడిరచారు. వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా సరైన జవాబు రాలేదని కేంద్ర మంత్రి వివరించారు.
11.బుచ్చా మరణకాండతో చర్చలు కష్టమే!..
` ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
కీవ్,ఏప్రిల్ 4(జనంసాక్షి):కీవ్ పరిసరాల్లో రష్యా బలగాలు చేసిన దారుణాలు.. ఆ దేశంతో చర్చలపై ప్రభావం చూపగలవని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. సోమవారం బుచ్చాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ‘రష్యా సేనలు ఇక్కడ ఏం చేశాయో చూస్తుంటే.. చర్చలు కొనసాగించడం చాలా కష్టంగా తోస్తోంది’ అని వ్యాఖ్యానించారు. బ్యారెళ్లు, నేలమాళిగల్లో.. గొంతు కోసిన, హింసించిన స్థితిలో మృతదేహాలు బయటపడ్డాయన్నారు. ‘ఇవి యుద్ధ నేరాలు. ప్రపంచం వీటిని నరమేధంగా గుర్తిస్తుంది’ అని అన్నారు.రష్యా బలగాల ఎడతెగని భీకర దాడులతో మేరియుపొల్ నగరం ఉక్కిరిబిక్కిరవుతోన్న విషయం తెలిసిందే. దీంతో నగరంలోని అన్ని మౌలిక సదుపాయాలు దాదాపు నాశనం అయ్యాయని మేయర్ వాదిమ్ బోయ్చెంకో చెప్పారు. ‘విషాదకరమైన వార్త ఏంటంటే.. నగరంలోని 90 శాతం మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 40 శాతం సదుపాయాల పునరుద్ధరణ అసాధ్యం’ అని ఆయన ఓ వార్తా సమావేశంలో చెప్పారు. నగరంలో దాదాపు 1.30 లక్షల మంది చిక్కుకుపోయారని వెల్లడిరచారు.రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ను వీడిన పౌరులు.. తిరిగి నగరానికి చేరుకునేందుకు మరికొన్ని రోజులు వేచి ఉండాలని స్థానిక మేయర్ విటాలి క్లిట్ష్కో కోరారు. ప్రస్తుతం దారంతా సురక్షితంగా లేదని హెచ్చరించారు. ‘ఒకవైపు కీవ్ ప్రాంతంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉంది. మరోవైపు.. కీవ్ సవిూప పట్టణాల్లో రష్యన్ బలగాలు మందుపాతరలు అమర్చి ఉండొచ్చు. దీంతోపాటు పేలుడు పదార్థాలూ ఉండొచ్చు’ అని అన్నారు. రష్యన్ బలగాలు ఇటీవల ఈ నగరం నుంచి వెనక్కివెళ్లిపోయిన విషయం తెలిసిందే.రష్యా బలగాల చెరలో ఉన్నప్పుడు వారు తమతో వ్యవహరించిన తీరు జెనీవా ఒప్పందాలను ఉల్లంఘించినట్లు ఉందని ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు తెలిపారని ఉక్రెయిన్ మానవ హక్కుల అంబుడ్స్వుమన్ లియుడ్మిలా దెనిసోవా వెల్లడిరచారు. తమను నేలమాళిగల్లో ఉంచారని, ఆహారం ఇవ్వలేదని, యూనిఫాంలను తీయించారని కొంతమంది మాజీ ఖైదీలు చెప్పారన్నారు. యుద్ధ ఖైదీల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై జెనీవా ఒప్పందం చట్టపరమైన ప్రమాణాలను ఏర్పాటు చేసింది. అయితే, దెనిసోవా వ్యాఖ్యలపై రష్యా ఇంకా స్పందించలేదు.మాస్కో బలగాలు పౌరులపై అకృత్యాలకు పాల్పడ్డాయన్న ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తోసిపుచ్చారు. బుచ్చాలో జరిగిన ఊచకోతపై కీవ్ చేసిన వాదనలను.. రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యలుగా అభివర్ణించారు. ఐరాస అండర్ సెక్రెటరీ జనరల్ మార్టిన్ గ్రిఫిత్స్తో చర్చల ప్రారంభంలో లావ్రోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ఆరోపణలు ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు. ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ) అత్యవసర సమావేశం కోసం రష్యా తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని వెల్లడిరచారు.