all news

 

1.నల్లజెండాలతో నిరసనల హోరు
` 11న ఛలో ఢల్లీి
` ఉధృతమవుతున్న రైతాంగ ఉద్యమం
` రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ నిరసన కార్యాక్రమాలు
` ధాన్యం కొనేవరకు పోరు ఆగదన్న నాయకులు
` ఇండ్లపై నల్ల జెండాలు ఎగగురేసిన మంత్రులు
` గ్రామాల్లో నిరసనర్యాలీలతో హోరెత్తిన ఆందోళనలు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లాలవ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఉధృతం చేసింది. పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేస్తూ పోరాటాలకు దిగింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ..శవయాత్రలు నిర్వహించారు. బీజేపీ వ్యతిరేకంగా గ్రామాల్లో నల్ల జెండాలు ఎగుర వేస్తూ ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం వేల్పూర్‌ మండల కేంద్రంలోని తన ఇంటిపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నల్ల జెండా ఎగరవేశారు. తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అలాగే తన ఇంటిపై మంత్రి గంగుల కమలాకర్‌ నల్ల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీసం బీజేపీ రైతుల కోసమైనా ధాన్యం కొనాలన్నారు. బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి కొనుగోళ్ల బాధ్యతను తీసుకోవాలన్నారు. ఇన్ని ఆందోళనలతో అయినా కేంద్రం కళ్లు తెరవాలన్నారు. హర్యానా, పంజాబ్‌ కంటే ఇంకా తీవ్రంగా రైతు ఉద్యమం చేస్తామ న్నారు. పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో గ్రామాల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నల్ల జెండాలు రెపరెపలాడుతున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల పక్షానా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా ఈ నల్లజెండాను ఎగురవేశామన్నారు. సీయం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నల్లజెండాలను ఎగురవేసి రైతులకు సంఫీుభావం తెలపాలని కోరారు. తెలంగాణ రైతన్నలు పండిరచిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్షను వీడనాడాలని డిమాండ్‌ చేశారు. వడ్లు కొనేదాకా రైతుల తరపున కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఊరూరా ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేలని, గ్రామ కూడళ్లలో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసి ఢల్లీి వరకు ఈ నిరసన సెగలు తాకేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నిరసర కార్యక్రమంలో భాగంగా నల్లగొండలోని తన నివాసంపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి ఉదయాన్నే నల్లజెండా ఎగుర వేశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నల్లజెండా ఎగురువేశారు. రైతులు పండిరచిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

 

2.మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):టీఎస్‌ ఆర్టీసీ మరోసారి బస్సు ఛార్జీలు పెంచింది. ఇప్పటికే రౌండప్‌, టోల్‌ ప్లాజాలు, పాసింజర్స్‌ సెస్‌ పేరిట ఛార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా డీజిల్‌ సెస్‌ పేరుతో మరోసారి పెంచింది.పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్‌ సెస్‌ కింద రెండు రూపాయలు, ఎక్స్‌ ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ రూ.10 కొనసాగుతుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతి రోజూ ఆర్టీసీ 6లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుందని, ఇటీవల కాలంలో చమురు ధరలు అమాంతంగా అసాధారణ రీతిలో పెరిగిపోవడంతో డీజిల్‌ సెస్‌ వసూలు చేయాలని నిర్ణయించామని, ప్రజలు సహకరించాలని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. 2021 డిసెంబరులో రూ.85లు ఉన్న డీజిల్‌ ధర ప్రస్తుతం రూ.118కి ఎగబాకడంతో డీజిల్‌ సెస్‌ విధించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

 

3.సర్కారు .. గవర్నర్‌
(గవర్నర్‌ బెదిరింపు ధోరణి ఏంది:మంత్రి ఇంద్ర)
` 20 నిముషాల ముందు చెబితే ప్రోటోకాల్‌ ఎలా సాధ్యం
` తమిళిసై వక్రబుద్ధి మానాలన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
ఆదిలాబాద్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా.. గవర్నర్‌ వ్యాఖ్యలపై దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. గవర్నర్‌ బీజేపీ సభ్యురాలిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్‌ పరిధి దాటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఇంద్రకరణ్‌ ఆదిలాబాద్‌ జిల్లాలో శుక్రవారం విూడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంద్రకరణ్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఉగాది రోజున గవర్నర్‌ యాదాద్రికి వెళ్లారు. 20 నిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్‌ పాటించడం కష్టంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గవర్నర్‌ నోరు పారేసుకోవడం మానుకోవాలి. ఆమె తన పరిధిలో ఉంటే అందరూ గౌరవిస్తారని మంత్రి పేర్కొన్నారు. గవర్నర్‌ రాజ్యాంగ పరంగా నడుచుకునే విధంగా వ్యవహరిం చాలన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగిన తమిళిసై.. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ వక్రబుద్దితో వ్యవహరించడం సరికాదన్నారు. తాను అసెంబ్లీని రద్దు చేసేదాన్ని అని తమిళిసై మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీని రద్దు చేసిన రామ్‌లాల్‌కు ఏం జరిగిందో తమిళిసై గుర్తుకు తెచ్చుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్‌ పాటించకుండా అవమానిస్తుందంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. గవర్నర్‌ తమిళిసై.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన తర్వాత గవర్నర్‌ తమిళిసై వక్రబుద్ధి బయటపడిరదంటూ ఇంద్రకరణ్‌ రెడ్డి మండిపడ్డారు. ఎక్కడ అవమానం జరిగిందో గుర్తుచేసుకోవాలంటూ సూచించారు. ఉగాది రోజున యాదాద్రికి వస్తున్నట్టుగా 20 నిమిషాల ముందు చెప్తే ప్రోటోకాల్‌ ఎలా పాటిస్తారంటూ నిలదీశారు. రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సిన గౌరవం, ప్రొటోకాల్‌ ఇస్తున్నామని.. నోరు పారేసుకోవడం మానుకోవాలంటూ గవర్నర్‌కు ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు.

(రాజ్యాంగవ్యవస్థను గౌరవించాలి: రేవంత్‌)
గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించుకోవాలి: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):రాజ్యాంగవ్యవస్థలను గౌరవించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు.గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించుకోవాలన్నారు.ఈ మేరకు గాంధీ భవన్‌లో విూడియా ప్రతినిధులతో రేవంత్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.’’రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికారికంగా నివేదిక ఇచ్చారు. వెంటనే రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఆమె ఉపయోగించుకోవాలి. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై సవిూక్ష చేసి చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని సమస్యలను గవర్నర్‌ గుర్తించారు.. ఫిర్యాదు చేశారు. సెక్షన్‌ 8 ప్రకారం సమస్యను పరిష్కరించే అధికారం గవర్నర్‌కు ఉంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయికుటుంబంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ అంశాన్ని సాకుగా చూపుతున్నారని తనను సీఎం చేయాలంటూ కేటీఆర్‌.. కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు.. అది సాధ్యం కాదని కుటుంబ సభ్యులతో సీఎం చెబుతున్నట్లు రేవంత్‌ పేర్కొన్నారు. ఆమె భాజపా నేతలా మాట్లాడుతున్నారని తెరాస నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వాళ్ళు భాజపా అని తెలియదా? గవర్నర్‌ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించారు. కేవలం సీఎం కేసీఆర్‌కు కోపం వస్తుందనే హైదరాబాద్‌లో ఉండి కూడా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వేడుకలకు హాజరు కాలేదని ప్రధాని మోదీ, అమిత్‌ షాలకు ఫిర్యాదు చేయాల్సింది. అప్పుడే ఇక్కడి కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతం అయ్యేవి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

 

4.వడ్డెర బస్తీలో కలుషిత నీటి కలకలం
` 51కి చేరిన బాధితుల సంఖ్య
మాదాపూర్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):నగరంలోని మాదాపూర్లోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి పలువురు అనారోగ్యానికి గురయ్యారు. కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. బాధితుల సంఖ్య 51కి చేరింది. వీరందరికీ కొండాపూర్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. బాధితులెవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వడ్డెర బస్తీలో ఓ వ్యక్తి వాంతులు విరేచనాలతో నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అస్వస్థతకు కారణం కలుషిత నీరేనని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5.ఈ యుద్ధం మాకు భారీ విషాదాన్ని మిగుల్చుతోంది: రష్యా
మాస్కో,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. పుతిన్‌ సేనలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇదే విషయాన్ని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అంగీకరించారు.తమ సైనికుల మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘మా దళాలను గణనీయంగా నష్టపోయాం. ఇది మాకు భారీ విషాదం’ అంటూ వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడం , అక్కడి నాజీ తత్వాన్ని పారదోలడమే తమ లక్ష్యమంటూ ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌పై బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అంతులేని విషాదాలు వెలుగుచూస్తున్నాయి. ఎంతోమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలి, వలస బాటపట్టారు. అయినా సరే, ఉక్రెయిన్‌ రష్యాను గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ స్థాయి ప్రతిఘటనను ఊహించని రష్యా భారీ స్థాయిలో సైన్యాన్ని కోల్పోతోంది. ఇప్పటివరకూ ఆ సంఖ్య సుమారు 18 వేల వరకూ ఉండొచ్చని ఉక్రెయిన్‌ చెప్పగా.. రష్యా చెప్తోన్న సంఖ్య అందుకు ఎన్నో రెట్లు తక్కువగా ఉంది. అయితే భారీ విషాదం అంటూ పుతిన్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా స్పందన వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది.రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ నగరం సువిూ తమ ఆధీనంలోనే ఉందని అక్కడి గవర్నర్‌ వెల్లడిరచారు. ‘సువిూ ప్రాంతానికి రష్యా సైన్యం బెడద లేదు. అయితే ఈ ప్రాంతం సురక్షితంగా మాత్రం లేదు. ఇక్కడ పాతిపెట్టిన మైన్స్‌ను తొలగించాల్సి ఉంది’ అంటూ తిరిగిరావాలనుకుంటోన్న ప్రజలను ఉద్దేశించి వెల్లడిరచారు.

 

6.18 ఏళ్లు పైబడినవారందరీకీ ప్రికాషన్‌ డోసు
` కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం
` ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో మాత్రమే తీసుకోవాలని వెల్లడి
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):కరోనా వ్యాక్సిన్‌ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 18ఏండ్లు పైబడిన వారందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్‌ఖ్తెన వారందరూ ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో బూస్టర్‌ డోస్‌ తీసుకోవచ్చని సూచించింది. అయితే ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్రం బూస్టర్‌ డోసును ఉచితంగా ఇస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 96శాతం మంది ఫస్ట్‌ డోస్‌ తీసుకోగా.. 86 శాతం మంది రెండో డోసు తీసుకున్నారు. యూకే, చైనాలో కొత్త వేరియంట్‌ వేగంగా విస్తరిస్తుండటంతో.. 18ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరు బూస్టర్‌ డోసు తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నామని వైద్యారోగ్య శాఖమంత్రి మన్‌?సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఏప్రిల్‌ 10, ఆదివారం నుంచి 18 ఏండ్లు నిండిన వారందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవచ్చని చెప్పారు.

 

7.ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 31ఏళ్ల జైలుశిక్ష..
ఇస్లామాబాద్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. అతడికి సంబంధించిన అన్ని ఆస్తులను సీజ్‌ చేయాలని ఆదేశించింది. వీటితోపాటు హఫీజ్‌ నిర్మించినట్లు భావిస్తున్న మసీదుతోపాటు మదర్సాలను కూడా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది.2008లో ముంబయిలో జరిపిన పేలుళ్లతో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. దానితో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న హఫీజ్పై అమెరికా కోటి డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. ఐరాస భద్రతా మండలి పేర్కొన్న మోస్ట్వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలోనూ హఫీజ్‌ ఉన్నాడు. వీటితోపాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతోపాటు మనీలాండరింగ్‌ కేసుల్లోనూ హఫీజ్పై ఎన్నో కేసులు ఉన్నాయి.ఇటీవల రెండు కేసుల్లో (2020) హఫీజ్కు 15ఏళ్ల జైలు శిక్ష కూడా పడిరది. అయినప్పటికీ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్పై విషయం చిమ్మే ప్రసంగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా పాకిస్థాన్పై ఒత్తిడి వస్తున్నప్పటికీ చర్యలు మాత్రం అంతంత మాత్రమేననే ఆరోపణలున్నాయి.

 

8.టెన్త్‌ పరీక్షలకు సమయం అరగంట పెంపు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం పొడిగించారు. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామన్నారు. ప్రశ్నపత్రంలో అధిక చాయిస్‌
ఇస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు.

 

9.కార్డ్‌ లేకుండానే అన్ని ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా
` ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌
ముంబై,ఏప్రిల్‌ 8(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ప్రతిపాదన చేసింది. కార్డ్‌ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నది. యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కార్డ్‌లెస్‌ విత్‌డ్రాలను కొన్ని బ్యాంకులు మాత్రమే కల్పిస్తున్నాయని, అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్స్‌లో కార్డ్‌లెస్‌ విత్‌డ్రా అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు.2022`23 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య పరపతి విధాన ప్రకటనను ఆయన ప్రకటించారు. కార్డ్‌ లెస్‌ విత్‌డ్రా ద్వానా వినియోగదారుడు తన వద్ద బెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కార్డ్‌ స్కిమ్మింగ్‌, కార్డ్‌ క్లోనింగ్‌ లాంటి చర్యలను కూడా అడ్డుకోవచ్చు అని ఆయన అన్నారు.క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల జారీని ఆపేది లేదని ఆర్బీఐ గరవ్నర్‌ తెలిపారు. ఆ కార్డులను కేవలం క్యాష్‌ విత్‌డ్రాల కోసమే కాదు అని, వాటిని రెస్టారెంట్లు, షాపులు, విదేశీ టూర్ల సమయంలో వాడుకునే వీలుందన్నారు. ఆ కార్డులను ఎప్పటికీ కంటిన్యూ చేస్తామన్నారు.
కీలక వడ్డీరేట్లు మళ్లీ మారలేదు
ఆర్‌బీఐ వరుసగా 11వ సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఫలితంగా రెపో రేటు 4 శాతంగా కొనసాగనుంది.ద్రవ్యలభ్యతను మెరుగుపరిచే ఉద్దేశంతో రివర్స్‌ రెపోరేటును సైతం గతంలో మాదిరిగానే 3.35 శాతం వద్దనే ఉంచారు. 2022`23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక పరపతి విధాన సవిూక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడిరచారు.కొవిడ్‌ సంక్షోభం ప్రారంభమైన తొలినాళ్లలో ద్రవ్యలభ్యత కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన సర్దుబాటు వైఖరిని దాదాపు అటూఇటూగా ఆర్‌బీఐ ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చింది. అయితే, ఈసారి సర్దుబాటు ఉపసంహరణ వైఖరికి మారుతున్నట్లు పేర్కొనడం గమనార్హం. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టం చేసింది. దేశీయంగా ఇంధన, కమొడిటీ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. అయినప్పటికీ.. ఆర్‌బీఐ మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

 

10.ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలం
` రైతులు దీనిపై దృష్టి సారించాలి
` వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):ఆయిల్‌ పామ్‌ సాగుకు మన నేలలు అనుకూలం కనుక రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి, పెద్దగూడెంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోదండరాముల వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కడుకుంట్ల గ్రామంలో ఆయిల్‌ పామ్‌ మొక్కల నర్సరీని సందర్శించి మంత్రి మాట్లాడారు. దేశంలో వంట నూనెల డిమాండ్‌కు తగినంతగా నూనెగింజల సాగు లేదు. ఏటా రూ.80 వేల కోట్ల విలువైన పామాయిల్‌ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. దేశంలో నూనె, పప్పు గింజలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉందన్నారు. మార్కెట్లో వంట నూనెల డిమాండ్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. వచ్చే జూన్‌ తర్వాత మూడు లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులకు మొక్కలు సిద్ధమయ్యాయి. సంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు పండిరచాలని ఆయన సూచించారు.

 

11.ఏప్రిల్‌ 15 తర్వాత ప్రజా ప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణ
` సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
దిల్లీ,ఏప్రిల్‌ 8(జనంసాక్షి): ప్రజా ప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల సత్వర విచారణపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐతో పాటు ఇతర సంస్థలు దర్యాప్తు జరుపుతోన్న కేసులపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై ఏప్రిల్‌ 15 తర్వాత విచారణ జరిపేందుకు అంగీకరించింది. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై కేసులు భారీగా పెరిగిపోతున్నాయని.. వీటిపై తక్షణమే విచారణ జరపాలంటూ అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తోన్న విజయ్‌ హన్సారియా చేసిన అభ్యర్థనకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.గడిచిన ఐదేళ్లలో దేశంలో 2వేల మందికిపైగా నేతలపై కేసులు పెండిరగులో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే అంశంపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని వీటికి అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తోన్న సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, ఏప్రిల్‌ 15 తర్వాత విచారణ చేస్తామని పేర్కొంది. ఆలోపు చట్టసభ సభ్యులపై విచారణ జరుపుతోన్న ప్రత్యేక న్యాయమూర్తులను బదిలీ చేయడంపై కొన్ని హైకోర్టులు చేస్తోన్న అభ్యర్థనలపై దరఖాస్తులను అనుమతిస్తామని తెలిపింది.ప్రజాప్రతినిధులపై కేసులకు సంబంధించి దాఖలైన పిల్పై తక్షణ విచారణ చేపట్టాలంటూ విన్నవించిన అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా.. ప్రస్తుతం పదవిలో ఉన్నవారితో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదవుతోన్న కేసుల సంఖ్యను సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై ప్రస్తుతం 4984 కేసులు పెండిరగ్లో ఉండగా.. వాటిలో 1899 కేసులు ఐదేళ్లకు పైబడినవే. 2018 డిసెంబర్‌ నాటికి 4110 కేసులు ఉండగా.. 2020 అక్టోబర్‌ నాటికి అవి 4859కి పెరిగిపోయాయి. పార్లమెంట్తోపాటు శాసనసభల్లో నేర చరిత కలిగిన వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో ఆక్రమిస్తున్నారని తాజా నివేదిక రుజువు చేస్తోంది. అందుకే పెండిరగ్లో ఉన్న కేసుల తక్షణ పరిష్కారంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని విజయ్‌ హన్సారియా సుప్రీం ధర్మాసనానికి వెల్లడిరచారు. దీంతో వీటిపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టు వెల్లడిరచింది.