all news

 1.ధాన్యం కొనాల్సిందే..
` పార్లమెంటులో తెరాస ఆందోళన
` ధాన్యం సేకరణపై జాతీయ విధానం
` ఉభయ సభల్లో టిఆర్‌ఎస్‌ డిమాండ్‌
` వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు
` ప్రశ్నోత్తరాల సమయంలో ప్లకార్డులతో నిరసనలు
` చర్చకు తిరస్కరణతో ఉభయ సభలనుంచి టిఆర్‌ఎస్‌ వాకౌట్‌
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):ధాన్యంసేకరణపై టిఆర్‌ఎస్‌ ఆందోళనలను కొనసాగించింది. దీంతో మంగళవారం మరోమారు  లోక్‌సభలో దుమారంరేగింది. టీఆర్‌ఎస్‌ నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఆహార ధాన్యాల సేకరణపై చర్చ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రం తీరును ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమాయకులైన అన్నదాతలను రక్షించండి.. అభివృద్ధి చెందుతున్న రాష్టాల్రకు అన్యాయం చేయకండి.. వరి కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించండి.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం రూపొందించాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన నేపథ్యంలో స్పీకర్‌ బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం స్పీకర్‌ ఓం బిర్లాకు లోక్‌ సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామ నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో పండిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్‌సీఐ సేకరణ చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ చేయాలని అభ్యర్థన చేశారు.దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానంపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని, అందుచేత సభ ఈ రోజు కార్యక్రమాలు రద్దు చేసి ఈ అంశంపై చర్చించాలని నామా తన లేఖలో అభ్యర్థించారు. ఈ క్రమంలో యధావిధిగా ప్రశ్నోత్రాలు కొనసాగుతుండగా ..ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ధాన్యం సేకరణపై నోటీసులు ఇచ్చిన ఎంపీలు ఉభయ సభల్లో చర్చకు పట్టుపట్టారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. అయితే దీనిపై ఉభయ సభల్లోనూ చర్చకు అనుమతి ఇవ్వలేదు. దీంతో లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. ఒడిషాతోపాటు మరికొన్ని రాష్టాల్రు కేంద్ర ప్రభుత్వం విధానంతో ఇబ్బందులుపడుతున్నాయని ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ సురేష్‌ రెడ్డి రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. కేంద్రం ఈ అంశంపై సమాధానం ఇవ్వాలన్నారు. అయితే వారం రోజుల నుంచి ఈ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిరోజూ వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ ఉభయ సభల్లో చర్చకు అనుమతించడంలేదు. ఈ నెల 11న ఢల్లీిలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.


2.కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నాం
` పెట్టుబడులకు కేంద్రంగా జీనోమ్‌ వ్యాలీ
` హైదరాబాద్‌లో కంపెనీల విస్తరణకు అవకాశాలు మెండు
` జాంప్‌ ఫార్మాను ప్రారంభించిన కేటీఆర్‌
హైదాబాద్‌,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జీనోమ్‌ వ్యాలీలో జాంప్‌ ఫార్మాను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్‌లో జాంప్‌ హైదరాబాద్‌ లోనే పెద్ద బ్రాంచ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌ను పరిశీలించిన అనంతరం.. కంపెనీ హైదరాబాద్‌ను ఎంచుకుందన్న మంత్రి.. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీల విస్తరణకు హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు.అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్‌ వ్యాలీ అనువుగా ఉంటుందని, యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలన్నారు. గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్‌ కంటే హైదరాబాద్‌ నే ఇష్టపడుతున్నారన్నారు. గ్లోబల్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 33శాతం ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే జాంప్‌ ఫార్మాకు భూమిని కేటాయించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ`హబ్‌ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. బీ`హబ్‌ నిర్మాణంతో పాటు జీనోమ్‌ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరలో బీ`హబ్‌ను ప్రారంభించి, బయోలాజికల్‌ పరిశోధనలకు తోడ్పాటును అందించ బోతున్నామని కేటీఆర్‌ ప్రకటించారు.  అనంతరం జాంప్‌ ఫార్మా ఆవరణలో మొక్కలు నాటారు. రూ.250 కోట్లతో జాంప్‌ ఫార్మా ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని, ఈ పార్మా ద్వారా 200 మందికి ఉపాధి అవకాశాలు లాభిస్తాయని తెలిపారు. ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ జీనోమ్‌ వ్యాలీకి దగ్గరలో రానున్నాయి. అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్‌ వ్యాలీ అనువుగా ఉందన్నారు.  కంటోన్మెంట్‌ లో స్కెవేల నిర్మాణానికి అనుమతులు అడుగుతున్నామని కెటిఆర్‌ చెప్పారు. ఏడేళ్లుగా కేంద్రం మా ప్రతిపాదనలను పట్టించు కోవట్లేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ రహదారి విస్తరణకు కేందద్రం ముందుకు వస్తుందన్న ఆశాభావం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ`హబ్‌ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. బీ`హబ్‌ నిర్మాణంతో పాటు జీనోమ్‌ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఐటి సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అజీమ్‌ ప్రేమ్‌జీ ఆదర్శ నాయకుడు
టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సరళతర వాణిజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఈ`సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అజీమ్‌ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయమన్నారు. ఆయన జీవితం అందరికీ అనుసరణీయం, మంచి పాఠం లాంటిదని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందిరికీ ఆదర్శమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 900 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విప్రో పరిశ్రమలో స్థానికంగా ఉన్న కందుకూరు, మహేశ్వరం ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేటీఆర్‌ వివరించారు.దాదాపు రూ.300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారని.. కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్‌ సాంకేతికతను ఉపయోగిస్తూ అన్ని చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్‌ వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ విధానం ద్వారా రాష్ట్రంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. తద్వారా ఏడేళ్లలో 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు. కరోనా సమయంలో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్‌.. ప్రేమ్‌జీ దాతృత్వాన్ని కొనియాడారు. ఎల్‌ఈడీ పరిశ్రమతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ కోరారు.అజీమ్‌ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. ‘’రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉంది. కరోనా నియంత్రణలో తెలంగాణ కీలకంగా నిలిచింది. తెలంగాణలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాం. పెట్టుబడులతో ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.3.సంక్షోభం వెనక అమెరికా కుట్ర!
` ఇమ్రాన్‌ మాస్కో పర్యటనే కారణమా!
` ఆధారాలు లభించలేదన్న పాక్‌ సైన్యం
ఇస్లామాబాద్‌,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):ఇమ్రాన్‌ ఖాన్‌పై ‘అవిశ్వాసం’తో పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పాక్‌ ప్రధాని జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ సంక్షోభం వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందని ఇమ్రాన్‌ బలంగా వాదిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రష్యా కూడా ఈ ఆరోపణలను సమర్థిస్తూ అమెరికాపై మండిపడిరది.పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘విదేశీ కుట్ర’ జరుగుతోందని ఇమ్రాన్‌ ఇటీవల ఆరోపించారు. దీనిపై రష్యా విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. దీని వెనుక అగ్రరాజ్యం హస్తం ఉందని ఆరోపించారు. ‘‘ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన తొలి నాళ్లలో పాక్‌ ప్రధాని మాస్కోలో పర్యటించారు. అప్పుడే ఇమ్రాన్ను శిక్షించాలని అమెరికా నిర్ణయించుకుంది. ఆ ఫలితమే ఆయనపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాన ప్రయత్నం జరిగింది’’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ వ్యాఖ్యలను పాకిస్థాన్‌ సైన్యం విభేదించడం గమనార్హం. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం ఉన్నట్లు ఎలాంటి ఆధారాల్లేవని ఆర్మీ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిపై వచ్చిన అవిశ్వాస తీర్మానం వెనుక ఎలాంటి దౌత్యపరమైన కారణాలు లేవు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో విదేశీయుల జోక్యం ఉన్నట్లు ఆధారాలు లేవు. పాక్‌ ప్రభుత్వానికి అమెరికా ఎలాంటి లేఖలు పంపలేదు’’ అని ఆర్మీ వర్గాలు వెల్లడిరచాయి.మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్పై ప్రతిపక్ష పీఎంఎల్‌ఎన్‌ పార్టీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ‘‘ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌ నవ్వులపాలైంది. చివరి బంతి వరకూ ఆడతానని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు వికెట్లు తీసుకొని పరిగెత్తారు. తన సీటును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ప్రతిపక్ష నేత ఒకరు దుయ్యబట్టారు.4.ఆంధ్రావి అసంబద్ధ ఆరోపణలు
` ప్రతి దానికి ఏపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోంది
` సాగర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం లేదు
` స్పష్టం చేసిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):విద్యుదుత్పత్తి కోసం నాగార్జునసాగర్‌నుంచి తాము నీటిని వినియోగించడం లేదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ సర్కారు చిల్లరగా వ్యవహరిస్తున్నదని విద్యుత్‌శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ఏపీ సర్కారు చీటికీమాటికీ కృష్ణా నది మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు ఫిర్యాదు చేస్తున్నదని అసహనం వ్యక్తంచేశారు. అసంబద్ధమైన ఆరోపణలు, ఫిర్యాదులు చేసి ఏపీ సర్కారు తన గౌరవాన్ని దిగజార్చుకుంటున్నదని విమర్శించారు. నాగార్జున సాగర్‌ నుంచి విద్యుదుత్పత్తి కోసం నీటిని తెలంగాణా వినియోగిస్తున్నదనే ఏపీ సర్కారు వాదనలో నిజం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. సాగర్‌నుంచి తెలంగాణకు తాగునీటి అవసరాలు ఎక్కువని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదుల్లో సహేతుకత లేదన్నారు. డిమాండ్‌ ఎక్కువ ఉన్న సమయంలో గ్రిడ్‌ను కాపాడేందుకు అప్పుడ ప్పుడు సాంకేతికపరంగా ఐదు , పది నిమిషాల ఉత్పత్తి జరగడం సహజమేనన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి ఆపేసినా.. ఆంధ్రప్రదేశ్‌ కొనసాగిస్తున్నదని, అయినా తాము చిల్లర ఫిర్యాదులు చేయడంలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రలో దుర్మార్గంగా తమ నీటిని ఆంధ్రకు బలవంతంగా తరలించుకెళ్లారని గుర్తుచేశారు. ఆంధప్రదేశ్‌ సర్కారుకు నీటి యాజమాన్యంపై అవగాహన లేదని, అందుకే తమపై ఫిర్యాదు చేస్తున్నదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.5.అమీతుమీకి కేసీఆర్‌ ఢల్లీిలో మఖం
` వరిధాన్యం కొనుగోళ్లపై పోరాటమే లక్ష్యంగా ముందుకు
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి): కేంద్రం, తెలంగాణ మధ్య వరి పంట అయితే ఇప్పట్లో తెగేలాలేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ సమరానికి సిద్ధమైంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసేందుకు సీఎం కేసీఆర్‌ మరోసారి హస్తిననే నమ్ముకున్నారు. ఈ మేరకు ఢల్లీిలో మకాం వేసిన కెసిఆర్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో పండిరచిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని గత ఏడాది నవంబర్‌ 18న ధర్నా చౌక్‌ వద్ద సీఎం కేసీఆర్‌ ఆందోళన చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ స్వయాన ముఖ్యమంత్రే ఆందోళన చేయడం అదే మొదటిసారి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి తేలే వరకు నిరసనలు కొనసాగుతాయని అప్పట్లో సీఎం అల్టిమేటం జారీ చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి పియూష్‌ గోయర్‌ క్లారిటీ ఇవ్వడంతో ఖంగుతిన్న గులాబీ నేతలు సమరానికి సిద్ధమయ్యారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పండిరచిన పంటను కేంద్రమే కొనాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. యాసంగిలో దాదాపు 40 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. యాసంగికి వరి వేయొద్దంటూ సీఎం చెప్పినా వినకుండా రైతులు వరినే సాగు చేశారు. బాయిల్డ్‌ రైస్‌కు బదులు రా రైస్‌ మాత్రమే కొంటామని కేంద్రం చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై మరో స్టాండ్‌ తీసుకున్నారు. ఇప్పుడు వడ్లనే కొనాలన్న డిమాండ్‌ తీసుకున్నారు. మరోవైపు పార్లమెంటులో ఎంపిలు వాయిదా తీర్మానాలతో పోరాడుతున్నారు.


6.22 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం
` దేశభద్రతకు భంగం కలిగిస్తున్నట్లు వెల్లడి..
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి): దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్న 22 యూట్యూబ్‌ చానెళ్లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్‌ చేసింది. ఇందులో 18 చానెళ్లు ఇండియాకు చెందినవి కాగా, మరో 4 పాకిస్తాన్‌ యూట్యూబ్‌ చానెళ్లు అని ఆ శాఖ స్పష్టం చేసింది. ఐటీ రూల్స్‌, 2021 ప్రకారం తొలిసారిగా 18 యూట్యూబ్‌ చానెళ్లను బ్లాక్‌ చేసినట్లు తెలిపింది. యూట్యూబ్‌ వీక్షకులను తప్పుదోవ పట్టించేందుకు కొన్ని టీవీ చానెళ్ల లోగోలను కూడా ఈ యూట్యూబ్‌ చానెళ్లు ఉపయోగించుకున్నాయని పేర్కొన్నది. తప్పుడు థంబ్‌ నెయిల్స్‌తో ప్రజలను గందరగోళపరిచినట్లు తెలిపింది. వీటితో పాటు 3 ట్విట్టర్‌ అకౌంట్లు, ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌, ఒక న్యూస్‌ వెబ్‌సైట్‌ను కూడా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్‌ చేసింది.


7.కాంగ్రెస్‌లో ఇప్పుడు ఐకమత్యమే ముఖ్యం
` అన్ని స్థాయిల్లో కలసినాడవాల్సి ఉంది
` సమాజానికి ఈ అవసరం ఉంది
` కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి): కాంగ్రెస్‌లోని అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా అవసరమని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. పార్టీ పునరుజ్జీవం పొందడం కేవలం తమ కోసం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి, సమాజానికి ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోందని, భయాందోళనలను వ్యాపింపజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం సోనియా మాట్లాడుతూ, భవిష్యత్తు మునుపటి కన్నా సవాళ్ళతో కూడినదని చెప్పారు. మన అంకితభావం, దృఢ సంకల్పం, తట్టుకుని నిలబడగలిగే సత్తా కఠిన పరీక్షకు నిలుస్తున్నాయి. మన విశాలమైన సంస్థలో అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా ముఖ్యం అని తెలిపారు. ఐకమత్యాన్ని సాధించడం కోసం ఏం చేయడానికైనా తాను నిశ్చయించుకున్నానని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్టాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం పాలైన నేపథ్యంలో త్వరలో మేధోమథనం జరగబోతోంది. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోగా, మిగిలిన నాలుగు రాష్టాల్ల్రోనూ ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. దీనిపై సోనియా మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు దిగ్భాంతికి గురి చేశాయని, అత్యంత బాధాకరమని చెప్పారు. తాను ఇతర నేతలతో కూడా మాట్లాడానని, పార్టీని బలోపేతం చేయడానికి సలహాలు తీసుకున్నానని చెప్పారు. పార్టీని ప్రక్షాళన చేయాలని గతంలో ఆమెకు లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్‌ నేతల్లో గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, మనీశ్‌ తివారీ ఇటీవల సోనియా గాంధీతో మాట్లాడిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించే విధంగా నేతలంతా ఐకమత్యంగా ఉండాలని సోనియా గాంధీ చెప్తున్నారు. ఐక్యత సాధించడం కోసం గతంలో ఆమెకు లేఖ రాసిన 23 మంది నేతలకు కూడా జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో పరాజయానికి ప్రధాన కారణం అంతర్గత కలహాలేనని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థుల భవిష్యత్తుకు అతి త్వరగా భరోసా కల్పించవలసిన అవసరం ఉందని సోనియా చెప్పారు.8.120కి చేరువలో లీటర్‌ పెట్రోల్‌
` ధరల పెంపులో దూసుకుపోతున్న కంపెనీలు
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):సామాన్యులపై కనీస కనికరం చూపకుండా చమురు కంపెనీలు పెట్రో ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను పెంచాయి. వీటికి డీలర్‌ కమిషన్‌, వ్యాట్‌ తదితర అంతా కలిపితే లీటరు పెట్రోలు ధర 91 పైసలు, డీజిల్‌ ధర 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 118.59కి పెరగగా లీటరు డీజిల్‌ ధర రూ.104.62కి చేరుకుంది.  ఉదయం ఆరు గంటలు అయ్యిందంటే చాలు పెట్రోలు రేట్లు ఎప్పుడు పెంచుదామా అన్నట్టుగా చూస్తున్నాయి చమురు కంపెనీలు. గడిచిన పదిహేను రోజుల వ్యవధిలో కేవలం రెండంటే రెండే రోజులు గ్యాప్‌ ఇచ్చి పదమూడు సార్లు ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సవరణల కారణంగా లీటరు పెట్రోలు ధర గత రెండు వారాల్లోనే రూ.10.39 పెరగగా డీజిల్‌ ధర రూ. 10.57లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ రేట్లను సవరిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికలు పెట్రోలు రేట్లకు సంబంధం లేదని కేంద్ర మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. 2022 మార్చి 21న అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 111.83 డాలర్లుగా ఉండగా ఏప్రిల్‌ 5న 109.41 డాలర్ల వద్ద ఉంది. ఐనప్పటికీ ధరల పెంపు నుంచి సామాన్యులకు ఉపశమనం లభించడం లేదు. 2021 మేలో బెంగాల్‌ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి పెట్రోలు వాతలు మొదలయ్యాయి. ఈ పరంపర 2021 నవంబరు 4 వరకు కొనసాగింది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు, డీజిల్‌ ధర వంద దాటేసింది. దీంతో ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్రం లీటరు పెట్రోలు, డీజిల్‌ ధరలను రూ.5 వంతున తగ్గించింది. ఆ తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌తో సహా ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి.ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం 2021 నవంబరు 4 నుంచి 2022 మార్చి 22 వరకు దాదాపు 137 రోజుల పాటు పెట్రోలు, డీజిల్‌ రేట్లను పెంచలేదు. ఇక మార్చి 22న మొదలైన చమురు సంస్థల బాదుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ దెబ్బకు లీటరు పెట్రోలు 118 నాటౌట్‌, డీజిల్‌ 104 నాటౌట్‌ బ్యాటింగ్‌ అన్నట్టుగా పరిస్థితి మారింది. యూపిలో గెలిపించినందుకు ఇది రిటర్న్‌ గిఫ్ట్‌ అంటూ బెంగాల్సిఎంమమతాబెనర్జీ విమర్వలు గుప్పించారు.
10.ప్రభుత్వ తీరుకు నిరసనగగా నేడు,రేపు ధర్నాలు
` వడ్లను కనీస మద్దతు ధర రూ.1960గా ఇవ్వాలి
` విూడియా సమావేశంలో వెల్లడిరచిన రేవంత్‌ రెడ్డి
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి): తెలంగాణలో రెండు పార్టీలు... రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడు తున్నాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల జీవితాలతో టీఆర్‌ఎస్‌, బీజేపీ చెలగాటం ఆడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ చేసిన సంతకం రైతుల పాలిట మరణశాసనంగా మారిందన్నారు. బాయిల్డ్‌ రైస్‌ సరఫరా చేయబోమని... కేంద్రంతో కేసీఆర్‌ చేసుకున్న ఒప్పందం గుదిబండగా మారిందని రేవంత్‌ పేర్కొన్నారు. వడ్లను కనీస మద్దతు ధర రూ.1960తో కొనాలని డిమాండ్‌ చేశారు. కొన్న వడ్లను ఏం చేసుకుంటారో విూ ఇష్టమన్నారు. రైతులను మోసం చేయడానికి సమస్యను జఠిలం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన, 7న హైదరాబాద్‌ లోని విద్యుత్‌ సౌధ ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడు తున్నాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో రేవంత్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్‌ విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలాడుతున్నాయన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రెండు పార్టీలు రైతులను మోసం చేశాయన్నారు. 2022 లో రైతుల ఆదాయం రెట్టంపు చేస్తానన్న బీజేపీ.. కనీసం వడ్లు కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. రా రైస్‌ మాత్రమే కొంటామని కేంద్రం, లేదు లేదు బాయిల్డ్‌ రైస్‌ కొనాలని రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం తిట్టుకుంటూ పెద్ద డ్రామాకు తెరలేపాయన్నారు. వరికి రూ.1960 కనీస మద్ధతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని, అందుకే కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్లను సంప్రదించాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలోనే మిల్లర్లు ఇష్టమొచ్చినట్టు ధర నిర్ణయిస్తూ దోపిడికి పాల్పడుతున్నారన్నారు. దమ్ముంటే రైతులను దోచుకుంటున్న మిల్లర్లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైల్లో పెట్టాలని సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు.