కాంగ్రెస్‌లో హిందుత్వ ఎజెండా కోసం కసరత్తు


కాంగ్రెస్‌ హిందుత్వకు అనుకూలమన్న భరోసా

రాహుల్‌,ప్రియాంకలు హిందుత్వ అనుకూల ధోరణి
న్యూఢల్లీి,ఏప్రిల్‌16 జ‌నంసాక్షి: త్వరలో జరిగే కొన్ని రాష్టాల్ర ఎన్నికలతో పాటు, 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని హిందుత్వ అనుకూలవాదిగా సిద్దం చేయాలని కాంగ్రెస్‌ ప్లాన్‌ వేస్తోంది. మోడీని ఢీకొనాలంటే అధికశాంత ఉన్న హిందువుల ఓట్లు ఆకట్టుకోవాలి. అందుకే ఇటీవల హిందూ అనుకూల విషయాల్లో కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక కూడా యూపి ఎన్నికల్లో ఇలాగే చేసినా ఫలితం రాబట్టలేకపోయారు. రాహుల్‌ హిందుత్వవాది అనిపించుకోవాలని పక్కాగా ప్లాన్‌ వేసినట్లు కాంగ్రెస్‌ నేతల ద్వారా వెల్లడవుతోంది. ఇటీవల ఫలితాలను బేరీజు వేసుకున్నాక కొంత హిందుత్వ విషయంలో రాహుల్‌ కూడా ఆలోచన చేస్తున్నట్లుగా క్షేత్రస్థాయికి సమాచారం చేరవేస్తున్నారు. బిజెపిని ఢీకొని అధికారంలోకి రావాలంటే జాతరల్లో ఓట్లను పట్టాలని చూస్తున్నారు. హిందుత్వ ఓట్లు నిజంగానే గంపగుత్తగా బిజెపికి పడివుంటే ఈ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండేది కాదు. కానీ ముస్లిం సంతుష్టీకరణపై మాత్రం హిందువుల్లో కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకత
ఉంది. కాంగ్రెస్‌ హయాంలో అనేక సందర్భాల్లో ముస్లింల కోసం కాంగ్రెస్‌ గీతదాటింది. ఎన్నికల సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బిజెపిని మించి హిందుత్వాన్ని ప్రదర్శించాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే రాహుల్‌ను మోడీని మించిన హిందుత్వవాదిగా తయారు చేయాలని చూస్తున్నారు. ఇదిసానుకూల ఫలితం ఇస్తుందా లేదా అన్నది పక్కన పెడితే అసలుకే ఎసరు పెట్టవచ్చు. ఈ ప్రమాదాన్ని గుర్తించకుంటే రాహుల్‌ రాజకీయ జీవితమే ప్రమాదంలో పడగలదు. నిజానికి దేశానికి ఇప్పుడు ఏం కావాలి... మనం ఏం తప్పులు చేశాం... ఏం చేయలేకపోయాం... గతలో పదేళ్లు ప్రజలు అధికారం కట్టబెడితే ఎందుకు దేశాన్ని సక్రమంగా పాలించలేక పోయాం అన్న ఆత్మపరిశీలనతో ముందుకు వెళితే తప్ప కాంగ్రెస్‌ మనుగడ సాధించడం కష్టం. కేవలం గుళ్లూగోపురాలు తిరిగితే ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటు. అలా అనుకుంటే దివంగత పివి నరసింహారావు హయాంలో అయోధ్యలో వివాదాస్పద మసీదు కూల్చివేత తరవాత కాంగ్రెస్‌ ఓటమి పాలయ్యింది. హిందువులు ఈ విషయంలో పివిని ఆదర్శంగా తీసుకుని, హిందువులకు అతనే ప్రతినిధి అని అనుకుని ఉంటే భారీ మెజార్టీతో మళ్లీ గెలిపించే వారు. కానీ అలా జరగలేదు. దేశంలో బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతున్న వైనాన్ని మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గమనించినందువల్లనే బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉదాసీనతతో వ్యవహరించారని, ఆయన వల్లే మైనారిటీలు దూరం అయ్యారని కాంగ్రెస్‌లో ఒక వర్గం ఆనాడు భావించింది. అందుకే తరవాత పివిని దూరం పెడుతూ వచ్చారు. అర్జున్‌ సింగ్‌ వంటి నేతలు పి.వి. నరసింహారావు అనుసరించిన హిందూత్వ విధానాలపై లేఖాస్త్రాలు సంధించి ఇరుకున పెడుతూ ఉండేవారు. మాధవరావు సింధియా, చిదంబరం తదితర నేతలు పివిని తక్కువ చేసి చూశారు. పి.వి. హయాంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా ఉన్న గాడ్గిల్‌ కాంగ్రెస్‌ రోజురోజుకూ క్షీణించిపోవడానికి కారణం ముస్లింలను బుజ్జగించే ప్రయత్నాలు చేయడమేనని చెప్పేవారు. సోనియా హాయంలో రెండు పర్యాయాలు అధికారం అనుభవించాక ఇంతగా దిగజారి పోవడం ఇదే ప్రథమం. అలాగే రాహుల్‌ పట్టాభి షిక్తుడు అయ్యాక ఇప్పుడు సహజంగానే ఓటమి భయం వెన్నాడుతుంటుంది. అందుకే కొందరు రాహుల్‌ను హిందూ ప్రతినిధిగా ప్రజలు గుర్తించేలా చేయాలని తపాత్రయపడుతున్నట్లుగా ఉంది. రాహుల్‌ గుళ్లూ గోపురాలు తిరగడం వల్లనే మూడురాష్టాల్రు దక్కాయని వాదిస్తున్న వారు ఉన్నారు. సోనియా స్వతహాగా క్రిష్టియన్‌ కావడం, విదేశీ వనిత కావడం వల్ల ఇంతకాలం ఆమె హిందుత్వను అంగీకరించి ఉండకపోయి ఉంటారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది.. ఏం చేయలేక పోయాం అన్న సిద్దాంతాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లడం అన్నది సైద్దాంతిక దిగజారుడు తనంగానే చూడాలి. 2014లో నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ ప్రభంజనం వీచిన తర్వాత నుంచీ కాంగ్రెస్‌లో ఈ మేరకు అంతర్మథనం ప్రారంభమైనట్లు సంకేతాలు కనపడుతున్నాయి. అప్పటివరకూ మైనారిటీల మద్దతు పొందేందుకు ఎటువంటి చర్యకైనా పూనుకునే దిగ్విజయ్‌ సింగ్‌ వంటి కాంగ్రెస్‌ నేతల వల్ల తమకు నష్టమే కాని లాభం లేదని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించే స్థితికి చేరుకుంది.