1.విషం విరజిమ్మి వెళ్లిపోవడమేనా..!
` విభజన హామీలు ఏమయ్యాయి?
` అమిషాకు మంత్రి కేటీఆర్ బహిరంగలేఖ
` గుజరాత్‌పై విూది పక్షపాత వైఖరి కాదా ?..ఐటీఐఆర్ రద్దు కుట్రకాదా?
` బయ్యారం ఉక్కు పరిశ్రమ హావిూకి ఎందుకు తుప్పుపట్టించారు?
` కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు?
` ఏం ముఖం పెట్టుకొని హైదరాబాద్ వస్తున్నారు?
` తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగట్టిన మంత్రి
హైదరాబాద్,మే13(జనంసాక్షి):కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీది అదే కక్ష, వివక్ష అలానే ఉందని ఆరోపించారు. కేంద్రం కడుపునింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదన్నారు. ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు దంచి.. విషం చిమ్మి పత్తా లేకుండా పోవుడు కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇచ్చిన హావిూలను నెరవేర్చని బీజేపీ.. గుజరాత్‌కు మాత్రం ఇవ్వని హావిూలను ఆగమేఘాల విూద అమలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లించదన్నారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైందన్నారు. తెలంగాణ గడ్డపై అమిత్ షా అడుగుపెడుతున్న నేపథ్యంలో విభజనచట్టంలోని హావిూలను తెలంగాణ సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతో పాటు వాటి కోసం తెగేదాక కొట్లాడడం మా బాధ్యతని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక అంశాలపై తమ (అమిత్ షా) దృష్టికి తెస్తున్నానన్నారు.ఇంకా ఎంతకాలం తెలంగాణపై నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తారని, రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని, రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని ఒక్క హావిూనైనా కేంద్రం నెరవేర్చిందా? రైల్వే ఫ్యాక్టరీ గుజరాత్‌లో ఎలా వస్తుంది? కాజీపేటలో ఎందుకు పెట్టరు? అని కేటీఆర్ ప్రశ్నించారు. నవోదయ, ఐఐఎం, ఐసర్ విద్యాలయాలు తెలంగాణకు ఎందుకు కేటాయించలేదు? లేదని నిలదీశారు. ‘గుజరాత్‌లో ఓ మెడికల్ విద్యార్థికి అడ్మిషన్ సమయంలో అన్యాయం జరిగిందని బాధపడిన ప్రధాన మంత్రి మోదీ’ అన్న వార్తలు చూశామని, అర్హతగల విద్యార్థికి అన్యాయం జరిగితే ప్రధాని స్పందించడం బాగుందని, కేంద్రంలో విూరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని, ఫలితంగా లక్షలాది తెలంగాణ బిడ్డలు మెడిసిన్ చదువుకోలేకపోతున్నారు. మరి మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ప్రధానమంత్రి మోదీకి, విూకు ఎందుకు బాధ కలగడం లేదు ? అని మండిపడ్డారు.బయ్యారం ఉక్కు పరిశ్రమ హావిూకి ఎందుకు తుప్పుపట్టించారు? హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి అడ్డుకునేందుకు ఐటీఐఆర్ రద్దు కుట్రకాదా? అని మండిపడ్డారు. ఐటీ రంగంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉందని, అలాంటిది సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఎందుకు ఇవ్వడం లేదు లేదని ప్రశ్నించారు. పాలమూరు ? రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? సాగునీటి హక్కులు దక్కకుండా చేస్తున్న తాత్సారంపై ఏం చెప్తారు ? అని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ఎందుకు సాయం అందించడం లేదు? ఢపిెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు? అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా రాష్ట్రానికి చేసిన సహాయం ఏంటో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి విప్లవాత్మక ప్రాజెక్టులకు 24వేలకోట్ల గ్రాంట్ ఇవ్వాలంటూ నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని, ఇప్పటిదాకా పైసా విదల్చని విూ పక్షపాత వైఖరిపై ఏం చెప్తారు? అని ప్రశ్నించారు. స్కైవేల నిర్మాణం కోసం రక్షణశాఖ భూములు అడిగితే ఏడేళ్లుగా తొక్కిపెడుతూ నగర పౌరులను అవస్థలకు గురి చేస్తున్నది నిజం కాదా? అని నిలదీశారు.బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నదీ ప్రక్షాళనకు వేలకోట్లు కేటాయించుకుంటూ.. మా మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి మూడు పైసలు కేటాయించనిది నిజం కాదా? అన్నారు. హైదరాబాద్ నగరంలో చరిత్రలో ఎన్నడూ ఎరగని వరదల్లో మునిగితే.. గుజరాత్‌కు వేలకోట్ల వరద సాయం అందించి.. హైదరాబాద్‌కు మొండిచేయి చూపించి నయాపైసా ఇవ్వకుండా ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని హైదరాబాద్‌కు వస్తున్నారు? ఇది విూకు సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ ఉన్న తెలంగాణ రాష్ట్ర టెక్స్‌టైల్ రంగానికి చేయూత ఇవ్వకుండా.. మెగా పవర్‌లూం క్లస్టర్ ఇవ్వకుండా శీతకన్ను వేసింది నిజం కాదా? అని నిలదీశారు. తెలంగాణ రైతులు తమ ధాన్యాన్ని పంజాబ్ మాదిరే కొనుగోలు చేయాలని, ఢల్లీి వేదికగా కోరినా ఎందుకు కొనుగోలు చేయడం లేదు? విూ ఎంపీ బాండ్ పేపర్‌పై ప్రజలకు రాసిచ్చిన హావిూని తుంగలో తొక్కి ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగలరా? అని డిమాండ్ చేశారు.
దేశ ప్రజల నడ్డి విరిచేలా పెంచుతున్న పెట్రో ధరల పైన అసలు కారణమైన సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మా సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్ విషయంలో విూ వైఖరి స్పష్టం చేస్తారా? అని ప్రశ్నించారు. దేశ ప్రజానీకంపై మోపిన సెస్సుల భారాన్ని రద్దు చేసి పెట్రో ధరలను తగ్గిస్తారా? లేదో? తెలంగాణ గడ్డ విూద నుంచి స్పష్టం చేస్తారా? అని నిలదీశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ హైదరాబాద్‌లో పెట్టబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారనీ, కానీ దాన్ని సైతం గుజరాత్‌కు తీసుకెళ్లిన విూది వైఖరి, గుజరాత్ పక్షపాత వైఖరి కాదా? హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఒక్కపైసా సహాయం చేయకపోగా, పోటీగా గుజరాత్‌లో మరో సెంటర్‌ను పెట్టిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు.
(బండి సంజయ్‌పై కెటిఆర్ పరువునష్టం దావా
తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆరోపణ
హైదరాబాద్,మే13(జనంసాక్షి):బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు పంపించారు. ఈ నెల 11న ట్విట్టర్‌లో తనపై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోపణలపై ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్దాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా? కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కు ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది పేర్కొన్నారు. కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేసిన సంజయ్.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది డిమాండ్ చేశారు.
2.న్యాయ వ్యవస్థలో దేశానికే ఆదర్శం
న్యూఢల్లీి,మే13(జనంసాక్షి): రాష్ట్ర న్యాయ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆప్ అధినేత, ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శుక్రవారం కర్కార్?దూమా కోర్టు నూతన భవనాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. లాయర్ల సంక్షేమం కోసం బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నామన్న ఆయన.... ప్రతి లాయర్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కింద రూ.5 లక్షలు, జీవిత బీమా కింద రూ.10 లక్షల అందిస్తున్నామన్నారు. ఇప్పటికే దాదాపు 30 వేల మంది లాయర్లు ఈ పథకానికి అప్లై చేసుకున్నారన్నారు.
3.నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీం నో
అనిశ్చితి ఏర్పడుతుందన్న ధర్మాసనం
న్యూఢల్లీి,మే13(జనంసాక్షి): జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2022 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ` 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష వాయిదా వేయలేమని తెలిపింది. కాగా నీట్ పీజీ`2021 కౌన్సిలింగ్ ఉన్నందున చదువుకోవడానికి తగినంత సమయం లేకపోవడంతో పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ వైద్యుల బృందం పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపి శుక్రవారం తీర్పును వెల్లడిరచింది. నీట్ పీజీ 2022 పరీక్షలు వాయిదా వేయడం సరైన ఆలోచన కాదని, దీని వల్ల ఈ పరీక్ష రాసే 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనిసనం తెలిపింది. నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయడం వల్ల రోగి సంరక్షణ, వైద్యుల కెరీర్ పై ప్రభావం చూపుతుందని బెంచ్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎలా.పరీక్షను వాయిదా వేస్తామని కోర్టు ప్రశ్నించింది. కాగాఈ ఏడాది మే 21న నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్‌లు మే 16, 2022 నుంచి అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. నీట్ పీజీ ఎగ్జామ్ 22ను వాయిదా వేయాలని కోరుతూ కొందరు డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మే 10న అంగీకరించింది. శుక్రవారం కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం ఎగ్జామ్ వాయిదాకే నో చెప్పింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సమయంలో పరీక్షలను వాయిదా వేస్తే దాదాపు 2 లక్షల 6 వేల మంది డాక్టర్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని ధర్మాసనం పేర్కొంది.కొంత మంది అభ్యర్థలు పరీక్షను వాయిదా వేయమని కోరుతున్నారని... అయితే అత్యధిక మంది ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నారని కోర్టు తెలిపింది. ఇక ప్రభుత్వం కూడా పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిందని... ఈ సమయంలో ఎగ్జామ్ వాయిదా నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
4.పల్లె,పట్టణ ప్రగతిలపై 18న సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,మే13(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్షించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఉన్నతస్థాయి సవిూక్ష జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీవోలు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చేపట్ట నున్నారు. కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో కేసీఆర్చర్చిస్తారు. ఇప్పటి వరకు అమలైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సవిూక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
5.కోలుకుంటున్న ఉక్రెయిన్
` రష్యా దళాలవ్యూహాలను తిప్పికొడుతూ ఉక్రెయిన్ దళాల భీకర ప్రతిదాడులు
కీవ్,మే13(జనంసాక్షి):రష్యా దళాలవ్యూహాలను తిప్పికొడుతూ ఉక్రెయిన్ దళాలు భీకరంగా ప్రతిదాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ మెళ్లిగా కోలుకుంటోంది. తాజాగా ఉక్రెయిన్ దళాలు ఒకే చోట 52 రష్యా సాయుధ వాహనాలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విటర్ హ్యాండిల్‌లో ఉంచింది. ‘’ఉక్రెయిన్‌కు చెందిన 17 ట్యాంక్ బ్రిగేడ్‌లోని శతఘ్ని దళాలు సెలవులు ఇవ్వడం మొదలుపెట్టాయి. కొందరు సివెర్స్కి డొనెట్స్ నదిలో స్నానం చేస్తుండగా.. మరికొందరు మే నెల సూర్యుడి దెబ్బకు కాలిపోతున్నారు’’ అని వెటకారంగా ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ దళాలు చాకచక్యంగా పనిచేస్తూ.. రష్యన్లను ముందుకు కదలనీయకుండా చేస్తున్నాయి.సివెర్స్కి డొనెట్స్ నదిని దాటేందుకు ఉన్న పాంటూన్ బ్రిడ్జిపై ఉక్రెయిన్ దళాలు దాడి చేసి కూల్చేశాయి. అదే సమయంలో ఆ కాన్వాయ్‌లో ఉన్న మిగిలిన వాహనాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసినట్లు అర్థమవుతుంది. దీనికి ఉక్రెయిన్ జీపీఎస్ గైడెడ్ శతఘ్ని గుండ్లను వినియోగించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ దాడిలో రష్యా సైన్యానికి చెందిన చాలా వాహనాలు దెబ్బతిన్నాయని సైనిక నిపుణుడు రాబ్ లీ పేర్కొన్నారు. రష్యా టాక్టికల్ బెటాలియన్ గ్రూపులను కనీసం 10 ట్యాంకులు, 40 సాయుధ రక్షణ వాహనాలు, దాదాపు 900 మంది సిబ్బందితో కలిపి రూపొందిస్తారని అన్నారు. ఉక్రెయిన్ విడుదల చేసిన చిత్రాలను వాణిజ్య శ్రేణి డ్రోన్‌తో చిత్రీకరించినట్లు భావిస్తున్నారు.సివెర్స్కి డొనెట్స్ నది దక్షిణ రష్యా నుంచి ఉక్రెయిన్ వేర్పాటు వాద ప్రాంతాలైన ఖర్ఖీవ్, లుహాన్స్క్ వరకు ప్రవహిస్తుంది. ఇది రష్యా దళాలకు భారీ అడ్డంకిగా మారింది. మాస్కో దళాలు ఈ నది కుడివైపు ఒడ్డున ఉన్న రుబిరaన్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి విఫలయత్నం చేస్తున్నాయి.
6.మళ్లీ అధికారమే లక్ష్యం
` గాంధీ హంతకులను కీర్తిస్తున్నారు
` మైనార్టీలను హింసిస్తున్నారు
` భాజపాతీరుపై మండిపడ్డ సోనియా
` ఉదయ్‌పూర్ చింతన్ శివిర్ వేదికగా విమర్శలు
ఉదయ్‌పూర్,మే13(జనంసాక్షి): దేశంలో మైనార్టీలను బీజేపీ ప్రభుత్వం క్రూరంగా అణిచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనకు గురి చేస్తోందని, గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారని మండిపడ్డారు. ఉదయ్‌పూర్ వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిరంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణిచివేస్తోంది. మినిమం గవర్న మెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అని చెప్పారు. దాని అర్థం దేశాన్ని నిట్టనిలువునా చీల్చడమేనా? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థల విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను చర్చించుకోవడానికి ’నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ ఒక అవకాశం కల్పిస్తుందని పార్టీ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ అన్నారు. నిరంతరం భయపెట్టడం, అభద్రతతో దేశ ప్రజలను బతికేలా చేయడం, మన సమాజంలో అంతర్భాగమైన , మన గణతంత్ర సమాన పౌరులైన మైనార్టీలనులక్ష్యంగా చేసుకుని క్రూరంగా హింసించడం చేస్తోందంటూ బీజేపీపై సోనియా చింతన్ శిబిర్ వేదికగా మండిపడ్డారు. ఇకపోతే పార్టీ నేతలంతా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. మోదీ పాలన కొనసాగితే... భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు 430 మంది నేతలు హాజరయ్యారు. తమతో పాటు ఫోన్లు తీసుకురావొద్దని వీరికి అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ, ఉపాధి, పార్టీ సంస్థాగత ప్రక్షాళన అంశాలపై వీరంతా చర్చించి తీర్మానాలు చేయనున్నారు. చింతన్ శిబిర్‌లో రూపొందించిన తీర్మానాలకు సీడబ్ల్యుసీ ఆమోదం లభించిన తరువాత సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లనుంది కాంగ్రెస్ పార్టీ. పార్టీ అంతా ఐకమత్యంగానే ఉందన్న సందేశం దేశప్రజలకు ఇవ్వాలని కోరారు. వ్యక్తిగత లక్ష్యాలకన్నా పార్టీకే ఎక్కువ విలువ ఇవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎంతో చేసిందని, ఇప్పుడు పార్టీకి తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా పాలకపక్షంపై విమర్శలు గుప్పించారు. 2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయిందని ఆరోపించారు. మోదీ పాలన కొనసాగితే.. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశంలో ఉన్న మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు పెంచారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలి. ప్రతిపక్ష నేతలపైకి విచారణ సంస్థలను ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గాంధీని చంపిన వారిని హీరోలుగా చిత్రీకరిస్తున్నారు. నెహ్రూ నెలకొల్పిన సంస్థలన్నిటినీ ధ్వంసం చేస్తూ వ్యవస్థలపై ఉన్న జ్ఞాపకాలను తుడిచేస్తున్నారు. లౌకికత్వంపై దాడి చేస్తూ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. ఆదివాసీలు, దళితులు, మహిళలపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయి. దేశాన్ని కార్పొరేట్ పరం చేస్తున్నారు. దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలి. అందుకు అనుగుణంగా వాతావరణం పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ఈ శిబిరంలో కాంగ్రెస్ నేతలు మన్మోమన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధీర్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. రెండ్రోజుల పాటు ఈ శిబిరం జరుగనుంది.
7.బిగ్ జోక్..(కిక్క)
మేమే ప్రధాన ప్రతిపక్షం
` ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
దిల్లీ,మే13(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.అలాగే దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని.. ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశ అప్పులపై కేంద్ర మంత్రి అమిత్‌షాతో చర్చించినట్లు కేఏ పాల్ తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కేఏ పాల్ విూడియాతో మాట్లాడారు.’’ఏపీ అప్పులు రూ.8 లక్షల కోట్లు.. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.4.50 లక్షల కోట్లుగా ఉంది. భారత్ అప్పులు చూస్తే రూ.కోటి లక్షలకు చేరింది. కేవలం రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసిన శ్రీలంక ఇవాళ దివాళా తీసింది. ఇందుకు కుటుంబ పాలన కూడా ఒక కారణం. కేసీఆర్ కుటుంబం 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. రూ.7లక్షల కోట్లు ఏమయ్యాయో కేసీఆర్, కేటీఆర్ చెప్పరు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రా, తెలంగాణ అప్పులపై అమిత్ షాతో చర్చించాను. నాపై జరిగిన దాడిని అమిత్ షా తీవ్రంగా ఖండిరచారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు లేవు.. ఇవ్వండని అమిత్ షాను కోరాను. ఆంధ్రప్రదేశ్‌లో భాజపా, జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. ఓటు బ్యాంక్ లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని కేంద్ర మంత్రిని అడిగాను. మేం ఆయన వెంట పడటమేంటి.. ఆయనే మా వెంట పడుతున్నారని అమిత్ షా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మినహా అన్ని ఎంపీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాను. ఇక ప్రజలే నిర్ణయిస్తారు’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు.
8.ఈసారి ముందస్తుగానే నైరుతి ప్రవేశం
మే 27న కేరళను తాకుతాయన్న వాతావరణశాఖ
న్యూఢల్లీి,మే13(జనంసాక్షి): నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ చల్లటి కబురు చెప్పింది. మే 27లోపు ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. తెలుగు రాష్టాల్రను సైతం వర్షాలు ముందుగానే పలకరిస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశాన్ని పలకరించ నున్నాయి. మే 27వ తేదీ లోపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయి. ఈ ఏడాది మాత్రం.. అంతకు నాలుగు రోజులు ముందుగానే ఇవి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం. అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 15న ఈ సీజన్ తొలి వర్షాలు కురవొచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. మే 15 కల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని ఐఎండీ తెలిపింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడిరచింది. ఈశాన్య రాష్టాల్లోన్రి అనేక ప్రాంతాలు సహా వాయువ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రుతుపవనాల రాకపై తాజా కబురు ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తోంది.
9.మోస్ట్ సెర్చ్ జాబితాలో తాజ్‌మహల్ నంబర్ వన్..
న్యూఢల్లీి,మే13(జనంసాక్షి):యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన ‘తాజ్‌మహల్’కు విశేష గుర్తింపు దక్కింది. ప్రముఖ ట్రావెల్ వెబ్‌సైట్ ‘జిటాంగో’ వివరాల ప్రకారం..మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించిన వారసత్వ సంపదల జాబితాలో ఈ పాలరాతి స్మారక కట్టడం మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఒకే నెలలో దాదాపు 14 లక్షలకుపైగా ఈ నిర్మాణం గురించి ఆన్‌లైన్‌లో వెతికారు. మొఘలుల నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణగా నిలిచే ఈ కట్టడాన్ని.. షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో నిర్మించాడు. ప్రపంచ ఏడు వింతల్లో ఇదీ ఒకటి. ఇదిలా ఉండగా.. యునెస్కో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,154 ప్రదేశాలను వారసత్వ సంపదగా గుర్తించింది.పెరూ దేశంలోని మాచు పిచ్చు రెండో స్థానంలో నిలిచింది. దీనికి దాదాపు 11 లక్షల సెర్చ్‌లు నమోదయ్యాయి. అండీస్ పర్వతాల్లో నది లోయపైన సముద్ర మట్టానికి 7900 అడుగులకుపైగా ఎత్తులో నిర్మించిన కోట ఇది. 15వ శతాబ్దంలో కట్టినట్లు భావిస్తారు. అడుసు ఉపయోగించకుండా రాతి గోడలను నిర్మించడం గమనార్హం.82 వేలకు పైగా శోధనలతో మూడో స్థానంలో బ్రెజిల్‌లోని రియో డి జనిరో ఉంది. దేశంలో రెండో అత్యధిక జనాభా కలిగిన నగరం ఇది. 2012లో ఇందులో కొంతభాగాన్ని యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఏడు వింతల్లో ఒకటైన ‘క్రైస్ట్ ది రిడీమర్’ విగ్రహం ఇక్కడే ఉంది.అమెరికాలోని ఎల్లోస్టోన్ పార్క్ ఓ జాతీయ ఉద్యానవనం. దీని గుండా ఎల్లోస్టోన్ నది పారుతుండటంతో.. ఆ పేరు వచ్చింది. వేడి నీటి బుగ్గల(హాట్ స్ప్రింగ్స్)కు పేరొందిన ప్రదేశం. అనేక జీవజంతుజాలానికి నెలవు ఈ పార్కు. 79 వేల సెర్చ్‌లు నమోదయ్యాయి.ఇంగ్లాండ్ విల్ట్‌షైర్‌లోని సాలిస్‌బరీ మైదాన ప్రాంతంలో నెలవైన కట్టడం ‘స్టోన్‌హెంజ్’. బ్రిటన్ సాంస్కృతిక చిహ్నం ఇది. రింగ్ ఆకృతిలో నిటారుగా నిలబెట్టిన పొడవైన భారీ రాళ్లు, వాటిపై అడ్డంగా పేర్చిన రాతి పలకలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. బ్లూస్టోన్స్‌తో లోపల మరో రింగ్, ఇతర నిర్మాణాలు ఉంటాయి. క్రీ.పూ 3000 నుంచి క్రీ.పూ 2000 వరకు వరకు దీని నిర్మాణం సాగినట్లు సమాచారం. 78 వేలకుపైగా దీని గురించి వెతికారు.స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి నెట్టింట 75 వేలసార్లకుపైగా వెతికారు. అమెరికా న్యూయార్క్‌లోని లిబర్టీ ఐలాండ్ ఉంటుందిదీ. చేతిలో కాగడాను పట్టుకుని ఠీవీగా కనిపించే ఈ 151 అడుగుల విగ్రహాన్ని.. ఫ్రాన్స్ అమెరికాకి బహుమతిగా ఇచ్చింది. వాస్తవానికిది రోమన్ దేవత. దీన్ని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు గుర్తుగా భావిస్తారు.57 వేలకుపైగా సెర్చ్‌లతో పెట్రా నగరం ఏడో స్థానంలో నిలిచింది. జోర్డాన్ దేశంలోని ఓ పురాతన నగరం ఇది. అద్భుతమైన రాక్`కట్ ఆర్కిటెక్చర్, ఎడారి ప్రాంతంలోనూ ప్రత్యేక నీటి నిర్వహణ వ్యవస్థ దీని సొంతం. అప్పట్లో ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అలరారినట్లు చరిత్ర చెబుతోంది. 1985లో యునెస్కో గుర్తింపు దక్కింది.వాయువ్య ఇటలీలోని ఓ తీర ప్రాంతం ‘సిన్క్యూ టెర్రే’. సిన్క్యూ టెర్రే.. అంటే ఐదు ప్రాంతాల సముదాయం అని అర్థం. మోంటెరోసో అల్ మేర్, వెర్నాజ్జా, కార్నిగ్లియా, మనరోలా, రియోమాగ్గియోర్ గ్రామాలు కలిసి ఉంటాయి. కఠిన శిఖర ప్రాంతాల్లో ఏటవాలుగా నిర్మించిన ఇళ్లు, సన్నని దారులు ముచ్చటగొల్పుతాయి. 55 వేలసార్లు దీని గురించి సెర్చ్ చేశారు.ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్.. మాజీ రాజ నివాసం. పారిస్‌కు 19 కిలోవిూటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్యాలెస్ ఫ్రెంచ్ రిపబ్లిక్ యాజమాన్యంలో ఉంది. 1995 నుంచి దేశ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఏటా 1.50 కోట్ల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారు. ఈ కట్టడం విషయంలో 46 వేలకుపైగా శోధనలు నమోదయ్యాయి.మెక్సికోలోని చిచెన్ ఇట్జా నగరం.. మాయన్ నాగరికత కాలం నాటిది. టెంపుల్ ఆఫ్ కుకుల్కాన్‌గా పేరొందిన ఓ పిరమిడ్ నిర్మాణం.. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. 44 వేలకుపైగా సెర్చ్‌లతో పదో స్థానంలో నిలిచింది.
10.విదేశాలకు వెళ్లేవారికి కోసం..
` బూస్టర్ డోసు వ్యవధి 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గింపు
దిల్లీ,మే13(జనంసాక్షి): విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్ డోసు విషయంలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య వ్యవధిని తగ్గించింది.ఈ రెండిరటి మధ్య అంతరాన్ని తొమ్మిది నెలల నుంచి 90 రోజులకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రం బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ తీసుకోవడానికి అర్హులని ప్రకటించింది. దీనిపై విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు, విద్యార్థుల నుంచి ఆరోగ్య శాఖకు పలు అభ్యర్థనలు వచ్చాయి. ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుంది. నిపుణుల సలహా మేరకు ఆ అంతరాన్ని తగ్గిస్తున్నట్లు నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. వారు వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు తగ్గట్టుగా ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని వెల్లడిరచారు. తాజాగా ఆ వ్యవధిని మూడు నెలలకు తగ్గిస్తూ ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.
11.ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా వైరస్
బయటకు లెక్కలు చెప్పని కిమ్ ప్రభుత్వం
సాయానికి ముందుకు వచ్చిన దక్షిణ కొరియా
న్యూఢల్లీి,మే13(జనంసాక్షి):ఉత్తర కొరియాను కొవిడ్ మహమ్మారి కుదిపేస్తోంది. గురువారం ఒక్కరోజే 18వేల మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ విూడియా వెల్లడిరచింది. మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. అందులో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. మొత్తంగా 3.5 లక్షల మందికిపైగా జ్వరపీడితులుగా మారినట్లు పేర్కొంది. లతిట ఞజీబ।బ: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు నమోదైనట్లు ప్రకటించిన మరుసటి రోజునే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్ర జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని, 3.5 లక్షల మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, మొత్తం ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు.. అస్తవ్యస్తమైన ఆరోగ్య వ్యవస్థ, టీకాలు వేయని, పోషకాహార లోపం ఉన్న ప్రజలతో దేశంలో కొవిడ్ `19 విజృంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి ఇప్పటివరకు 3.5 లక్షల మంది జ్వరపీడితులుగా మారినట్లు ఉత్తర కొరియా అధికారిక విూడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అందులో 1,62,200 మంది కోలుకున్నారని, కొత్తగా గురువారం ఒక్కరోజే 18,000 మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు పేర్కొంది. వారందరినీ ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆరుగురు మృతి చెందగా అందులో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ అయిందని తెలిపింది. అయితే ఎంతమందికి సోకిందనేది స్పష్టత లేదని వెల్లడిరచింది.కరోనా ఉద్భవించిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది కిమ్ ప్రభుత్వం. ఏప్రిల్ 25న పెద్ద ఎత్తున నిర్వహించిన మిలిటరీ పరేడ్ కారణంగానే వైరస్ వ్యాప్తి జరిగినట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణ ప్రధాన కేంద్రాన్ని గురువారం సందర్శిన కిమ్‌జోంగ్ ఉన్.. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ కట్టడిలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కరోనా ఉద్ధృతి సమయంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని కొవాక్స్ నుంచి టీకాలు తీసుకునేందుకు నిరాకరించిన ఉత్తర కొరియా ప్రస్తుతం విదేశాల నుంచి సాయం అందుకునేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు పలువురు నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే మానవతా కోణంలో ఉత్తర కొరియాకు వైద్య సాయంతో పాటు ఇతర సహాయం అందించేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉందని ఇరు దేశాల వ్యవహారాలను చూసే ఆ దేశ మంత్రిత్వ శాఖ తెలిపింది.