1.రెండుమూడు నెలల్లో సంచలన వార్త వింటారు
`దేశంలో మార్పు తథ్యం:సీఎం కేసీఆర్
` దేశంలో జరగాల్సిన అభివృద్ది జరగలేదు
` ఇన్ని సంవత్సరాలు గడచినా.. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుండిపోయింది
` స్వతంత్ర భారత అమృతోత్సవాలను జరుపుకుంటున్నామని, కరెంట్,తాగుసాగునీటి కోసం ఇంకా ఇక్కట్లే..
` మాజీప్రధాని దేవేవగౌడ,కుమారస్వామిలతో సీఎం కేసీఆర్ భేటిీ
` తాజా రాజకీయాలపై సమగగ్రంగా చర్చ
` కేసీఆర్ దేశాన్ని రక్షించాలనుకుంటున్నారు: హెచ్‌డీ కుమారస్వామి
బెంగళూరు,మే26(జనంసాక్షి): కేంద్రంలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల తర్వాత సంచలన వార్త వింటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బెంగళూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో పాటు రాజకీయ అంశాలపై అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్.. మాజీ సీఎం కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశం మార్పు కోరుకుంటోందని, మార్పు తథ్యమని కెసిఆర్ అన్నారు. ఇప్పటికే ఎందరో ప్రధానులు దేశాన్ని పరిపాలించారని, ఎన్నో ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలాయని.. అయినా.. దేశ పరిస్థితి ఏమాత్రం మారలేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడచినా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుండిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ కంటే తక్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అంటూ ప్రచారం చేస్తోందని, ఇది దేశానికే అవమానమని అన్నారు. నిజంగా మనసు పెట్టి అభివృద్ధి చేస్తే.. అమెరికా కంటే ఆర్థికంగా మనమే ఫస్ట్ ప్లేస్‌లో వుంటామని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో స్వతంత్ర భారత అమృతోత్సవాలను జరుపుకుంటున్నామని, అయినా? కరెంట్ కోసం, మంచినీళ్ల కోసం, సాగు నీటి కోసం ఇంకా అల్లల్లాడుతూనే వుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది ఇక్కడ ప్రధానం కాదని, ఒక ఉజ్వల భారతం కోసం శ్రమించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. దేశంలోని ఏ వర్గం కూడా మోదీ పాలనతో సంతోషంగా లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. రోజురోజుకీ పరిస్థితి దిగజారి పోతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కుమారస్వామి విూడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు కుమారస్వామి తెలిపారు. కన్నడ భాషలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం అనేక మంది నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వివిధ రాష్టాల్ల్రో పర్యటిస్తున్నట్లు కర్నాటక మాజీ సీఎం అన్నారు. దేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ఫ్రంట్‌కు ప్రయత్నిస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం మార్పు అవసరం అని, పేద ప్రజల కోసం కూడా మార్పు కావాలని కేసీఆర్ కాంక్షిస్తున్నారని హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. అంతకుముందు బెంగళూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి లంచ్ చేశారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్న కేసీఆర్.. నేరుగా దేవెగౌడ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు. లంచ్ అనంతరం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్టాల్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో కేసీఆర్ చర్చించారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంశాన్ని కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్‌తో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత అంటూ ప్లెక్సీలు వెలిశాయి.
కాగా బెంగళూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి లంచ్ చేశారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్న కేసీఆర్.. నేరుగా దేవెగౌడ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు.లంచ్ అనంతరం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో కేసీఆర్ చర్చించారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంశాన్ని కూడా చర్చించినట్లు తెలుస్తోంది.కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సాయంత్రం 4 గంటలకు తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.
2.భారత్ అంటే బిజినెస్
` కరోనా సమయంలో భారత్ సత్తా చాటింది
` భారత యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది
` ఐఎస్‌బిలో చదివిన వారు విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు
` యువత తమ శక్తిసామర్థ్యాలను దేశం కోసం ఉపయోగించాలి
` యువత కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టాం
` ఐఎస్‌బి 29వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగం
హైదరాబాద్,మే26(జనంసాక్షి):కరోనా సమయంలో దేశం తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చూపిందని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌కు రికార్డుస్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. నేడు ఇండియా అంటే బిజినెస్ అనేలా పరిస్థితి ఉంది. భారత యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. మనం చెప్పే పరిష్కారాలను ప్రపంచం అంతా అమలు చేస్తోంది. యువత కోసమే దేశంలో ఎన్నో సంస్కరణలు చేస్తున్నామని అన్నపారు. ఐఎస్‌బీఒక మైలురాయిని దాటిందని ప్రధాని మోదీ కొనియాడారు. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణమని ప్రశంసలు కురిపించారు. 20 ఏళ్ల వసంతాలను ఐఎస్‌బీ పూర్తి జరుపుకుంటోందని, 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయ్ ఐఎస్‌బీని ప్రారంభించారని తెలిపారు. నేడు ఆసియాలోనే ఐఎస్‌బీ టాప్ బిజినెస్ స్కూల్ అని మోదీ పొగడ్తలు కురిపించారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని తెలిపారు. ఐఎస్‌బీలో చదివిన వారు విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారని చెప్పారు. అనేక స్టార్టప్‌లను ప్రారంభించారని, దేశానికి ఐఎస్‌బీ గర్వకారణమన్నారు. వచ్చే 25 ఏళ్లకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని మోదీ ప్రకటించారు. జీ20 దేశాల్లో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్ వాడకంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ దేశంలో ఉందన్నారు. యువతతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్‌ఫామ్ అందరికీ ముఖ్యం. దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో దేశం మొదటి స్థానంలో ఉంది. విూ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడిరచండి. విూ కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండని మోదీ పేర్కొన్నారు. మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కన్జూమర్ మార్కెట్. నాకు విూ విూద నమ్మకం ఉంది. విూకు విూపై నమ్మకం ఉందా. మన విధానాలు, నిర్ణయాలను ప్రపంచం మొత్తం అధ్యయనం చేసే పరిస్థితులు వచ్చాయి. విూ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడిరచండి. విూరు చేపట్టబోయే కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయో గపడతాయో ఆలోచించండని ప్రధాని సూచించారు. దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. యువత కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. కరోనా సమయంలో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. చరిత్ర ఎన్నడూ లేని విధంగా దేశానికి ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇప్పుడు ఇండియా అంటేనే బిజినెస్ అని అన్నారు. భారత యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. మా ప్రభుత్వం దేశ యువతకు అండగా నిలబడుతోంది. రాజకీయ అస్థిరత వల్ల మూడు దశాబ్దాలుగా దేశం పాలసీ నిర్ణయాలు తీసుకోలేకపోయింది. 8 ఏళ్లుగా నిరాటకంగా సంస్కరణలు చేపడుతున్నాం. దేశంలో 8 ఏళ్లుగా మెడికల్ కాలేజీల సంఖ్య పెంచుకున్నాం. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామన్నారు.. కరోనా వ్యాక్సిన్‌ను కూడా దేశీయంగా అభివృద్ధి చేసుకున్నాం. భారత ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్
ఉంది. కరోనా సమయంలో పీపీఈ కిట్ తయారీ కంపెనీలు దేశంలో లేవు. ఇప్పుడు పీపీఈ కిట్లు తయారు చేసే కంపెనీలు 1100 ఉన్నాయని మోదీ అన్నారు.ఈ సందర్భంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
3.రాష్ట్రంలో హ్యుందాయ్ రూ. 1400 కోట్ల పెట్టుబడి
` 37 లక్షల డాలర్ల పెట్టుబడికి జీఎంఎం ఫాడులర్ సంస్థ ఆసక్తి
` మాస్టర్‌కార్డ్‌తో తెలంగాణ ఒప్పందం..
` దావోస్ వేదికగా మంత్రి కెటిఆర్ తీవ్రకృషి
హైదరాబాద్,మే26(జనంసాక్షి): దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్ వేదికగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రమైన కృషి చేస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తుండటంతో.. పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయస్థాయి కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఎంవోయూలను కూడా కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్టాన్రికి మరో భారీ పెట్టుబడి దక్కింది. ఈ క్రమంలో జీఎంఎం ఫాడులర్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. గ్లాస్ లైన్ పరికరాల తయారీకి విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. తయారీ కేంద్రంపై మరో 37 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం కంపెనీ ఈ ప్రకటన చేసింది. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులో భాగస్వామిగా సంస్థ ఉంటానని ప్రకటించింది. 2020 ఏడాదిలో తెలంగాణలో జీఎంఎం ఫాడులర్ తన కంపెనీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. గ్లాస్ లైనింగ్ ఈక్విప్‌మెంట్ తయారీ రంగంలో 6.3 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్‌తో హ్యుందాయ్ గ్రూప్ తెలంగాణలో రూ. 1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో హ్యుందాయ్ సీఈవో యంగ్చోచి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్ లతో పాటు ఎకో సిస్టమ్ అవసరం అయిన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాల పైన కూడా విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుందాయ్ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో రూ. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్ కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హ్యుందాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.
మాస్టర్‌కార్డ్‌తో తెలంగాణ ఒప్పందం..
హైదరాబాద్: రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణాగా మార్చేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం.. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. డిజిటల్ స్టేట్ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. మాస్టర్‌కార్డ్ వీసీ, అధ్యక్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మధ్య ఆ డీల్ కుదిరింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరైన తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌తో జరిగిన ఒప్పంద భాగస్వామ్యంతో.. ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో వెల్లడిరచారు. మాస్టర్‌కార్డ్‌తో రాష్ట్రంలో పౌర సేవలను అత్యంత వేగంగా డిజిటైజ్ చేయవచ్చు అన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై ఫోకస్ పెట్టడంతో పాటు రైతులకు కూడా డిజిటల్ సేవలను అందించవచ్చు అని మంత్రి తన ట్వీట్‌లో తెలిపారు. డిజిటల్ స్టేట్ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా మాస్టర్‌కార్డ్‌తో కీలక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పనిచేయనున్నట్లు మంత్రి చెప్పారు.
4.మోదీకి తెలంగాణ అమరుల గురించి మాట్లాడే అర్హత లేదు
` తల్లిని బిడ్డను బతికించారన్నావు..
` తెలంగాణ అభివృద్ధి చూసి నీకు కండ్లమంట..
` వాట్సాప్ యూనివర్సీటీ కట్టుకథలకు కేంద్రం భాజపా
` 8ఏళ్లుగా మాటలే తప్ప చేతలు లేని ప్రధాని
` ఎనిమిదేళ్లలో వంద లక్షల కోట్ల అప్పులు చేశారు
` మండిపడ్డ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్,మే26(జనంసాక్షి): హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణపై మరోసారి విషం చిమ్మిన ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండిరచారు. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి తెలంగాణ అమరుల గురించి ఉచ్చరించే అర్హత లేదని తేల్చిచెప్పారు. మోదీ ప్రభుత్వంలో మాటలే తప్ప, చేతలు లేవన్నారు. స్వచ్చభారత్, భేటీ బచావో` భేటీ పడావో, జన్ ధన్, నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా ఇలా అన్ని పథకాలు, నినాదాలు, విధానాలు విఫలమైనవే అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేదని స్పష్టం చేశారు. మోదీ అత్యాశకు పోతున్నారని నిప్పులు చెరిగారు. మోదీ, అమిత్‌షాలు దేశాన్ని అమ్ముతుంటే ఆదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో రూ. 100 లక్షల కోట్ల అప్పుచేసిన మోదీ రేపు ఆగస్టు వరకు మరో రూ. 8 లక్షల కోట్ల ప్రతిపాదనలు తయారుచేసి పెట్టాడని మంత్రి తెలిపారు. రూ. 4 వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యం కొనమంటే మొహం చాటేసిన మోదీ, రూ.11 లక్షల కోట్ల కార్పోరేట్ అప్పులను మాఫీ చేయడం దారుణమన్నారు. గుజరాత్‌లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు దేశ ప్రధానిగా ఉండి గుజరాత్‌లో కనీసం 24 గంటల కరెంటు ఇవ్వలేకపోయిన వ్యక్తి మోదీ అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నింపడం చేతగాని మోదీ.. యువకుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నిస్సిగ్గుగా తెగనమ్మి దేశాన్ని అధోగతి పాలు చేసింది మోదీనే అని మంత్రి నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాను నినాదానికి పరిమితం చేసి సేల్ ఇండియాను పరిచయం చేశారని ఎª`దదెవా చేశారు. ప్రపంచదేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధవిశ్వాసాలను నమ్మనంటున్న మోదీ అంధ భక్తులను తయారుచేసి పబ్బం గడుపుకుంటున్నాడని పేర్కొన్నారు. వాట్సప్ యూనివర్శిటీలో కట్టుకథలు తయారుచేసి, ప్రచారం చేస్తూ దేశంలో వివిధ రాష్టాల్ల్రో హింసను రెచ్చగొడుతున్నారని నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇదిలావుంటే తెలంగాణపై ప్రధాని మోడీ విషం కక్కారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న మోడీ... కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ అయిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై పల్లా రాజేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రధాని హోదాలో ఉండి పచ్చి అబద్దాలు ఆడారని ఫైర్ అయ్యారు. రాష్టాన్రికి ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్టాన్రికి కేటాయించిన ఐటీఐఆర్‌ను రద్దు చేసిన చరిత్ర మోడీది కాదా అని నిప్పులు చెరిగారు.
5.హక్కుల కోసం కలబడుతాం
` మోదీ ముందే తెగేసి చెప్పిన స్టాలిన్
చెన్నై,మే26(జనంసాక్షి):కేంద్ర వ్యవహార శైలిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ ముందే తప్పుబట్టారు. కేంద్రం నుంచి తమిళనాడుకు ఏమాత్రం నిధులే రావడం లేదని ప్రధాని ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గురువారం చెన్నైలో పర్యటించారు. సీఎం స్టాలిన్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ ముందు కొన్ని డిమాండ్లు వుంచారు.రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్టాలిన్ తేల్చి చెప్పారు. అలాగే తాము నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నామని, అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. తమ రాష్ట్రానికి నీట్ నుంచి మినహాయింపును ఇవ్వాలని స్టాలిన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఇక.. హిందీని కాకుండా తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలని స్టాలిన్ ప్రధాని మోదీని కోరారు. మత్స్యకారులు స్వేచ్ఛగా చేపలు పట్టేందుకు వీలుగా శ్రీలంక నుంచి కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను వదులుకోవడంలో ఏమాత్రం సిద్ధంగా లేమని ప్రధాని మోదీ ముందే సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు.
6.భాజపా రాష్ట్రాల్లో అంతా కుటుంబపాలనే..
` బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు : మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట,మే26(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు అని మండిపడ్డారు. మోదీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు వచ్చి చిల్లర మాటలు మాట్లాడిపోయారని విమర్శించారు. మోదీ ఆయన స్థాయికి తగిన మాటలు మాట్లాడలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు.నాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉద్యమాన్ని విచ్చిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. విూ బీజేపీ పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి అధికారంలోకి వచ్చే మోసం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు. ఓట్ల కోసం మతకల్లోల్లాలు సృష్టించాలని చూస్తున్నారు. బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇవాళ్టి హైదరాబాద్ పర్యటనలో తెలంగాణ ప్రజలకు మేలైన విషయాలు చెప్తారని ఆశించాం.. విభజన చట్టంలోని సమస్యలపై స్పందిస్తారని అనుకున్నాం.. కానీ అలాంటిదేవిూ జరగలేదన్నారు.కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణనే ఓ కుటుంబంగా భావించి పరిపాలించే నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారో చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తమనేది పగటి కలే. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే. కుటుంబ రాజకీయాలపై మోదీ మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు హరీశ్‌రావు.గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అడిగినప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ మంచిపార్టీ. ఆ రోజు కుటుంబ పార్టీ కాదు. ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా విూకు కనబడుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. అమిత్ షా కుమారుడు బీసీసీఐకి సెక్రటరీ అయిండు. ఎలా అవుతాడు. ఆయనేమైనా క్రికెటర్‌రా? దానికి విూరు ఇచ్చే సమాధానం ఏంటి? తమిళనాడులో డీఎంకేతో, ఏపీలో టీడీపీతో, పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు.. అవి కుటుంబ పార్టీలు అని గుర్తుకు రాలేదా? విూ తప్పులు ఎత్తిచూపితే కుటుంబ పార్టీ అంటారా? అని హరీశ్‌రావు నిలదీశారు.
7.కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి నష్టం జరుగుతోంది
` పార్లమెంట్‌లో తెలంగాణను అవమానించేలా మోదీ వ్యాఖ్యలు
` మోదీకి రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్,మే26(జనంసాక్షి):ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని రేవంత్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఉప్పు, నిప్పుగా ఉన్నట్లు నాటకమాడుతున్నాయని.. కానీ వాళ్ల చీకటి బంధం ప్రజలకు తెలుసన్నారు. బహిరంగ లేఖలో 9 అంశాలను ప్రస్తావిస్తూ వాటికి ప్రధాని సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు గురించి అవమానించేలా మోదీ మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. దాన్ని ప్రధాని ఎందుకు ఉపేక్షిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంతో జరుగుతున్న నష్టం, గిరిజన విశ్వవిద్యాలయం, ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసివేత, యాసంగి ధాన్యం కొనుగోలు, రామాయణం సర్క్యూట్‌లో భద్రాద్రికి చోటు కల్పించకపోవడం తదితర అంశాలపై రేవంత్‌రెడ్డి ప్రశ్నలు సంధించారు. వీటికి ప్రధాని మోదీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
9.గుజరాత్‌లో పట్టుబడ్డ రూ.500కోట్ల విలువైన డ్రగ్స్
గుజరాత్,మే26(జనంసాక్షి):గుజరాత్‌లో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడిరది. ‘ఆపరేషన్ నవ్కిూన్’లో భాగంగా గజురాత్‌లోని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రూ.500 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఇరాన్ నుంచి ఉప్పు పేరుతో సరకు వచ్చిందనే సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ముంద్రా పోర్టులో సోదాలు నిర్వహించారు. అనుమానంతో జరిపిన సోదాల్లో డీఆర్‌ఐ అధికారులు 57 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. కొకైన్ దిగుమతి విషయంలో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.గతంలోనూ ఇదే పోర్టులో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. డీఆర్‌ఐ అధికారులు ముంద్రా పోర్టులో రూ. 9వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడతో సంబంధాలు సైతం ఉండటం గమనార్హం. నిఘా వర్గాల సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకొని తనిఖీలు చేయగా భారీగా హెరాయిన్ బయటపడిరది. ఆ కంటైనర్లు అఫ్గానిస్థాన్ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడిరగ్ సంస్థకు చెందినవిగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
10. ‘ఉక్రెయిన్ ముగిసింది.. తర్వాత పోలాండే!’
` చెచెన్ నేత రంజాన్ కదిరోవ్
మాస్కో,మే26(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో పుతిన్‌కు మద్దతుగా నిలుస్తోన్న చెచెన్ నేత రంజాన్ కదిరోవ్.. తాజాగా పోలాండ్‌ను ఉద్దేశించి తీవ్ర బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు కనిపిస్తోన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.’ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్ పట్ల ఆసక్తిగా ఉంది’ అని ఆయన అందులో వ్యాఖ్యానించారు. ‘ఉక్రెయిన్ అనంతరం.. ఒకవేళ మాకు ఆదేశాలు ఇచ్చినట్లయితే.. ఆరు సెకన్లలో మేం ఏం చేయగలమో చేసి చూపుతాం’ అని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన ఆయుధాలు, కిరాయి సైనికులను వెనక్కి తీసుకోవాలని పోలాండ్‌కు డిమాండ్ చేశారు. రష్యా దాడికి వ్యతిరేకంగా కీవ్‌కు ఆయుధాలను సరఫరా చేసిన ఐరోపా దేశాల్లో పోలాండ్ ఒకటి.ఇటీవల రష్యా విక్టరీ డే సందర్భంగా పోలాండ్‌లోని రష్యా రాయబారిపై ఎర్ర సిరాతో దాడి చేసిన ఘటననూ కదిరోవ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘మా రాయబారి పట్ల ప్రవర్తించినదానికి అధికారికంగా క్షమాపణలు కోరండి. మేం ఈ విషయాన్ని మర్చిపోం. గుర్తుంచుకోండి’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై పుతిన్ సేనల దాడిని కదిరోవ్ మొదట్లోనే స్వాగతించిన విషయం తెలిసిందే. వెంటనే అక్కడికి తన బలగాలనూ పంపారు. తన మనుషుల్లో దాదాపు వెయ్యి మంది అక్కడ ఉన్నారని మార్చి మధ్యలో స్వయంగా వెల్లడిరచారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో పుతిన్ అనుకూల వేర్పాటు వాదులకు ఆయన మద్దతు ఉంది. క్రిమియా ఆక్రమణ సమయంలో కూడా రెబల్స్‌కు కదిరోవ్ మద్దతు లభించింది.