ALL NEWS

 1.మంకీఫాక్స్‌పై తెలంగాణ సర్కారు పారాహుషార్‌

` లక్షణాలుంటే ఐసోలేషన్‌

` అప్రమత్తమైన యంత్రాంగం

` అనుమానితులు జిల్లా వైద్యాధికారులను సంప్రదించాలని సూచన

హైదరాబాద్‌,మే28(జనంసాక్షి): పలు దేశాల్లో మంకీ పాక్స్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్లో ఉంచనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.ఇటీవల మంకీ పాక్స్‌ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ఒంటిపై రాషెస్‌ వచ్చిన వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులను అదేశించింది. అనుమానితులు జిల్లా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. అనుమానితుల రక్త నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీకి పంపనున్నట్టు వెల్లడిరచారు.ఇదిలావుండగా దేశానికి చెందిన మెడికల్‌ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌.. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్‌టైమ్‌ పీసీఆర్‌ కిట్‌ను రూపొందించింది.’’ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌కు చెందిన రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బృందం.. మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు ఓ ఆర్‌టీ`పీసీఆర్‌ కిట్‌ను తయారుచేసింది. ఇది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్‌ ఆధారిత కిట్‌. ఇది వన్‌ ట్యూబ్‌ సింగిల్‌ రియాక్షన్‌ ఫార్మాట్‌లో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌ తేడాను గుర్తిస్తుంది. ఈ కిట్‌ ద్వారా గంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు’’ అని ట్రివిట్రాన్‌ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. ఈ కిట్‌తో టెస్టు చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతో పాటు వీటీఎం(వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విూడియా) స్వాబ్‌లను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ చంద్ర గంజూ మాట్లాడుతూ.. ‘’ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్‌ వ్యాప్తి కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది’’ అని తెలిపారు.బ్రిటన్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, కెనడా, అమెరికా సహా 20 దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టకపోతే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్‌ సైల్వై బ్రైండ్‌ అభిప్రాయపడ్డారు. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్‌పై పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయంపై బ్రిటన్‌, జర్మనీ, కెనడా, అమెరికాలు పరిశోధన ప్రారంభించిన నేపథ్యంలో.. డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం కూడా ఈ విషయమై పనిచేస్తోందని, త్వరలోనే మార్గదర్శకాలను అందిస్తామని చెప్పారు. మంకీపాక్స్‌ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం, ఒళ్లునొప్పులు, చలి, అలసట వంటి లక్షణాలుంటాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్నబొబ్బలు ఏర్పడవచ్చు. క్రమేపీ అవి ఇతర శరీర భాగాలకూ వ్యాపించవచ్చు.



2.పేదల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నాం

` ఎనిమిదేళ్లలో తలదించుకునే పనిచేయలేదు

` గాంధీ, పటేల్‌ కలలుగన్న భారతావని కోసం కృషి

` సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం

` పేదల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాల అమలు

` గుజరాత్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ

గాంధీనగర్‌,మే28(జనంసాక్షి):గత ఎనిమిదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని ఏదీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ రాజ్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని శనివారం ప్రారంభించిన ప్రధాని... అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ కలలుగన్న భారతాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తు న్నట్లు ప్రధాని మోదీ అన్నారు. గత ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పనేదీ తాను చేయలేదని పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్ల భాజపా పాలనలో పేదల సంక్షేమం సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు ప్రధాని. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాశ్‌ నినాదాల ద్వారా దేశాభివృద్ధికి ఊతమిచ్చినట్లు చెప్పారు. వివిధ పథకాల ద్వారా దేశంలోని పేదల అభ్యున్నతికీ పనిచేస్తున్నామన్నారు. తద్వారా వారి జీవితాలను మెరుగు పరిచేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో పేద ప్రజల కోసం ఆహార ధాన్యాల నిల్వలను తెరిచినట్లు మోదీ చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు అందజేసినట్లు గుర్తుచేశారు. అంతకుముందు నూతన ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని.. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. రాజ్‌కోట్‌లోని అట్కోట్‌లో శ్రీ కేడీ పర్వాడియా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. నేడు గుజరాత్‌ గడ్డపైకి వచ్చానని, గుజరాతీలందరికీ తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. మాతృభూమికి సేవ చేయడంలో ఏ అవకాశాన్నీ తాను వదిలిపెట్టలేదని చెప్పారు. సమాజం కోసం ఏ విధంగా జీవించాలో గుజరాతీలు తనకు నేర్చారన్నారు. గుజరాతీలు నేర్పిన విద్య, విలువల వల్ల తాను జన్మభూమికి సేవ చేసే ఏ అవకాశాన్నీ వదిలిపెట్ట లేదన్నారు. కేంద్రంలో ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ సేవలో ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంటోందన్నారు. ఈ ఎనిమిదేళ్ళలో తాము పేదలకు సేవ చేయడం, వారి సంక్షేమం కోసం కృషి చేయడం, సుపరిపాలనను అందించడానికే ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ’అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’ అనే మంత్రాన్ని తాము అనుసరిస్తున్నామని చెప్పారు. దేశాభివృద్ధికి నూతన ప్రేరణను ఇచ్చామన్నారు. మహాత్మా గాంధీ, సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ కలలుగన్న భారత దేశాన్ని నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్ళలో నిజాయితీగా కృషి చేశామని చెప్పారు. పేదలు, దళితులు, బాధితులు, గిరిజనులు, మహిళలు సాధికారులను చేసే భారత దేశం కావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం జీవన విధానంగా ఉన్న సమాజం కోసం కలలు గన్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దేశీయ పరిష్కారాలు ఉండాలన్నారని తెలిపారు. కోవిడ్‌`19 మహమ్మారి గురించి ప్రస్తావిస్తూ, పేదల కోసం ప్రభుత్వం ఉన్నట్లయితే, అది వారికి ఎలా సేవ చేస్తుందని ప్రశ్నిస్తూ, వారిని సాధికారులను చేయడానికి పని చేస్తుందన్నారు. నేడు యావత్తు దేశం దీనినే చూస్తోందన్నారు. వందేళ్ళలో అతి పెద్ద సంక్షోభం కోవిడ్‌ వచ్చిన సమయంలో కూడా యావత్తు దేశం దీనిని చూసిందన్నారు. ఈ మహమ్మారి ప్రారంభమైనపుడు పేదలకు ఆహారం, తాగునీరు సమస్యలుగా మారాయన్నారు. దీంతో తాము దేశంలోని ఆహార ధాన్యాల గోదాములను తెరిచామన్నారు. 




4.పంజాబ్‌లో వీఐపీల భద్రత ఉపసంహరణ

` ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. 

చండీగఢ్‌,హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీఐపీ సంస్కృతికి తెరదించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.ఇందులో భాగంగా ఆ మధ్య మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను రద్దు చేసిన భగవంత్‌ మాన్‌ సర్కారు.. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు కూడా భద్రతను తొలగించింది.రిటైర్డ్‌ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. డేరా రాధ సోవిూ బ్యాస్‌కు ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించినట్లు తెలిపింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు మాన్‌ ప్రభుత్వం వెల్లడిరచింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీతో పాటు మాజీ మంత్రులు మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, రాజ్‌ కుమార్‌ వెర్కా, భరత్‌ భూషణ్‌ అషు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నిర్ణయంతో 400 మందికి పైగా పోలీసు సిబ్బంది తిరిగి పోలీసు స్టేషన్లకు వచ్చినట్లు సీఎం మాన్‌ అన్నారు. పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలి గానీ.. వీఐపీలకు భద్రతా విధుల పేరుతో వారిని బాధపెట్టకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మాన్‌ వెల్లడిరచారు.అంతకుముందు, మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలోనూ మాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులుగా ఎన్నిసార్లు ఎన్నికైనా.. ఇకపై ఒకేఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రకటించారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఒకసారి శాసనసభ్యునిగా ఎన్నికైనవారికి పదవీకాలం ముగిశాక నెలకు రూ.75 వేల చొప్పున పింఛను చెల్లిస్తున్నారు. తరవాత ప్రతి పదవీకాలానికి ఈ పింఛను మొత్తంలో 66 శాతాన్ని అదనపు పింఛనుగా ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడున్నర లక్షల నుంచి అయిదున్నర లక్షల రూపాయల వరకు పింఛను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ నిర్ణయం వల్ల కోట్లాది రూపాయలు ప్రజా ప్రయోజనాలకు ఖర్చు పెట్టే అవకాశం లభిస్తుందని సీఎం మాన్‌ అన్నారు. అయితే దీనిపై రాష్ట్ర శాసనసభలో బిల్లు తీసుకురావాలని పంజాబ్‌ గవర్నర్‌.. ప్రభుత్వానికి సూచించారు.




5.మతవిద్వేషపు విషాన్ని విరజిమ్ముతున్న బండి

` చట్టపరమైన చర్యలకు ముస్లిం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌

కరీంనగర్‌,మే28(జనంసాక్షి):కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ మతవిద్వేషాన్ని విరజిమ్ముతున్నారని, వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ  డిమాండ్‌ చేసింది.కరీంనగర్‌ శనివారం రాజీవ్‌చౌక్‌లో పికాక్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంజేఏసీ అధ్యక్షుడు అబుబకర్‌ ఖాలీద్‌ మాట్లాడుతూ బుధవారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని జరిగినటువంటి హిందూ ఏక్తాయాత్రలో బండి సంజయ్‌ కుమార్‌ విద్వేషపూరిత ప్రసంగంలో తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వితే శవాలు దొరికితే విూవి, శివలింగం దొరికితే మేము తీసుకుంటామని అన్నారని, ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ది పొందాలనే దురుద్దేశ్యంతో మాత్రమే చేసినవని అన్నారు.అంతేకాకుండా కరీంనగర్‌ లోనిఈద్గా, వేములవాడలోని దర్గాను తమ ప్రభుత్వం వస్తే కూల్చేస్తామని, ముస్లింలరిజర్వేషన్‌ను, ఉర్దూ రెండవ భాషను రద్దు చేస్తామని, మదర్సాలను మూసివేస్తామనే అహంకారపూరిత ప్రసంగం ద్వారా ముస్లింలపై, మసీదులపై హిందూ యువకులను ఎగదోసి మతకల్లోహాలు రేపి ఈ మంటలో చలికాసుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌, మునుషులు లేని మట్టికి విలువేముందని, మనుషులను ప్రేమించలేని సమాజానికి మనుగడ ఎక్కడ ఉందని,ద్వేషపునాదులపై మనం జాతిని నిర్మించలేమన్నారు.ఉత్తరప్రదేశ్‌, బీహార్‌,ఉత్తరాఖండ్‌, కర్ణాటక రాష్ట్రాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రభుత్వాలను చేజిక్కించుకున్నారన్నారు.అలాంటి ప్రయత్నమే ఇక్కడ చేయబోతున్నారని తెలిపారు. మతం ఏదైనా మనమంతా భారతీయులమే అని మనమంతా గుర్తుంచుకోవలసిన విషయమని స్పష్టం చేశారు. మనదిలౌకిక దేశమని ఏ మతమైనా అనుసరించే స్వేచ్ఛ ఉన్న దేశమని, భిన్నత్వంలో ఏకత్వమంటే ఇరుగు పొరుగు వారిని గౌరవించే సాంప్రదాయం గల దేశమని, మనిషిని మనిషి దృష్టితో కాకుండా మతం దృష్టితో చూడడం సరిjైున ధోరణి కాదని వారు హితవు పలికారు. ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’’ ..ప్రపంచంలోనే ఉన్నతమైన దేశం మనదని, సద్భావన మతసామరస్యం ప్రపంచానికి చాటి చెప్పే దేశం మనదని అన్నారు.మతతత్వ శక్తులు ఫాస్టిఫ్‌ ధోరణిగల పార్టీలు తన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.సెక్యులర్‌ ధోరణి గల ప్రజాస్వామ్యవాదులందరూ ఏకమై ప్రతిఘటించాలని ఈ సందర్భంగా వారు కోరారు.కరీంనగర్‌లో ప్రశాంత వాతావరణాన్ని శాంతి భద్రతలను కాపాడాలని, హిందూ ముస్లిం వర్గాల మధ్య మతకల్లోహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్‌పూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌,సీపీలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంజేఏసీ వైస్‌ ప్రెసిడెంట్‌లు ముఫ్తీ మహ్మద్‌ గియాస్‌ మోహియుద్దీన్‌,ఎండీ.ఖైరుద్దీన్‌, ముఫ్తీ అలీముద్దీన్‌ నిజామీ,అబ్దుల్‌ సమీ సహెబ్‌, జాయింట్‌ సెక్రటరీ మహ్మద్‌ మునీబుద్దీన్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు ఎంఏ.సమద్‌ నవాబ్‌, ఖాజా అలీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


6.మహారాష్ట్రలో ఉపవేరియంట్ల కలకలం.. 

` విస్తరిస్తున్న బీఏ.4, బీఏ.5 రకం కేసులు

` ఏడుగురికి పాజిటివ్‌

ముంబయి,మే28(జనంసాక్షి):దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.మహారాష్ట్రలో తాజాగా నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ల బారిన పడిన ఏడుగురికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపారు. కాగా వీరంతా పుణెకు చెందినవారు కావడం గమనార్హం. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు.’జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ నిర్వహించింది. ఈ సీక్వెన్సింగ్‌ను ఫరీదాబాద్‌లోని ఇండియన్‌ బయోలాజికల్‌ డేటా సెంటర్‌ ధృవీకరించింది. ఇందులో పుణెకు చెందిన ఏడుగురు ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ల బారినపడినట్లు నిర్ధరణ అయ్యింది. వీరిలో నలుగురికి బీఏ.4 సోకగా, మరో ముగ్గురు బీఏ.5 ఉప వేరియంట్‌ బారినపడ్డారు. ఈ ఏడుగురిలో ముగ్గురు మహిళలతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు ‘ అని అని వైద్యాధికారి పేర్కొన్నారు.వైరస్‌ బారిన పడినవారిలో ఇద్దరు విదేశాలకు వెళ్లివచ్చారని, మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడిరచారు. మరో ఇద్దరు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదని తెలిపారు. బాలుడు మినహా మిగతా ఆరుగురు కూడా వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో తీసుకున్నారని, ఓ వ్యక్తి బూస్టర్‌ డోసు కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ ఉప వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌`కోవ్‌`2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఎఔూంఅూఉ) కొద్దిరోజుల క్రితమే వెల్లడిరచించిన విషయం తెలిసిందే. తమిళనాడు, తెలంగాణలో ఈ కేసులు ఇప్పటికే బయటపడ్డాయి.



7.మోదీ డ్రోన్లకు ప్రజల ఇబ్బందులు కనిపించవు

` డ్రాగన్‌ ఆక్రమణ కనిపించదు 

` కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా..

న్యూఢల్లీి,మే28(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డ్రోన్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. మోదీ ఆయన ఉపయోగించే డ్రోన్లు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది. డ్రోన్ల సాయంతో దేశవ్యాప్తంగా జరిగే అభివృద్ధి పనులను తాను తనిఖీ చేస్తుంటానని మోదీ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తప్పుపడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. కొవిడ్‌ సమయంలో ప్రజల మరణాలు, ఆకలి కేకలు, మృతదేహాల సామూహిక ఖననం వంటి దృశ్యాలు ప్రధాని డ్రోన్‌ చూడలేకపోయిందని పేర్కొంది. బీజేపీ అజెండాకు ఏది ఉపయోగపడుతుందో వాటినే ప్రధాని మోదీ డ్రోన్లు పసిగడతాయని కాంగ్రెస్‌ ప్రతినిధి సునీల్‌ అహిరె ట్వీట్‌ చేశారు. చైనా ఆక్రమణను మోదీ డ్రోన్లు ఉద్దేశపూర్వకంగానే చూసీచూడనట్టు వదిలేశాయని అన్నారు.ప్రధాని డ్రోన్‌లు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం, చైనా బ్రిడ్జిలు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా గ్రామాలు, 20 మంది భారత సైనికుల మరణాన్ని చూడలేకపోయాయని పేర్కొన్నారు. కాగా, భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌లో ప్రధాని మాట్లాడుతూ వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, క్రీడలు వంటి కీలక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరగాలని ఆకాంక్షించారు. భారత్‌లో డ్రోన్‌ పరిశ్రమ ఉపాధి రంగంగా ఎదుగుతున్నదని చెప్పారు.


8.రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు 

హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో అరేబియన్‌ సముద్రం, లక్షద్వీప్‌లోని పలు ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.తెలంగాణలోకి జూన్‌ 5 నుంచి 10వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో 38.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


9.అమెరికాలో తుపాకీపై నియంత్రణను తోసిపుపచ్చిన ట్రంప్‌

వాషింగ్టన్‌,మే28(జనంసాక్షి):ఇటీవల అమెరికాలోని ఓ పాఠశాలలో పిల్లలపై జరిగిన తుపాకీ కాల్పుల ఘటన ప్రపంచాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దాంతో తుపాకీ వ్యవస్థను నియంత్రించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.కాగా, దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు.తుపాకీ వాడకంపై నియంత్రణలను కఠినతరం చేయాలనే డిమాండ్లను ట్రంప్‌ తోసిపుచ్చారు. చెడు నుంచి తమను తాము రక్షించుకునేలా తుపాకీ వాడేందుకు చట్టానికి లోబడి జీవించే అమెరికన్లను అనుమతించాలన్నారు. హూస్టన్‌లో నేషనల్‌ రైఫిల్‌ అసోషియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏ) నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ... ‘ఇప్పటివరకూ తుపాకీ నియంత్రణకు ప్రతిపాదించిన విధానాలు ఈ తరహా ఘటనలు నియంత్రించడానికి ఏ మాత్రం ఉపకరించలేదు. ఈ విధానాలు వింతైనవి. మన చిన్నారులను రక్షించుకోవడానికి, పాఠశాలలను పటిష్టం చేసుకోవడానికి పార్టీలకతీతంగా మనమంతా ఏకం కావాలి’ అని సూచించారు.టెక్సాస్‌లోని యువాల్డీ పట్టణంలోని రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఓ యువకుడు రక్షణ కవచం ధరించి వచ్చి ఏఆర్‌`15 సెవిూ ఆటోమేటిక్‌ తుపాకీతో నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. ఆ మారణ హోమం 19 మంది బడిపిల్లల్ని, ఇద్దరు టీచర్లను బలిగొంది. అనేకమంది గాయపడ్డారు. ఈ అమానుష ఘటన యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది. శక్తిమంతమైన ‘గన్‌ లాబీ’కి కళ్లెం వేయడానికి శాసనకర్తలు నడుం బిగించాలంటూ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఉద్వేగంతో పిలుపునిచ్చారు. ఆయుధాల వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘తమ బిడ్డను కోల్పోవడమంటే కన్నవారి ఆత్మ నుంచి ఒక భాగాన్ని కోసి తీసుకుపోవడమే. రక్తపాతాన్ని నిర్మూలించే దృఢ సంకల్పాన్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఎన్నాళ్లు ఇలా దేవుడి దయకు వదిలేస్తాం? శక్తిమంతులైన తుపాకీ తయారీదారులకు అడ్డుకట్ట పడాలి. ఇకనైనా మన ఆవేదనను కార్యరూపంలోకి తీసుకువద్దాం’ అంటూ స్పందించారు. అమెరికాలో 2022లో ఇప్పటివరకు 200 పైగా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.



10.నల్గొండ జిల్లాలో ఘోరం

` రథాన్ని తీసే క్రమంలో విద్యుత్‌ షాక్‌ 

` ముగ్గురి మృతి

నాంపల్లి,మే28(జనంసాక్షి): నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రామాలయంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు.రథం తరలిస్తుండగా.. విద్యుత్‌ తీగలు తగిలి ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామ శివారులో ఉన్న రామాలయంలో ఇటీవల ఉత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. ఇనుప రథం కావడంతో వర్షానికి తుప్పు పడుతుందనే భావనతో శనివారం ఆ రథాన్ని రథశాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సవిూపంలో ఉన్న 11కేవీ విద్యుత్తు తీగలకు రథం తాకింది. దీంతో విద్యుదాఘాతంతో కేతపల్లికి చెందిన రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహన్‌(36), గుర్రంపూడ్‌ మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు(26) అక్కడికక్కడే మృతి చెందారు. కేతపల్లికి చెందిన మరోవ్యక్తి రాజబోయిన వెంకటయ్యకు తీవ్రగాయాలు కావడంతో 108లో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై రజనీకర్‌ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



11.ప్రతిష్టాత్మక సంస్థకు సురవరంపేరు వచ్చేలా నా వంతు కృషి చేస్తాం

` సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 

ఏదైనా ప్రతిష్టాత్మక సంస్థకు కేంద్ర సాహిత్య అకా డవిూ అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి పేరువచ్చేలా తన వంతు కృషిచేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి వేడుకలలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సాంస్కృతిక సారధి చైర్మన్‌ , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సాహిత్య అకాడవిూ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఛాడ వెంకట్‌ రెడ్డి, సురవరం కుటుంబసభ్యులు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘సురవరం ప్రతాపరెడ్డిది వసుధైక కుటుంబం.తెలంగాణ చైతన్యానికి వారు గొప్ప స్ఫూర్తి .. కేంద్ర సాహిత్య అకాడవిూ అవార్డు పొందిన తొలి తెలుగువారు వారి సాహితీ సౌరభాన్ని విశ్వవ్యాప్తం చేశారు.ఏక కాలంలో ఒకవ్యక్తి  భిన్న వ్యవస్థలు, భిన్నరూపాలలో దర్శనమివ్వడం వారికే సాధ్యమయింది.ఏకకాలంలో దళిత సంఘాలకు, వైశ్య సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉండడం గమనార్హం . తొలిసారి వనపర్తి శాసనసభ్యులుగా ఎన్నికై కేవలం 12,13 మాసాలలోనే మరణించడం దురదృష్టకరం.సురవరం గొప్పతనం భవిష్యత్‌ తరాలకు తెలియాలని వనపర్తి, పాలమూరు సాహితీమితృల సహకారంతో రెండు సంకలనాలు తీసుకువచ్చాం.సురవరం అనంతరం తెలంగాణ పేరుతో మరో సంకలనం సెప్టెంబర్‌ వరకు తీసుకురాబోతున్నాం.సాహిత్య సంపద లేని ఇంటిలో నన్ను చక్రవర్తిగా పెట్టినా ఉండలేను.సాహిత్య సంపద ఉన్న పూరి గుడిసె అయినా నేను సంతోషంగా ఉంటాను.అన్న గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడి.్డఎంతో గొప్ప సాంఫీుక, సాహిత్య పరిశోధనను సురవరం సమాజానికి అందించారు.భూగర్భం నుంచి రోదసీ వరకు, సాహిత్యం నుంచి సైన్స్‌ వరకు వారు అప్పట్లోనే అన్నీ స్పృషించారు.సురవరం పేరు దేనికైనా పెట్టాలని అభిమానుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.సందర్భోచితంగా, సమయానుకూలంగా ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చేలా నా వంతు కృషిచేస్తాను.ఈ కార్యక్రమంలో సురవరం కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.