ALL NEWS

 

1.తెలంగాణలో ఓలా కార్ల ఫ్యాక్టరీ?
` 1000 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు
` రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం
దిల్లీ,మే27(జనంసాక్షి):విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిశగా వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేసిన ఈ సంస్థ తయారీ కేంద్రం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు.దాదాపు 1000 ఎకరాల్లో కారు, సెల్‌ తయారీకి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు రచించినట్లు సదరు అధికారి వెల్లడిరచారు. అందుకోసం తెలంగాణ సహా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే నెల ఆరంభానికి భూ కేటాయింపు విషయంలో తుది నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఓలా సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఓలా ఎలక్ట్రిక్‌కు ఇప్పటికే తమిళనాడులోకి కృష్ణగిరిలో 500 ఎకరాల్లో ఫ్యూచర్‌ఫ్యాక్టరీ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కేంద్రం. తాజాగా సేకరించనున్న 1000 ఎకరాలు ప్రత్యేకంగా కారు, వాటి బ్యాటరీకి అవసరమయ్యే సెల్స్‌ తయారీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నారు. 2020 డిసెంబరులో ఓలా విద్యుత్తు స్కూటర్ల తయారీని తమిళనాడులో ప్రారంభించింది. గత ఏడాది డిసెంబరు 15న వినియోగదారులకు డెలివరీలు అందజేసింది. వచ్చే 2`3 ఏళ్లలో ఓలా నుంచి తొలి విద్యుత్తు కారు రాబోతోందని కంపెనీ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ఇప్పటికే ప్రకటించారు.

2.పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ
` 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్న 7.33 లక్షల మంది అభ్యర్థులు
హైదరాబాద్‌,మే27(జనంసాక్షి): తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడిరచింది. వీటిలో ఎస్సై పోస్టులకి 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు నియామక మండలి తెలిపింది. 3.55 లక్షల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.తేదీల్లో ఏమైనా మార్పులు ఉంటే ముందే ప్రకటిస్తామని నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు.మొత్తం దరఖాస్తుల్లో.. 7.65% ఓసీలు, 8.27% బీసీ (ఏ), 17.7% బీసీ (బీ), 0.26% బీసీ (సీ), 20.97% బీసీ (డీ), 4.11% బీసీ (ఈ), 22.44 % ఎస్సీ, 18.6% ఎస్టీ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, నారాయణపేట్‌, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు నియామక మండలి తెలిపింది. తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు, ఆంగ్లంలో పరీక్ష రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్‌ ఎంచుకున్నట్లు నియామక మండలి తెలిపింది.

 

3.నదిలో బోల్తాపడిన వాహనం
` ఏడుగురు సైనికులు దుర్మరణం
` లద్దాఖ్‌లో ఘోరం
శ్రీనగర్‌,మే27(జనంసాక్షి):లద్దాఖ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి, లద్దాఖ్‌లోని ష్యోక్‌ నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. మిగతా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ’పర్తాపూర్‌ క్యాంప్‌ నుంచి 26 మంది జవాన్లు వాహనంలో బయల్దేరారు. ష్యోక్‌ నది దగ్గర ఆ వాహనం స్కిడ్‌ అయి.. నదిలో పడిపోయింది. ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మిగతా జవాన్లు గాయాల పాలయ్యారు’ అని ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లను ఆర్మీ ఫీల్డ్‌ ఆస్పత్రికి తరలించామని ఆర్మీ పేర్కొంది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ పేర్కొంది. తీవ్రంగా గాయపడి, ఇబ్బందులున్న వారిని ఎయిర్‌ అంబులెన్స్‌లో వెస్టన్ర్‌ కమాండ్‌కు తరలిస్తామని ఆర్మీ పేర్కొంది.

 

4.డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌..!
` ఎన్‌సీబీ అధికారి సవిూర్‌ వాంఖడేపై చర్యలు
` ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
ముంబయి,మే27(జనంసాక్షి):బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కు ఊరట లభించింది.ఈ కేసులో అతడికి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు సీనియర్‌ ఎన్‌సీబీ అధికారి ఒకరు వెల్లడిరచారు.ఆర్యన్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ హర్షం వ్యక్తం చేశారు. ‘’ఆర్యన్‌, అతడి తండ్రి షారుక్‌కు గొప్ప ఉపశమనం లభించినట్లయింది. నిజం ఇప్పటికైనా బయటపడిరది. ఆర్యన్‌ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదు. అతడిపై కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాల్లేవ్‌. ఇకనైనా ఎన్‌సీబీ తన తప్పు తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అని రోహత్గీ వ్యాఖ్యనించారు. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై అతడి తరఫున రోహత్గీనే వాదించారు.ఇదిలావుంగా ఎన్‌సీబీ అధికారి సవిూర్‌ వాంఖడే దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘’డ్రగ్స్‌ కేసులో పేలవంగా దర్యాప్తు చేపట్టినందుకు గాను సవిూర్‌ వాంఖడేపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు ఆయన తప్పుడు కుల ధ్రువపత్రాల ఆరోపణలపైనా చర్యలు చేపట్టనున్నాం’’ అని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు విూడియాకు వెల్లడిరచారు.డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలుత ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సవిూర్‌ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో సవిూర్‌ వాంఖడేపై అనేక ఆరోపణలు వచ్చాయి. డబ్బులు గుంజేందుకే ఆర్యన్‌ను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారంటూ ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. అంతేగాక, వాంఖడే ముస్లిం అని, ఉద్యోగం పొందేందుకు ఎస్సీగా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ ఆరోపణలు చేశారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈ క్రమంలోనే ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌గా వాంఖడే పదవీ కాలం ముగియడంతో ఆయనను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కు బదిలీ చేశారు.అనంతరం డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు నిమిత్తం ఎన్‌సీబీ సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అతడికి క్లీన్‌ చిట్‌ ఇస్తున్నట్లు ఎన్‌సీబీ నేడు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశించడం గమనార్హం.కాగా.. వాంఖడే నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో అనేక అవకతవకలు జరిగినట్లు తాజాగా బయటికొచ్చింది. ఈ కేసులో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినప్పుడు ఎలాంటి వీడియోగ్రఫీ చేయలేదని తెలుస్తోంది. అంతేగాక, ఒక సాక్షి నుంచి ఖాళీ పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

5.నిఖత్‌ ‘జై’రీన్‌
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ స్వర్ణపతకం విజేతకు ఘనస్వాగతం
ఆమె దేశానికే గర్వకారణమన్న మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రశాంత్‌ రెడ్డి
ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పథకాలు సాధిస్తానన్న నిఖత్‌

 

6.ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం
కూతురు మతాంతర వివాహం చేసుకుందని నమ్మించి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు
నార్నూర్‌,మే27(జనంసాక్షి):ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నార్నూర్‌ మండలం నాగల్‌కొండలో తల్లిదండ్రులు.. కుమార్తె రాజేశ్వరి (20) గొంతు కోసి చంపేశారు.సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని షేక్‌ అలీమ్‌, రాజేశ్వరి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. 45 రోజుల క్రితం వారిద్దరు కలిసి మహారాష్ట్రకు పారిపోయారు. తమ కూతురు కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు సావిత్రి బాయి, దేవీలాల్‌ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడిని రిమాండుకు తరలించారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో రాజేశ్వరికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పరువు పోతుందనే భయంతో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులే రాజేశ్వరిని కత్తితో గొంతు కోసి హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజేశ్వరి తల్లిదండ్రులను అరెస్టు చేశారు.

 

7.కేటీఆర్‌ విదేశీ పర్యటన విజయవంతం
` రాష్ట్రానికి రూ.4200కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌,మే27(జనంసాక్షి):రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. యూకే, దావోస్‌లో పది రోజుల పాటు పర్యటించిన కేటీఆర్‌.. రాష్ట్రానికి కోట్ల విలువ చేసే పెట్టుబడులను తీసుకొచ్చారు. యూకే, దావోస్‌ పర్యటనలో భాగంగా 45 వాణిజ్య, 4 రౌండ్‌ టేబుల్‌, 4 ప్యానెల్‌ సమావేశాల్లో పాల్గొన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. రూ. 4,200 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్‌ తన ట్విట్టర్‌ పేజీలో వెల్లడిరచారు. యూకే, దావోస్‌ పర్యటన విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ నెల 18 నుంచి 22 వరకు ఆయన లండన్‌ పర్యటన సాగింది. లండన్‌లో భారత హైకమిషన్‌ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు కోసం మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మే 22న సాయంత్రం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ నగరానికి చేరుకున్నారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో కేటీఆర్‌ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

(’హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ విస్తరణ
దావోస్‌ వేదికగా కెటిఆర్‌తో చర్చించిన ప్రతినిధులు
నానక్‌రాంగూడలో సంస్థ కొత్త మొబిలిటీ కేంద్రం ఏర్పాటు )
హైదరాబాద్‌,మే27(జనంసాక్షి):జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ సంస్థ హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌ వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. 3 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. నానక్‌రాంగూడలో కొత్త మొబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మొబిలిటీ కేంద్రాన్ని జూన్‌ 1వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రపంచంలో 100 ఏరియాల్లో, 18 మేజర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో తమ కార్యకలాపాలను జెడ్‌ఎప్‌ సంస్థ కొనసాగిస్తోంది. జెడ్‌ఎఫ్‌ సంస్థకు కేటీఆర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

8.తెలంగాణకుఏమిచ్చావో గదిజెప్పు!
` టూరిస్టులా వచ్చి వెళ్లావు
` మోదీపై బాల్కసుమన్‌ ఫైర్‌
` ప్రధాని తెలంగాణకు పచ్చి వ్యతిరేకిఅని మండిపాటు
హైదరాబాద్‌,మే27(జనంసాక్షి): నియంతృత్వ పాలన చేస్తున్న దుర్మార్గుడు మోదీ అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి అసమర్ధ ప్రధానిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. కరోనా సమయంలో అసమర్ధ పాలనను ప్రపంచమంతా చూసిందని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌తో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. దేశ సంపదను అదానీ, అంబానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ పనిచేస్తున్న దేశం కోసమా లేదా.. దోస్తుల కోసమా అని ప్రశ్నించారు.కుటుంబ పార్టీలపై మాట్లాడే నైతికత బీజేపీకి లేదన్నారు. ఆ పార్టీలో ఒకే కుటుంబానికి చెందినవాళ్లు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ప్రజల చేత నేరుగా ఎన్నికయ్యారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కుటుంబం త్యాగాలు చేసిందన్నారు. అమిత్‌షా కుటుంబం క్రికెట్‌ బోర్డును నియంత్రణలో పెట్టుకున్నదని విమర్శించారు. ఇలాంటి వాళ్లు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాని మోదీ పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వినతులపై మోదీ ఎన్నడూ సానుకూలంగా స్పందించలేదన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్రం ఉనికిలోకి రాకముందే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని, ఐటీఐఆర్‌ను రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అరిగోస పెడుతున్నది కేంద్రం కాదా అని ప్రశ్నించారు.కేంద్రం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో సమాధానం చెప్పాలని సుమన్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

 

9.అసొం వరదల్లో తెలంగాణ బిడ్డ ఐఏఎస్‌ సేవలు హ్యాట్సాఫ్‌
దిస్పూర్‌,మే27(జనంసాక్షి):ఎంత పెద్ద ఉన్నత స్థానాల్లో వున్నా.. మనుసుగల్లది తెలంగాణ సమాజం. ప్రజలు ఇబ్బందుల్లో వున్నారని తెలిస్తే చాలు.. హోదాలన్నీ పక్కన బెట్టి? దుఃఖంలో పాలు పంచుకుంటారు. ఇబ్బందుల నుంచి బయటపడేసి, ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేస్తారు. తెలంగాణ ఆత్మలోనే అంత సౌందర్యముంది. ఇప్పుడు ఓ ఐఏఎస్‌ తెలంగాణలోని ఆత్మ సౌందర్యాన్ని కష్టాల్లో వున్న ప్రజలకు పంచుతున్నారు.వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయి? కన్నీరు మున్నీరు అవుతున్న ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే? మోకాళ్ల లోతు బురదలో నడుస్తూ, ప్రజల ఇబ్బందులను దగ్గరుండి తెలుసుకుంటున్నారు. ఆ ఐఏఎస్‌ పేరు కీర్తి జల్లి. ఆమె స్వస్థలం వరంగల్‌. ఐఏఎస్‌గా అసోంలోని కచార్‌ డిప్యూటీ కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. ఆమె అక్కడి ప్రజలను అక్కున చేర్చుకోవడాన్ని చూసి యావత్‌ సోషల్‌ విూడియానే ప్రశంసలు కురిపిస్తోంది. ప్రజల కష్టాలను తెలుసుకోడానికి ఆమె అనుసరిస్తున్న విధానం చూసి తోటి ఐఏఎస్‌లు కూడా ముచ్చటపడుతున్నారు. మెచ్చుకుంటున్నారు.భారీ వర్షాలు, వరదల కారణంగా అసోం తీవ్రంగా దెబ్బతింది. రహదారులు, రోడ్లు, భవనాలు.. ఇలా అన్నీ నాశనమైపోయాయి. ఈ నేపథ్యంలో అసోంలోని కచార్‌ వరద బాధిత ప్రాంతాల్లో కీర్తి జల్లి విస్తృతంగా పర్యటించారు. మోకాళ్ల లోతులో వున్న బురదలోకి కూడా ఆమె దిగారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దగ్గరి నుంచి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారాలను చూపుతున్నారు.ఆమెకు వృత్తిపై వున్న నిబద్ధత, ప్రజల పట్ల వున్న మమకారానికి అందరూ ఫిదా అయ్యారు. తోటి ఐఏఎస్‌లు కూడా ఫిదా అయిపోయారు. ఆమెకు సంబంధించిన ఫొటోలను అవనీశ్‌ శరణ్‌ అన్న ఐఏఎస్‌ సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. వరద ప్రాంతాల్లో ఓ బోటులో ప్రయాణిస్తూ? ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు.

 

10.చౌతాలాకు నాలుగేళ్ల జైలు
` రూ.50లక్షల జరిమానా
` అక్రమాస్తుల కేసులో మాజీ సీఎంకు శిక్ష ఖరారు
దిల్లీ,మే27(జనంసాక్షి):అక్రమాస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా (87)కు నాలుగేళ్ల జైలు శిక్ష పడిరది.దీనితోపాటు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ దిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మే 21న ఆయన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం తాజాగా శిక్ష ఖరారు చేసింది. చౌతాలాకు శిక్ష, జరిమానాతోపాటు ఆయన పేరువిూదున్న నాలుగు ఆస్తులను కూడా జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, వయసు పైబడడం, అనారోగ్య కారణాల దృష్ట్యా తక్కువ శిక్ష విధించాలని ఓంప్రకాశ్‌ చౌతాలా కోర్టుకు విన్నవించగా.. సీబీఐ మాత్రం ఆయనకు గరిష్ఠ శిక్ష విధించాలని అభ్యర్థించింది. తద్వారా సమాజానికి ఒక సందేశాన్ని పంపించవచ్చని పేర్కొంది.ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ అధినేత ఓం ప్రకాశ్‌ చౌతాలా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారంటూ సీబీఐ ఆయనపై 2005లో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో రూ.6కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన సీబీఐ ఆయనపై 2010లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వీటితోపాటు 2021లో ఆయనపై మనీ లాండరింగ్‌ అభియోగాలు కూడా దాఖలయ్యాయి. తాజాగా తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం, చౌతాలాకు నాలుగేళ్ల శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది.ఇదిలాఉంటే, ఉపాధ్యాయుల భర్తీలో జరిగిన అక్రమాల కేసులో ఓంప్రకాశ్‌ చౌతాలతోపాటు ఆయన కుమారుడు అజయ్‌ చౌతాలాకు గతంలో పదేళ్ల జైలు శిక్ష పడిరది. దీంతో 2013 నుంచి ఆయన తిహార్‌ జైల్లోనే శిక్ష అనుభవించిన చౌతాలా 2021 జులైలో విడుదలయ్యారు. తాజాగా మరో కేసులో చౌతాలాకు నాలుగేళ్ల శిక్ష పడటం గమనార్హం.

11.దేశమంతా అంధకారంలో..తెలంగాణలో విద్యుత్‌ వెలుగులు
చిమ్మటి చీకట్లను చీల్చుకుంటూ... దేదీప్యమాన వెలుగుల్లోకి రాష్ట్రం
విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు
తెలంగాణ విజయం...దేశానికే ఆదర్శం
హైదరాబాద్‌,మే27(జనంసాక్షి):ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పరిస్థితి అంధకార బందురం. కరెంటు రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలిసేది కాదు. ఆనాడు కరెంటు పోతే కాదు. వస్తే వార్త. పేరుకే కరెంటు... కరెంటు తీగల విూద బట్టలు ఆరేసుకునే పరిస్థితి. కోతలే కోతలు. పవర్‌ హాలీ డేలు. పరిశ్రమలకు ఏనాడూ సరి పడా కరెంటు ఇచ్చిన పాపాన పోలేదు. గృహావసారాలు అసలే తీరలేదు. రైతాంగం అరి గోస పడ్డది. కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాణ్యతలేని కరెంటుతో ఇంట్లో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోయేది. రైతాంగానికి పేరుకే 9 గంటల కరెంటు... అరకొరగా వచ్చే కరెంటు తక్కువలు ఎక్కువలతో...ట్రాన్స్‌ఫార్మార్లు, మోటార్లు కాలిపోయేది. ఫీజులు ఎగిరిపోయేవి. అవి బాగు కావడానికి రోజులు పట్టేది. దీంతో పంటలు ఎండేవి. రాత్రిళ్ళు ఇచ్చే కరెంటు కోసం రైతులు భార్యా బిడ్డలను వదిలి బావుల దగ్గర పడుకునేది. చీకట్లో కరెంటు షాక్‌ లు కొట్టి, పాములు, తేళ్ళు కుట్టి చనిపోయిన రైతులెందరో! ట్రాన్స్‌ ఫార్మర్ల విూద ఫీజులు వేయడానికని వెళ్ళి మృత్యువాత పడ్డ రైతులకు లెక్కలేదు. కరెంటు ఉండేది కాదు. ప్రజలకు మంచినీరు అందేది కాదు. ఎండా కాలం వస్తే ఉక్కపోతే. చెప్పుకునే దిక్కులేని దిక్కుమాలిన పరిస్థితులు ఆనాటివి.ఈ కష్టాల కడలిని ఈదుతూనే ఈ బతుకులు మాకొద్దని ప్రజలంతా ఇప్పటి సిఎం అప కెసిఆర్‌ నేతృత్వంలో ఉద్యమించారు. 14 ఏండ్ల అవిశ్రాంత, శాంతియుత పోరాటం చేశారు. తెలంగాణ వస్తే ఏమొస్తది? అని వెక్కిరించారు. విూ తెలంగాణల కరెంటు ఉండదు. ఉత్పత్తి కేంద్రాలు లేవు. విూరంతా చీకట్లో మగ్గాలె. అవహేళన చేశారు. తెలంగాణ వచ్చింది. 60 ఏండ్ల కల ఆవిష్కారమైంది. ఉద్యమ నేత కెసిఆర్‌, సీఎం అవడం అదృష్టంగా మారింది. పట్టుపట్టి సీఎం కెసిఆర్‌ విద్యుత్‌ రంగంపై దృష్టి పెట్టారు. అదే పనిగా పదే పదే సవిూక్షిస్తూ, అతి తక్కువ కాలంలో అనుకున్నది సాధించారు. తెలంగాణలో విద్యుత్‌ వెలుగులు విరజిమ్మారు. ఒకవైపు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొంటూనే, అవసరమైన మేర కొనుగోలు చేస్తూ, ఇవ్వాళ కరెంటు మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. ఎలాంటి విద్యుత్‌ కోతలు లేకుండా, పవర్‌ హాలీడేల స్వస్తి పలికి, నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు నిరంతరాయంగా అందిస్తున్నారు. ఇవ్వాళ దేశంలో 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అంతులేని కరెంటు కోతలు, పవర్‌ హాలిడేల నుండి ఆనతి కాలంలోనే తెలంగాణ శాశ్వత విముక్తిని సాధించింది. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ 1 గా నిలిచింది. తేదీ 02.06.2014లో రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు 01.04.2022 నాటికి 17,305 మెగావాట్లకు పెరిగింది. సోలార్‌ విద్యుదుత్పత్తిలో గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 4,431 వేల మెగావాట్లకు రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. పైగా గరిష్ట డిమాండ్‌ 5,661 మెగావాట్ల నుండి 14,160 మెగావాట్లకు చేరింది. గ్రిడ్‌ విద్యుత్‌ వినియోగం 128 మెగా యూనిట్ల నుండి 283.83 మెగా యూనిట్లకు పెరిగింది.కాగా ట్రాన్స్‌ కో లో...ఇదే సమయంలో 400 కెవి. సబ్‌ స్టేషన్‌లు 6 మాత్రమే ఉంటే వాటిని 23 కి పెంచుకున్నం.220 కెవి. సబ్‌ స్టేషన్‌లు 51 మాత్రమే ఉంటే వాటిని 98 కి పెంచుకున్నం132 కెవి. సబ్‌ స్టేషన్‌లు 176 మాత్రమే ఉంటే వాటిని 247 కి పెంచుకున్నంమొత్తం ఇహెచ్‌టి సబ్‌ స్టేషన్‌లు 233 మాత్రమే ఉంటే, వాటిని 368కి పెంచుకున్నం మొత్తం ఇహెచ్‌టి పొడవు 16,379 మాత్రమే ఉంటే, వాటిని 27,375కి పెంచుకున్నం ట్రాన్స్‌ ఫార్మర్ల సామర్థ్యాన్ని 14,973 మెగావాట్లు ఉంటే వాటిని 38,426కి పెంచుకున్నం.డిస్కంలలో 33 కెవి సబ్‌ స్టేషన్ల సంఖ్యను 2,138 నుండి 3,159కి పెంచుకున్నం 33కెవి, 11 కెవి, ఎల్‌ టీ ల పొడవుని 4.89 లక్షల నుండి 6.58 లక్షలకు పెంచుకున్నంపిటిఆర్‌ లను సంఖ్యను 3,272 నుండి 5,598కి పెంచుకున్నం డిటిఆర్‌ ల సంఖ్యను 4.67 లక్షల నుండి 8.09 లక్షలకు పెంచుకున్నంమరోవైపు వినియోగదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది వ్యవసాయ సర్వీసులు 19.03 లక్షల నుండి 26.45 లక్షలకు పెరిగాయి. అంటే 40శాతం పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం సర్వీసులు 1.11 కోట్ల నుండి 1.71 కోట్లకు పెరిగాయి. అంటే 54శాతానికి పెరిగాయి.17 వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ వచ్చినా తట్టుకునే విధంగా విద్యుత్‌ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేసింది. కొత్తగూడెం జిల్లలో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. శరవేగంగా నల్లగొండ జిల్లాలో యాదాద్రి ఆల్ట్రా మెగా ప్రాజెక్టు నిర్మాణమవుతున్నది. విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టులో మన వాటా మనకు దక్కుండా గండి కొట్టి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. దీంతో పాటు మనకు దక్కాల్సిన విద్యుత్‌ వాటాను కూడా కోల్పోయాం.అయినా, వెరవకుండా, ఆంధ్రప్రదేశ్‌ కు దీటుగా, మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ని అందించలగుతున్నాం. ఇది కచ్చితంగా సిఎం కెసిఆర్‌ సాధించిన అద్భుత విజయం. విద్యుత్‌ రంగంలో తెలంగాణ విజయం. దేశానికే ఆదర్శం.
ఔట్‌ సోర్సింగ్‌ వ్యక్తుల క్రమబద్ధీకరణ:
తక్కువ వేతనాలతో కాంట్రాక్టర్లతో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ వ్యక్తులు 23,667 మంది సర్వీసులను క్రమబద్ధీకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం లవజీలజీబజీజీవజీనితిసతి పూర్తిగా ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ ని అందించడమే కాకుండా, నాయీ బ్రాహ్మణులకు, దోబీ ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ని అందిస్తున్నది. 50శాతం సబ్సిడీని చేనేత రంగానికి అందిస్తున్నది.
వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్‌ సరఫరా దేశంలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోని సనీనినితి రాష్ట్రాలు ఉచిత విద్యుత్‌ ప్రకటించినా, ఆ రాష్ట్రాల్లో ఇచ్చేది కేవలం 7 గంటలు మాత్రమే.
రాష్ట్రంలో 40 శాతం విద్యుత్తు, కేవలం వ్యవసాయరంగానికే సరఫరా అవుతున్నది. ఈ విధంగా విద్యుత్‌ సరఫరా, తెలంగాణలో వ్యవసాయ విప్లవానికి దారి తీసింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను కొత్తగా ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 25.63 లక్షలకు పెరిగింది. 2014`15 సంవత్సరం నుండి ఇప్పటివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం కోసం ప్రభుత్వం రూ.39 వేల 200 కోట్లను సబ్సిడీగా అందజేసింది.
చేనేతలకు చేయూతగా 50 శాతం విద్యుత్‌ రాయితీ
చేనేతలను ఆదుకునేందుకు 2014 `15 నుంచి రాష్ట్రంలో 5 హెచ్‌ పీ లోడ్‌ తో నడుస్తున్న పవర్‌ లూమ్‌ యూనిట్లకు 50 శాతం విద్యుత్తు రాయితీని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్దని.రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి ఇప్పటి వరకు రూ.34.50 కోట్లను 10,000 పవర్‌ యూనిట్లకుగాను విడుదల చేసింది.
దోబీ ఘాట్లకు, లాండ్రీలకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు
ప్రభుత్వం రజకుల దోబీ ఘాట్లకు, లాండ్రీలకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించింది.
పౌల్ట్రీ, టెక్స్‌టైల్‌ రంగాల వారికి రూ.2 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.వ్యవసాయ, ఇతర అన్నిరంగాలకు కలిపి క్రాస్‌ సబ్సిడీ, సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.13,100 కోట్లు చెల్లిస్తున్నది. కేంద్రం సహాయ నిరాకణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, లైన్లు, పంపిణీ సామర్థ్యం గణనీయంగా పెంచుకున్నాం. అందుకోసమే సంస్థలు రూ.35 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసుకున్నా యి. కేంద్ర సంస్థలైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఆర్‌ఈసీలు రుణాలను, 12 శాతం మేర వడ్డీకి ఇస్తాయి. ఈ వడ్డీ శాతం వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు విధించే వడ్డీ శాతం కన్నా ఎక్కువ. అంతేకాకుండా ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టం కింద పీజీసీఎల్‌కు రూ.1580 కోట్లు చెల్లించాలి.
ఒకే ఒక్కసారి విద్యుత్‌ చార్జీల పెంపు
ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ సంస్థలు 2022`23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 శాతం చార్జీల పెంపుదలకు రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ సిఫారసు చేసింది. రాబోయే ఏడాదిలో 74,727 మిలియన్‌ యూనిట్ల కొనుగోలు, రూ.53,054 కోట్ల రెవెన్యూ అవసరాలను అంచనా వేశాయి. కమిషన్‌ రూ.48,708 కోట్ల అవసరాలకు అనుమతినిస్తూ రూ.6,831 కోట్ల చార్జీల పెంపుదల ప్రతిపాదనలకు గాను రూ.5,596 కోట్ల పెంపుదలకు అనుమతినిచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేండ్లలో మొదటిసారి స్వలంగా కరెంటు చార్జీలను పెంచింది.
విద్యుత్‌ చార్జీలను ప్రధానంగా ఉత్పత్తి వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయాలు ప్రభావితం చేస్తాయి. 2014`2015లో టన్ను బొగ్గుకు రూ.50గా ఉన్న క్లీన్‌ ఎనర్జీ సెస్‌ ప్రస్తుతం రూ.400లకు పెరిగింది. అదేవిధంగా గత ఐదారేండ్లలో రెట్టింపైన చమురు, గ్యాస్‌ ధరల వల్ల బొగ్గు రవాణా, రైల్వే రవాణా చార్జీలు కూడా పెరిగాయి. మొత్తంగా విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది.
తెలంగాణలోనే విద్యుత్‌ ఛార్జీలు తక్కువ..
మనిషి నిత్య జీవితంతో పెనవేసుకున్న అతి కీలకమైన అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన జీవనం స్తంభించి పోయేంతగా విద్యుత్‌ వినియోగం జరుగుతున్నది.
కరోనా కష్ట కాలంలోనూ విద్యుత్‌ ఉద్యోగులు బాగా పని చేశారు
మానవాళి ఊహించని కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక పరిస్థితులను తీవ్ర ప్రభావితం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. దీనికోసం ప్రభుత్వం, విద్యుత్‌సంస్థలు, విద్యుత్‌ ఉద్యోగులు నిరంతరం శ్రమించారు. ఈ క్రమంలో వాళ్లు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టారనడంలో సందేహం లేదు.భవిష్యత్తులో విద్యుత్‌ చార్జీలు పెరగకుండా అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుకొని లాభాల దిశగా పయనించాల్సిన బాధ్యత విద్యుత్‌ సంస్థలు, ఉద్యోగులపైన ఉన్నది. సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించుకొని లాభాలనిచ్చే వాణిజ్య, పారిశ్రామిక అమ్మకాలను పెంచుకోవడం ద్వారా సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి గణనీయమైన అవకాశాలున్నాయి. ఇందుకు సిఎం కెసిఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు తమ పూర్తి సహకారాన్ని అన్ని విధాలుగా అందిస్తున్నది.
పవర్‌ సెక్టార్‌ యొక్క ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు(01.05.2022 నాటికి)
24 గంటల ఉచిత వ్యవసాయ సరఫరా:
24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 26.60 లక్షల వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం 2014`15 నుండి 2021`22 వరకు రూ.30,155 కోట్ల సబ్సిడీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 7.57 లక్షల వ్యవసాయ సర్వీసులు విడుదలయ్యాయి.24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ట్రాన్స్‌కో మరియు డిస్కమ్‌ల ద్వారా 2014 నుండి ఇప్పటి వరకు రూ.36,227 కోట్లు పెట్టుబడి పెట్టారు.ప్రభుత్వం 2014`15 నుండి 2021`22 వరకు రూ.10,826 కోట్ల సబ్సిడీని అందించింది.దాదాపు 1కోటి 41లక్షల 952 లబ్ది పొందే దేశీయ వినియోగదారులకు సబ్సిడీ టారిఫ్‌ కోసం ప్రభుత్వం ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తోంది 28,464 మంది నాయీ బ్రాహ్మణులు/కేశవులకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.కటింగ్‌ సెలూన్లు మరియు 52,440 ధోభి ఘాట్‌లు/లాండ్రీ దుకాణాలు. ప్రభుత్వం 6467 పౌల్ట్రీ ఫారాలకు రూ.2.00/యూనిట్‌ సబ్సిడీని అందిస్తోంది మరియు 2015 నుండి 5047 పవర్‌ లూమ్‌లకు రూ.2.00/యూనిట్‌.పెట్టుబడితో పంపిణీ నెట్‌వర్క్‌ని సరిదిద్దడం జరిగింది పల్లెప్రగతి కింద రూ.333 కోట్లు 41.98 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చింది.పెట్టుబడితో పంపిణీ నెట్‌వర్క్‌ని సరిదిద్దడం జరిగిందిపట్టణప్రగతి కింద రూ.134 కోట్లు 23.15 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చింది.తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ కింద రూ. 10,602 కోట్లు 2022`23 సంవత్సరంలో పంపిణీ సంస్థలు ఉచిత విద్యుత్‌ సరఫరాను అందించడానికి 26.60 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులు మరియు గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్‌.తక్కువ వేతనాలతో కాంట్రాక్టర్లతో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ వ్యక్తులుత23,667 మంది సర్వీసులను క్రమబద్ధీకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ