ALL NEWS

 

1.సికింద్రాబాద్‌ విధ్వంసంపై ముమ్మర దర్యాప్తు
` రూ.12 కోట్ల ఆస్తి నష్టం
` ` సికింద్రాబాద్‌ రైల్వే ప్రాంతీయ మేనేజర్‌ గుప్తా
` కీలక సూత్రధారి ఆవుల సుబ్బారావు అరెస్టు
హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి):అగ్నిపథ్‌ విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రత్యక్ష్యంగా రూ.12 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సికింద్రాబాద్‌ రైల్వే ప్రాంతీయ మేనేజర్‌ గుప్తా వెల్లడిరచారు.అంతే కాకుండా సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో రైలు సర్వీసులు రద్దు చేసిన కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్‌లో గుప్తా విూడియాతో మాట్లాడారు.అల్లర్లలో రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి పూర్తిగా ధ్వంసం అయిందని పేర్కొన్నారు. అల్లర్ల ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని వెల్లడిరచారు. ఈ విధ్వంసంలో 5 రైలు ఇంజిన్లు (లోకో మోటార్స్‌), 30 రైలు బోగీలు, పార్శిల్‌ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయినట్లు వెల్లడిరచారు. పవర్‌ కార్‌ (డీజిల్‌ ట్యాంకర్‌)కు భారీ ప్రమాదం తప్పిందని.. పవర్‌ కార్‌కు మంటలు అంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదన్నారు. ఆందోళనకారులను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. ప్రస్తుతం అన్ని గూడ్స్‌ రైళ్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుప్తా వెల్లడిరచారు.
పోలీసుల అదుపులో అల్లర్ల సూత్రధారి ఆవుల సుబ్బారావు
అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై నరసరావుపేటలో డిఫెన్స్‌ అకాడవిూ నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్‌ అకాడవిూ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేటకు తరలిస్తున్నారు.సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 12 మంది యువకులు ప్రధాన కారకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. వాట్సప్‌ గ్రూపుల్లో యువతను రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ బ్లాక్స్‌, 17/6 గ్రూప్‌తో పాటు పలు పేర్లతో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అల్లర్లకు సంబంధించి ఆందోళనకారుల వాట్సప్‌ సందేశాలు ఇప్పటికే వైరల్‌ అయిన విషయం తెలిసిందే. కాగా, పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్‌ అకాడవిూ డైరెక్టర్‌ ఆవుల సబ్బారావు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. దీంతో సుబ్బారావును ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన స్టార్‌ డిఫెన్స్‌ అకాడవిూ నిర్వాహకుడు వసీంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వ్యూహరచన ఎలా జరిగింది?
రైల్వేస్టేషన్లను ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చింది? ఎన్ని రోజుల నుంచి దీనికి వ్యూహ రచన జరిగింది? దీని వెనక ఇంకెవరు ఉన్నారు? విధ్వంసంలో పాల్గొన్న వారంతా సైనిక నియామకాల కోసం ప్రయత్నిస్తున్నవారేనా? బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంతమంది స్టేషన్‌కు చేరుకోవటానికి ఎలా సమాచారం షేర్‌ చేసుకున్నారు?ఆ ఫోన్లు ఎవరివి? అని సుబ్బారావుకు ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తునట్టు సమాచారం.
ఆర్థిక సంక్షోభానికి తోడు అసహనం పెరిగి....
ప్రకాశం జిల్లా కంభం మండలం తురుమెళ్లకు చెందిన ఆవుల సుబ్బారావు ఆర్మీలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా చేరి అధికారి హోదాలో దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసి 2012లో పదవీ విరమణ పొందారు. కొంతకాలం గుంటూరులో ఉండి 2014లో నరసరావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడవిూని ప్రారంభించారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన యువకులు ఎక్కువగా ఇక్కడ శిక్షణ తీసుకుంటారని తెలుస్తోంది. గడిచిన రెండేళ్ల నుంచి కొవిడ్‌ కారణంగా శిక్షణకు రాకపోవడంతో అకాడవిూ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక సమస్యలు అధిగమించడానికి ఈఏడాది హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో అకాడవిూని ఏర్పాటుచేశారు. ఆర్మీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావటం, ఎంపికల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవటం, నియామకాలు వాయిదా పడటంతో హైదరాబాద్‌ కేంద్రాన్ని మూసేశారు. ఆర్మీ నియామకాల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలతో విసిగిపోయిన సుబ్బారావు నిరుద్యోగ యువతతో కలిసి విధ్వంసానికి తెరా తీశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్న విషయాన్ని, విచారణ అంశాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

 

2.రాకేష్‌ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనసందోహం
` నినాదాలతో దద్దరిల్లిన వరంగల్‌ నగరం
` అంతిమ యాత్రలో మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు
` జోహార్లు రాకేష్‌అంటూ బోరున విలపించిన కుటుంబ సభ్యులు
` శోకసంద్రంలో గ్రామస్తులు
వరంగల్‌బ్యూరోజూన్‌ 18 (జనంసాక్షి):వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి నుండి నుండి అశేష జనవాహిని మధ్య సికింద్రాబాద్‌ కాల్పుల్లో మృతి చెందిన దబీర్‌ పేట గ్రామానికి చెందిన అమరుడు దామెర రాకేష్‌ అంతిమయాత్ర. యాత్రలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు పాల్గొని నివాళులు అర్పిస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు.శనివారం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో నుండి ఇ బయల్దేరిన అంతిమయాత్ర ఎంజీఎం వెంకట్రామా సెంటర్‌ ధర్మారం విూదుగా నర్సంపేట అయ్యప్ప ఆలయం వరకు యాత్ర కొనసాగింది నర్సంపేట అయ్యప్ప దేవాలయం నుండి ఇ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు అగ్రభాగాన నిలిచి జోహార్లు రాకేష్‌ అంటూ ప్రజల నినాదాల మధ్య అంతిమ యాత్ర కొనసాగింది, కేంద్ర బీజేపీ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆర్మీ విద్యార్థులు ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తప్పుడు నిర్ణయాల ను నిరసిస్తూ నినాదాలతో వరంగల్‌, నర్సంపేట, నగరాలు దద్దరిల్లిపోయాయి .రాకేష్‌ మృతికి సంఫీుభావంగా అంతిమ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సంఘటన జరిగిన దగ్గర నుండి అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తూ, పోస్ట్‌ మార్టం ఫార్మలిటీస్‌ పూర్తి చేయించి అంతిమయాత్ర కు మార్గదర్శకం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మార్గ దర్శకత్వం వహిస్తూ దబీర్‌ పేట గ్రామం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. రాకేష్‌ కుటుంబ సభ్యులను మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ అంతిమ యాత్ర కు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దొంతి మాధవ రెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క రాగా వారిని బంధించి అడ్డుకున్నారు. దబీర్‌ పేట గ్రామంలో దామెర రాకేష్‌ అంత్యక్రియలు సాయంత్రం పోలీసు బందోబస్తు మధ్య మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు అశేష జనవాహిని మధ్య శోకసముద్రంలో రాకేష్‌ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో రాకేష్‌ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువర్గము స్నేహితులు ఆర్మీ శిక్షణ అభ్యర్థులు వివిధ విభాగాల అధికారులు పాల్గొని రాకేష్‌ మృతికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, దాస్యం వినయ్‌ భాస్కర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గండ్ర జ్యోతి, పలు మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

 

3.కేంద్రం అనాలోచిత చర్యలవల్లే ఉద్రిక్తతలు
` అగ్నిపథ్‌ పథకంపై మండిపడ్డ కేటీఆర్‌
` బిజెపి తీరుతో దేశం రావణకాష్టంగా మారిందని మండిపాటు
నాగర్‌ కర్నూల్‌,జూన్‌ 18(జనంసాక్షి): కేంద్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని, బీజేపీ నేతలు దేశాన్ని రావణకాష్టంలాగా మార్చారని మంత్రికెటిఆర్‌ మండిపడ్డారు. అగ్నిపథ్‌పై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని కొల్హాపూర్‌లో బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 400 నుంచి రూ. 1000 దాటింది. నల్లధనం తెస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు తెల్లముఖం వేశారు. తంబాకు తినడం తప్ప బండి సంజయ్‌కు ఏవిూ తెలియదు. కాంగ్రెస్‌ పార్టీకి ఇక కాలం చెల్లింది. కాంగ్రెస్‌కు చరిత్రే మిగిలింది. రాహుల్‌ గాంధీని గంటల తరబడి ఈడీ ఆఫీసులో కూర్చోబెట్టినా అడిగేవారు లేరు. ఒక్క ఛాన్స్‌ అని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే 50 ఏళ్లు అధికారం ఇచ్చారు. అన్నేళ్లు ఏవిూ చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. భారత ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోందన్నారు. ఆర్మీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు క్రియేట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో దాడులకు టీఆర్‌ఎస్‌ హస్తం ఉంటే.. మరి యూపీలో దాడుల వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. బండి సంజయ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అగ్గి అంటుకుందన్నారు.

 

4.పోలీసుల కళ్లుగప్పి గాంధీ ఆస్పత్రిలోకి రేవంత్‌
` సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఘటనలో గాయపడిన క్షతగాత్రుకు పరామర్శ
హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): గాంధీ ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. నిన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఘటనలో గాయపడిన క్షతగాత్రులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.బాధితులను పరామర్శించేందుకు రాజకీయ పార్టీల నేతలు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గాంధీ ఆసుపత్రి వెనుక గేటు నుంచి ఆసుపత్రిలోకి ప్రవేశించారు. చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారితో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్యపరిస్థితి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 12మంది యువకులకు గాయాలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ... అగ్నిపథ్‌ స్కీమ్‌ను వెనక్కి తీసుకునే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘’దేశ వ్యాప్తంగా పెల్లుబికుతున్న ఆర్మీ ఉద్యోగార్థుల ఆవేదన అర్థం చేసుకోవాలి. తక్షణమే ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలి. 2020లో ఎంపికైన విద్యార్థులకు తక్షణమే రాత పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల్లో నియమించాలి. ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులకు యూనిఫాం శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలి. కేంద్రం అనైతిక చర్యల వల్లే విద్యార్థులు గాయపడ్డారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఘటనలో నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలి. ఈ వ్యవహారంపై ప్రధాని జోక్యం చేసుకోవాలి. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించాం. గాంధీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోతే అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి వివరించారు.

 

5.ట్రిబుల్‌ ఐటీ విద్యార్థులతో మంత్రుల చర్చలు
నిర్మల్‌,జూన్‌ 18(జనంసాక్షి): బాసర ట్రిపుల్‌ ఐటీ చర్చల్లో గందరగోళం నెలకొంది. ఒపక్క విద్యార్థులతో చర్చలు సఫలమయ్యాయని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడిరచారు. సోమవారం నుంచి విద్యార్థులు తరగతలకు హజరవుతారని మంత్రి ప్రకటించారు. మరోవైపు అధికారులతో చర్చలు విఫలమని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదని అంటున్నారు. వర్షంలోనే విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.12 డిమాండ్లలో మౌలిక వసతుల కల్పన త్వరలోనే పూర్తి చేస్తామని ఉన్న విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వెంకంట రమణ తెలిపారు. కంప్యూటర్లు, ల్యాబ్‌లో టెక్నికల్‌ బుక్స్‌ 15 రోజుల్లో కల్పిస్తామన్నారు. అలాగే ఐసీటీ ప్రాతిపదికన అకాడమికి రిసోర్సెస్‌, ప్యాకల్టీ నియామకం కూడా చేపడుతామని హావిూ ఇచ్చారు. విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు చేపడుతామననారు. ఐసీటీ బేసెడ్‌ ఎడ్యుకేషన్‌ను కల్పిస్తామని చెప్పారు.‘పీయూసీ బ్లాక్స్‌, హస్టల్‌ను 15 రోజుల్లో పునర్నిర్మిస్తాం. లైబ్రరీలో అదనపు సదుపాయాలు కల్పిస్తాం. ఇంటర్నెట్‌ , ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ సౌకర్యాలను కల్పిస్తాం. మెస్‌ల నిర్వహణ, క్యాంటీన్ల నిర్వహణలో గుత్తాధిపత్యం తగ్గించాలని విద్యార్థులు కోరారు. అది చేస్తా చేస్తాం. 12 డిమాండ్లలలో ఎనిమిది డిమాండ్లను 15 రోజుల్లో పూర్తి చేస్తాం. ఆందోళనను విరమించి సోమవారం నుండి క్లాసులకు అటెండ్‌ అవుతారని నమ్ముతున్నాం. గంట పాటు విద్యార్థులతో జరిగిన చర్చల్లో అన్ని డిమాండ్ల పై మాట్లాడాం’ అని తెలిపారు.
ఒక అమ్మగా బాధేస్తుంది.. ఆందోళన విరమించండి.. :విద్యాశాఖ మంత్రి విజ్ఞప్తి
బాసర ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని, దయచేసి ఆందోళన విరమించాలని విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ను కూడా నియమించడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వెంకటరమణను క్యాంపస్‌కు పంపించామని, వారితో కూడా చర్చించండి అని సబిత సూచించారు. స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ కమిటీ, యూనివర్సిటీ కమిటీ అంతర్గతంగా చర్చించుకొని, సమస్యలను పరిష్కారించుకోవాలని చెప్పారు. కొవిడ్‌ కారణంగా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులను సీఎం కేసీఆర్‌ దృష్టిలో ఉంచుకొని, ఈ క్యాంపస్‌లో 1000 నుంచి 1500కు అడ్మిషన్స్‌ పెంచడం జరిగిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాసర ట్రిపుల్‌ ఐటీకి మంచి పేరుంది. అలాంటి యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలగవద్దని మాత్రమే కోరుతున్నాను. రాజకీయాలకు ఈ యూనివర్సిటీ వేదిక కావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఎండలో, వానలో కూర్చొని విూరు నిరసనలు చేస్తున్న దృశ్యాలను చూస్తుంటే.. ఓ మంత్రిగానే కాదు.. ఓ అమ్మగా బాధేస్తుందన్నారు. ఇది విూ ప్రభుత్వం.. దయచేసి ఆందోళనలు విరమించి, చర్చించండి.. విూ సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఆగని ఆందోళనలు
మరోవైపు రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్‌ఐటీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేయమంటూ ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు అయిదో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. విద్యార్థులంతా ఒకేమాటపై నిలబడి, మూకుమ్మడిగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. వర్షంలోనే విద్యార్థుల ఆందోళనలు చేస్తున్నారు.

 

6.కాబూల్‌ గురుద్వారాలో పేలుళ్లు..
` ఘటనలో ఇద్దరు మృతి!
` తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్‌
కాబూల్‌,జూన్‌ 18(జనంసాక్షి):అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. నగరంలోని కార్తే పర్వాన్‌ గురుద్వారా లో ఈ ఘటన జరిగినట్లు స్థానిక విూడియా కథనాల ద్వారా తెలుస్తోంది.ఈ ఘటనలో కనీసం ఇద్దరు సాధారణ పౌరులు మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. మరికొంత మంది భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది.గురుద్వారా నుంచి భారీ ఎత్తున పొగ బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని దగ్గరి నుంచి గమనిస్తున్నట్లు తెలిపింది. అక్కడి తాజా పరిస్థితిపై సమాచారం కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది.’’ఉదయం 6 గంటల సమయంలో కార్తే పర్వాన్‌ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించింది. అరగంట తర్వాత మరో పేలుడు సంభవించింది. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని పూర్తిగా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి’’ అని ప్రత్యక్షసాక్షిని ఉటంకిస్తూ ఓ అంతర్జాతీయ విూడియా ఛానల్‌ కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటనలో పలువురు మరణించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్నంతా గాలిస్తున్నట్లు పేర్నొన్నారు.కొంతమంది దీన్ని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. పేలుళ్లు జరిగిన సమయంలో గురుద్వారాలో భక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఐఎస్‌ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అఫ్గాన్‌ పాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఉగ్రకార్యకలాపాలు పెరుగుతూ వస్తున్నాయి.

 

7.దిశలేని పథకం అగ్నిపథ్‌
యువతకు అండగా కాంగ్రెస్‌ ఉంటుంది
అహింసా పద్దతిలోనే పోరాటం ఉండాలి
యువతకు సోనియా భరోసా
సాగు చట్టాల తరహాలోనే అగ్నిపథ్‌నూ ఉపసంహరించుకోవాలి: రాహుల్‌
న్యూఢల్లీి,జూన్‌ 18(జనంసాక్షి): కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ స్కీమ్‌కు దిశలేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ఆస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. యువత స్వరాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా ఆ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఆర్మీ ఉద్యోగం ప్రయత్నిస్తున్న యువత శాంతియుతంగా, అహింసా పద్ధతిలో తమ డిమాండ్ల కోసం పోరాటం చేయాలని సోనియా కోరారు. నిరసన చేపడుతున్న యువతకు మద్దుతుగా కాంగ్రెస్‌ పార్టీ ఉందని, అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సోనియా అన్నారు.కేంద్ర కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌పై నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో పౌరులంతా శాంతియుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. విూ వాణిని పట్టించుకోకుండా ప్రభుత్వం పూర్తిగా దిశానిర్దేశర లేని కొత్త పథకాన్ని ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అహింసా పద్ధతిలో అందరూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని విూకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ విూతోనే ఉంటుందని సోనియాగాంధీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యువతతో పాటు, పలువురు మాజీ సైనికులు, రక్షణ నిపుణులు కూడా అగ్నిపథ్‌ పథకాన్ని ప్రశ్నిస్తున్నారని, యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని సోనియాగాంధీ అన్నారు. ఆర్మీలో లక్షలాది ఉద్యోగాల ఖాళీలు ఉన్నప్పటికీ రిక్రూట్‌మెంట్ల విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న జాప్యంపై యువత మనోవేదనను తాను అర్ధం చేసుకోగలనని అన్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశానికి టెస్ట్‌లు రాసి ఫలితాలు, నియామకాల కోసం యువత ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ పూర్తి శక్తిసామర్థ్యాలతో యువతకు అండగా నిలుస్తుందని, వారి ప్రయోజనాల కోసం, స్కీమ్‌ ఉపసంహరణ కోసం బాసటగా నిలుస్తుందని హావిూ ఇచ్చారు.
సాగు చట్టాల తరహాలోనే అగ్నిపథ్‌నూ ఉపసంహరించుకోవాలి: రాహుల్‌
దిల్లీ: రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా గుర్తుచేశారు.అదే తరహాలో సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.’’వరుసగా 8 ఏళ్ల నుంచి భాజపా ప్రభుత్వం ‘జై జవాన్‌, జై కిసాన్‌’ విలువలను అవమానపరిచింది. నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోకతప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. అగ్నిపథ్‌లో చేరుతున్నవారిని ‘అగ్నివీర్‌’లని వ్యవహరిస్తున్నట్లుగా .. యువతకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసిన రాహుల్‌ ఆయనను వ్యగ్యంగా ‘మాఫీవీర్‌’ అని సంబోధించారు. ‘మాఫీ’ అంటే హిందీలో ‘క్షమాపణ’ అని అర్థం.సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడిరది. రైల్వే స్టేషన్లను కేంద్రంగా చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ సహా పలు రైల్వే స్టేషన్లలో రైళ్లకు నిప్పంటించారు. మరోవైపు అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలుచోట్ల కాల్పులు కూడా జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.

8.అస్సాం, మేఘాలయాలో వరద బీభత్సం..
` 31 మంది మృత్యువాత
గువాహటి,జూన్‌ 18(జనంసాక్షి):అస్సాం,మేఘాలయా రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు.వరదల ధాటికి రెండ్రోజుల వ్యవధిలో అస్సాంలో 12 మంది మరణించగా, మేఘాలయాలో 19 మంది మృత్యువాతపడ్డారు. మేఘాలయాలో మృతిచెందినవారి ఒక్కో కుటుంబానికి సీఎం సంగ్మా రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. మేఘాలయలోని చిరపుంజీ, మౌసిన్‌రామ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గడిచిన 82 ఏళ్లలో (1940 తర్వాత) ఇదే అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం.అస్సాంలోని 28 జిల్లాల్లోని 19 లక్షల మందిపై ఈ వరదలు ప్రభావం చూపుతున్నాయి. 3వేల గ్రామాలు ముంపునకు గురవ్వగా.. 43వేల ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలోనే అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని హావిూ ఇచ్చారు.

 

9.అగ్నిపథ్‌పై ఆందోళనలతో కేంద్రం మరో కీలక నిర్ణయం
సాయుధ బలగాలు, అసోం రైఫిల్స్‌ విభాగాల్లో పదిశాతం రిజర్వేషన్లు
న్యూఢల్లీి,జూన్‌ 18(జనంసాక్షి):అగ్నిపథ్‌పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అసోం రైఫిల్స్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది. ఫలితంగా తొలిబ్యాచ్‌ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించ నున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కారణంగా రెండేళ్లు రిక్రూట్‌?మెంట్‌? జరగలేదని.. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్‌ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే.సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం ’అగ్నిపథ్‌’పై నిరసనలు శుక్రవారం మరిన్ని రాష్టాల్రకు విస్తరించాయి. యువకుల ఆగ్రహంతో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. నిరసనకారులు పోలీసులతోనూ బాహాబాహీకి దిగారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తోపాటు సైనిక ఉద్యోగార్థులు పలు రాష్టాల్ల్రో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పంటిం చారు. రహదారులపై, రైలు మార్గాల్లో బైఠాయించారు. ప్రభుత్వ ఆస్తులపై రాళ్ల దాడులకూ పాల్పడ్డారు. బిహార్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 234 రైలు సర్వీసులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది.నాలుగేళ్ల కాలపరిమితితో తొలిసారిగా కేంద్రం తీసుకొచ్చిన ’అగ్నిపథ్‌’ సర్వీస్‌ పథకం కింద తొలిబ్యాచ్‌లో 45 వేల మందిని నియమించనున్నారు. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. నాలుగేళ్ల పరిమితితో కూడిన ఈ సర్వీస్‌లో ఎంపికైన వారికి సాంకేతిక నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కలిగినవారిగా తీర్చిదిద్దనున్నారు. ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశమివ్వనున్నారు.

10.మంత్రికెటిఆర్‌ చొరవతో ఐటి పరిశ్రమల రాక
` లక్షల మందికి ఉపాధి దక్కుతోంది
` త్వరలో కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్‌
` మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడి
నాగర్‌ కర్నూల్‌,జూన్‌ 18(జనంసాక్షి):త్వరలోనే కొల్లాపూర్‌ మామిడి మార్కెట్‌ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన విద్య కోసం పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి నిరంజన్‌ రెడ్డి హావిూ ఇచ్చారు. ఐటీ మంత్రి కేటీఆర్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈర్ష్య పడేలా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటవుతున్నాయని, 19 వేల పరిశ్రమలకు క్లియరెన్స్‌ ఇచ్చి 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడిరచారు. మంత్రి కేటీఆర్‌ వయసులో చిన్నవాడైనా దక్షతలో అందరికంటే మిన్న అని మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రశంసించారు. కొల్లాపూర్‌ లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సహచర మంత్రులతో కలసి ఆయన పాల్గొన్నారు. కొల్లాపూర్‌ రాజా బంగ్లా ప్రాంగణంలో బహిరంగ సభ మంత్రి కేటీఆర్‌, మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, ఎంపీ రాములు , ఎమ్మెల్యేలు బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ నిజాంపాష, నాగర్‌ కర్నూల్‌ జడ్పీ ఛైర్మన్‌ పద్మావతి, గద్వాల జడ్పీ ఛైర్మన్‌ సరిత, వనపర్తి జడ్పీ ఛైర్మన్‌ లోక్‌ నాథ్‌ రెడ్డి , మాజీ ఎంపీ మంద జగన్నాథం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్‌ నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు జూరాల ఎడమ కాల్వ ద్వారా క్రిష్ణానది నీరందించే సింగోటం ` గోపాల్‌ దిన్నె లింక్‌ కెనాల్‌ కు 150 కోట్లతో శంకుస్థాపన చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల పైబడి సాగవుతున్న నియోజకవర్గాల్లో కొల్లాపూర్‌ ఒకటని వెల్లడిరచారు.

 

11.మహిళలు పుగరోగమిస్తేనే దేశాభివృద్ది సాధ్యం
మహిళల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో విధానాలు
గుజరాత్‌ పర్యటనలో ప్రధాని మోడీ
గాంధీనగర్‌,జూన్‌ 18(జనంసాక్షి): భారత్‌ అభివృద్ధి చెందాలంటే మహిళలకు సాధికారత కల్పించడం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లో రూ.21 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. మహిళల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో విధానాలు రూపొందిస్తునట్లు తెలిపారు.డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లలో మహిళలకు సాధికారత కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధికి మహిళల సాధికారత అత్యావశ్యకమని ఉద్ఘాటించారు. ఆర్మీ నుంచి గనుల దాకా.. అన్ని రంగాల్లో మహిళల సంక్షేమం కోసం విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఇప్పుడు అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయని అన్నారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న ఆయన వడోదరలో రూ.21వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన మహిళలకు పోషకాహారం అందించే కార్యక్రమాన్ని సైతం ప్రారంభించారు.ఖఓ ఓక్షఆఎ చిక్షఓఇఔ ఇఓఖక్షచిఇఖీఓఇఔªుఅభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న మోదీ’21వ శతాబ్దంలో భారత్‌ అభివృద్ధి చెందాలంటే మహిళలకు సాధికారత కల్పించడం అవసరం. ఇందుకోసమే ప్రభుత్వం విధానాలు రూపొందించింది. మహిళలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకునేందుకు అన్ని అడ్డంకులను తొలగించింది’ అని మోదీ వివరించారు.

12.నేను రాష్ట్రపతి రేసులో లేను
నా అవసరం కాశ్మీర్‌కు ఎంతగానో ఉంది
మాజీ సిఎం ఫరూఖ్‌ అబ్దుల్లా వెల్లడి
న్యూఢల్లీి,జూన్‌ 18(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికల కోసం అభ్యర్థి ఎంపిక కసరత్తులో ఉన్న విపక్షాలకు మరో రaలక్‌ తగిలింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా(84) రాష్ట్రపతి ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. తాను వైదొలుగుతుండడంపై శనివారం మధ్యాహ్నాం స్వయంగా ఆయన ప్రకటించడం విశేషం. ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ను విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో షాక్‌ తగిలింది. జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా సైతం రేసు నుంచి తప్పుకున్నారు. జమ్ము కశ్మీర్‌ ఒక క్లిష్టమైన ఘట్టం గుండా వెళుతోంది. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. నా సేవలు స్వరాష్టాన్రికి అవసరం అని భావిస్తున్నా. అందుకే రాష్ట్రపతి రేసు నుంచి మర్యాదపూర్వకంగా వైదొలుగుతున్నా అని తెలిపారు. జమ్ము రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ సేవలో సానుకూల సహకారం అందించడానికి సిద్ధంగానే ఉన్నా అంటూ ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రకటించారు. అంతేకాదు.. తన పేరును రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల ఉమ్మడి ప్రతిపాదన చేసిన మమతా బెనర్జీకి, ఆ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చిన విపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారాయన. రేసు నుంచి వైదొలిగినా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం జూన్‌ 15వ తేదీన మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు సమావేశం అయ్యాయి. అయితే శరద్‌ పవార్‌ ఆసక్తి చూపించకపోవడంతో.. రేసులో ఫరూఖ్‌ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచాయి. జూన్‌ 21న మరోసారి భేటీ అయ్యి.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఓ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఫరూఖ్‌ అబ్దుల్లా తప్పుకోవడంతో ఇక విపక్షాల జాబితాలో మిగిలింది గోపాలకృష్ణ గాంధీ పేరు మాత్రమే.

13.అప్పుల కోసం బెదరిస్తే కఠిన దండన
బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్‌బిఐ హెచ్చరిక
ఫోన్లలో బెదరింపులకుమూల్యం తప్పదన్న గవర్నర్‌
న్యూఢల్లీి,జూన్‌ 18(జనంసాక్షి):అప్పులు వసూలు చేయడానికి కొన్ని బ్యాంకులు,ఆర్థిక సంస్థలు వేధించడం, బెదిరించడం వంటి పద్ధతులను వాడటంపై ఆర్‌బీఐ తీవ్రంగా స్పందించింది. కస్టమర్లను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్‌ చేసి అప్పు కట్టాలని అడగడం, బూతులు మాట్లాడటం వంటి పద్ధతులను సహించబోమని అన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. అర్థరాత్రి కూడా ఫోన్‌ చేసి అప్పుకట్టాలని అడుగుతున్నారంటూ లోన్‌ రికవరీ ఏజెంట్లపై కంప్లైంట్లు అందుతున్నాయి. బూతులు మాట్లాడుతున్నారని సమాచారం వస్తోంది. ఇలాంటివి ఆమోదనీయం కాదు. ఫైనాన్షియల్‌ సంస్థలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెగ్యులేటెడ్‌ సంస్థలపై అయితే నేరుగా మేం చర్యలు తీసుకుంటాం. అన్‌ రిజిస్టర్‌ సంస్థలపై పోలీసులు, ఇతర ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయని ఆయన అన్నారు. లోన్‌ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. కస్టమర్లను ఇలాంటి సమస్యల నుంచి రక్షించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వేధింపులను అడ్డుకోవడానికి ఇది సిఫార్సులు చేయనుంది.
డిజిటల్‌ ్గªనాన్షియల్‌ ప్రొడక్టులు, డిస్టిబ్యూష్రన్‌?పైనా ఫోకస్‌? చేస్తుంది. డిజిటల్‌ లెండిరగ్‌పై డిస్కషన్‌ పేపర్‌ను విడుదల చేయనుంది. టెక్నాలజీ, డిజిటల్‌? సర్వీసుల వాడకం ఎక్కువై సైబర్‌? నేరాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ కొన్ని సిఫార్సులు చేసిందని, అవి పరిశీలనలో ఉన్నాయని శక్తికాంత దాస్‌? తెలిపారు. ఇల్లీగల్‌గా అప్పులు ఇస్తున్న 600 యాప్స్‌ను కూడా గుర్తించిందని, వీటిపై సంబంధిత ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయని వివరించారు. ఇట్లాంటి యాప్స్‌? నుంచి అప్పులు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.

 

 

15.ఏడాది చివరికి 20`25 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌
` టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌
న్యూఢల్లీి,జూన్‌ 18(జనంసాక్షి):ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. విదేశాలతో పోల్చితే 5జీ రేట్లు దేశంలో తక్కువగానే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని మొబైల్‌ డేటా చార్జీలు ప్రపంచంలోనే చాలా తక్కువని వెల్లడిరచారు. విూడియాతో శనివారం మాట్లాడిన అశ్విని వైష్ణవ్‌, 5 జీ గురించి మాట్లాడారు. ఈ ఏడాది చివరి నాటికి 20`25 నగరాల్లో అందుబాటులోకి వస్తుందని నమ్మకంతో చెబుతున్నానని అన్నారు. ‘విశ్వసనీయ నెట్‌వర్క్‌ ప్రొవైడర్ల జాబితాలో భారతదేశం పేరు అగ్రస్థానంలో ఉంది. భారతదేశం అభివృద్ధి చేసిన సాంకేతికతపై ప్రపంచం ఆసక్తి చూపుతోంది’ అని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా డేటా రేట్లు సగటున 25 డాలర్లు ఉండగా దేశంలో కేవలం 2 డాలర్లగా ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో 5 జీ డేటా రేట్లు కూడా దీనికి అనుగుణంగా తక్కువగానే ఉంటాయని చెప్పారు. ‘భారత టెలికామ్‌ కొత్త శకానికి 5 జీ నాంది’ అని అభివర్ణించారు. 5 జీ టెక్నాలజీతోపాటు రాబోయే 6 జీ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామి దేశంగా ఆవిర్భవించే సమయం ఎంతో దూరంలో లేదని అన్నారు.కాగా, 5జీ స్పెక్ట్రం బ్యాండ్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈ నెలాఖరులో ఆక్షన్‌ జరుగవచ్చని భావిస్తున్నారు. 72 జీహెడ్జ్‌ను 20 సంవత్సరాలకు అమ్మనున్నారు. 5 జీ సేవలు 4 జీ కంటే పది రెట్లు వేగంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.