ALL NEWS

1.హైదరాబాద్‌ మురుగునీటి పారుదల ప్రణాళికకుఆర్థికసాయం చేయండి
` ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు అమృత్‌ `2 కింద ఇవ్వండి
` కేంద్రమంత్రిహరిదీప్‌ సింగ్‌ పూరీతో కేటీఆర్‌ భేటీ..
` రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
న్యూఢల్లీి,జూన్‌ 23(జనంసాక్షి):మంత్రి కేటీఆర్‌ కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.హైదరాబాద్‌ మురుగునీటి పారుదల ప్లాన్‌ కు ఆర్థికసాయం చేయాలని కేంద్రమంత్రిని కోరారు. ఎస్టీపీల నిర్మాణానికి రూ.8,654.54 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడిరచారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు రూ.2,850 కోట్లు అమృత్‌ `2 కింద ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తౌెతే 100శాతం మురుగునీటిని శుద్ధీ చేయడమే కాకుండా మూసీనది సహా ఇతరవాటికి మురుగు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌ లో వ్యక్తిగత రాపిడ్‌ ట్రాన్సిట్‌ కారిడార్‌ కు సహకరించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మెట్రో రైల్‌, ఎంఎంటీఎస్‌ కి ఫీడర్‌ సేవలుగా వ్యవహరించడానికి పీఆర్టీ, రోప్‌ వే సిస్టమ్స్‌ వంటి స్మార్ట్‌ అర్బన్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపికలను అన్వేషిస్తోందని తెలిపారు.


2.మహిళల జోలికొచ్చారో జాగ్రత్త!
` టీమ్స్‌తో మహిళల్లో ఆత్మవిశ్వాసం
` ఉమెన్‌ సెప్టీ విభాగం అధికారి స్వాతి లక్రా
జోగులాంబగద్వాల,జూన్‌ 23(జనంసాక్షి):మహిళల జోలికోస్తే ఎంతిటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు డీజీపీ, ఉమెన్‌ సెప్టీ విభాగం అధికారి స్వాతి లక్రా తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్‌ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందని అన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందని స్వాతి లక్రా పేర్కొన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని స్వాతి లక్రా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్‌ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్‌ శ్రీహర్ష, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా మహిళల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు అండగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోక్సో, లైంగిక దాడి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.


3.యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..
` 10 మంది యాత్రికుల మృతి
లఖ్‌నవూ,జూన్‌ 23(జనంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిలిభిత్‌ జిల్లాలోని గజ్రౌలా ప్రాంతంలో ఓ వ్యాన్‌.. చెట్టును ఢీకొన్న ఘటనలో 10 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు.మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాత్రికులంతా హరిద్వార్‌ నుంచి లఖింపుర్‌కు తిరిగి వస్తుండగా.. గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నిద్రమత్తులో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడిరచారు. క్షతగాత్రులను సవిూపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. బరేలీకి తరలించినట్లు పోలీసులు చెప్పారు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు.4.శ్రీలంకలో బంకుల వద్ద భారీ క్యూ
` రోజుల తరబడి నిలుచుని మృత్యువాత పడుతున్న ప్రజలు
` ఇంధనం కోసం నిలబడి ఇప్పటివరకు 10 మంది మృతి
కొలంబో,జూన్‌ 23(జనంసాక్షి): శ్రీలంకలో నెలకొన్న ఇంధన ఆర్థిక, ఆహార సంక్షోభాలు అక్కడి ప్రజలకు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి.ముఖ్యంగా ఇంధనం కోసం బంకుల ముందు రోజుల తరబడి ‘క్యూ’లోనే వేచిచూడాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా నిరీక్షిస్తూ ‘క్యూ’లోనే తనువు చాలిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఐదురోజుల పాటు క్యూలో ఉండి చివరకు ప్రాణాలు కోల్పోయినట్లు శ్రీలంక విూడియా పేర్కొంది. ఇలా ఇంధనం కోసం వేచిచూస్తూ మరణించిన వారిసంఖ్య పదికి చేరడం శ్రీలంక సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.వాహనంలో ఇంధనం నింపుకునేందుకు ఓ 63ఏళ్ల వృద్ధుడు అంగురువటోటలోని పెట్రోల్‌ బంకు వద్ద వేచిచూస్తున్నాడు. అలా ఐదురోజులు అయినప్పటికీ ఇంధనాన్ని నింపుకోలేకపోయాడు. చివరకు తన వాహనంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఇంధనం కోసం క్యూలో వేచిచూస్తూ మరణించడం ఇదో పదో సంఘటన అని పేర్కొన్నారు. చనిపోయిన వాళ్లందరూ 43 నుంచి 84ఏళ్ల మధ్య వయసున్న వారే. వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోతున్నట్లు శ్రీలంక విూడియా వెల్లడిరచింది. రాజధాని కొలంబోలోని పానాదుర ప్రాంతంలో ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద క్యూలో నిలబడిన ఓ 53ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తన ఆటో రిక్షాలో ఇంధనం కోసం గంటల తరబడి లైన్లో నిలబడడం వల్లే ఆయన చనిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు.
ఇలా తీవ్ర ఇంధన కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక.. పౌరుల నుంచి వస్తోన్న ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు, పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తోంది. ముఖ్యంగా రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోన్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జూన్‌ 17 నుంచి శుక్రవారాన్ని కూడా సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడిరచింది. వచ్చే మూడు నెలలపాటు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. అయితే, ఈ సెలవు రోజుల్లో వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొని ఆహార ఉత్పత్తులను పెంచేందుకు కృషి చేయాలని వారికి పిలుపునిచ్చింది. మరోవైపు ఇంధన కొరత వల్ల కేవలం 20శాతం సర్వీసులను మాత్రమే నడుపుతున్నట్లు ప్రైవేటు ఆపరేటర్లు కూడా చెబుతున్నారు.పెట్రోల్‌ బంకులతోపాటు నిత్యావసర వస్తువుల కోసం గంటలు, రోజుల తరబడి నిలబడడంపై శ్రీలంక వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటువంటి సమయంలో ప్రజల ఆగ్రహాన్ని అంచనా వేసి భద్రతా చర్యలు ముమ్మరం చేయాలని విదేశీ రాయబారులు శ్రీలంక ప్రభుత్వానికి సూచించారు. క్యూలో నిలబడిన పౌరులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలను తీవ్రమైనవిగా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఇంధన కొరత మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున వీటి పంపిణీపై పరిమితి విధించేందుకూ శ్రీలంక ప్రభుత్వం సిద్ధమవుతోంది.
5.అదో రaూఠా పథకం
` ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకంలో కొత్తవారికి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి
` ఈ పథకం కింద ఇచ్చేది తక్కువ.. ప్రచారం ఎక్కువ.
` దీని ద్వారా కేవలం రూ.6 వేలు చొప్పున 35.74 లక్షల మంది రైతులకే లబ్ధి
` రైతుబంధు ద్వారా రాష్ట్రంలో 66 లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం
` ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు ?
` మండిపడ్డ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం ‘రaూఠా’ యోజన పథకం అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకంలో కొత్తవారికి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారు, అదే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద మాత్రం ఏడాదికి రూ.6 వేలు వస్తున్నది కేవలం 35.74 లక్షల మందికే. రైతుబంధు పథకం కింద ఈ వానాకాలం సీజన్‌ తో కలుపుకుంటే రూ.58 వేల కోట్ల నిధులు  తెలంగాణ రైతుల ఖాతాలలోకి జమ కానున్నాయి. కాని ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద ఇప్పటి వరకు రైతులకు అందింది రూ.7689 కోట్లు మాత్రమే అని తెలిపారు.‘‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకంలో కొత్తవారి నమోదుకు అవకాశం లేదు .. 1 ఫిబ్రవరి 2019 తర్వాత కొత్తగా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు .. 2024 వరకు కొత్తవారికి నో ఛాన్స్‌. ఆదాయం పన్ను కట్టినా, రూ.పది వేల పెన్షన్‌ వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పదవీ విరమణ చేసినా, తమ తమ అసోసియేషన్లలో నమోదు చేసుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్‌ లు, ఛార్టెడ్‌ అకౌంటెట్లు ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ యోజనకు అనర్హులు. రైతుబంధు గురించి, రైతుల ప్రయోజనాల గురించి రంకెలు వేసే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు ?  తెలంగాణ రైతుల్లో కొత్తవారికి కూడా ఈ పథకం వర్తించేలా ఎందుకు కృషిచేయరు?’’ అని ప్రశ్నించారు.‘‘కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద రైతులకు ఇచ్చేది కేవలం రూ.2200 కోట్లకు మించింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగానికి గరిష్టంగా కేటాయించిన బడ్జెట్‌ ఎన్నడూ రూ.3 వేల కోట్లకు మించలేదు. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ఏడాదికి రూ.15 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి వేస్తున్నారు .. రూ.1500 కోట్లు రైతుభీమా కోసం ఖర్చు చేస్తూ రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. గతంలో వ్యవసాయ రంగ పథకాలు అన్నీ కలిపితే ఒక మండలంలో లబ్దిదారులు కేవలం 200 నుండి 500 లోపు మాత్రమే ఉండేవారు. రైతుబంధు పథకం ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకు నేరుగా సాయం అందుతున్నది .. అటవీ చట్టం ఆధీనంలో ఉన్న రైతుల భూములకు కూడా రైతుబంధు సాయం అందించడం జరుగుతున్నది. రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాలలో వేయడం మూలంగా రైతులు ఆ డబ్బులను తన వ్యవసాయ అవసరాల మేరకు వాడుకునే అవకాశం ఉన్నది’’ అని వాక్యానించారు.‘‘కేంద్రం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద ఇచ్చేది తక్కువ .. ప్రచారం ఎక్కువ. కేంద్రం అడ్డగోలు నిబంధనల మూలంగా ప్రతి విడతలో 30 లక్షల మంది తెలంగాణ రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన ప్రయోజనాలు అందడం లేదు. ఎరువుల విూద సబ్సిడీలు తగ్గిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు .. ఎనిమిదేళ్లలో ఎరువులు, రసాయనాల ధరలు రెట్టింపు అయ్యాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతూ వ్యవసాయరంగంలో యంత్రాల వినియోగంపై భారం మోపుతున్నారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ .. రైతుల పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేయడంలో విజయవంతం అయ్యారు. బీజేపీ నేతలు మందికి సుద్దులు చెప్పడం మానేసి ప్రధానమంత్రికి చెప్పి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకంలో నిబంధనలు వెంటనే సడలించాలి .. ప్రతి రైతుకూ ఈ పథకం వర్తింపజేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.


6.ట్విటర్‌ ట్రెండిరగ్‌లో ‘బై బై మోడీ’
` దేశవ్యాప్తంగా నంబర్‌వన్‌గా నిలిచిన హాష్‌ట్యాగ్‌
` సోషల్‌ విూడియాలో విరుచుకుపడ్డ నెటిజన్లు
` మోదీ విధానాల వల్లే అన్నిరంగాల్లో దేశ విఫలమైందని మండిపాటు
` ప్రధాని అసమర్థ విధానాల వల్లే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అంటూ ఆగ్రహం
న్యూఢల్లీి,జూన్‌ 23(జనంసాక్షి):దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నెటిజనులు ‘బై బై మోడీ’ హాష్‌ట్యాగ్‌తో సోషల్‌ విూడియాలో విరుచుకుపడ్డారు. ట్విటర్‌లో దేశవ్యాప్తంగా ఈ హాష్‌ట్యాగ్‌ గురువారం నంబర్‌ వన్‌గా నిలిచింది. దేశాన్ని పాలించడం లో మోడీ ప్రభుత్వం అన్ని విధాల విఫలమైందని, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యేందుకు కారణం మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమంటూ నెటిజన్లు ట్వీట్లతో చెలరేగిపోయారు.ఇది ట్రెండిరగ్‌గా మారడంతో టీఆర్‌ఎస్‌ పార్టీలోని మంత్రులు, ఎమ్మేల్యేలు సైతం తమ ట్వీట్ల ద్వారా మోడీ ప్రభుత్వం విూద విమర్శలు గుప్పించారు. దాదాపు యాభై వేలకు పైగా ట్వీట్లు చేశారు. గ్యాస్‌, డీజిల్‌ పెట్రోల్‌ ధరలు మొదలుకొని ద్రవ్యోల్బణం దాకా, విద్వేషాలు విధానాల విూద నెటిజన్లు విమర్శలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్‌ చేస్తామని చెప్పి ఖర్చులను రెట్టింపు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.సోషల్‌ విూడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌.. ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంగా బీజేపీ సర్కారు భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు చేసుకున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ ‘దేశానికి పాలించే నాయకుడు కావాలి కానీ పబ్లిసిటీ కోసం పాటుపడే నాయకుడు వద్దం’టూ ట్వీట్‌ చేశారు. అదానీ ? బీజేపీ బంధాన్ని, కార్పొరేట్ల కోసం.. వారి బాగు కోసం బీజేపీ అనుసరిస్తున్న విధానాలను, ఇటీవల శ్రీలంకలో అదానీ కంపెనీలకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన అంశాన్ని, దేశంలో బొగ్గు కృత్రిమ కొరత సృష్టించి ఆస్ట్రేలియాలో ఉన్న ఆదాయాన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. తమ తమ నాయకుల ట్వీట్లతో పార్టీ కార్యకర్తల్లో సైతం కొత్త జోష్‌ వచ్చినట్లయింది.


7.మావోయిస్టులతో సంబంధాల అభియోగంతో ముగ్గురి అరెస్టు
` దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పలను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ
హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి): మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు.3 ఏళ్ల క్రితం తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంఎస్‌ నాయకులు... రాధను కిడ్నాప్‌ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆమె తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్‌ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర.. రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఉప్పల్‌ చిలుకానగర్‌లోని శిల్ప నివాసంలో, చైతన్య మహిళా సంఘం కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు డిజిటల్‌ సామగ్రి, మావోయిస్టు భావజాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మెదక్‌ జిల్లా చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. గతంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ప్రభాకర్‌ భార్య, న్యాయవాది దేవేంద్రను మేడ్చల్‌ జిల్లాలోని మేడిపల్లి పర్వతాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర, స్వప్న, శిల్ప ముగ్గురూ మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
రాధ ఎవరో మాకు తెల్వదు..మాపై కక్ష కట్టారు
హైకోర్టు అడ్వకేట్‌ శిల్పను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు... రాధ అనే యువతి మిస్సింగ్‌ కేసులో భాగాంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.శిల్ప ఇంట్లో పలు డాక్యుమెంట్స్‌ ను పరిశీలించారు ఎన్‌ఐఏ అధికారులు. శిల్పను అదుపులోకి తీసుకొని ఔఎం కార్యాలయానికి తరలిస్తున్నారు. రాధ అనే మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్‌ ను మావోయిస్టుల్లో చేర్చారంటూ శిల్ప పై కేసు నమోదైంది. 2017లో తన కూతురిని బలవంతంగా మావోయిస్టుల్లో చేర్చించారంటూ శిల్ప, దేవేందర్‌, బండి కిరణ్‌ లపై రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఈఎఖీ ఆధారంగా నిందితుల ఇళ్లల్లో ఔఎం అధికారులు సోదాలు చేసి అడ్వకేట్‌ శిల్పను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు అడ్వకేట్‌ శిల్పను అదుపులోకి తీసుకోవడంపై ఆమె భర్త బండి కిరణ్‌ ఫైర్‌ అయ్యారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. విచారణ కోసం అని చెప్పి ఔఎం ఆఫీస్‌ కి తీసుకెళ్లారని చెప్పారు. చైతన్య మహిళ సంఘానికి శిల్ప రిజైన్‌ చేసి చాలా రోజులైందని.. కావాలనే తమను కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. రాధ అనే అమ్మాయి ఎవరో తమకు తెలియదన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపై పోరాడుతున్నందుకు తమపై కక్ష్య గట్టి సంబంధం లేని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా కేసులు పెట్టి శిల్పను జైలుకు పంపారన్నారు.


8.పేదల పక్షాన పోరాడుతాం
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
` కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్‌ కుమార్తె
హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి): దివంగత పి.జనార్దన్‌ రెడ్డి (పీజేఆర్‌) కుమార్తె, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఆమె.. ఇవాళ పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి గాంధీభవన్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా పీజేఆర్‌ సేవలను నేతలు కొనియాడారు. పీజేఆర్‌ పేరు తెలియని వారు ఉండరని, పేదలకు పెద్దన్న పీజేఆర్‌ అని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్నో బస్తీలు ఆయన కృషితోనే వెలిశాయని, ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్‌ వెనుకాడలేదని వివరించారు.’’పీజేఆర్‌ లేని లోటు ప్రస్తుత తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదు. బస్తీ ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకత్వం అవసరం. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌ పేద ప్రజల పక్షాన పోరాడే దళపతి మాకు దొరికింది. విజయారెడ్డికి పార్టీలో మంచి గౌరవం దక్కుతుంది’’ అని రేవంత్‌రెడ్డి వెల్లడిరచారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘’ విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం సంతోషం. పీజేఆర్‌ కూతురుగా విజయారెడ్డికి మంచి భవిష్యత్‌ ఉంది. ఖైరతాబాద్‌ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుంది. కాంగ్రెస్‌ను గెలిపించుకుంటేనే పీజేఆర్‌కు నిజమైన నివాళి’’ అని పేర్కొన్నారు.

9.మీరు కోరితే..
కూటమి నుంచి బయటికి వస్తాం
` తిరుగుబాటు ఎమ్మెల్యేందరూ సీఎంతో మాట్లాడండి
` శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌
` ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవిని కోల్పోయే ప్రమాదం లేదని వ్యాఖ్య
ముంబై,జూన్‌ 23(జనంసాక్షి): మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నదది. శివసేన మంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివసేన చీలికదశకు చేరగా, ఆ పార్టీ చీఫ్‌, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ మాత్రం చాలా గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు. ముంబైకి తిరిగి వచ్చి ధైర్యాన్ని ప్రదర్శించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలనుద్దేశించి అన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు గౌహతిలో ఉండి మాట్లాడటం సరికాదన్నారు. వారు ముంబైకి తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలని సూచించారు.ఎమ్మెల్యేలందరి అభీష్టం అదే అయితే ఎంవీఏ కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నామని సంజయ్‌ రౌత్‌ తెలిపారు. అయితే దాని కోసం రెబల్‌ ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలని కోరారు. ఏక్‌నాథ్‌ షిండేతో ఉన్న ఎమ్మెల్యేల్లో 22 మంది తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ముంబైకి తిరిగి వస్తే వారు ఎలాంటి ఒత్తిడిలో తమను వీడాల్సి వచ్చిందో అన్నది చెబుతారని అన్నారు. ఈ విషయం కూడా త్వరలో బయటపడుతుందన్నారు.ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవిని లేదా శివసేన అధ్యక్ష పదవిని కోల్పోయే ప్రమాదం ఏవిూ లేదని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఒకవేళ అసెంబ్లీలో బలపరీక్ష ఎదురైతే మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్‌ ఠాక్రే, బుధవారం రాత్రి సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేసిన అనంతరం భారీగా తరలివచ్చిన శివ సైనికులతో కలిసి సొంత నివాసం మాతోశ్రీకి చేరుతున్నారు. దీంతో గత రాత్రి ఒక సింహాన్ని విూరు రోడ్డుపై చూశారంటూ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.
మేం జోక్యం చేసుకోం.. ఠాక్రేపై విశ్వాసం ఉంది..:కాంగ్రెస్‌ పార్టీ
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే శిబిరం వైపు 45మందికి పైగా శివసేన ఎమ్మెల్యేలు వెళ్లడంతో రాష్ట్రంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం పతనం అంచులకు చేరింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. శివసేన అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని.. కానీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై తమకు విశ్వాసం ఉందని తెలిపింది. మహారాష్ట్రలో స్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా చేస్తోన్న ప్రయత్నాలు మాత్రం విజయవంతం కావని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, లోక్‌సభాపక్ష ఉప నేత గౌరవ్‌ గొగొయి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తలెత్తుతోన్న ప్రశ్నలపై ఆయన దిల్లీలో స్పందించారు.’శివసేనపై మా అభిప్రాయాలు రుద్దడం ఇష్టంలేదని ఇదివరకే స్పష్టంచేశాం. అది పూర్తిగా వారి అంతర్గత వ్యవహారం. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై మాకు విశ్వాసం ఉంది. మహారాష్ట్రలోని మా సహచరులతో టచ్‌లో ఉన్నాం.. సుస్థిర ప్రభుత్వాన్ని పడగొట్టి, దేశంలో అస్థిరతకు గురిచేసే భాజపా ఉద్దేశాలు ఫలించబోవని మేం విశ్వసిస్తున్నాం. భాజపా వరుసగా అస్థిరతను సృష్టిస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ’’ అన్నారు.దేశంలోని నిరుద్యోగ యువత వీధిన పడటం, కొవిడ్‌ కేసులు పెరగడం, వరదలు, రైతుల తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా చేస్తున్న ఇలాంటి రాజకీయాలు ఆ పార్టీ అధికార దాహాన్ని తెలియజేస్తోందన్నారు. భాజపా అధికార దాహం వల్లే దేశం అభివృద్ధి నుంచి పట్టాలు తప్పుతోందని విమర్శించారు. అస్సాం వరదలతో అతలాకుతలమవుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. భాజపా అధికారం కోసం గుడ్డిగా వెళ్తోందని.. ఆ పార్టీకి అధికారమే సర్వస్వమని ఆక్షేపించారు. గువాహటిలో రాజకీయ వార్తల్ని కవర్‌ చేస్తున్న ముఖ్య విూడియా సంస్థలు సిల్చార్‌, కరీంగజ్‌లలోని ప్రజల బాధలను చూపించాలన్నారు. వారంతా తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.
కూటమిలో మమ్మల్ని అలమానాలపాలు చేశారు:శిందే
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది.నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంతో మాట్లాడారు. అనంతరం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. దీనిపై అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ శిందే కౌంటర్‌ ఇచ్చారు. ‘ఇదీ వాస్తవ పరిస్థితి’ అంటూ ఎంవీఏ పాలనలో ఎదుర్కొన్న అవమానాలను ప్రస్తావించారు. అలాగే తాను తిరిగి రావాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అసంతృప్త ఎమ్మెల్యేలు రాసిన మూడు పేజీల లేఖను ట్విటర్‌లో షేర్‌ చేశారు.’రామ్‌ మందిరం, అయోధ్య, హిందుత్వ.. శివసేనకు సంబంధించినవి కావా..? శివసేన ఎమ్మెల్యేలు అయోధ్యకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆదిత్య ఠాక్రే ఒక్కరే వెళ్లారు. మిగిలినవారు వెళ్లడానికి ప్రయత్నిస్తే.. ఉద్ధవ్‌ స్వయంగా ఫోన్‌చేసి, అడ్డుకున్నారు. మరోపక్క, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ నేతల ముందు అధికారులు మాకు గౌరవం ఇవ్వడం లేదు. మమ్మల్ని అవమానించారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ నేతలు మిమ్మల్ని కలవడానికి అనుమతి ఉంటుంది. మాకు మాత్రం తలుపులు మూసి ఉంటాయి. వారికి నిధులు అందుతున్నాయి. వారికెందుకు నిధులు వస్తున్నాయి, మనకెందుకు రావడం లేదని నియోజకవర్గంలోని ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏక్‌నాథ్‌ శిందే మాకు మద్దతుగా నిలిచారు. విూరు నిన్న మాట్లాడిరది ఉద్వేగపూరితంగా ఉంది. కానీ మా ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలేదు. మా ఆవేదన, అభిప్రాయాలు తెలియజేయడానికే ఈ లేఖ రాశాం’ అంటూ ఉద్ధవ్‌ వైఖరిని నిరసించారు.శివసేనకు అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యే ఉన్నారని, అందులో 13 మంది మినహా అంతా తమ వర్గంలోకి వస్తారని శిందే ఇదివరకే ధీమా వ్యక్తం చేశారు. అలాగే శివసేన ఎన్నికల చిహ్నాన్ని శిందే వర్గం క్లెయిమ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.
తదుపరి పోరాటానికి సిద్ధంగా ఉండండి..: పవార్‌
ఈ రోజు ఉదయం ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ తన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ‘ఈ అనిశ్చితి వేళ.. కఠిననిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు తెలియజేశాం. ఈ పరిస్థితుల్లో ఎన్‌సీపీ తోడుగా ఉంటుందని చెప్పాం. మనం అధికారం కోల్పోతే.. తదుపరి రాజకీయ పోరాటానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి’ అంటూ పవార్‌ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి.ఈ సంక్షోభం సమయంలో ఎంవీఏ అధికారం కోల్పోతే.. భాజపా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మరోసారి దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. దీనిని ఉద్దేశించి.. ఔరంగాబాద్‌లోని ఆయన అనుచరులు ఫడణవీస్‌ సీఎం అని పోస్టర్ల రూపంలో తమ మద్దతు ప్రకటించారు.

10.ప్రాంతీయపార్టీలను బిజెపి అస్థిరపరుస్తోంది
` మహారాష్ట్రలో పరిస్థితి షాకింగ్‌లా ఉంది:
` పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
కోల్‌కతా,జూన్‌ 23(జనంసాక్షి):మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఏజెన్సీ సంస్థలు సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ డబ్బు, మాఫియా శక్తిని ఉపయోగించి.. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తోంది అంటూ మండిపడ్డారు. విష్యత్తులో ఏదో ఒక రోజు బీజేపీని కూడా ఇలాగే విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ఇలాంటి రాజకీయాలకు తాను మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రస్తుతం’మహా వికాస్‌ అఘాఢీ’ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం సమసిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారామె.


11.విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు కామన్‌ బోర్డు...
త్వరలో నోటిఫికేషన్‌.. నిబంధనలు ఖరారు..
హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి): విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నిమాయకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లో ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కామన్‌ బోర్డు ద్వారా జరగనుంది.ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వుల జారీ చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ అధ్యక్షుడిగా, విద్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను బోర్డులో సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ బోర్డు కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే మరో సభ్యుడిగా నిపుణులను నియమించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 15 యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాలను ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా చేపట్టనున్నారు. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ ఎలా చేపట్టాలి?తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది. వర్సిటీల్లోని 3,500 ఉద్యోగాల భర్తీకి కామన్‌ బోర్డు ప్రక్రియ ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే అనుమతిచ్చింది. నియామక ప్రక్రియకోసం వేచి చూస్తున్నారు.ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ, తెలుగు, పాలమూరు, శాతవాహన, అంబేడ్కర్‌, మహాత్మగాంధీ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, అటవీ, ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయాల్లో నియామకాలను కామన్‌ బోర్డు చేపట్టనుంది. విశ్వవిద్యాలయాల్లో 3,500 బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏప్రిల్‌ 12న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. గతంలో యూనివర్సిటీలే వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టే విధానం అమల్లో ఉంది. దానివల్ల ఒకే అభ్యర్థి వేర్వేరు యూనివర్సిటీల్లో ఉద్యోగాల్లో నియామకమైనప్పుడు.. మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయన్న చర్చ జరిగింది. దానికి తోడు ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధానం అమలు చేయడం వల్ల గందరగోళం తలెత్తుతుందన్న సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీల్లో నియామకాల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సులను పరిశీలించిన కేబినెట్‌ కామన్‌ బోర్డును ఏర్పాటు చేయాలని ఏప్రిల్‌ 12న నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఇవాళ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. బోర్డు నిర్వహణ ఖర్చులను ఉన్నత విద్యా మండలి ఆయా యూనివర్సిటీల నుంచి సేకరించి బోర్డుకు కేటాయిస్తుంది. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ నిబంధనలను త్వరలో ఖరారు చేయనున్నారు.

12.విజయవంతంగా రోదసీలోకి దూసుకెళ్లిన జీశాట్‌`24
న్యూఢల్లీి,జూన్‌ 23(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ జీశాట్‌`24 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్‌ కంపెనీ ఏరియన్‌ స్పేస్‌ గురువారం ఫ్రెంచ్‌ గయానా (దక్షిణ అమెరికా)లోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌?5 రాకెట్‌తో ఇస్రో రోదసీలోకి పంపింది. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌), కేంద్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌(డీఓఎస్‌) సంయుక్తంగా 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్‌?24 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టాయి.ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు పాన్‌ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. జీశాట్‌?25తో డీటీహెచ్‌ అప్లికేషన్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష రంగ సంస్కరణల తర్వాత న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) ప్రారంభించిన డిమాండ్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ మిషన్‌ ఇదేకావడం విశేషం. ఇదిలా ఉండగా.. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది.13.ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్తా
న్యూఢల్లీి,జూన్‌ 23(జనంసాక్షి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దినకర్‌ గుప్తా జాతీయ దర్యాప్తు సంస్థ (ఔఎం) డైరెక్టర్‌ జనరల్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు గురువారం మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. గుప్తా పంజాబ్‌ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా గుప్తా నియామకానికి క్యాబినేట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన మార్చి 31, 2024 వరకు పదవిలో కొనసాగనున్నారు. అలాగే స్వాగర్‌ దాస్‌ను హోంమంత్రిత్వశాఖలో ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత)గా నియమించారు. ఆయన ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో స్పెషల్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన నవంబర్‌ 30, 2024 వరకు పదవి విరమణ చేసే వరకు సేవలందించనున్నారు.

14.మోడీతో ద్రౌపదీ ముర్మూ భేటి
` దేశ సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉంది
` అభ్యర్థిత్వంపై ప్రధాని ట్వీట్‌
న్యూఢల్లీి,జూన్‌ 23(జనంసాక్షి): రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉందని ట్విటర్‌లో ప్రశంసించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము గురువారం ఢల్లీిలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్‌ చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కూడా ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పుష్పగుచ్ఛంతో ఆమెను అమిత్‌ షా స్వాగతించారు. బీజేపీ సీనియర్‌ నాయకులతోనూ ఆమె భేటీ అవుతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులను కలిసి ఆమె కోరనున్నారు. కాగా, జూన్‌ 24న ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రపతిగా అవకాశం కల్పించినందుకు ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు ద్రౌపది ముర్ము ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎమ్మెల్సీ గెస్ట్‌ హౌస్‌ నుంచి విమానంలో బయలుదేరి ఢల్లీి చేరుకున్నారు. ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్‌ 24న శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపాదించారు. నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్ర పక్షాలు, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 29 చివరి తేదీ. ఈ ఎన్నిక ఫలితాలను జూలై 21న వెల్లడిస్తారు.