ALL NEWS

 

1.ఆర్యసమాజ్‌ వివాహధృవీకరణ పత్రాలు చెల్లవు
` సుప్రీం కోర్టు కీలక తీర్పు
` వాటిని గుర్తించబోమన్న సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢల్లీి,జూన్‌ 3(జనంసాక్షి): ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆర్య సమాజ్‌ మ్యారేజ్‌ సర్టిఫికెట్లను గుర్తించబోమని స్పష్టం చేసింది. వివాహ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్‌ బాధ్యత కాదని, అధికారుల పని అని సుప్రీంకోర్టు తెలిపింది. మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారనే ఆరోపణలను వ్యతిరేకిస్తూ నిందితుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన బీవీ నాగరత్న, అజయ్‌ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడిపై 363, 366ఏ, 384, 384 సెక్షన్లతో పాటు పోక్సో కింద కూడా కేసు బుక్‌ అయింది. బాధితురాలు మైనర్‌ కాదని, మేజర్‌ అని, నిందితుడితో ఆర్యసమాజ్‌లో వివాహం కూడా అయిందని, అత్యాచారం ఆరోపణలు అవాస్తవమని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఆర్యసమాజ్‌ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను గుర్తించబోమని, అసలైన సర్టిఫికెట్‌ ఎక్కడ అని ప్రశ్నించింది. లవ్‌ మ్యారేజ్‌ అంటేనే చాలామందికి గుర్తుకు వచ్చేది ఆర్య సమాజ్‌. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోని సందర్భంలో ఆర్యసమాజ్‌ కు వెళ్లి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. పెళ్లి అనంతరం ఆర్యసమాజ్‌ ఇచ్చే సర్టిఫికెట్లు చట్టపరంగా చెల్లుబాటు అయ్యేవి. అయితే ఆర్య సమాజ్‌లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు, ఆ సంస్థ ఇస్తున్న సర్టిఫికెట్లను గుర్తించబోమని తెలిపింది. ఆర్య సమాజ్‌ ఉన్నది పెళ్లిళ్లు చేయడానికి కాదన్న సుప్రీంకోర్టు.. కుల, మతాలకు అతీతంగా ప్రేమించుకున్న యువత పెద్దల అంగీకారం లేకపోవడంతో నేరుగా ఆర్య సమాజ్‌ను ఆశ్రయిస్తున్నారని చెప్పింది. అలా వచ్చిన యువ జంటలకు ఆర్య సమాజ్‌ పెళ్లిళ్లు చేస్తోందని, ఇలా జరిగిన పెళ్లిళ్లపై ఆయా కుటుంబ పెద్దలు కక్షలు పెంచుకోవడం, పరువు హత్యలు క్రమంగా పెరిగిపోతున్న వైనంపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఇకపై ఆర్య సమాజ్‌ ఇచ్చే వివాహ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్‌ లో ఓ ప్రేమపెళ్లిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది.

 

2.తెలంగాణ ప్రభుత్వానికి ఊరట ..
` బాండ్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతి
` రుణాల ద్వారా రూ.4వేల కోట్లు సవిూకరించుకునే అవకాశం
` ఈనెల 7న బాండ్లు వేలం వేయనున్న రాష్ట్రం
హైదరాబాద్‌,జూన్‌ 3(జనంసాక్షి): అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బాండ్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు ఎట్టకేలకు కేంద్రం అనుమతించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా రూ.53వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అయితే, గత రెండేళ్లుగా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న బడ్జెటేతర రుణాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు.కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలు, అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. గత రెండు నెలలుగా అప్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో నిధులు సర్దుబాటు కాక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడిరది. ఆ ప్రభావం జీతాలపై కూడా పడి ఆలస్యమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తంలో కొంత కోత విధించి అనుమతిచ్చినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా నిధులు సవిూకరించుకోనుంది. దీంతో రూ.4వేల కోట్లు రుణాల ద్వారా సవిూకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. ఈమేరకు ఆర్బీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 13 ఏళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. ఈనెల 7న బాండ్లు వేలం వేయనున్నారు.

 

3.కర్ణాటకలో ఘోరరోడ్డు ప్రమాదం
` మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు
` మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధం
` 8మంది ప్రయాణికుల సజీవదహనం
` మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారే
` ఘటనపై సిఎం కెసిఆర్‌ దిగ్భార్రతి
` క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
` మృతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం ప్రకటన
బెంగళూరు,జూన్‌ 3(జనంసాక్షి): కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 8 మంది సజీవ దహనం అయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టిన ఘటనలో వీరంతా సజీవదహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.డ్రైవర్‌ సహా 35 మందితో కూడిన ప్రైవేటు బస్సు గురువారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఒక కుటుంబానికి చెందిన 11 మంది.. మరో కుటుంబానికి చెందిన 21 మందితో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు. తెల్లవారుజామున కర్ణాటకలోకి ప్రవేశించిన ట్రావెల్స్‌ బస్సు బీదర్‌` శ్రీరంగపట్టణం హైవే గుండా గమ్యం వైపు సాగుతున్న క్రమంలో.. కమలాపుర వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మినీ లారీని బస్సు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన బోల్తా పడిరది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సు అంతటికి వ్యాపించడంలో పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బస్సులో ఉన్న పలువురిని రక్షించారు. బస్సు అద్దాల పగలకొట్టి వారిని కాపాడారు. అయితే ఈ లోపే మంటలు విస్తరించడంతో బస్సులోని.. ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వైద్యం కోసం క్షతగాత్రులను కలబురిగి జిల్లా ఆసుపత్రితో పాటు యునైటెడ్‌, గంగా ఆసుపత్రులకు తరలించారు. మంటల్లో తీవ్రగాయాలపాలైన మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిని లారీ డ్రైవర్‌కు సైతం తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందినదిగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో బీవన్‌, దీక్షిత్‌ అనే ఇద్దరితో పాటు రవళి, సరళాదేవి, అర్జున్‌ శివకుమార్‌, అనితారాజు, శివకుమార్‌ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారని పోలీసులు నిర్దారించారు. బర్త్‌ డే పార్టీ కోసం హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు మే 29న గోవా వెళ్లినట్లు సమాచారం. ఒక కుటుంబంలో 11 మంది, మరో కుటుంబంలో 21 మంది వెళ్లారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు క్లీనర్లు ఉన్నారు.
కర్నాటక బస్సు ప్రమాదంపై సిఎం కెసిఆర్‌ దిగ్భార్రతి
కర్నాటక లో బస్సు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. కర్నాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి లక్ష, క్షతగాత్రులకు 50వేల పరిహారం ప్రకటించారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా, కమలాపురం సవిూపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణీకులు మృతి చెందారు. లారీని ఢీకొన్న తర్వాత బస్సు బోల్తా పడిరది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా సమయంలో బస్సులో 32 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. 12 మందిని స్థానికులు కాపాడారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్లారు.కాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కర్ణాటకలో హైదరాబాద్‌కు చెందిన వారు ప్రయాణిస్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపడతామని... మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హావిూ ఇచ్చారు.

 

4.అనకాపల్లిలో అమోనియా గ్యాస్‌లీక్‌
` అచ్యుతాపురం బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌లో చోటు చేసుకున్న ఘటన
` పదుల సంఖ్యలో మహిళలకు అస్వస్థత..
` ఘటనపై సీఎం జగన్‌ ఆరా
` ఎవరికీ ప్రాణాపాయం లేదు
` బాధితులను పరామర్శించిన మంత్రి ముత్యాల నాయుడు
` ఘటనపై కలెక్టర్‌తో ఆరా తీసిన హోంమంత్రి వనిత
అచ్యుతాపురం,జూన్‌ 3(జనంసాక్షి):అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌ పరిధిలోని పోరస్‌ కంపెనీలో అమోనియా వాయువు లీకైంది. దీంతో సవిూపంలోని సీడ్స్‌ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు.ఆ వాయువు పీల్చడంతో మహిళలకు తల తిరగడం, కళ్ల మంటలు రావడంతో పాటు వాంతులు అయ్యాయి. పదుల సంఖ్యలో మహిళలను సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారిని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. అమోనియా పీల్చడంతో మహిళలు స్పృహ తప్పి పడిపోయారని.. ప్రాణాపాయం ఉండదని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు పోరస్‌ కంపెనీలో అమోనియా లీకేజీని నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. దాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. దీంతో కంపెనీ యాజమాన్యం రెండో షిఫ్టు రద్దు చేసి ఉద్యోగులను ఇళ్లకు పంపించారు. ఆమోనియా వాయువు లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనాస్థలిని పరిశీలించాలని పరిశ్రమలశాఖ మంత్రికి సూచించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కాగా అచ్యుతాపురం సెజ్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌లో మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఎంపీ సత్యవతి పరామర్శించారు. 124 మంది హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుం డగా.. వారిలో ఎవ్వరికీ ప్రాణాపాయం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించామన్నారు. జరిగిన ప్రమాదంపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్యాల నాయుడు, ఎంపీ సత్యవతి అన్నారు. ఈ మేరకు ఘటనపై మంత్రి ముత్యాలనాయుడు విూడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన సంఘటన దురదృష్టం. జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారిని ఎన్టీఆర్‌ హాస్పిటల్‌కు తరలించాము. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హాస్పిటల్‌లో 124 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. వారిలో ఎనిమిది మందికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 50 బెడ్స్‌ కేజీహెచ్‌లో అదనంగా ఏర్పాటు చేశాము. జరిగిన ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశాము. జరిగిన ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ హాస్పిటల్‌లో మెరుగైన వైద్యం బాధితులకు అందుతోంది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితిని కలెక్టర్‌ అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు. అనకాపల్లి గ్యాస్‌ లీకేజీ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సవిూక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్‌ పీల్చి ఇబ్బందిపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. లీకేజీని త్వరగా కంట్రోల్‌లోకి తీసుకోవాలని ఆదేశించారు.

 

5.రాజ్యసభకు దామోదర్‌ రావు, పార్థసారధి రెడ్డిలు ఎన్నిక
` ఇద్దరే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవం అయినట్లు ప్రకటన
హైదరాబాద్‌,జూన్‌ 3(జనంసాక్షి):రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసిపోయింది. దీంతో రెండు స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులైన దామోదర్‌రావు, పార్థసారధి రెడ్డి మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ్య ద్వైవార్షిక ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ తన అభ్యర్థులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డిని ప్రకటించింది. వారితోపాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారిద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

6.అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా భారత్‌
` గ్లోబల్‌ రిటైల్‌ ఇండెక్స్‌లో రెండో స్థానంలో ఇండియా
` యూపిలో పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని మోడీ
` దేశానికి యూపి రోల్‌ మాడల్‌ కాబోతుందన్న ప్రధాని మోడీ
` అదాని,అంబానీ తదితర వ్యాపార దిగ్గజాల హాజరు
లక్నో,జూన్‌ 3(జనంసాక్షి):భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోందని.. జీ 20 ఆర్థిక వ్యవస్థలలో తాము వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడిరచారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందన్నారు. వచ్చే పదేళ్లలో భారతదేశానికి ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని.. చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. లక్నోలో యూపీ పెట్టుబడుదారుల సదస్సులో సుమారు రూ. 80 వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, ఇదొక రికార్డు అన్నారు. శుక్రవారం లక్నోలో యూపీ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 3.0 జరుగుతోంది. ఈ సమ్మిట్‌ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. తమ ప్రభుత్వం ఇటీవలే 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకోవడం జరిగిందని, సంస్కరణలు, పనితీరు.. ఇతర వాటిని అమలు పరుస్తూ.. పురోగించడం జరిగిందన్నారు. సమన్వయంతో చేసుకుంటూ సులభంగా వ్యాపారం చేయడంపై దృష్టి కేంద్రీకరించామ న్నారు. నేడు భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోందని, దేశం పని తీరును ప్రశంసిస్తోందన్నారు. జి20 ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా దేశం అభివృద్ధి చెందిందని, గ్లోబల్‌ రిటైల్‌ ఇండెక్స్‌ లో దేశం రెండో స్థానంలో ఉందని వెల్లడిరచారు. ప్రస్తుతం జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో రూ. 80 వేల కోట్ల కంటే పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, దీని ఫలితంగా యువత ఎక్కవ ప్రయోజనం పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారత శక్తి సామర్థ్యాలను చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్లోబల్‌ రిటైల్‌ ఇండెక్స్‌లో మనం రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. గత 8 ఏళ్ల పాలనలో గొప్ప పురోగతి సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. స్థిరత్వం, సహకారం, సులభతర వాణిజ్య విధానంపైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, తయారీ, పునరుత్పాదక శక్తి, ఎంఎస్‌ఎంఈ, ఫార్మా, పర్యటకం, రక్షణ, వాయుమార్గం, వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన 1,406 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. వీటి విలువ రూ.80,000కోట్లు. 21 శతాబ్దంలో భారత అభివృద్ధికి యూపీనే ఊతమిస్తుందని అన్నారు. వచ్చే పదేళ్లు దేశానికి ఛోదక శక్తిగా యూపీనే ఉంటుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ’భారత శక్తి సామర్థ్యాలను చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. జీ`20 దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే. గ్లోబల్‌ రిటైల్‌ ఇండెక్స్‌లో భారత్‌ది రెండో స్థానం. ఉత్తర్‌ప్రదేశ్లో గంగానది 1100కిలోవిూటర్ల మేర ప్రవహిస్తుంది. 25`30జిల్లాల నుంచి వెళ్తోంది సహజ వ్యవసాయ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ స్కీమ్‌ను యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్‌ ప్రపంచానికి ఇదే సువర్ణావకాశం అని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. యూపీ ఇన్వెస్టర్ల మొదటి సదస్సు 2018 జులై 29న జరిగింది. ఈ కార్యక్రమంలో రూ.61,500కోట్లు విలువ చేసే 81 ప్రాజెక్టులను ప్రారంభించారు. 2019 జులై 28న జరిగిన రెండో విడత సదస్సులో రూ.67,000కోట్లు విలువ చేసే 290 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

 

7.ప్రియాంకకు కరోనా
` హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ట్వీట్‌
న్యూఢల్లీి,జూన్‌ 3(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా కూడా కోవిడ్‌ బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్విటర్‌లో వెల్లడిరచారు. శుక్రవారం చేసిన కోవిడ్‌ నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్‌ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం సోనియా ఐసొలేషన్‌లో ఉన్నారని, ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతోందని తెలిపారు. గత వారం రోజులుగా సోనియా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారని, వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు గుర్తించామని సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సోనియా బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. ఇదిలావుంటే భారత్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం బులిటెన్‌లో 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్రం వెల్లడిరచింది. గురువారం నాటి కేసులతో పోలిస్తే ఇవాళ అదనంగా మరో పదిహేను వందలకు పైగా కొత్త కేసులు రావడం గమనార్హం.దేశంలో తాజాగా 4,041 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్‌తో పది మంది మృతి చెందారు. అలాగే యాక్టివ్‌ కేసులు కూడా 20 వేల మార్క్‌ను దాటేసి.. 21, 177కి చేరాయి. డెయిలీ పాజిటివిటీ రేటు.. 0.60 శాతంగా, వీక్లీ రేటు 0.56 శాతంగా నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే బుధవారం.. 2, 745 కేసులు నమోదు అయ్యాయి. నాలుగున్నర లక్షల శాంపిల్స్‌కుగానూ.. గురువారం ఏకంగా 3, 172 కేసులు వెలుగు చూశాయి. దాదాపు 22 రోజుల తర్వాత మూడు వేల మార్క్‌ దాటింది కరోనా. ఇక గురువారం యాక్టివ్‌ కేసుల సంఖ్య 19, 509 ఉండగా.. శుక్రవారం ఆ సంఖ్య 21, 177కి చేరింది. దేశంలో కరోనా కేసుల పెరుగుదల మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మాస్క్‌ నిబంధనను మళ్లీ తెస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రకటించారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, కేరళలో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో చాలా చోట్ల కరోనా నిబంధనలకు కాలం చెల్లింది. అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వాటి గురించి ఆలోచించాలంటూ కేంద్రం, పలు రాష్టాల్రను అప్రమ్తతం చేస్తోంది.

 

8.కరోనా ప్రమాదం మళ్లీ పొంచిఉంది
` తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
` కట్టడికి ముమ్మర చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ
దిల్లీ,జూన్‌ 3(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 21వేలు దాటింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కొవిడ్‌ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. దీంతో కొవిడ్‌ కట్టడికి ముమ్మర చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ ఐదు రాష్ట్రాలకు లేఖ రాసింది.’కరోనా వైరస్‌పై చేస్తోన్న పోరులో ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలను కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ప్రజారోగ్యం విషయంలో ముప్పు అంచనా ఆధారిత విధానాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో టెస్టుల సంఖ్య పెంచడం, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టడాన్ని ముమ్మరంగా చేయాలి. వైరస్‌ వ్యాప్తి తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమర్థంగా కట్టడి చర్యలు చేపట్టాలి’ అని ఐదు రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఈ సమిష్టి కృషిలో అవసరమైన మద్దతును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తనవంతు సహాయాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఇదిలాఉంటే, గత వారంరోజులుగా దేశంలో పలు చోట్ల కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 4041 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దాదాపు మూడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా పాజిటివిటీ రేటు కూడా ఒక శాతానికి చేరువయ్యింది. కేవలం మహారాష్ట్ర, కేరళలోనే వెయ్యి చొప్పున కేసులు వెలుగు చూశాయి. ముంబయిలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు. లేదంటే మళ్లీ ఆంక్షలు విధించాల్సి రావచ్చని పరోక్ష హెచ్చరిక చేశారు.

 

9.కంపతార చెట్లు ప్రమాదం
` కూకటివేళ్లతో పెకిలించాలి
` అలా చేస్తే ఆ గ్రామానికి రూ.లక్ష అందిస్తాం
` మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి,జూన్‌ 3(జనంసాక్షి):గ్రామాల్లో కంపతార చెట్లు ఉండొద్దని, వాటిని కూకటివేళ్లతో సహ పెకిలించి ఏరిపారేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అలా చేస్తే పంచాయతీకి రూ.లక్ష చొప్పున అందిస్తాని తెలిపారు. ఎన్ని గ్రామ పంచాయతీలు ఇలా చేస్తే అన్నింటికీ రూ. లక్ష చొప్పున అందిస్తానని తెలిపారు.శుక్రవారం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలం అంకూరు, పెద్దగూడెం గ్రామాల్లో, వనపర్తి పట్టణంలో కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు.వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి లబ్దిదారులకు రూ.32,35,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ప్రజల బతుకుదెరువు కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది.తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పథకాలు, కార్యక్రమాలు లేవు గ్రామాల్లో ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీలకు నిధులుపల్లె ప్రకృతివనం, వైకుంఠధామంల ఏర్పాటుతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు రూ.8,500 వేతనాలు, పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్‌, ఆటోలు ఏర్పాటు చేసిందిఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రస్తుతం నడుస్తున్నదిగ్రామాలు శుభ్రంగా ఉండడానికి 1588 మంది ఉన్న చిన్న అంకూరు గ్రామానికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రూ.62 లక్షల 45 వేల 780 ఏడు దశాబ్దాల్లో దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో నెలా నెలా నిధులిచ్చి గ్రామాలను బాగుచేసుకోమన్న పరిస్థితి లేదుఒక్క కేసీఆర్‌ పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఉన్నదిఅవసరమయిన అన్ని చోట్లా సీసీ రహదారులు వేయడం జరిగింది .. మిగిలిన చోట్ల సీసీ రహదారులు వేయిస్తాంవైకుంఠధామాలను సద్వినియోగం చేసుకోవాలిఅంకూరులోని 556 మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.3 కోట్ల 20 లక్షల 83 వేల 796 రూపాయలు15 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గల్లీ తిరిగి అధికారులు, ప్రజలు సమస్యలు పరిష్కరించుకోవాలి’’ అని అన్నారు.

 

10.అభివృద్ది సంక్షేమంలో తెలంగాణ నంబర్‌ వన్‌
` రాష్ట్రం నుంచే పది టాప్‌ నగరాలు
` తమిళనాడు, కేరళ తరవాత పట్టణీకరణలో ముందున్నాం
` ప్రత్యేక దృష్టితో పట్టణాల్లో మౌలిక వసతులు
` పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదలలో మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,జూన్‌ 3(జనంసాక్షి):అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇండియాలో టాప్‌ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలతోపాటు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నామని వెల్లడిరచారు. ప్రత్యేక దృష్టితో పట్టణాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. తమిళనాడు, కేరళ తర్వాత తెలంగాణలో 46.8 శాతం మంది పట్టణాల్లోనే ఉంటున్నారని చెప్పారు. 3 శాతం భూభాగంలో 46.8 శాతం జనాభా ఉన్నదని వెల్లడిరచారు. 2050 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంటుందని నీతి ఆయోగ్‌ చెప్పిందన్నారు. నాలుగైదేండ్లలో 50 శాతం తెలంగాణ జనాభా పట్టణాల్లో ఉండబోతున్నదని పేర్కొన్నారు.లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లు, నాలాలు, ఫ్లై ఓవర్లు నిర్మించుకున్నామన్నారు.పేదలకు ఆత్మగౌరవ గృహనిర్మాణం చేస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. 2021`22 ఏడాదికి పురపాలకశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరు అడగకున్నా ప్రతి ఏడాది ప్రగతి నివేదిక విడుదల చేస్తున్నామని తెలిపారు. అద్భుతంగా పనిచేస్తున్న మున్సిపల్‌, పట్టణాభివృద్ధి అధికారులను అభినందించారు. కరోనా కాలంలో మున్సిపల్‌ సిబ్బంది బాగా పనిచేశారని, కరోనా టీకాలు వేయడంలో మున్సిపల్‌ సిబ్బంది పాత్ర మరచిపోలేమని మంత్రి అన్నారు.హైదరాబాద్‌లో వ్యర్ధ పదార్థాలతో 62 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని వెల్లడిరచారు. అన్ని మున్సి పాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేస్తున్నామన్నారు. రూ.100 కోట్లతో అవుటర్‌ రింగ్‌రోడ్డు మొత్తం ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సోలార్‌ రూఫ్‌టాప్‌తో 21 కిలోవిూటర్ల సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం కింద రూ.వెయ్యి కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈసారి వరద ముప్పు ఉండదని తాను చెప్పనని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. మూసీ నదిపై రూ.540 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. నానక్‌రామ్‌గూడ నుంచి టీఎస్‌పీఏ వరకు సర్వీస్‌ రోడ్డు విస్తరిస్తున్నామని తెలిపారు. ఉస్మాన్‌ సాగర్‌ చుట్టూ 18 ఎకరాల్లో కొత్త పార్కు తుదిదశకు వచ్చిందన్నారు. హెరిటేజ్‌ భవనాలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.2410 కోట్లతో 104 కొత్త లింక్‌ రోడ్లను నిర్మించ బోతున్నామన్నారు. హైదరాబాద్‌లో 37 లింక్‌ రోడ్ల పనుల చేపట్టామని, ఏడు లింక్‌ రోడ్లను పూర్తిచేశా మన్నారు. మిగతావి తుదిదశలో ఉన్నాయని చెప్పారు. ఉప్పల్‌, మెహిదీపట్నంలో స్కైవాక్‌లు నిర్మిస్తున్నా మన్నారు. 41 మున్సిపాలిటీల్లో రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడిరచారు. అన్ని పట్టణాల్లో టెన్‌ పాయింట్‌ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నా మన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పోస్టు ఉందన్నారు. త్వరలో 50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈడాది అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడిరచారు. హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాల్లో 142 శాతం వృద్ధి నమోదయిందన్నారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత 26 నెలల్లోనే ఇండ్ల అమ్మకాలు జరుగుతు న్నాయని చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని చెప్పారు. 2254 శానిటేషన్‌ వెహికిల్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. 103 వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు ఏర్పాటు చేశామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్‌ ఎనర్జీ ఎª`లాంట్‌ హైదరాబాద్‌లోనే ఉందన్నారు. రూ.3800 కోట్లతో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 

11.జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌..
` నిందితులను కఠినంగా శిక్షిస్తాం
` వెల్లడిరచిన హోంమంత్రి మహమూద్‌ అలీ,మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,జూన్‌ 3(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ఉన్నట్టు తెలుస్తోంది. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు గోవా వైపునకు పారిపోయినట్టు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం బెంజికారును పోలీసులు సీజ్‌ చేశారు. ఈకేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరికొందరి ప్రముఖుల కుమారుల పేర్లు తెరపైకి రావడంతో ఈకేసు సంచలనంగా మారింది. తెరాస, ఎంఐఎం నేతల కుమారులు ఉండటంతోనే పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారని భాజపా నేతలు ఆరోపిస్తుండగా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.కాగా జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. బాలికపై జరిగిన దారుణంపై వార్త చూసిగ్భ్భ్రాంతికి గురయ్యానని..ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌లను కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని సూచించారు.కాగా జూబ్లీహిల్స్‌ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ చేసిన విజ్ఞప్తిపై హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. బాలికపై అత్యాచారం జరగడం దారుణమన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఇప్పటికే డీజీపీ, హైదరాబాద్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశానన్నారు. చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని ట్విటర్‌ ద్వారా మహమూద్‌ అలీ తెలిపారు.

 

12.పేరు మార్చుకున్న టర్కీ..
` ఆమోదించిన ఐక్యరాజ్యసమితి
అంకారా,జూన్‌ 3(జనంసాక్షి):మధ్యప్రాశ్చ్య దేశమైన టర్కీ తన పేరును మార్చుకున్నది. ఇంగ్లీష్‌లో ఆ దేశాన్ని టర్కీ(ుబీతీసవవ) అని పిలుస్తారు. అయితే ఇక నుంచి తమ దేశాన్ని తుర్కై(ుఁతీసతివవ) అని పిలువాలని ఆ దేశం ఐక్యరాజ్యసమితిని కోరింది. యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌కు తుర్కై విదేశాంగ మంత్రి కవసొగ్లూ లేఖ రాశారు. టర్కీ ప్రభుత్వం పంపిన లేఖను స్వాగతిస్తున్నట్లు యూఎన్‌ తెలిపింది. అయితే పేరు మార్పు ప్రక్రియ గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. అధ్యక్షుడు రీసెప్‌ తయ్యప్‌ ఎర్డగాన్‌ నేతృత్వంలో ఆ ఉద్యమం సాగినట్లు విదేశాంగ మంత్రి వెల్లడిరచారు. దేశ బ్రాండ్‌ వాల్యూను పెంచే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవసొగ్లూ తెలిపారు. యూఎన్‌కు లెటర్‌ అందిన రోజు నుంచే కొత్త పేరును అమలులోకి తీసుకువచ్చారు. టర్కిష్‌ ప్రజల సంస్కృతి, నాగరికత, విలువలకు కొత్త పేరు ప్రత్యామ్నాయంగా ప్రతిబింబిస్తుందని గతంలో అధ్యక్షుడు ఎర్డగోన్‌ తెలిపారు.