ALL NEWS

 1.తయారీరంగానికి హైదరాబాదే అడ్డా
` పెట్టుబడిదారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
` అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం
` ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి):హైదరాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషనల్‌ సెంటర్‌ టీ`హబ్‌, టీ`సెల్‌ హైదరాబాద్‌లో ఉన్నాయని.. ఇమేజ్‌ టవర్స్‌ సైతం నగరంలో నిర్మిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు.నగరంలో ప్రపంచ స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. స్థానికంగా పెట్టుబడులు, తయారీ యూనిట్లు పెట్టేవారికోసం ఇప్పటికే వివిధ పాలసీలు తీసుకొచ్చామన్నారు. హైటెక్‌ సిటీ హుడా టెక్నో ఎన్‌క్లైవ్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌లో టాలెంట్‌ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదన్నారు. వ్యాపార విస్తరణ చేయడంతోపాటు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు జాన్సన్‌ కంట్రోల్‌ సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడులకు ఒకేఒక్క గమ్యస్థానం హైదరాబాద్‌ అని, ఇకపై దేశంలోని ఏ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జాన్సన్‌ కంట్రోల్‌ సంస్థ దశాబ్ద కాలంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నదని, హైదరాబాద్‌ ఎంతలా అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో, ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయవచ్చో ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ టీ`హబ్‌, టీ`సెల్‌ హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. ఇమేజ్‌ టవర్స్‌, ప్రపంచ స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగానికి హైదరాబాద్‌ అడ్డాగా మారబోతు న్నదని వెల్లడిరచారు. ఇక్కడ అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్‌ రెడ్డి, సెక్రటరీజయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గోన్నారు.




2.ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు
` ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
దిల్లీ,జూన్‌ 14(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) మంగళవారం ట్వీట్‌ చేసింది.అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవనరుల స్థితిగతులను సవిూక్షించిన విూదట మోదీ నుంచి ఈ కీలక ప్రకటన వచ్చింది. ‘ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మానవవనరుల స్థితిగతులను ప్రధాని మోదీ సవిూక్షించారు. అనంతరం 10 లక్షల నియామకాలపై ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం చేశారు’ అని పీఎంఓ పోస్టు పెట్టింది. దేశంలోని నిరుద్యోగ సమస్యపై విపక్షాలు తరచూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటాయి. ప్రభుత్వ రంగంలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల గురించి కేంద్రం దృష్టికి తీసుకువస్తుంటాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ నియామకాలపై తాజా ఆదేశాలు వచ్చాయి.





3.రెండో రోజూ రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ
` ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే
` కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన
` రాజకీయ ప్రయోజాల కోసమే ఈడీ కేసులు
` బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టాల్సిందే
` కుట్రలు బయటపడతాయనే భయంతోనే ఈడీతో కేసులు
` నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికతో బండారం బయట పడుతుందన్న భయం
` కాంగ్రెస్‌కు ప్రజల ఆదరణ పెరగడంతో మోడీ ద్వయం కుట్రరాజకీయాలు
` ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ ధర్నాలో రేవంత్‌,భట్టిల విమర్శలు
న్యూఢల్లీి/హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ విచారణ రెండోరోజూ కొనసాగుతోంది. రెండోరోజు ఈడీ అధికారులు రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. ముందుగా ప్రియాంకతో కలసి ఎఐసిసి ఆఫీస్‌ కు వచ్చిన రాహుల్‌... ఆ తర్వాత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ రాహుల్‌ వెంట ఉన్నారు. సీపీఆర్‌ఎఫ్‌ ఎస్కార్ట్‌ సెక్యూరిటీతో ఈడీ కార్యాలయానికి రాహుల్‌ గాంధీ వెళ్లారు .దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్య నేతలనే ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు. ఇతర కాంగ్రెస్‌ నేతలు పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. దీంతో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పార్టీ కార్యాలయంలోకి వెళ్లలేకపోయారు. పార్టీ కార్యాలయానికి ఎవరి వాహనాల్లో వారు వెళ్తున్నామని కాంగ్రెస్‌ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. మాన్‌ సింగ్‌ రోడ్‌ సర్కిల్‌ పై కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టేరు. కాంగ్రెస్‌ కార్యకర్తలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేస్తున్న కొందరు కాంగ్రెస్‌ ఎంపీలను నిర్బంధించారు ఢల్లీి పోలీసులు. ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ నేతలు హరీశ్‌ రావత్‌, రణ్‌ దీప్‌ సింగ్‌ సూర్జేవాలాను అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు దిగిన కొందరు కార్యకర్తలను  పోలీసులు ఈడ్చుకెళ్లారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి కాంగ్రెస్‌ నిరసనలు కొనసాగుతున్నాయి. రాహుల్‌ ఈడీ విచారణ దృష్ట్యా ఢల్లీిలోని లుటియన్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ జాం జరగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెంట్రల్‌ ఢల్లీి ప్రాంతంలో ఆంక్షలు విధించారు. అక్బర్‌ రోడ్‌, జన్‌ పథ్‌ రోడ్‌, అబ్దుల్‌ కలాం మార్గ్‌, పృథ్వీరాజ్‌ రోడ్‌, మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌, సునేబ్రీ బాగ్‌ మార్గాలను పోలీసులు మూసేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయ పరిసరాలు, ఈడీ ఆఫీస్‌ పరిసరాల్లో సెక్షన్‌ 144 విధించారు. అయినా మంగళవారం కూడా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేపట్టడతారని.. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ ఏఐసీసీ కార్యాలయం దగ్గరికి..  కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ముందుగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు, పలువురు నేతలు రాహుల్‌కు సంఫీుభావం తెలిపారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఆందోళన చేస్తున్న కొంతమంది కాంగ్రెస్‌ ఎంపీలను దిల్లీ పోలీసులు నిర్బంధించారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలాను సైతం అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మంగళవారం కూడా ఆందోళన కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీంతో పోలీసులు సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
రాజకీయ ప్రయోజాల కోసమే ఈడీ కేసులు
రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీతో కేసులు పెట్టిస్తున్నారని టీపీపీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.  ప్రజల దృష్టిని మరల్చేందుకే 14 ఏళ్ల తర్వాత ఈ కేసులను మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. అయితే ఈ కుట్రలను కాంగ్రెస్‌ తిప్పికొట్టి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం  చేశారు.ఈడీ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీ కాంగ్రెస్‌ హైదరాబాద్‌ ఈడీ ఆఫీస్‌ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌.. బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టి ప్రజా సమస్యలను బయటపెట్టేందుకే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను తిరిగి ప్రారంభించారని చెప్పారు. అయితే ఈ పత్రిక ద్వారా తమ కుట్రలు బయటపడతాయనే భయంతోనే ఈడీతో కేసులు పెట్టించారని రేవంత్‌ విమర్శించారు.  దేశభక్తిని పెంపొందించడానికి నేషనల్‌ హెరాల్డ్‌ ను నడిపించారని రేవంత్‌ చెప్పారు. ఉద్యోగుల జీతాల కోసం 90 కోట్ల పెట్టుబడులు పెట్టారని..లాభాల కోసం నేషనల్‌ హెరాల్డ్‌, యంగ్‌ ఇండియా సంస్థలు పనిచేయవని తెలిపారు. డబ్బులు చేతులు మారలేదు కాబట్టి ఆర్థికనేరం కింద విచారణ చేయడానికి వీల్లేదని ఈడీ గతంలోనే  చెప్పిందని..అయితే కాంగ్రెస్‌ ప్రజలకు దగ్గర అవుతుందనే ఉద్దేశ్యంతో మళ్లీ ఈడీ కేసులు పెట్టి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను వేధిస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. మోడీ, అమిత్‌ షా రాక్షసంగా వ్యవహరిస్తున్నారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి ఆరోగ్యం బాగోలోని సమయంలో రాహుల్‌ ను విచారణ పేరుతో అర్థరాత్రి వరకు ఈడీ ఆఫీసులోనే ఉంచడం మోడీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలు బీజేపీ కుట్రలను గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారే ఆ పార్టీకి తగిన సమాధానం చెప్తారని అన్నారు. దేశ చరిత్రలో ఇంత బరితెగించిన ప్రధానిని ఎప్పుడు చూడలేదని.. దేశం కోసం ప్రాణాలను ఇచ్చిన కుటుంబాలను అవమానిస్తున్నారని అన్నారు. ఇదిలావుంటే బ్యాంకులను లూటీ చేసిన నేతలంతా బిజెపిలోనే ఉన్నారనికాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలు ఆరోపించారు. రాహుల్‌ ఈడీ విచారణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సోనియా, రాహుల్‌ గాంధీలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన ఆస్తుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకునే హక్కు ట్రస్టు వాళ్లకు లేదని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.. ‘కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన చరిత్ర వాళ్లది. రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ దఅష్ట్యా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటి వారు భాజపాలో ఎవరైనా ఉన్నారా? బ్యాంకులను లూటీ చేసిన నేతలంతా బిజెపిలోనే ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసే కుట్ర జరుపుతోందని పేర్కొన్నారు. అందుకే ఈడీ కేసుల ప్రయోగమని తెలిపారు. నెహ్రూ 16, ఇందిరా 6 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారన్నారు. దేశం కోసం గాంధీల కుటుంబాన్ని త్యాగం చేశారన్నారు. మరి బీజేపీలో దేశం కోసం ఒక్కరైనా త్యాగం చేసినవారు ఉన్నారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. స్వాతంత్య ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటీష్‌కి వత్తాసు పలికిందన్నారు. గాంధీని చంపిన గాడ్సేని బీజేపీ నేత ఒకరు పార్లమెంట్‌లో గొప్పవాడు అంటున్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన నేతలంతా బీజేపీలో ఉన్నారన్నారు. వారి విూద ఈడీ ఉండదా..? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీలదన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. ముంబై ఎయిర్పోర్టును ఆదానికి అప్పగించడానికి సీబీఐని ఉపయోగించు కున్నారా? లేదా..? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకులను బీజేపీ...  సీబీఐ, ఈడీతో అణిచివేసే ప్రయత్నం చేస్తోందని పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


4.గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తం
సిద్దిపేట,జూన్‌ 14(జనంసాక్షి): జిల్లా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుడాటిపల్లి భూనిర్వాసితులు ప్రజాప్రతినిధులపై దాడికి దిగారు. లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గుడాటిపల్లి భూనిర్వాసితులు మధ్యాహ్నం నుంచి నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో తెరాస ప్రజాప్రతినిధులు, భూనిర్వాసితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలపై భూనిర్వాసితులు దాడికి దిగారు. హుస్నాబాద్‌ ఏసీపీ సతీశ్‌పైనా భూ నిర్వాసితులు దాడి చేశారు. లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పునరావాసం ప్యాకేజీ కొన్నాళ్లుగా గూడాటిపల్లి వాసులు ఆందోళన చేపట్టారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములను గుడాటిపల్లి వాసులు కోల్పోయారు. ప్యాకేజీ ఇవ్వకుండా ట్రయల్‌రన్‌ నిర్వహించవద్దని ఆందోళన చేపట్టారు. పోలీసులు, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది.


5.ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ హామీ ఏమైంది?
` ఈ ప్రభుత్వం నకిలీ కాదు.. మహా నకిలీ
` కేంద్రంపై రాహుల్‌ విమర్శలు
దిల్లీ,జూన్‌ 14(జనంసాక్షి): రాబోయే ఏడాదిన్నర కాలంలో 10లక్షల ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించినట్టు పీఎంవో చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు.ఎనిమిదేళ్ల క్రితం యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హావిూ ఇచ్చారనీ.. అలాగే ఇప్పుడు 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాల వంతు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ప్రభుత్వం నకిలీ కాదు.. మహా నకిలీ అంటూ విమర్శించారు. ప్రధాని ఉద్యోగాలు సృష్టించడంలో కాదు.. ఉద్యోగాలపై వార్తలు తయారుచేయడంలో నిపుణులంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ చేయాలని మోదీ ఈరోజు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.మరోవైపు, ఇదే అంశంపై భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా స్పందించారు. కొత్తగా 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నందుకు కృతజ్ఞతలు చెబుతూనే గతంలో కేంద్రం ఇచ్చిన హావిూల సంగతేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ.. ‘నిరుద్యోగ యువత ఆవేదనను అర్థం చేసుకున్నందుకు ప్రధాని మోదీకి థాంక్స్‌. కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు మంజూరై, ఖాళీగా ఉన్న కోటికిపైగా ఖాళీలను భర్తీ చేయాలి. అందుకోసం తగిన ప్రయత్నాలు చేయాలి. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హావిూని నిలబెట్టుకునేందుకు సత్వర చర్యలు చేపట్టాలి’’ అని సూచించారు.


6.మోదీ అదికార దుర్వినియోగం
` అదానీ పవర్‌ ప్రాజెక్టుకోసం శ్రీలంకపై ఒత్తిడి
` వెల్లడిరచిన శ్రీలంక సీఈబీ ఛైర్మన్‌ ఎం.ఎం.సి.ఫెర్డినాండ్‌
` అనంతరం రాజీనామా
` అయినా అదానీ విద్యుత్‌  ప్రాజెక్టుపై సద్దుమణగని వివాదం
దిల్లీ,జూన్‌ 14(జనంసాక్షి):  శ్రీలంకలో ఓ పవన విద్యుత్‌ ప్రాజెక్టును భారత పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి చెందిన సంస్థకు ఇప్పించేందుకు ప్రధాని మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసిన సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు(సీఈబీ) ఛైర్మన్‌ ఎం.ఎం.సి.ఫెర్డినాండ్‌ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. మోదీని ఉద్దేశించి పార్లమెంటరీ కమిటీ ముందు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించిన మరుసటిరోజే ఆయన పదవి నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొనడం గమనార్హం. కమిటీ సభ్యులు కొందరు అడిగిన ప్రశ్నలకు భావోద్వేగానికి లోనై..మోదీ ఒత్తిడి తెచ్చారన్న వ్యాఖ్యలు చేశానని ఆదివారం ఫెర్డినాండ్‌ వివరణ ఇచ్చారు. ఫెర్డినాండ్‌ ప్రకటన తర్వాత అధ్యక్షుడు గొటబాయ కార్యాలయం కూడా.. విద్యుత్‌ ప్రాజెక్టు కేటాయింపు విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడీ లేదని ట్వీట్‌ చేసింది. భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ మొత్తం వివాదంపై అదానీ గ్రూప్‌ నిరాశ వ్యక్తం చేసింది. ‘‘మేం నిరాశకు గురయ్యాం. వాస్తవమేంటంటే ఈ విషయాన్ని ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం అంతర్గతంగా పరిష్కరించింది’’ అని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.మన్నార్లోని 500 మెగావాట్ల పవన్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును అదానీ గ్రూప్నకు కట్టబెట్టిన విషయంలో శుక్రవారం పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన ఫెర్డినాండ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది. అధ్యక్షుడు గొటబాయను నవంబర్లో తాను కలిశానని, ఆ సందర్భంగా ప్రాజెక్టును అదానీ గ్రూప్నకు ఇవ్వాలని తనపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు అధ్యక్షుడు తనతో చెప్పారని కమిటీ ముందు సీఈబీ ఛైర్మన్‌ పేర్కొన్నారు. శ్రీలంక ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అదానీ గ్రూప్‌ కోసమే.. విద్యుత్‌ ప్రాజెక్టుల్లో పోటీ బిడ్డింగ్‌ నిబంధనను తొలగిస్తూ పార్లమెంట్లో ఇటీవల ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని ఆరోపించాయి. అదానీ గ్రూప్‌.. శ్రీలంకలో మన్నార్‌ ప్రాజెక్టుతో పాటు, జాఫ్నాలోని పునిరయన్‌ పవన్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును గత ఏడాది డిసెంబరులో సొంతం చేసుకుంది. దీంతో పాటు.. కీలకమైన కొలంబోలో వెస్టర్న్‌ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రాజెక్టు కూడా చేస్తోంది.




7.గ్రూప్‌ అక్టోబర్‌ 16న గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌..
` ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
హైదరాబాద్‌,జూన్‌ 14(జనంసాక్షి): గ్రూప్‌`1 పోస్టుల భర్తీలో భాగంగా టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రిలిమ్స్‌ను అక్టోబర్‌ 16న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మంగళవారం టీఎస్‌పీఎస్సీ పాలకవర్గం సమావేశమై ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ తేదీని ఖరారు చేసింది. అక్టోబర్‌ 16న గ్రూప్‌`1 ప్రాథమిక పరీక్షను నిర్వహించనుండగా.. మెయిన్స్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.వాస్తవానికి మొదట ప్రిలిమ్స్‌ పరీక్షను జూలై లేదా ఆగస్ట్‌లో నిర్వహించాలని నిర్ణయించామని, అభ్యర్థుల సూచన మేరకు విజ్ఞప్తుల మేరకు ప్రిలిమ్స్‌ను అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించిందని, పరీక్ష కేంద్రాల వివరాలు, హాల్‌ టికెట్‌ నిర్ణీత సమయంలో టీఎస్‌పీఎస్సీ వైబ్‌సైట్‌ లిలిలి.బిబజూబఞ.ణనీల.తినిలో అప్‌డేట్‌ చేయనున్నట్లు వివరించింది. 503 పోస్టులకు ఈ ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్‌`1 పోస్టులకు 3,80,202 దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


8.ఓర్వలేకనే తెలంగాణ అభివృద్దికి అడ్డంకులు
` హక్కుగా రావాల్సిన నిధులను నిలిపివేసారు
` బిజెపినేతలు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు
` మంత్రి హరీష్‌ రావు
సిద్దిపేట,జూన్‌ 14(జనంసాక్షి):తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకే కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కావాలనే నిలిపివేసిందని చెప్పారు. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్‌ లో తిరుగుతున్నారని హరీష్‌ రావు మండిపడ్డారు. ఉపాధి హావిూని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ముందుగా ఆ పని చేసుకొచ్చి ముఖం చూపిస్తే బాగుంటుందని బీజేపీ నేతలకు చురకలంటించారు. వ్యవసాయ బావుల వద్ద మోటార్లు పెడితే రాష్టాన్రికి రూ.25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని, కానీ సీఎం కేసీఆర్‌ అందుకు ఒప్పుకోలేదన్నారు. ఎఫ్‌సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్టాన్రికి ఇవ్వాల్సిన పెండిరగ్‌ నిధులను విడుదల చేయకుండా బీజేపీ ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం తిరగబడుతుందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. వరంగల్‌ లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని బీజేపీ నిలిపివేసిందన్నారు. వరంగల్‌ కు రావాల్సిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌ కు తీసుకెళ్లారని ఆరోపించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. చాలాసార్లు దరఖాస్తులు పెట్టినా..మెడికల్‌ కళాశాలలు, నవోదయ పాఠశాలలు తెలంగాణ రాష్టాన్రికి మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్‌ రావు హాజరయ్యారు. తెలంగాణ విద్యార్థి, ఉద్యమ నాయకుడైన మాదాసు శ్రీనివాస్‌ గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గా నియమితులయ్యారు. ఆయనతో పాటు కార్యవర్గ సభ్యులు మంత్రి హరీష్‌ రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది అన్నారు. సీఎం కేసీఆర్‌ కూడా మాదాసు శ్రీనివాస్‌ కు పదవి ఇస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు.




10 లక్షల ఉద్యోగాలు సరే..
మంజూరై, ఖాళీగా ఉన్న కోటికిపైగా ఖాళీల మాటేంటి?
` వాటి భర్తీ కోసం తగిన ప్రయత్నాలు చేయాలి
` భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ
దిల్లీ,జూన్‌ 14(జనంసాక్షి): ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసే నిమిత్తం మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 18 నెలల్లో 10 లక్షల పోస్టులను యుద్ధ ప్రాతిపదికన నింపాలని దిశానిర్దేశం చేశారు.దీనిపై భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ స్పందించారు. కృతజ్ఞతలు చెప్తూనే.. కేంద్రం చేసిన హావిూలను మరోసారి గుర్తుచేశారు.’నిరుద్యోగ యువత బాధను అర్థం చేసుకున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞలు. కొత్త ఉద్యోగాల కల్పనతో పాటుగా, మంజూరై, ఖాళీగా ఉన్న కోటికిపైగా ఖాళీలను భర్తీ చేయాలి. అందుకోసం తగిన ప్రయత్నాలు చేయాలి. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హావిూని నిలబెట్టుకునేందుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.వరుణ్‌ గాంధీ కమలం పార్టీకి చెందినవాడే అయినప్పటికీ.. ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. కొత్త సాగు చట్టాలు, లఖింపుర్‌ ఖేరి ఘటన, బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణ.. ఇలా సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తుంటారు. ఇటీవల కూడా నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీలను వెల్లడిస్తూ.. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్‌ ఎక్కడికి పోయిందంటూ ప్రశ్నించారు. మూడు దశాబ్దాల్లోనే నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరుకున్న వేళ.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో 60 లక్షల మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

11.సైన్యంలో కొత్తగా అగ్నిపథ్‌ పథకం
` నాలుగేళ్ల స్వల్పకాలిక ఉద్యోగం
` సైన్యం ఎంపికలతో అమలుకు శ్రీకారం
న్యూఢల్లీి,జూన్‌ 14(జనంసాక్షి): నాలుగేళ్ల కాలపరిమితితో సైన్యంలో పనిచేసే సరికొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. అగ్నిపథ్‌ పేరుతో ఈ సర్వీసును ప్రారంభించింది.  త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవచేయాలనుకునే యువతకు కేంద్రం చక్కని అవకాశం కల్పించింది. సాయుధ బాలగాల నియామక పక్రియలో నూతన విధానం తీసుకొచ్చింది. నాలుగేళ్ల కాలపరిమితితో సైన్యంలో పనిచేసేలా ’అగ్నిపథ్‌’ పేరుతో సర్వీసును ప్రారంభించింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ ఉపసంఘం ఆమోదం తర్వాత కీలక విధానంపై నిర్ణయం తీసుకున్నట్లు రాజనాథ్‌ సింగ్‌ వెల్లడిరచారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన ’అగ్నివీరుల’కు మంచి వేతనం లభిస్తుందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్‌ ప్యాకేజ్‌ సైతం అందుతుందని చెప్పారు.అధికారులు, సైనికుల విభాగాల్లో అగ్నిపథ్‌ సర్వీసును ప్రారంభించాలని మూడేళ్ల క్రితమే ఆర్మీ వర్గాలు భావించాయి. అయితే, రెండేళ్లుగా కరోనా కారణంగా ఇవేవీ అమలుకు నోచలేదు. తాజాగా సైనికుల విభాగం వరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా ఆర్మీలో వేతనాలు, పింఛన్ల భారం తగ్గించవచ్చని భావిస్తోంది. మిగులు నిధులతో ఆర్మీ ఆధునికీకరణకు వెసులుబాటు లభించనుంది. తక్కువ కాలపరిమితి(షార్ట్‌) సర్వీసు కమిషన్‌ కింద యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్లలో సగటు వయసు 35`36 ఏళ్ల నుంచి 25`26 ఏళ్లకు తగ్గనుంది.


12.విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై నేడు మమత చర్చలు
తాను రాష్ట్రపతి ఎన్నికల బరిలో లేనంటూ పవార్‌ స్పష్టీకరణ
న్యూఢల్లీి/ముంబై,జూన్‌ 14(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు బుధవారం ఢల్లీిలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ప్రతిపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. వివిద పార్టీల నేతలు. సిఎంలతో మాఎ ఢల్లీిలో బుధశారం చర్చించనున్నారు. అయితే ఇదే సమయంలో  తాను రాష్ట్రపతి రేసులో లేనని మరాఠా నేత శరద్‌ పవర్‌ స్పష్టం చేశారు. దేశంలోని అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకులలో ఒకరైన పవార్‌, గత కొన్ని దశాబ్దాలుగా అనేక సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో, విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈక్రమంలోరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై శరద్‌ పవార్‌ క్లారిటీ ఇచ్చారు. తాను రాష్ట్రపతి రేసులో లేనని చెప్పారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల అభ్యర్థిగా శరద్‌ పవార్‌ ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి లేదని చెప్పారు. ఈ విషయంపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన శరద్‌ పవార్‌.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాష్ట్రపతి రేస్‌ నుంచి పవార్‌ వెనక్కి తగ్గడంతో విపక్షాలు డైలమాలో పడ్డాయి. ఓడిపోయే పోరులో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పలువురు విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. భారత రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దింపాలనే ప్రతిపాదనను శరద్‌ పవార్‌ తిరస్కరించారని ఎన్సీపీ పార్టీ వర్గాల ద్వారా కూడా తెలిసింది. సోమవారం రాత్రి ముంబై నగరంలో జరిగిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) సమావేశంలో శరద్‌ పవార్‌ మాట్లాడారని సమాచారం. నేను రాష్ట్రపతి పదవి కోసం రేసులో లేను, రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని కాను అని శరద్‌ పవార్‌ స్పష్టంగా చెప్పారు.81 ఏళ్ల కేంద్ర మాజీ మంత్రి అయిన శరద్‌ పవార్‌ అధికారికంగా తన తిరస్కరణను కాంగ్రెస్‌ పార్టీకి తెలియ జేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు అవసరమైన మెజారిటీని సాధించగలవనే నమ్మకం శరద్‌ పవార్‌కు లేదని ఎన్సీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోయే పోరులో పోటీచేయడానికి శరద్‌ పవార్‌ మొగ్గుచూపడం లేదని ఆయన పార్టీ వర్గీయులు అంటున్నారు. మహారాష్ట్రలో ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు దెబ్బతిన్నాయి. శివసేనకు చెందిన సంజయ్‌ పవార్‌ ను ఓడిరచి బీజేపీ రాజ్యసభ సీటు సాధించింది. శివసేన అభ్యర్థికి మద్ధతు ఇస్తామని వాగ్దానం చేసిన పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థిని ఎన్నుకున్నారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ మిత్రపక్షాలైన కాంగ్రెస్‌, శివసేన పార్టీలు రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఏకాభిప్రాయ అభ్యర్థిగా శరద్‌ పవార్‌ కావాలని కోరుకుం టున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే సోనియాగాంధీ సందేశంతో ఇటీవల ముంబైలో పవార్‌ ను కలిసి మాట్లాడారు. ఆమ్‌ ఆద్మీపార్టీ నేత సంజయ్‌ సింగ్‌ కూడా తాజాగా ఎన్సీపీ నేతకు ఫోన్‌ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై మల్లికార్జున్‌ ఖర్గే శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లతో కూడా మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో శివసేనకు చెందిన సంజయ్‌ పవార్‌ ను ఓడిరచి బీజేపీ గట్టి షాక్‌ ఇచ్చింది. స్వతంత్య ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతు ఇస్తామని వాగ్దానం చేసి..చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థికి మద్ధతు తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకుంది.



15.ఒక్కరోజే.. దిల్లీలో 82శాతం, ముంబయిలో 54శాతం పెరుగుదల
దేశవ్యాప్తంగా 50వేలు దాటిన యాక్టివ్‌ కేసులు
దిల్లీ,జూన్‌ 14(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది.ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో నగరంలో నిన్న 614 కేసులు వెలుగు చూడగా.. నేడు ఏకంగా 1118 కేసులు బయటపడ్డాయి. కొవిడ్‌ కేసుల్లో ఒకే రోజులో 82శాతం పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివిటీ రేటు 6.5శాతానికి చేరడం ఆందోళన కలిగించే విషయం. నేడు మరో ఇద్దరు కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 26,223కు చేరింది.గత కొన్నిరోజులుగా దిల్లీ, ముంబయి నగరాల్లో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో క్రియాశీల కేసుల (ంఞబితిలవ అజీబవబ) సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దిల్లీలో యాక్టివ్‌ కేసులు 3177కి చేరిపోగా.. ముంబయిలోనూ 15వేల కేసులు రికార్డయ్యాయి. గడిచిన పది రోజుల్లో మహారాష్ట్ర కొవిడ్‌ కేసుల్లో 241శాతం పెరుగుదల నమోదైంది.కొవిడ్‌ విజృంభణతో వణుకుతోన్న ముంబయి నగరంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1724 కేసులు రికార్డయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 54శాతం కేసులు పెరిగాయి. నగరంలో మొత్తం 11వేల కొవిడ్‌ టెస్టులు (అనీలతిట ువబబి) నిర్వహించగా.. వాటిలో 1724 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఃఓఅ) అధికారులు వెల్లడిరచారు. కొవిడ్‌ బాధితుల్లో నేడు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కొవిడ్‌ బాధితుల రికవరీ రేటు 97శాతంగా ఉందని చెప్పారు.ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే, గత మూడురోజులుగా నిత్యం 8వేల కేసులు నమోదవుతుండగా నేడు కొత్తగా 6వేల కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దీంతో ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య 50వేలు దాటిందని పేర్కొంది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.





17.వాయు కాలుష్యంతో.. భారతీయుల్లో తగ్గుతున్న ఐదేళ్ల జీవితకాలం
యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం
దిల్లీవాసుల పదేళ్ల ఆయుర్దాయం తగ్గుతోందన్న తాజా నివేదిక
దిల్లీ, జూన్‌ 14(జనంసాక్షి):వాయుకాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో రానున్న రోజుల్లో ప్రజా ఆరోగ్యానికి ఇది పెను ముప్పుగా పరిణమించనుందని తాజా అధ్యయనం వెల్లడిరచింది. ఈ విషపూరితమైన కాలుష్యం భారత ప్రజల్లో ఐదేళ్ల జీవితకాలాన్ని తగ్గిస్తోందని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం పేర్కొంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం కాలుష్యం కారణంగా మానవ జీవితకాలం పదేళ్లు తగ్గిపోతున్నట్లు అంచనా వేసింది. ఇక దేశంలో అత్యంత కాలుష్య రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, హరియాణా, త్రిపుర రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయని ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ నివేదిక తెలిపింది.దక్షిణాసియా దేశాలు తీవ్ర కాలుష్య భూతాన్ని ఎదుర్కొంటున్నాయని తాజా నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లు అగ్ర స్థానాల్లో ఉన్నట్లు వెల్లడిరచింది. తొలిస్థానంలో బంగ్లాదేశ్‌ ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది. కేవలం కాలుష్యం కారణంగా బంగ్లాదేశ్‌లో 2020లో ప్రజల జీవనకాలం 6.9 సంవత్సరాలు తగ్గిపోయింది. ప్రపంచ సగటు 2.2 ఏళ్లతో పోలిస్తే భారత్‌లో ఐదేళ్ల జీవితకాలం తగ్గిపోనుంది. ఇక భారత్‌ పొరుగు దేశాలైన నేపాల్‌, పాకిస్థాన్‌లు కూడా కాలుష్యంతో అల్లాడిపోతున్నాయి. వీటివల్ల నేపాల్‌లో 4.1 సంవత్సరాలు, పాకిస్థాన్‌లో 3.8ఏళ్ల జీవిత కాలం తగ్గుతోంది. ఇక చైనా విషయానికొస్తే.. కాలుష్యం వల్ల 2.5ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నప్పటికీ 2013 నుంచి అక్కడ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల కాలం పుంజుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది.ఇక భారత్‌లో పొగ పీల్చడం కంటే వాయుకాలుష్యమే (ంతితీ ఖనీశ్రీశ్రీబీబితినీని) అత్యంత ప్రాణాంతకంగా మారుతోందని తాజా నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా చిన్నారులు, పోషకాహారలోపంతో బాధపడుతోన్న వారికి 1.8 ఏళ్ల జీవిత కాలాన్ని తగ్గిస్తోంది. ఈ కాలుష్య తీవ్రత ఇదేవిధంగా కొనసాగితే గంగా, బ్రహ్మపుత్ర, సింధూ నదుల పరివాహక ప్రాంతాల్లో నివసించే దాదాపు యాభై కోట్ల ప్రజల ఆయుర్దాయం 7.6 సంవత్సరాలు తగ్గిపోనుందని తాజా నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా లఖ్‌నవూ ప్రజలు 9.5ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించింది.గడిచిన రెండు దశాబ్దాల్లో వాహనాల రద్దీ, బొగ్గు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయి. వీటికితోడు పంటల వ్యర్థాలు కాల్చడం, ఇటుక బట్టీలతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో దేశంలో వాయుకాలుష్యం భారీగా పెరుగుతోంది. దీంతో గాలిలో అత్యంత ప్రమాదకరమైన పీఎం2.5 స్థాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 2013`2020 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వాయుకాలుష్యంలో 44శాతం భారత్‌ నుంచే ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ (ంఖిఒఎ) డైరెక్టర్‌ డాక్టర్‌ క్రిస్టా హాసెన్‌కోఫ్‌ పేర్కొన్నారు.

వాలీబాల్‌ క్రీడాకారిణికి మంత్రి నిరంజన్‌రెడ్డి సన్మానం
` డబల్‌ బెడ్రూం ఇళ్లు, రూ.లక్ష సాయం అందజేత
హైదరాబాద్‌(జనంసాక్షి): అండర్‌ 18 వాలీబాల్‌లో భారత జట్టుకు తెలంగాణకు చెందిన శాంతాకుమారి ఎంపికైంది.ఆమె స్వగ్రామం వనపర్తి మండలం చిట్యాల తూర్పుతండా.క్రీడలలో వనపర్తి పేరును నిలబెడుతున్న శాంతాకుమారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌ 6 నుంచి 13 తేదీలలో థాయిలాండ్‌ లో జరిగిన 14వ ఆసియా మహిళల అండర్‌ 18 చాంపియన్‌ షిప్‌ లో భారతజట్టులో ప్రాతినిధ్యం వహించింది.బాలానగర్‌ గురుకుల పాఠశాలలో చదువుకుని జాతీయ జట్టుకు ఎంపికయిన తొలిబాలిక శాంతాకుమారి.ఈ సందర్భంగా హైదరాబాద్‌ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శాంతాకుమారిని సన్మానించి రూ.లక్ష చెక్కు అందజేశారు.కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు