ALL NEWS

 

1.కీలకవడ్డీరేట్లు పెంపు
` సామాన్యుడి నడ్డీ విరిచే నిర్ణయం
` ఈఎంఐలు ఇక మరింత భారం
` మరో 50 బేసిన్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం
` రెపో రేటు 4.9 శాతానికి పెరుగుదల
` గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం
` ద్రవ్యోల్బణం కట్టడికే అన్న గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌
న్యూఢల్లీి,జూన్‌ 8(జనంసాక్షి): రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. తాజాగా మరో 50 బేసిన్‌ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4.9 శాతానికి పెరిగింది. కాగా మేలో 40 బేసిన్‌ పాయింట్లు పెంచిన సంగతి విదితమే. సోమవారం ప్రారంభమైన ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులు తాజా రేట్ల పెంపుకు అనుకూలంగా ఓటు వేశారు. మూడు రోజుల పాటు సమావేశమైన చేసిన నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడిరచారు. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రెపోరేటు పెంచుతున్నట్లు ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుంది. కాగా, ఆగస్టులో సమావేశంలో కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో8 సంవత్సరాల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. ఏప్రిల్‌లో ఆర్‌బిఐ అంచనా వేసిన ద్రవ్యోల్బణం 5.7 శాతం కన్నా అధికంగా 6.7 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంచినట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ కీలక వడ్డీ రేట్ల పెరుగుదలతో పర్సనల్‌ లోన్స్‌, గృహ వినియోగ దారులపై ఇఎంఐ భారం పడనుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడిరచారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 4.4 నుంచి 4.9 శాతానికి పెరిగింది. పెంచిన వడ్డీరేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని శక్తికాంత దాస్‌ చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. ఏప్రిల్‌, మే నెలల్లో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఏప్రిల్‌లో అంచనా వేసిన 5.7 శాతానికి అధికం కావడం గమనార్హం. టమాట ధరలు పెరగడం వల్ల ఆహార ధరల ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశం ఉందని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు సైతం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయని అన్నారు. సాధారణ వర్షపాతం వల్ల ఖరీఫ్‌ సీజన్‌కు మేలు జరుగుతుందన్న ఆయన.. ఈ ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అంచనా వేశారు. మరోవైపు, జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌ విసురుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం వల్లే సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగిందని వివరించారు. అయితే, పట్టణప్రాంతాల్లో డిమాండ్‌ పెరుగుదల నేపథ్యంలో జీడీపీ అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా ద్రవ్య విధాన వైఖరిని క్రమక్రమంగా కఠినతరం చేయనున్నట్లు ఆర్‌బీఐ ఇదివరకే సంకేతాలిచ్చింది. తాజాగా ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది. ఇలా క్రమంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్‌బీఐ రెపో రేటును 5.6 శాతానికి చేరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. పరపతి విధాన నిర్ణయాలకు ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.79 శాతానికి చేరింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి. ఈ నేపథ్యంలో కీలక రేట్ల పెంపు ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని మార్కెట్‌ నిపుణులు ముందే వ్యక్తం చేశారు. అయితే ద్రవ్యోల్బణం పెరగడానికి కమొడిటీలు, ముడి చమురు ధరలే కారణం. రష్యా` ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు ఇందుకు అధిక కారణమన్నది గమనార్హం. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 13 నెలలుగా రెండంకెల స్థాయిల్లో నమోదవుతూ, ఏప్రిల్‌లో రికార్డు గరిష్ఠమైన 15.08 శాతాన్ని చేరింది. ఇవన్నీ రేట్ల పెంపునకు దారితీసిన అంశాలే. 2022లో ఇప్పటివరకు అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో 45 దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచాయి. తాజాగా ఆస్టేల్రియా బ్యాంకు మంగళవారం వడ్డీరేట్లను 2 శాతం మేర పెంచింది.

 

2.భారతీయభాష ఉర్ధూను కాపాడుకుందాం
` ఉర్దూ జర్నలిజం ఉత్సవాల్నిఘనంగా నిర్వహిద్దాం
` రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ
హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా ఘన చరిత్ర కలిగి ఉన్న ఉర్దూ జర్నలిజానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.తెలంగాణ ఉర్దూ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై ఇవ్వాళ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ లోని మంత్రి నివాసంలో ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో మహమూద్‌ అలీ మాట్లాడారు. దేశంలో ఉర్దూ జర్నలిజం 200 ఏళ్ళు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్‌ లో టీయూడబ్ల్యూజేఎఫ్‌ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఉర్దూ భాష పై ఉన్న పట్టు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ ఉత్సవాలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆయన హావిూ ఇచ్చారు. రెండు రోజుల పాటు రవీంద్రభారతీలో ఈ ఉత్సవాలను నిర్వహించే విషయంలో తాను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. వెంటనే ఉత్సవాల సన్నాహక కమిటీని నియమించు కోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ విూడియా అకాడవిూ ఛైర్మెన్‌ అల్లం నారాయణ, ఇంటర్‌ విూడియట్‌ బోర్డు కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్‌ అలీ, ప్రముఖ ఉర్దూ విద్యావేత్త, ప్రొఫెసర్‌ ఎస్‌.ఏ.శుకుర్‌, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అతీఖ్‌ అహ్మద్‌, ఫ్యాప్సి మాజీ అధ్యక్షులు అనీల్‌ రెడ్డి, టీయుడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ఏ.మాజీద్‌, గౌస్‌, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఫైసల్‌ అహ్మద్‌, హాబీబ్‌ జిలానీ తదితరులు పాల్గొన్నారు.

పిల్లలు చేసే తప్పులకు పెద్దలదే బాధ్యత
` హోం మంత్రి మహమూద్‌ అలీ
హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి):పిల్లలు తప్పుదారి పడుతున్నారని, తల్లిదండ్రులే వారిని దారిలో పెట్టాలని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ కోరారు.జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని ప్రతిపక్షాలకు మహమూద్‌ అలీ హితవు పలికారు. ఈనెల 20 నుంచి హజ్‌ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.’’కాలం మారింది. ప్రజల చేతిలోకి ఫోన్లు, వాట్సాప్‌లు వచ్చాయి. పిల్లలు పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. అందరు తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. విూ అబ్బాయి, అమ్మాయిలపై కొంచెం దృష్టిపెట్టండి. వారిని అలా వదిలిపెట్టకండి. స్వేచ్ఛగా వదిలేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. విూ పిల్లల్ని నియంత్రణలో ఉంచండి’’ అని పేర్కొన్నారు.కాగా సంచలనం రేపిన జూబ్లీల్స్‌ మైనర్‌ బాలక రేప్‌ ఘటనకు సంబంధించి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. నిందితులు ఎవరైనా సరే తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మరోసారి రుజువైందన్నారు.పోలీసులు ఈ కేసును నిష్పక్ష పాతంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. పోలీసులపై ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణ పోలీసులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారనేదానికి కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేయడం అందుకు నిదర్సనమని అన్నారు. తమను బ్లేమ్‌ చేసేందుకు కొన్ని రాజకీయంగా శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్‌ వన్‌ ఇతర స్టేట్‌ పోలీసులకు ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించండి పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వహించాలి.టెక్నాలజీ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో పరివర్తనలో మార్పు వచ్చిందన్నారు. పేరెంట్స్‌ తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మైనర్‌ బాలిక అత్యాచారం వ్యవహారంలో తన మనవడిపై అనవసర ఆరోపణలు చేశారని, అసలు నిందితులు అరెస్ట్‌ కావడంతో తన మనవడిపై ఆరోపణలు తప్పని తేలిందని మహమూద్‌ అలీ అన్నారు. జూబ్లీ హిల్స్‌ మైనర్‌ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రిమహమూద్‌ అలీ మాట్లాడుతూ... వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగినందున చైర్మన్‌ తొలగింపు కూడా బోర్డు పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పై కేసు వేరు... రాజకీయా సంబంధాలు వేరు అని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. సెల్‌ ఫోన్ల వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రుల పిల్లల విషయంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఘటనకు సంబంధించి చట్టపరిధిలో పోలీసులు తమ పని తాము చేసుకుంటారని మంత్రి పేర్కొన్నారు.

 

3.నోమాస్క్‌.. నో జర్నీ..
` విమాన ప్రయాణానికి కఠిన నిర్ణయాలు
` పెరుగుతున్న కేసులతో డీజీసీఏ ఆదేశాలు
న్యూఢల్లీి,జూన్‌ 8(జనంసాక్షి): కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్‌ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌ లేని ప్రయాణికులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్‌ ధరించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మాస్క్‌ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి అనుమతించొద్దని సూచించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సీఐఎస్‌ఎఫ్‌కు తాజాగా మార్గదర్శకాలు పంపింది. కొవిడ్‌ భద్రతా చర్యలను పాటించేందుకు నిరాకరించే విమాన ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవలే ఢల్లీి హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం ముగియలేదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు కోర్టు ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం చర్య తీసుకోవాలని ఆదేశించిన విషయం విదితమే.దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం 3714 కేసులు నమోదవగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 5,233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది డిశ్చార్జీ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1881 కేసులు ఉన్నాయి. ఇందులో 1242 కేసులు ముంబైకి చెందినవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక కేరళలో 1494, ఢల్లీిలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో 227 కేసులు ఉన్నాయి.

 

4.ఢల్లీి మెట్రోస్టేషన్‌లో పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం
` 90వాహనాలు అగ్నికి ఆహుతి
దిల్లీ,జూన్‌ 8(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగ్నేయ దిల్లీ జామియానగర్‌ మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 90 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని 11 ఫైరింజన్ల సాయంతో అతి కష్టం విూద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడిరచారు. ఈ భారీ ప్రమాదంలో మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌లో ఉన్న 10 కార్లు, ఓ బైక్‌, రెండు స్కూటర్లు, 30 కొత్త ఈ`రిక్షాలు, 50 పాత ఈ`రిక్షాలతో సహా పలు వాహనాలు మంటల్లో దగ్ధమైనట్లు దిల్లీ ఫైర్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ వెల్లడిరచారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

5.ఈడీ విచారణకు వస్తాం..కాస్త గడువు ఇవ్వండి:సోనియా
దిల్లీ,జూన్‌ 8(జనంసాక్షి): ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పత్రిక అవినీతి కేసులో కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇఆ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.దీనిలో భాగంగా ఇవాళ (జూన్‌ 8న) ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా.. జూన్‌ 2న ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో విచారణకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావడానికి సోనియా మూడు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈడీ త్వరలో కొత్త తేదీలతో సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.కాగా.. సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌ తేలడంతో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ రాలేదని సమాచారం. కొవిడ్‌ నెగిటివ్‌ వచ్చిన తర్వాతే వైద్యుల సూచనల మేరకు ఆమె బయటకు వస్తారని తెలుస్తోంది. మరోవైపు ఇదే కేసులో రాహుల్‌ గాంధీకి కూడా ఈడీ నోటీసులు పంపింది. ఆయన మాత్రం జూన్‌ 13న ఈడీ ముందు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి.

 

6.కాసింత పెరిగిన మద్ధతు ధరలు
దిల్లీ,జూన్‌ 8(జనంసాక్షి): అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022`23 ఖరీఫ్‌ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 పంటలకు మద్దతు ధరను పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విూడియాకు వెల్లడిరచారు.సాధారణ వరి క్వింటాల్‌ కనీస మద్దతు ధరను రూ.100 పెంచారు. దీంతో క్వింటాల్‌ ధర రూ.2,040కి చేరింది.నువ్వుల కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ. 523 పెరిగింది.పెసర్లపై రూ.480 (క్వింటాల్‌కు) ఎంఎస్‌పీ పెంచారు.పొద్దుతిరుగుడు విత్తనాల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.385 పెరిగింది.మినుములపై మద్దతు ధర క్వింటాల్‌కు రూ.300 పెంచారు.మధ్య రకం పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ.354 పెరిగింది.సోయాబీన్‌ మద్దతు ధరను క్వింటాల్‌పై రూ.350 పెంచారు. కందుల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.300 పెంచారు. హైబ్రీడ్‌ జొన్నల మద్దతు ధర క్వింటాల్‌పై రూ.232 పెరిగింది.సజ్జల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.100 పెరిగింది.మొక్కజొన్న మద్దతు ధరను క్వింటాల్‌పై రూ.92 పెంచారు.

 

7.నిధులు గుజరాత్‌కు.. ఉత్తిమాటలు హైదరాబాద్‌కా!
` శతాబ్దకాలంలో భారీ వరదలొస్తే హైదరాబాద్‌కు పైసా సాయం చేయలేదు
` కార్పొరేటర్లకు తీయని మాటలు చెప్పి పంపారు
` మోడీ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి): తెలంగాణలోని వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలకాలని ప్రధాని మోదీ చేసిన ట్విట్‌కు మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పుకునే విూరు.. వరదలు వచ్చినప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు మాటలు, నిధులు మాత్రం గుజరాత్‌కు అంటూ ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పుకునే ప్రధాని వరదలు వచ్చినప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. మూసి నది ప్రక్షాళనకు, మెట్రో రైలు పొడిగింపునకు, రాష్టాన్రికి ఐటీఐఆర్‌ ప్రాజెక్టు విషయాలపై పురోగతి ఏంటో చెప్పాలని ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రధాని చేసిన ట్వీట్‌కు ఈ మేరకు కేటీఆర్‌ బదులు ఇచ్చారు. అంతకుముందు హైదరాబాద్‌ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భేటి అనంతరం తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రధాని, తెలంగాణలోని వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలకాలని ట్వీట్‌ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన కేటీఆర్‌ సమాజ సేవకు ప్రయత్నాలేమైనా ఉన్నాయా అంటూ ప్రధానిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. విూరు నడుపుతుంది ప్రభుత్వాన్నా లేదా స్వచ్ఛంద సంస్థనా ప్రశ్నించారు.

(కేంద్ర మంత్రి రాజీవ్‌తో కెటిఆర్‌ భేటీ
న్యూఢల్లీి,జూన్‌ 8(జనంసాక్షి): కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్టాన్రిక్స్‌, టెక్నాలజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. భారత ఎలక్టాన్రిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలో ఉన్న అభివృద్ధి అవకాశాలపై కేంద్ర మంత్రితో కేటీఆర్‌ చర్చించారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌ వెంట ఎంపీలు నామా నాగేశ్వర్‌ రావు, సురేశ్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.)

 

8.రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌
` గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం
` ఈనెల 10న మహిళా దర్బార్‌ నిర్వహణ
హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి): తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో ప్రజా దర్బర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజా దర్బార్‌లో భాగంగా మహిళా దర్బార్‌తో శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 10న శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. గవర్నర్‌ తమిళిసై జూన్‌ 10న మహిళా దర్బార్‌ నిర్వహించనున్నారు. తాను ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో భాగంగా దీన్ని శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్‌ భవన్‌ లో నిర్వహించనున్నారు. గవర్నర్‌ను వచ్చి కలవాలనుకునే మహిళలు 040 ` 23310521కు కాల్‌ చేయడం ద్వారా లేదా ఈమెయిల్‌ చేయడం ద్వారా అపాయింట్‌మెంట్‌ పొందొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాజ్‌ భవన్‌ ఉందని, నెలకోసారి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్‌ తమిళి సై ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు గవర్నర్‌ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

 

10.కోవిడ్‌ టెస్టులు పెంచండి
` రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి): కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముంచుకొస్తున్నదన్న హెచ్చరికల నేపథ్యం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో కొవిడ్‌ టెస్టులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం కోవిడ్‌ 19పై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్‌ జాగ్రత్తలు పాటించేలా చూడాలని ధర్మాసనం సూచించింది. కోవిడ్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కోవిడ్‌ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. కరోనా కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కేసులు పెరుగుతున్నందున తగిన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది.కరోనా మృతుల కుటుంబాలకు 15 రోజుల్లో ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా పక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.

 

11.కీలక ఒప్పందంపై భారత్‌`వియత్నాం సంతకాలు
న్యూఢల్లీి,జూన్‌ 8(జనంసాక్షి):కీలకమైన రవాణా సహకారంపై భారత్‌`వియత్నాం దేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నాయి. తొలిసారి భారత్‌తో వియత్నాం కుదుర్చుకొన్న కీలక ఒప్పందం ఇదే కావడం విశేషం.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు వియత్నాంకు చేరుకొన్నారు. రాజ్‌నాథ్‌కు విమానాశ్రయంలో జనరల్‌ ఫాన్‌ వాన్‌ జియాంగ్‌ స్వాగతం పలికారు.ఈ పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్‌ సింగ్‌, జనరల్‌ జియాంగ్‌లు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిల్లో ఇరు దేశాల మధ్య రవాణా సహకారానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. 2030 నాటికి ఇండియా`వియత్నాం సంయుక్త రక్షణ భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా బలప్రదర్శన నేపథ్యంలో భారత్‌` వియత్నాంల మధ్య సహకారానికి సంబంధించిన అవసరాలను, అవకాశాలను ఈ ప్రకటనలో ప్రస్తావించారు.’’పరస్పర రక్షణ దళాల సహకారం పెరుగుతున్న సమయంలో.. ఇరు పక్షాలకు ప్రయోజనకరమైన రవాణా సహకారాన్ని సరళతరం చేసే దిశగా.. ఇది కీలక ముందడుగు. ఏదైనా ఒక దేశంతో ఈ దిశగా వియత్నాం చేసుకొన్న పెద్ద ఒప్పందం ఇదే’’ అని ఆ ప్రకటనలో వెల్లడిరచారు. దీంతోపాటు భారత్‌ వియత్నాంకు అందజేయనున్న 500 మిలియన్‌ డాలర్ల లైనాఫ్‌ క్రెడిట్‌ను ఓ ఓ కొలిక్కి తెచ్చే అంశంపై కూడా చర్చలు జరిగాయి. వియత్నాం ఎయిర్‌ ఫోర్స్‌కు శిక్షణ నిమిత్తం రెండు సిమ్యూలేటర్లు అందజేయడంతోపాటు లాంగ్వెజ్‌, ఐటీ ల్యాబ్‌లను భారత్‌ ఏర్పాటు చేస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.

 

12.డాన్‌బాస్‌పై రష్యా భీకరదాడులు
కీవ్‌,జూన్‌ 8(జనంసాక్షి):ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంపై రష్యా భీకర దాడులు చేస్తోంది. విధ్వంసం భారీ స్థాయిలో ఉన్నట్లు శాటిలైట్‌ చిత్రాల ద్వారా తెలుస్తోంది. నిరాటంకంగా రష్యా సైన్యం చేస్తున్న బాంబు దాడులతో తూర్పు ఉక్రెయిన్‌ నగరాలన్నీ శిథిలాలవుతున్నాయి. సివెరొడెనస్కీ నగరంపై రష్యా ఏకధాటిగా దాడి చేస్తోంది. అయితే మాక్సర్‌ టెక్నాలజీస్‌ సంస్థ హై రెజల్యూషన్‌ ఇమేజ్‌లను తీసింది. కేవలం 24 గంటల్లోనే భారీ నష్టం జరిగినట్లు ఆ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. సివెరొడెనస్కీలో బిల్డింగ్‌లు, హాస్పిటల్‌తో పాటు పలు ప్రాంతాలన్నీ ధ్వంసం అయ్యాయి. ఇక ఆకాశం నుంచి చూస్తే అక్కడో భారీ రంధ్రం ఏర్పడినట్లే కనిపిస్తోంది. డోవ్‌హెంకీలో సుమారు 40 విూటర్ల వెడల్పు ఉన్న భారీ గొయ్యి ఏర్పడినట్లు శాటిలైట్‌ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. సివెరొడెనస్కీ పారిశ్రామిక నగరం. ఒకవేళ ఈ నగరాన్ని రష్యా చేజిక్కించుకుంటే అప్పుడు మిగితా ప్రాంతాలను ఆధీనం చేసుకోవడం సులువవుతుంది.

 

 

15. మరోసారి పెగిరిన ఆర్టీసీ ఛార్జీలు
హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి): తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు మరోసారి షాక్‌ తగిలింది. సెస్‌ రూపంలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగాయి. కిలోవిూటర్‌ వారీగా ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో దూరంతో సంబంధం లేకుండా ప్రయాణికులపై రూ. 5ను పెంచారు. అలాగే, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో కూడా కిలోవిూటర్‌ చొప్పున ఈ పెంపు వర్తించనుంది. పెరిగిన ధరలు రేపటి నుంచే అమలులోకి రానున్నాయి. పల్లె వెలుగు.. 250 కి.విూ దూరానికి రూ. 5 నుంచి రూ. 45 పెంపు.ఎక్స్‌ప్రెస్‌.. 500 కి.విూ దూరానికి రూ. 5 నుంచి రూ. 90 పెంపు.డీలక్స్‌.. 500 కి.విూ దూరానికి రూ. 5 నుంచి రూ. 125 పెంపు.సూపర్‌ లగ్జరీ.. 500 కి.విూ దూరానికి రూ. 10 నుంచి రూ. 130 పెంపు.ఏసీ సర్వీసులు.. 500 కి.విూ దూరానికి రూ. 10 నుంచి రూ. 170 పెంపు