60వేల మందికి డబుల్‌ ఇళ్లు ` పంపిణీకి సిద్ధం

\


`అధికారులతో కేటీఆర్‌ సమీక్ష
హైదరాబాద్‌,జూలై 4(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో.. వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.ఇప్పటికే నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్న అధికారులు.. ఇందులో 60 వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. నానక్‌రామ్‌ గూడలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియపై మంత్రి కేటీఆర్‌ సవిూక్ష నిర్వహించారు.పూర్తయిన 60వేల ఇళ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను వారంలోగా సిద్ధం చేయాలని కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలన్నారు. మార్గదర్శకాలను రూపొందించే క్రమంలో ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క ఇల్లు కచ్చితంగా గూడు లేని నిరుపేదలకు మాత్రమే అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అవసరమైన క్షేత్రస్థాయి గుర్తింపు, వెరిఫికేషన్‌ వంటి కార్యక్రమాల కోసం పెద్దఎత్తున బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చేవారం మరోసారి ఈ అంశంపై సమావేశం ఉంటుందని మంత్రి తెలిపారు. ఆలోగా తుది మార్గదర్శకాలతోపాటు ఇళ్ల పంపిణీకి కచ్చితమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

(వీరులను తలచుకోవడం మన విధి
` మన్యం వీరుడు అల్లూరికి ఘనంగా నివాళి
` ట్యాంక్‌బండ్‌పై అల్లూరి విగ్రహానికి కెటిఆర్‌ పుష్పాంజలి
హైదరాబాద్‌,జూలై 4(జనంసాక్షి): వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అందరికి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యం వీరుడి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. జల్‌ జంగల్‌ జవిూన్‌ నినాదంతో కుమ్రం భీమ్‌ ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాం ప్రభువు పై తెగించి పోరాడారని చెప్పారు. అదేవిధంగా తెలుగుజాతిని ప్రభావితం చేసేలా అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై దీరోధాత్తంగా పోరుసలిపారని వెల్లడిరచారు. అలాంటి వీరుల స్ఫూర్తితో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్‌ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. నగరంలోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్‌ కేటాయించారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు గొప్ప వీరుడని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. అల్లూరి జయంతి వేడుకలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతవరకు అధికారికంగా జరుగలేదని ఇదే మొదటిసారన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మనదేశంలో పుట్టినందుకు అందరం గర్వపడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాము కొమరం భీం, అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ముందుకు సాగుతున్నామన్న కేటీఆర్‌..గిరిజన హక్కుల కోసం అల్లూరి పోరాడారని చెప్పారు. వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడేనని.. అలాంటి విప్లవ వీరుడు అల్లూరి మనదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణం అన్నారు. కాల్చితే వెన్నువిూద కాదు.. గుండె విూద కాల్చమని ధైర్యంగా చెప్పిన మహాను భావుడు అల్లూరి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. జల్‌... జంగల్‌... జవిూన్‌ కోసం కొమరం భీమ్‌ పోరాడారని... బ్రిటిష్‌ వారిపై అల్లూరి పోరాడారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 8 ఏళ్ళుగా తెలంగాణను కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారన్నారు. క్షత్రియుల కోసం స్థలం అడిగారని... క్షణం ఆలోచించకుండా మూడు ఎకరాల భూమిని కేసీఆర్‌ కేటాయించారని అన్నారు. త్వరలో భవన నిర్మాణం పూర్తిచేసుకుని దానికి అల్లూరి పేరు పెడతామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అల్లూరి సీతారామరాజు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఉద్యమకారులను సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ మరిచిపోరని చెప్పారు.