all news

 

1.అచ్చేదిన్‌ వచ్చేశాయి..
` ‘బండబాదుడు ఏ రూ.1105క
` గ్యాస్‌ ధరపెంపుపై కెటిఆర్‌ వ్యంగ్యాస్త్రాలు
` సిలిండర్‌పై మరో రూ. 50 పెంచిన చమురు సంస్థలు
హైదరాబాద్‌,జూలై 6(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వ విధానాలను తరచూ తనదైన శైలిలో ఎండగట్టే తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. తాజాగా మరో సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు.గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.50మేర పెంచిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో స్పందించారు.’’మంచి రోజులు వచ్చేశాయ్‌ (అచ్చేదిన్‌ ఆగయా).. అందరికీ శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్‌ ధరను కేంద్రం పెంచేసింది. ప్రధాని సిలిండర్‌ ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చేశారు’’ అని కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. కాగా సామాన్యుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌ ధరలను పెంచేస్తున్నాయి. మరోసారి గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌ ధర మరోసారి పెరిగింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధర 50కి పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర 1055 నుంచి రూ. 1105కి చేరింది. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడిరచింది. ఢల్లీిలో రూ. 1053గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో రూ. 1002.50 నుంచి రూ. 1052.50, కోల్‌ కతాలో రూ. 1,029 నుంచి రూ.1,079కి చేరింది. చెన్నైలో రూ.1,058.50 బదులుగా రూ. 1,068.50 చెల్లించాల్సి ఉంటుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 8.50 తగ్గడం విశేషం. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 01న 19 కిలోల సిలిండర్‌ ధరను రూ. 183.50 మేర తగ్గించిన విషయం తెలిసిందే. పెరిగిన గ్యాస్‌ ధరలతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.18 పెరిగింది. ఈ నెల 1న వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.198 తగ్గించిన విషయం తెలిసిందే. గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ’మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్‌ లిండర్‌ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్‌ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కాగా ఎల్పీజీ సిలిండర్‌ ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ విమర్శలు చేశారు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంటే, మరోవైపు ఎల్పీజీ ధరలు కూడా పెంచుతారా అంటూ ప్రశ్నించారు.ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచుతూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.’’నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్‌ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్‌ కనెక్షన్‌ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్‌ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు. సిలిండర్‌ కోసం వాడే రెగ్యులేటర్‌ ధర కూడా రూ.100కు పెంచారు. పేదవాళ్ల వంట గది మళ్లీ పొగతో నిండిపోయింది’’ అని వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈ ధరల పెంపును కాంగ్రెస్‌ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ‘’ఇంత ఖరీదైన ఎల్పీజీ సిలిండర్‌ను ఎవరు కొంటారని మోదీని ప్రశ్నిస్తున్నాం. ఎనిమిదేళ్లలో ఎనిమిది కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువకు వెళ్లారు.రైతుల రోజువారీ ఆదాయం రూ.27కు పడిపోయింది. ఆర్థిక మాంద్యం కారణంగా గృహిణుల ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో సిలిండర్‌ ఎలా కొంటారు’’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి రాగిణి నాయక్‌ విమర్శించారు. గృహ వినియోగానికి వాడే 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. అలాగే 5 కేజీల సిలిండర్‌ ధర రూ.18 పెంచారు. మరోవైపు 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.8.50 తగ్గించారు.

 

 

 

2.హైదరాబాద్‌లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడి
` రూ.1200 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చిన ‘సాఫ్రాన్‌’
` హైదరాబాద్‌లో మెగాఏరోఇంజిన్‌ఎంఆర్‌ఓ ఏర్పాటుకు సంస్థ నిర్ణయం
` సుమారు 1000 మందికి ఉద్యోగఅవకాశాలు.. మంత్రి కేటీఆర్‌ వెల్లడి
` ఏరోస్పేస్‌ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదని మరోసారి రుజువైందని వెల్లడి
హైదరాబాద్‌,జూలై 6(జనంసాక్షి):హైదరాబాద్‌ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌ కు చెందిన దిగ్గజ సంస్థ సాఫ్రాన్‌ తన మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌ హాల్‌ కేంద్రాన్ని ఏర్పాటచేసేందుకు హైదరాబాద్‌ ను ఎంచుకుంది. 15 కోట్ల అమెరికన్‌ డాలర్ల తో ఈ విమాన ఇంజన్ల నిర్వహణ, మర మ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్‌ ఏర్పాటుచేస్తుంది. ఇండియాలో తన తొలి ఎంఆర్‌వో కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్‌ ను ఎంచుకోవాలనుకున్న శాఫ్రాన్‌ నిర్ణయాన్ని స్వాగతి స్తున్నామన్నారు ఐటీశాఖమంత్రి కే.తారకరామారావు. సాఫ్రాన్‌ సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదేనన్న కేటీఆర్‌, మనదేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదే అన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజిన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన సాఫ్రాన్‌ ఏర్పాటుచేస్తున్న ఈ ప్రతిపాదిత ఎంఆర్‌వో తో సుమారు వెయ్యి ఉద్యోగాలు కల్పించబడతాయని చెప్పారు. భారత్‌తో పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్‌`1ఏ, లీప్‌`1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్‌ లోనే చేస్తారన్నారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. శాఫ్రాన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్‌ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. దిగ్గజ సంస్థ ఐన శాఫ్రాన్‌ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్‌ రంగంలో హైదరాబాద్‌ కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందన్నారు కేటీఆర్‌.

 

3.ఏ దేశమేగినా.. ఎందుకాలిడిన..
తెలంగాణే ధ్యాస.. వ్యవసాయమే శ్వాస..
ప్రపంచంలో మొత్తంగా భారత్‌లోనే పత్తి ఎక్కువ
పత్తిలో ఉత్పాదకపెంచడంపై అద్యయనం చేస్తున్నాం
అమెరికాలో బేయర్‌ పత్తి పరిశోధన కేంద్రం సందర్శించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం
హైదరాబాద్‌,జూలై 6(జనంసాక్షి): ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం హిర్సూటం రకానికి చెందిందే ఉంటుందన్నారు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో ఉన్న బేయర్‌ పత్తి విత్తన, జన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లో సుమారు 6.2 మిలియన్‌ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. ఇండియాతోపాటు చైనా, అమెరికాలలో పత్తి ఎక్కువగా సాగవుతుందని చెప్పారు. భారతదేశంతోపాటు ప్రధానంగా దక్కన్‌ పీఠభూమి పత్తి సాగుకు అత్యంత అనుకూలమని వెల్లడిరచారు. దేశంలో 2030 నాటికి పత్తి ఉత్పత్తి 7.2 మిలియన్‌ టన్నులకు చేరుందన్నారు. 2002 నుంచి పురుగులను తట్టుకునే బోల్‌గార్డ్‌ రకం హైబ్రీడ్‌ పత్తి సాగవుతుందని, దీంతో పంట ఉత్పాదకత పెరిందని తెలిపారు. బేయర్‌ విత్తన సంస్థ అనేక దేశాల్లో పరిశోధనలు జరిపి అక్కడి వాతావరణ, భూ పరిస్థితులకు అనుకూలమైన ఎక్కువ దిగుబడినిచ్చే రకాలను అందిస్తున్నదని చెప్పారు. పత్తిసాగులో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పాదకత పెంచడంతోపాటు పంటకోతలో ఉన్న సమస్యలను సరళీక రించేందుకుకు అమెరికాలో అధ్యయనం చేస్తున్నామని వెల్లడిరచారు. తెలంగాణకు పత్తి, మొక్కజొన్న, కూరగాయల రకాల్లో నూతన వంగడాలను అందించేందుకు బేయర్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తంచేసిందన్నారు. అమెరికాలో వ్యవసాయ కమతాలు పెద్దవికావడంతో వారు యాంత్రీకరణతో అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు. తక్కువ విస్తీర్ణంలో తక్కువ రోజుల్లోనే అధిక ఉత్పత్తి సాధిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పత్తు సాగు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తుందన్నారు.

 

4.మన జర్నలిస్టులకు అండగా నిలుస్తాం
` ప్రభుత్వ విప్‌,చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌
హైదరాబాద్‌,జూలై 6(జనంసాక్షి):జర్నలిస్టులకు నిరంతరం,ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రభుత్వ విప్‌,చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు.తన భార్య కూడా జర్నలిస్టే నని పేర్కొన్నారు.జర్నలిస్ట్‌ ల సంక్షేమా నికి సీఎం కెసిఆర్‌ వందకోట్లు నిధి ఇవ్వడం జరిగిందని,కోవిడ్‌ సమయంలో ఆదుకోవడం జరిగిందని పేర్కొ న్నారు.జర్నలిస్ట్‌ లు అంటే ప్రత్యేక ప్రేమ,గౌరవం ఉందన్నారు.బుధవారం మందమర్రి ప్రెస్‌ క్లబ్‌ ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్య అతిధిగా సుమన్‌ పాల్గొని మాట్లాడారు.బెల్లంపల్లి ఏసీపీ మహేష్‌,జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ ప్రవీణ్‌,సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎండి.మునీర్‌,ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య,బిఎమ్మెఎస్‌ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య,ఐఎఫ్టీయు అధ్యక్షులు టీ.శ్రీనివాస్‌,సీఐ ప్రమోద్‌,సీనియర్‌ జర్నలిస్ట్‌ లు ఉమేష్‌,తదితరులు పాల్గొనగా,ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు చందు అధ్యక్షత వహించారు.

 

5.మార్పుకోసం పోరు..
` రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,జూలై 6(జనంసాక్షి): భూ వివాదాలకు కారణమైన ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ధరణిని అట్టహాసంగా ప్రారంభించిన లక్ష్మాపూర్‌ గ్రామంలో చాలా భూములు ధరణిలో లేవన్నారు. ఇబ్రహీంపట్నం కాల్పుల ఘటనకు ’ధరణి’ పోర్టలే కారణమన్నారు. ప్రభుత్వమే భూ కబ్జాలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడుతోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామని మరోమారు స్పష్టం చేశారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం దలితులకు, గిరిజనులకు ఇచ్చిన భూమిని టీఆర్‌ఎస్‌ లాక్కుంటుంది. హారితహారం పేరు విూద గిరిజనుల భూమిని లాక్కుంటున్నారు. నష్టపరిహారం అడిగిన భూ నిర్వాసితులను అరెస్ట్‌ చేసి జైళ్లో పెడుతున్నారు. ఫ్యాక్టరీల పేరు విూద నయా భూస్వాములను కేసీఆర్‌ తయారుచేస్తున్నారు. ఐకియా కంపెనీకి 19 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఎకరా రూ. 50కోట్లు పలికే 15 ఎకరాల భూమిని ఎలాంటి టెండర్లు లేకుండానే ఐకియాకు కట్టబెట్టారని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు జాగా లేదంటున్న కేటీఆర్‌.. ఐకియాకు ఇచ్చిన భూమిలో వాటిన నిర్మించొచ్చు కదా అని రేవంత్‌ సూచించారు.ఇప్పటికే కేసీఆర్‌ కుటుంబం రూ. లక్ష కోట్లు దోచుకుంది ధరణి పోర్టల్‌కు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం అని అన్నారు. మేం ప్రశ్నిస్తున్నందుకే..ధరణిపై కేసీఆర్‌ సవిూక్షిస్తున్నారు. ధరణి పోర్టల్‌ భూ సమస్యలకు సంబంధించి లక్షకు పైగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని రేవంత్‌ పేర్కొన్నారు. భూముల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారుణాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ భూ యజమానులను కేసీఆర్‌ సర్కార్‌ జైల్లో పెట్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ లో భూ సమస్యలు పెరిగిపోయాయని తెలిపారు. ధరణి వచ్చాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణిలో వారసత్వ భూములు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. ఓటేసిన పాపానికి ప్రభుత్వమే తమ భూములను.. కొల్లగొడుతోందని బాధితులు రోదిస్తున్నా రని చెప్పారు. ఓఆర్‌ఆర్‌, ప్రాజెక్టులు, ఫార్మాసిటీలు, ట్రిపుల్‌ ఆర్‌ పేరుతో కొల్లగొడుతున్నారని దుయ్య బట్టారు. ధరణి లోపాల కారణంగా హత్యలు పెరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు కన్న బిడ్డల్లా చూసుకునే భూములను కేసీఆర్‌ సర్కారు అన్యాయంగా గుంజుకుంటోందని ఆరోపించారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను సైతం వివిధ కారణాలు చెప్పి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని మండిపడ్డారు. తరతరాలుగా వస్తున్న భూముల్ని సర్కారే స్వయంగా లాక్కోవడం సిగ్గుచేటని రేవంత్‌ విమర్శించారు. ధరణి అద్భుత మని, సర్వరోగ నివారిణి అని కేసీఆర్‌ చెప్పిన మాటల్నీ అబద్దాలని ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతోందని అన్నారు. ధరణి రికార్డుల్లో అసలు యజమాని పేరు కాకుండా ఎవరెవరి పేర్లు ఉంటున్నాయని, లేదంటే సర్కారు భూమి అని చూపిస్తోందని వాపోయారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్‌ 25లక్షల ఎకరాల భూములు పంచితే.. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 30 లక్షల ఎకరాలు మాయమయ్యాయని రేవంత్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి తీరుతో 5 లక్షల ఎకరాల పోడు భూములు కూడా ఆగమవుతున్నాయని అన్నారు. గౌరెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే చెల్లిందని విమర్శించారు. పేదల భూములు గుంజుకునేందుకే కేసీఆర్‌ను ప్రజలు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఐటీ కంపెనీలు ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నాయో తెలియకపోయినా కేసీఆర్‌ సర్కారు మాత్రం అడ్డగోలుగా వాటికి భూములు కేటాయిస్తోందని రేవంత్‌ విమర్శించారు.

 

6.ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ
` మంత్రి పదవికిరాజీనామా
దిల్లీ,జూలై 6(జనంసాక్షి): భాజపాలో కీలక మైనార్టీ నేత, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు.ఆయనతో పాటు మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి పదవులు రాజీనామా చేశారు.అయితే నఖ్వీ రాజీనామాపై అనేక ఊహాగానాలను వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీయే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నట్లు జాతీయ విూడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం నఖ్వీ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో మైనార్టీ వర్గంలో కాషాయ పార్టీపై కొంత వ్యతిరేకత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో నఖ్వీని ఉపరాష్ట్రపతి పదవికి బరిలో దించాలని ఎన్డీయేలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.అయితే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి రేసులో పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా నఖ్వీ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూను ఎన్డీయే ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉపరాష్ట్రపతిగా ఎవరిని నిలబెట్టనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

 

8.’తెలంగాణ విూడియా అకాడవిూ’ చైర్మన్‌ గా పరిశీలనలో విరాహత్‌ అలీ
` 2006 లోనే 16 ప్రజాసంఘాలతో గజ్వేల్‌ లో సమావేశం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు
` రాష్ట్రంలోని మెజారిటీ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టియుడబ్ల్యూజె (ఐజెయు) ప్రధాన కార్యదర్శి
` అన్ని జర్నలిస్టు సంఘాలతో సత్సంబంధాలు అదనపు బలం
` జర్నలిస్టుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించడంలో దిట్ట
హైదరాబాద్‌,జూలై 6(జనంసాక్షి):రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, సంస్థలలో ఖాళీగా ఉన్న మరియు పదవీకాలం ముగుస్తున్న చైర్మన్‌ ల భర్తీ ప్రక్రియను ముఖ్యమంత్రి కెసిఆర్‌ వేగవంతం చేసిన విషయం విదితమే. చైర్మన్ల నియామకంలో ఆశావాహులకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించి ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ‘తెలంగాణ విూడియా అకాడవిూ’ తొలి చైర్మన్‌ గా సుదీర్ఘసేవలు అందించిన అల్లం నారాయణ పదవీకాలం ముగుస్తుండటంతో జర్నలిస్టులు అందరి దృష్టి దీనిపైన పడిరది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్‌ అలీ పేరు ‘తెలంగాణ విూడియా అకాడవిూ’ చైర్మన్‌ గా ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన విరాహత్‌ అలీ 1988 లో జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రజా సమస్యల విూద గళమెత్తి వాటి పరిష్కారానికి కృషి చేయడంలో విరాహత్‌ అలీ ముందుంటారు. మలిదశ తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో 2006 లోనే 16 ప్రజాసంఘాలతో గజ్వేల్‌ లో సమావేశం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు విరహత్‌ అలీ. అప్పట్లోనే ఈ సమావేశానికి దాదాపు పదిహేను వేల మంది హాజరయ్యారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం ముందుడే విరహత్‌ అలీ మెజారిటీ జర్నలిస్టులకు ప్రాతినిథ్యం వహిస్తున్న టియుడబ్ల్యూజె (ఐజెయు) ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అన్ని జర్నలిస్టు సంఘాలతో సత్సబంధాలు కలిగియున్న విరహత్‌ అలీ ‘తెలంగాణ విూడియా అకాడవిూ’ చైర్మన్‌ గా నియామకమైతే తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో పాటు సానుకూలంగా పరిష్కారం అవుతాయని జర్నలిస్టులు భావిస్తున్నారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

 

9.రాజ్యసభకు దక్షిణాది ప్రముఖులు
` రాష్ట్రపతి కోటాలో ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌,పీటీ ఉషా,వీరేంద్ర హెగ్డేలను నామినేట్‌ చేసిన కేంద్రం
` అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
దిల్లీ,జూలై 6(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్‌ చేసింది.ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌తో పాటు సంగీత దిగ్గజం ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ సందర్భంగా వారు అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆ నలుగురు ప్రముఖులకూ అభినందనలు తెలిపారు.ప్రముఖ అథ్లెట్‌ పీటీ ఉషా జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. క్రీడా రంగంలో ఆమె సాధించిన విజయాలు అందరికీ తెలిసినప్పటికీ గత కొన్నేళ్లుగా వర్ధమాన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఆమె చేసిన కృషి కూడా ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. రాజ్యసభకు నామినేట్‌ అయిన సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ఫొటోను షేర్‌ చేశారు. అలాగే, సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతం ఎన్నో భావాలకు ప్రతిబింబమని.. అనేక తరాలకు ఆయన సంగీతం వారధిలా నిలిచిందని మోదీ కొనియాడారు. ఆయన జీవిత ప్రయాణం కూడా ఎంతో స్ఫూర్తిదాయకని.. అలాంటి వ్యక్తి రాజ్యసభకు నామినేట్‌ కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే, విజయేంద్ర ప్రసాద్‌ దశాబ్దాల పాటు సృజనాత్మక సేవలు అందించారని.. ఆయన సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు. వీరేంద్ర హెగ్డే గొప్ప సమాజ సేవకుడని మోదీ కొనియాడారు. ధర్మస్థల ఆలయంలో ప్రార్థనలు చేసే అవకాశం తనకు దక్కిందని.. ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక రంగంలో ఆయన చేసిన గొప్ప కృషిని చూశానని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల ద్వారా పార్లమెంట్‌ కార్యకలాపాలను సుసంపన్నం అవుతాయని పేర్కొన్నారు.

10.ఆర్నెళ్లకే బూస్టర్‌ డోస్‌
` టీకాల మధ్య వ్యవధి 9 నుంచి 6 నెలలకు కుదింపు
` కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢల్లీి,జూలై 6(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌, బూస్టర్‌ డోస్‌ మధ్య గ్యాప్‌ 6 నెలలకు తగ్గించింది. నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ కాలపరిమితి 3 నెలలు తగ్గిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. 18`59 ఏళ్లవారు రెండో డోస్‌ తీసుకున్న 6 నెలలకు బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గతంలో 2 డోసులు పూర్తయిన 9 నెలల తరువాత మాత్రమే బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలనే నిబంధన ఉండేది. స్టాండిరగ్‌ టెక్నికల్‌ సబ్‌ కమిటీ సిఫార్సు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖ ఈ మేరకు రాష్టాల్రకు లేఖ రాశారు. వ్యాక్సినేషన్‌ సెంటర్లు, గృహస్థాయిలో బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు రాష్టాల్రు సిద్ధం కావాలని ఆ లేఖలో సూచించారు. భారత్‌లో కోవిడ్‌`19 కేసులు క్రమంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో బూస్టర్‌ డోస్‌ త్వరగా ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భారత్‌లో గడచిన 24 గంటల్లో 16,159 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 28 మంది కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,15,212గా ఉన్నాయి. ఇప్పటివరకూ 198 కోట్ల డోసులను ప్రజలకు ఇవ్వడం జరిగిందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌, బూస్టర్‌ డోస్టర్‌ మధ్య గ్యాప్‌ 9 నెలలుగా ఉంది. ఈ వ్యవధిని కేంద్రం 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారు రెండో డోస్‌ కొవిడ్‌ టీకా తీసుకున్న 6 నెలలకు బూస్టర్‌ డోస్‌ తీసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ అన్ని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, నిర్వహకులకు లేఖ రాశారు.

 

11.భారీ వర్షాలకు హిమాచల్‌లో వరదలు
` ఆరుగురు గల్లంతు..
` భారీ వర్షాలతో ముంబయికి ఆరెంజ్‌ అలర్ట్‌..
ముంబయి/సిమ్లా,జూలై 6(జనంసాక్షి):రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తాయి.దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలు మునిగిపోవడంతో స్థానిక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడిరది. దీంతో లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు.ముంబయిలో గత సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే శుక్రవారం వరకు ముంబయి సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబయికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.ముంబయి సహా ఠాణే, పాల్ఘర్‌ జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తాయి. ఠాణేలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై గుంత కారణంగా కింద పడ్డాడు. అదే సమయంలో వచ్చిన బస్సు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వర్షాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నిన్న అధికారులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.హిమాచల్‌ప్రదేశ్‌లోనూ నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కులూ జిల్లాలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉద్ధృతిలో ఆరుగురు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపట్టామన్నారు. వరదల కారణంగా జిల్లాలోని మలానా, మణికరణ్‌ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సిమ్లాలోని ధల్లీ టన్నెల్‌ వద్ద కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతిచెందారు. అటు బిహార్‌లోనూ భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.