హైదరాబాద్‌ లో భారీ వర్షంరోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు
హైదరాబాద్‌,జూలై 4(జనంసాక్షి):జంట నగరాల పరిధిలో సోమవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు వర్షం కురవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు.రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజరాహిల్స్‌, ఖైరతాబాద్‌, కోఠి ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాంనగర్‌, హిమాయత్‌ నగర్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, జీడిమెట్ల, షాపూర్‌ నగర్‌, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, పటాన్‌ చెరువు, లింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, గాజులరామారాం, జీడిమెట్ల, సూరారం, కుత్బుల్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లోనూ వానపడిరది. అలాగే సంగారెడ్డితో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. మరో వైపు ఇవాళ జార?ండ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పాటయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం జార?ండ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టం నుంచి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. దీని ఫలితంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.