భావి తరాల కోసం ఇంధనం పొదుపుగా వాడుకోవాలి..

వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ కుమారి.

వికారాబాద్, తాండూర్ డిసెంబర్19( జనం సాక్షి)

ఇంధనం చాలా అమూల్యమైనది అని భావి తరాల కోసం పొదుపుగా వాడుకోవాలని వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణకుమారి సూచించారు. గురువారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా స్థానిక ఆర్డీవో కార్యాలయం నుండి బి జె ఆర్ చౌరస్తా వరకు జిల్లా అధికారులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడుతూ  సహజ వనరులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సహజ ఇంధన వనరులు వంట గ్యాస్, పెట్రోల్ ,బొగ్గు లాంటివి భూగర్భంలో రోజురోజుకు తరిగి పోతున్నాయని, భావి తరాల వారి కోసం పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి సహజ వనరులను భావితరాలకు అందించడమే ముఖ్య లక్ష్యంగా ఇంధనం  అనవసరంగా వృధా చేయకూడదు అన్నారు. విరివిగా చెట్లు నాటాలని సూచించారు. ప్రకృతి విరుద్ధంగా పనులు చేయకుండా నీటిని కూడా పొదుపుగా వాడుకోవాలి అన్నారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించి బట్టతో చేసిన సంచులను, బ్యాగులను వినియోగించాలని సూచించారు.

నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు అధికారులు సహజ ఇంధన పొదుపుపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ డిఎం మాణిక్యం

 మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న జనాభా ప్రకారం ఇంధనం కూడా అధికంగా వినియోగం జరుగుతుందన్నారు. వినియోగం పెరిగే కొద్దీ సహజ ఇందనాలు భూగర్భంలో పెరిగిపోతున్నాయని తెలిపారు. పొదుపుగా ఇం

దనాన్ని వినియోగించి, భావి తరాల భవిష్యత్తుకు తోడ్పడాలి అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుండి 20 వరకు ఇంధన పొదుపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోతిలాల్, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు , విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.