ఈనెల 28న క్రెడాయ్ రియాల్టీ అవార్డుల ప్రధానోత్సవం






ఖైరతాబాద్ ; డిసెంబర్ 19 జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంలో డిజైన్, ప్రాజెక్టులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు" క్రియేట్ 2019" పేరిట అవార్డులను అందజేస్తున్నట్లు తెలంగాణ క్రెడాయ్ చైర్మన్ రామ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ఎలాక్ట్  ప్రెసిడెంట్ మురళి కృష్ణ రెడ్డి, కార్యదర్శి ప్రేమ్ సాగర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, అజయ్ కుమార్ ,మధుసూదన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ గోపాల్ లతో కలసి క్రియేట్- 2019 లోగోను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో వివిధ అంశాలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించాలన్న ఉద్దేశంతో క్రియేట్ 2019 క్రెడాయ్ వేడుకలను ఈనెల 28వ తేదీన నగరంలోని  జె ఆర్ సి కన్వెన్షన్ హాల్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ అవార్డుల ద్వారా సంస్థ లలో పోటీతత్వం పెరిగి ఉత్సాహవంతంగా పని చేసేందుకు ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. ఈ అవార్డులు బిల్డర్లకు ఆస్కార్ అవార్డు అలాంటివన్నీ అన్నారు.  ఈ వేడుకల్లో సీనియర్ ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లు, డెవలపర్లు ,వెండర్లు దాదాపు గా 750 మంది విశిష్ట అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు.