3న సావిత్రీబాయి పూలే జయంతి

ఆదిబాలాద్‌,డిసెంబర్‌31(జనం సాక్షి) : జనవరి 3న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను జరుపనున్నారు.  దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకల్ని ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని అఖిల భారతీయ మాలీ మహాసంఘం, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకమార్‌ పేట్కులే కోరారు.  కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు.