ఫలిప్పీన్‌ తుఫాన్‌లో 30మంది మృతి


మనీలా,డిసెంబర్‌27(జ‌నంసాక్షి):  ఫిలిప్పిన్స్‌లో ఫాన్ఫోన్‌ తుఫాన్‌ బీభత్సం కారణంగా ఇప్పటి వరకు 30 మంది వరకు మృతి చెందారు. ఫాన్ఫోన్‌ తుఫాను విరుచుకపడడంతో 30 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతైనట్టు సమాచారం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికి 200 కిలో విూటర్ల వేగంతో గాలులు భీకరంగా వీయడంతో పాటు భారీ వర్షం కురుస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక విూడియా వెల్లడించింది. 2013లో హేయాన్‌ తుఫాన్‌లో ఆరు వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే.