కానుకల ద్వారా టిడిడికి రూ.79. 34 కోట్ల ఆదాయం

తిరుమల,మార్చి5 (జనం సాక్షి):  తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీకి ఫిబ్రవరిలో రూ.79. 34 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడిరచారు. 10 లక్షల 95 వేల 724 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. 5.35 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా 13.63 లక్షల మంది శ్రీవారి అన్నప్రసాదాలు స్వీకరించారన్నారు.

దాదాపు 1.64 లక్షల గదులను భక్తులకు కేటాయించామన్నారు. 329.04 ఎమ్‌ఎల్‌ డీ నీటిని వినియోగించారని చెప్పారు. 27.76 లక్షల యూనిట్లు విద్యుత్‌ వినియోగం జరిగిందని పేర్కొన్నారు. 64.90 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశామని, 3378 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారని వివరించారు. కొవిడ్‌ కారణంగా రెండు సంవత్సరాల తరువాత టీటీడీ సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ సర్వదర్శనం ప్రారంభించిందని పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 56,686 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. 27,997 మంది తలనీలాలు సమర్పించుకున్నారని, హుండీ ఆదాయం రూ.2.93 కోట్లు వచ్చిందన్నారు.