చరిత్రను వక్రీకరించిన గ్రంధాలెన్నో ప్రాణం పోసిన మహామహులెందరో!

హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి):  బ్రిటీషు, ఫ్రెంచ్‌, చైనా.. తదితర ప్రపంచ దేశాలన్నింటికీ తమకంటూ నిర్దిష్టమైన పద్ధతిలో చరిత్రను నిక్షిప్తం చేసుకున్నారు. కానీ మనదేశచరిత్రను ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల చైనా తన చరిత్రను పునర్‌నిర్మించుకుంటోంది. అలా మనమూ చేయాల్సిన అవసరం ఉంది. విదేశీ దండయాత్రల కారణంగా మొత్తం భారతదేశ చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు ధ్వసం అయ్యాయి. తాళపత్రాలను తగులబెట్టారు. ముస్లిం రాజుల దండయాత్రలో నలందా విశ్వవిద్యాలయంలోని తాళపత్రగంధాలను తగులబెడితే నెలల తరబడి ఆ మంటలు కొనసాగాయంటే అర్థం చేసుకోవచ్చు. తగులబడుతున్న తాళపత్రాలను కొందరు బౌధ్ద సన్యాసులు తీసుకెళ్లి చైనాలో దాచారని అంటున్నారు. అక్కడి భాండాగారాల్లో కొన్నయినా లభ్యం కావచ్చు. మనచరిత్ర అంతా తాళపత్రాల్లోనే నిక్షిప్తంకాగా అవి కాస్తా విదేశీ దాడుల్లో ధ్వంసం అయ్యాయి. అందుకే దేశ చరిత్రతో పాటు, ఆంధ్రుల చరిత్ర, మనభాషా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కూడా పోయాయి. 20వ శతాబ్దం ఆరంభంలో ఆలోచనల పరంగా మన దేశం ఆధునిక యుగంలోకి ప్రవేశించింది. ఈ సమయంలోనే మనకెందుకు మన చరిత్ర లేదన్న ఆందోళన కలిగింది. ఈ క్రమంలో తెరవిూదకి వచ్చినవారే కొమర్రాజు వెంకటలక్ష్మణరావు, చిలుకూరు వీరభద్రరావులు శోధించి తెలుగు చరిత్రను నిక్షిప్తం చేసే పసనిచేశారు. ఈ పరిశోధకులు తమశక్తిని ధారపోసి తెలుగు చరిత్రను నిర్మించటంలో అవిరళ కృషి చేశారు. తెలుగువారి మూలాలెక్కడన్న ప్రశ్నలకు సాధికారిక సమాధానాలు అన్వేషించారు. నానా కష్టాలు పడి ఒంటి చేత్తో ఆంధ్రుల చరిత్రను చిలుకూరి వీరభద్రరావు మూడు సంపుటాలుగా రాశారు. ఆ తర్వాత వారి దగ్గరే చరిత్ర శోధన అలవరచు కున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ తెలుగు చరిత్రకు ఎంతో ఉపకారం చేవారు. కేవలం చరిత్ర నిర్మాణ అభిలాషతో అనేక భాషలు నేర్చుకుని, శాసనాలు సాధికారికంగా చదవటం ఆరంభించి.. ఎవరు ఎక్కడ శాసనం ఉదంటే అక్కడికి వెళ్లి.. ఎన్ని అవస్థలైనా పడి.. దాని ప్రతిని తీసుకొచ్చి.. పరిష్కరించి చరిత్రను అడుగడుగునా నిర్మించిన మ¬న్నతుడు ఆయన. బ్రిటీషు వారు 19వ శతాబ్దం ఆరంభంలోనే మన చరిత్రను కొంత క్రోడీకరించటం మొదలుపెట్టారు. దక్షిణ భారతదేశానికి సర్వేయర్‌ జనరల్‌గా వచ్చిన కల్నల్‌ మెకంజీ ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను చక్కగా వివరించే గ్రంథాలను రాయాలన్న తలంపుతో ఎంతోమంది గుమాస్తాలనూ ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్లను గ్రామగ్రామానికీ పంపించి తామ్ర, శిలా శాసనాలు, తాళపత్రాల వంటివన్నీ సేకరించి 'కైఫీయతుల'ను సిద్ధం చేశాడు. ఇలా తయారైన నాలుగు వందల సంపుటాలు నేటికీ మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలో ఉన్నాయి.. ఇప్పటికీ ఇవి మనకు చక్కటి చారిత్రక వనరులుగా ఉపయోగ పడుతూనే ఉన్నాయి. ఆయన సిబ్బందికి నాయకత్వం వహించిన కావలి


వెంకట బొర్రయ్య.. ఆ తర్వాతా బోలెడంత చరిత్ర శోధన చేశారు. తెలుగు నేలను పాలించిన వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, పల్లవుల వంటి ఎన్నో రాజవంశాల చరిత్రలను నేలటూరి వెంకటశేషయ్య వెలికి తీసారు. వేటూరు ప్రభాకరశాస్త్రి, కుందూరు ఈశ్వరదత్తు, భావరాజు వెంకటకృష్ణరావు పంతులు, రాళ్లబండి సుబ్బారావు, డాక్టర్‌ మారేమండ రామారావు వంటి వారు తరవాతి కాలంలో తెలుగు చరిత్రకు సాధ్యమైనంత సమగ్రత తీసుకువచ్చారు. అందుబాటులో ఉన్న శాసనాలు, నాణెళిలు, సాహిత్యం.. వంటివన్నీ సేకరించి, శోధించి చరిత్ర నిర్మాణం చెయ్యటం వల్ల మనకూ ఘనమైన చరిత్ర ఉందన్న విషయం తెలిసింది. దీనిని మరింతగా పరిశోధించి పరిష్కరించు కోగలిగితే తెలుగునేలకు మేలు చేసిన వారం అవుతాం. అందుకు ప్రభుత్వాల పరంగా కార్యాచరణ జరగాలి.