మోడీ ప్రభుత్వాన్ని బర్త్  రఫ్ చేయాలి
సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. శ్రీనివాస్ 

తాండూరు డిసెంబర్ 19(జనం సాక్షి) మతాల మధ్య విభేదాలు సృష్టించి  అల్లర్లకు కారణమైన మోడీ ప్రభుత్వాన్ని బర్త్  రఫ్  చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం తాండూర్ పట్టణం అంబేద్కర్ చౌక్ లో వామపక్ష  పార్టీల  ఆధ్వర్యంలో  ఎన్ఆర్ సి పౌరసత్వ  సవరణ  చట్టానికి వ్యతిరేకంగా  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా  సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. శ్రీనివాస్  మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతాన్ని ఉపయో గించుకొని పౌరసత్వ సవరణ చట్టం తీసుకు రావడం  దురదృష్ట కరమన్నారు.దేశంలోమతాల మధ్య విభేదాలు సృష్టించి  అల్లర్లకు కారణమైన మోడీ ప్రభుత్వాన్ని బర్త్  రఫ్  చేయాల న్నారు.సిఎఎ  చట్టాన్ని మతానికి సంబంధం లేకుండా సవరణ చేయాలని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎన్ఎఎ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ సిపిఎం నాయకులు బుగ్గప్ప, వెంకటేష్ విద్యార్థి సంఘం నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ ,డివిజన్ అధ్యక్షుడు దీపక్, రాజశేఖర్, పవన్, నరేష్, చెన్నప్ప, మల్లేష్, ముస్లిం సోదరులు, ప్రజా సంఘాల నాయకులు , వామపక్ష నాయకులు హుస్సేన్,  నరసింహులు, మునీర్ తదితరులు పాల్గొన్నారు.