శ్రీ వాణి టెక్నో స్కూల్ విద్యార్థులకు బహుమతులు 

సిద్దిపేట జిల్లా ప్రతినిధి(జనంసాక్షి) డిసెంబర్ 19:

 

స్థానిక సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీ వాణి టెక్నో స్కూల్ బుధవారం రోజున నిర్వహించిన  ఒలంపియాడ్ లెవెల్ వన్ పరీక్షలలో పాఠశాలల్లోని విద్యార్థులు ప్రధమ బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సి.హెచ్. సత్యం విద్యార్థులకు మెమొంటో సర్టిఫికెట్లు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో వివిధ పోటీ పరీక్షలలో రాణించాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్  కృపాకర్, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.