లిస్టింగ్‌ అయిన ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ బ్యాకింగ్‌


ముంబయి,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఇటీవల ఐపీఓకు వచ్చి రూ. 750 కోట్లను సవిూకరించిన ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, తొలిసారిగా లిస్టింగ్‌ అయింది. ఆరంభం రోజునే నమ్ముకున్న ఇన్వెస్టర్లకు 60 శాతం ప్రీమియంను అందించింది. ఒక్కో ఈక్విటీ వాటాను రూ. 36 నుంచి రూ. 37 మధ్య అమ్మకానికి ఉంచగా, 166 రెట్లు ఓవర్‌ సబ్‌ స్కయ్రిబ్‌ అయిన ఉజ్జీవన్‌ ఇష్యూ, కనీసం 50 శాతం ప్రీమియంను ఇస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. అయితే, అంచనాలను మించి ఈక్విటీకి డిమాండ్‌ కనిపించింది. ఉదయం స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభం కాగానే, ఉజ్జీవన్‌ స్మాల్‌ బ్యాంక్‌ ఈక్విటీ రూ. 62కు చేరింది. దీంతో సంస్థ పేరెంటే కంపెనీ ఉజ్జీవన్‌ ్గ/నాన్షియల్‌ సర్వీసెస్‌ మార్కెట్‌ కాప్‌ రూ. 4,300 కోట్లకు పైగా పెరగడం గమనార్హం.