రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా వైకాపా వ్యవహరిస్తుంది


- ప్రత్యేక ¬దాను పక్కన పెట్టారు
- పోలవరానికి నిధులివ్వాలని పార్లమెంట్‌లో కోరాం
- వైకాపా ఎంపీలు రాష్ట్ర అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తలేదు
- తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 
న్యూఢిల్లీ, డిసెంబర్‌14(జ‌నంసాక్షి) : వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తుందని, తమ కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక ¬దాపై కేంద్రాన్ని అడిగేందుకు జగన్మోహన్‌రెడ్డి, ఎంపీలు కనీస ప్రయత్నం చేయడం లేదని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో వైకాపా ఎంపీలు రాష్ట్ర సమస్యలు లేవనెత్తలేదని అన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని సమస్యలను కేంద్ర మంత్రులను కలిసి వివరించామని అన్నారు. ఆరు నెలల్లో జగన్‌ పాలనలో రాష్టాన్రికి తీవ్ర నష్టం జరిగిందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలు వెనక్కి వెళ్లిపోతున్నాయని రవీంద్ర అన్నారు. పార్లమెంట్‌లోనూ, అసెంబ్లీలోను ఆర్థిక నేరాల ప్రస్తావన లేదని, ప్రజాస్వామ్య పద్దతిలో అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని పార్లమెంట్‌లో కేంద్రాన్ని కోరామని, వైకాపా ఎంపీలు మాత్రం రాష్ట్ర అంశాలను పార్లమెంటులో లేవనెత్తలేదని విమర్శించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, 22 మంది లోక్‌ సభ సభ్యులు పార్లమెంట్‌ లో రాష్ట్ర పరిస్థితులు కేంద్రం దృష్టికి తేలేదన్నారు. జగన్‌ తమ 24మంది ఎంపీలను ప్రధాని వద్దకు పంపి ప్రత్యేక ¬దా, విభజన హావిూలు సాధించాలని కనకమేడల డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌, విజయసాయిరెడ్డి ఇతర అధికారులు ఆర్థిక నేరస్తులుగా ఉన్న కేసుల్లో.. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేందుకు ముఖ్యమంత్రి, పార్లమెంటరీ పక్ష నేతలపై ఉన్న కేసులే కారణమని కనకమేడల ఆరోపించారు. తాము అవినీతి రహిత వ్యక్తులమని జగన్‌, విజయసాయిరెడ్డి నిరూపించుకోవాలన్నారు. దిశ చట్టం మాదిరిగానే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి తమ 
సచ్ఛీలతను నిరూపించుకోవాలని రవీంద్రకుమార్‌ కోరారు.