ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు


భద్రాచలం,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నిధులు వెచ్చింది  ముక్కోటి ఏకాదశి మ¬త్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  రోజుకో రూపంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందుకోసం మిథిలా మండపం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన హంస వాహనానికి విద్యుద్దీపాలతో పాటు పుష్పాలంకరణ చేయనున్నారు. నాణ్యమైన బాణాసంచా తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
వేలసంఖ్యలో  భక్తులు వస్తారన్న అంచనాతో అన్ని శాఖలు ప్రణాళికలు తయారు చేసుకున్నాయి. ఆలయ పరిసరాలు పచ్చగా కళకళలాడేందుకు రంగు రంగుల పూల మొక్కలను తెప్పించారు. ప్రసాదాలకు ఇబ్బందుల్లేకుండా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ప్రత్యేక  బస్సులను నడుపనున్నారు. గోదావరి తీరంలో స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.