వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సిందే

లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన బాధత్య ప్రజలదే


ఆదిలాబాద్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): మరుగుదొడ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని డీఆర్‌డీవో పీడీ రాజేశ్వర్‌ రాథోడ్‌ అన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లను జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న ట్లు చెప్పారు. వీటి పురోగతిని ఎప్పటికప్పుడు కిందిస్థాయిలో అధికారులు తెలుసుకోవాలన్నారు. కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకున్నప్పటికీ వాటిని వినియోగించడం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని స్వఛ్చ ఆదిలాబాద్‌కు చేయూతను ఇవ్వాలన్నారు. మరుగుదొడ్లు లేని వారు తక్షణమే దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రావిూణ


ప్రజలు మరుగుదొడ్లను నిర్మించుకొని వాటిని వినియోగించు కోవాలని సూచించారు. అధికారులు గ్రామాలను సందర్శించి ఆరు బయట మూత్ర, మల విసర్జన చేస్తే వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించి


మరుగుదొడ్లను వినియోగించుకునేలా చేయాలన్నారు. బహిరంగ మూత్ర, మల విసర్జన ప్రాంతాలుగా ప్రకటించాలన్నారు. బేస్‌మెంట్‌ లెవల్‌లో ఒక బిల్లు వస్తుందని ఆతర్వాత మరుగుదొడ్డి పూర్తి అయితే అధికారులు పరిశీలించి ఫొటోలను చిత్రికరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి మొత్తం బిల్లును చెల్లిస్తారన్నారు. గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్థిక సాయం కోసం స్థానికంగా సంప్రదిస్తే అధికారులు చేయూతనిస్తారని అన్నారు.