లోక్‌సభకు వృద్దుల సంరక్షణ బిల్లు


న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఇకపై తల్లిదండ్రులు, వృద్ధులను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తే వారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా లేదా రెండూ గానీ విధించేందుకు చట్టం రానున్నది. ఈ మేరకు తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ (సవరణ) బిల్లు-2019ను కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు/ వృద్ధులను భౌతికంగా గానీ, మానసికంగా గానీ వేధించే కొడుకు, కూతురు, సవతి పిల్లలు, దత్తత పిల్లలు, అల్లుడు, కోడలు, మనుమడు, మనుమరాలు, మైనర్ల గార్డియన్లకు ఈ బిల్లు వర్తిస్తుంది.