హైదరాబాద్,డిసెంబర్18(జనంసాక్షి): ఇప్పటికే ఆన్‌లైన్ మోసాలు అధికంగా జరుగుతున్న తరుణంలో నగదురహితం వల్ల ప్రమాదాలే ఎక్కువని ఇటీవలి సంఘటనలే రుజువు చేస్తున్నాయి. ఆన్‌లైనప్ వ్యవహారాలతో చామాంది మోసపోతున్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేసి నైజీరియన్లు మోసం చేస్తున్నారు. నగదు రహితానికి స్వస్తి పలికి చిల్లర నోట్లు ఎక్కువగా తెచ్చి, రూ.500 నోటుకు మించి పెద్ద నోటు లేకుండా చేయాలన్న పలువురి సూచనలు పట్టించుకోవడం లేదు. నిరక్షరాసులు ఎక్కువగా ఉన్న దశలో నగదురహితం సాధ్యమా ఆలోచన చేయాలన్నారు. నగదు రహిత లావాదేవీలను చిన్న వారి దగ్గరి నుంచి పెద్ద వారి వరకు జరపాలని ఒక పక్క ప్రోత్సహిస్తూ అందుకు తగ్గ పరిస్థితులు కల్పించడం లేదన్నారు.
ఆన్‌లైన్ మోసాలను పట్టించుకోరా?