నగరంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వేడుకలు

ఖైరతాబాద్ ; డిసెంబర్ 19 (జనం సాక్షి) బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం నగరంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో  నిర్వహించింది ఈ కార్యక్ర మానికి మంత్రులు కె టి ఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పన బాధ్యతలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేసిన వారికి ఈ అవార్డులను అందజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డి పి ఎస్ రెడ్డి మాట్లాడుతూ బిల్డర్ అసోసియేషన్ వేడుకలు హైదరాబాద్ నగరంలో జరగడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ వేడుకలు భవిష్యత్తులో కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంతో పనులు చేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు నవీన్ చంద్ర, ఉపాధ్యక్షులు శ్రీ రామ్, ప్రతినిధులు బొల్లినేని శీనయ్య, ఎస్ ఎన్ రెడ్డి ,బిల్డర్స్ డే ఈవెంట్ చైర్మన్ సచ్చిదానంద తదితరులు పాల్గొన్నారు.