తప్పిపోయిన వలస కూలి

చేర్యాల (జనం సాక్షి) డిసెంబర్ 18 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ పరిధిలోగల ,తూర్పు గుంటూరు పల్లి దగ్గర పొట్టకూటి కోసం గత కొంత కాలం నుండి ఇటుక బట్టీల తయారు పనుల కోసం ,వచ్చి 5 రోజుల క్రితం  నుండి తప్పిపోయినాడు. ఇతని  కోసం బుధవారం రోజున తన భార్య సత్యభామ ,చేర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు ఏ ఎస్ ఐ శ్రీనివాస్ గారి వివరాల ప్రకారం, లింగరాజు మ జీ ది ,ఒరిస్సా రాష్ట్రం ,జిల్లా  కాటన్ బండి ,మండలం  దాల్ మదర్ ,లో  జలం గారు గ్రామం వాసుడైన లింగరాజు మజీ తండ్రి సాహస ,ఇతని వయస్సు 28 సంవత్సరాలు గలడు, ఇతను  ఆదివాసి కులస్తు డు , చేర్యాల ప్రాంతంలో చల్ల బాలకృష్ణ దగ్గర, పని చేయుటకు తన భార్య సత్యభామ కూతురు కలిసి వచ్చినారు. కానీ 14 తేదీనాడు పని చేసే స్థలం నుండి ఒంటరిగా వెళ్లిపోయినాడు ,ఎవరికీ తెలవదు ఇతని ఎత్తు 5.3  నలుపురంగు కలిగి ఉన్నాడు, నలుపు కలర్ పాయింట్ బ్లూ కలర్ షర్టు ధరించి నాడు, ఎవరికైనా ఆచూకీ తెలిసినచో  ఫోన్ చేయగలరు 9 8 6 6 1 1 8 8 మరియు9 4 4 0 9 0 4 6 5 6 నెంబర్ కు ఫోన్ చేయగలరు. ఏ ఎస్ ఐ శ్రీనివాస్  కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.