కశ్మీర్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులున్నాయి


- కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా 
న్యూఢిల్లీ, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : కశ్మీర్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో మంగళవారం ఆయుధ సవరణ చట్టంపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కశ్మీర్‌కు స్వయంప్రతిపత్రి కల్పించే 370 అధికరణ రద్దు అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై అమిత్‌షా స్పందిస్తూ.. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, కాంగ్రెస్‌లో మాత్రం సాధారణ పరిస్థితి తనకు కనిపించడం లేదని అన్నారు. ఎందుకంటే 370 అధికరణ రద్దు చేస్తే రక్తపాతం తలెత్తుతుందని కాంగ్రెస్‌ అంచనా వేసిందనీ, అయితే ఒక్క బులెట్‌ కూడా పేల్చకుండానే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కశ్మీర్‌లో రాజకీయ నేతలను ఒక్కరోజు కూడా అదనంగా జైళ్లలో ఉంచాలని తాము అనుకోవడం లేదన్నారు. కశ్మీర్‌ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు సరైన సమయమని భావిస్తుందో అప్పుడే రాజకీయ నేతలు జైలునుంచి విడుదలవుతారని చెప్పారు. ఫరూక్‌ అబ్దుల్లా తండ్రిని కాంగ్రెస్‌ హయాంలో 11ఏళ్ల పాటు జైలులో ఉంచారని, అయితే తాము మాత్రం అలాచేయమని, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు నిర్ణయిస్తుందో అప్పుడే నేతలు విడుదలవుతారని చెప్పారు. సాధారణ పరిస్థితులు (నార్మలసీ) అంటే కాంగ్రెస్‌ ఏమనుకుంటోందని అమిత్‌షా ప్రశ్నించారు. 99శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, అధీర్‌ రంజన్‌కు ఇది సాధారణ పరిస్థితిగా కనిపించడం లేదని అన్నారు. 7 లక్షల మంది ప్రజలకు ఓపీడీ సేవలు అందుతున్నాయని, ప్రతి చోటా 144 సెక్షన్‌ తొలగించామని చెప్పారు. కానీ, 
కాంగ్రెస్‌ విపక్ష నేత అధీర్‌కు సాధారణ పరిస్థితి అంటే రాజకీయ కార్యకలాపాలు ఒక్కటే కనిపిస్తున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మాటేమిటని అమిత్‌షా నిలదీశారు.