బస్సుపై దాడి చేసిన దుండగులు

జగిత్యాల,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు గత రాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల వద్ద చోటుచేసుకుంది. కోరుట్ల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై అర్థరాత్రి ఒంటిగంటకు కారులో వచ్చి ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. జరిగిన ఘటనపై బస్సు డ్రైవర్‌ జగిత్యాల పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బస్సులోని 18 మంది ప్రయాణికులను అధికారులు మరో బస్సులో హైదరాబాద్‌కు పంపించారు.