ఘనంగా యూత్   క్రిస్మస్  వేడుకలు


ఝరసంగం డిసెంబర్ 19 (జనంసాక్షి) మండల కేంద్రంలో ని ఝరసంగం లో ఆలోచన యూత్ ఆధ్వర్యంలో  యూత్   క్రిస్మస్ వేడుకలు బుధవారం రోజు  రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా సర్పంచ్ జగదీశ్వర్, ఎంపిటిసి రజిని ప్రియ సంతోష్ పాటిల్, ఎస్ఆర్డిఏ అధ్యక్షుడు రాయికోటి నర్సింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  వారు  మాట్లాడుతూ  క్రిస్మస్ పండగ నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరపడం జరుగును అని  ప్రజలను రక్షించడానికి ఏసుక్రీస్తు జన్మించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలోచన యూత్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్,మాజీ సర్పంచ్ పెంటయ్య, నాయకులు నాగన్న పాటిల్, నాగేశ్వర్ సజ్జన్, మల్లికార్జున్, ఇస్మాయిల్, నాసర్, సభ్యులు ప్రవీణ్, సామెల్,సాగర్,బాల్ రాజ్, విలాస్, తదితరులు పాల్గొన్నారు.