రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


మెదక్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): జిల్లాలోని నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా ఎస్‌ వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.