రామప్పను సందర్శించిన స్విజర్లాండ్ దేశీయులు

వెంకటాపూర్/ములుగు, డిసెంబర్ 19 (జనంసాక్షి):

మండల పరిధిలోని పాలంపేట గ్రామంలోని గల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయాన్ని గురువారం రోజున స్విట్జర్లాండ్ దేశానికి చెందిన దంపతులు మరియు గ్రీస్ దేశస్థుడు రామప్పను సందర్శించారు.వారికి ఆలయ అర్చకులు సాదరణ స్వాగతం పలికి శ్రీ రామలింగేశ్వర స్వామి వద్ద పూజలను నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.అనంతరం ఆలయ గైడ్ వెంకటేష్ ద్వారా ఆలయ చరిత్రను వివరించారు.అనంతరం వారు మాట్లాడుతూ రామప్ప యొక్క చరిత్ర, శిల్పాకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉందని అన్నారు.ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని,రామప్ప యొక్క చరిత్ర శిల్పాకళా నైపుణ్యాలు చాలా అద్భుతంగా ఉందని అన్నారు.అనంతరం రామప్ప శిల్పకళా,ఆలయ అందాలను వారివారి కెమెరాలలో బందించుకొని,రామప్ప సరస్సును తిలకించారు