నిరు పేదలకు దుప్పట్ల పంపిణీ 


- బాలానగర్ జనం సాక్షి 19:

భగత్ సింగ్ యూత్ అశోసియెషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గురువారం ఏ దిక్కులేని నిరు పేద వృద్ధులు పార్కుల్లో, ఫుట్ పాత్ లపై రాత్రి వేళల్లో చలికి వణుకుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారిని చూసి చలించి బాలానగర్ భగత్సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి బనగిరి చైతన్య రెడ్డి దుప్పట్ల పంపిణీ చేశారు. ఫ్యారడైజ్ సిగ్నల్ ప్రాంతంలో అనేకమంది హోం లెస్ పీపుల్ కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర లేక అనేక అవస్థలు పడుతున్నారని అలాంటి వారిని అధికారం తమకు తోచిన  విధంగా ఆదుకునేందుకు ఆయా సంఘాల వారు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, చైతన్య, ప్రసాద్,కార్తీక్,సాయి తదితరులు పాల్గొన్నారు.