ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ఆత్మహత్య చేసుకుంటా: హీరో ఆందోళన

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): దుర్గాప్రసాద్‌ హీరోగా రూపొందిన చిత్రం 'నానిగాడు'. ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్‌ తగిలింది. సినిమాను ఎవరో యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వ్యవహారంపై హీరో దుర్గా ప్రసాద్‌ ఫిలిం ఛాంబర్‌ వద్ద నిరసనను వ్యక్తం చేశారు. 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 'నానిగాడు' సినిమా తీశాం. సినిమా సెన్సార్‌ పూర్తయ్యింది. 'యు' సర్టిఫికేట్‌ కూడా వచ్చింది. సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో ఎవరో యూట్యూబ్‌లో మొత్తం సినిమాలో అప్‌లోడ్‌ చేసేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అలాగే యూట్యూబ్‌ లింక్‌ను వెంటనే తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు న్యాయం జరగకపోతే రేపు చిత్ర యూనిట్‌తో సహా ఛాంబర్‌ వద్ద ఆత్మహత్య చేసుకుంటాం అన్నారు.