మహిళను హత్య చేసి ముఖం తగులబెట్టిన దుండగులు

రాంచీ,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): ఓ మహిళను హత్య చేసి సగం శరీర భాగాలను తగలబెట్టిన సంఘటన ఝార్ఖండ్‌లోని ఖుంటి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఓ మహిళను హత్య చేసిన అనంతరం ముఖంపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ముఖం ఒక్కటే కాలిపోవడంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారిందని డిఎస్‌పి అశిష్‌ మోహ్లీ తెలిపాడు. గురవారం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని, మృతదేహం ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు ముఖంపై పెట్రోల్‌ పోసి తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, అదృశ్యమైన మహిళల వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని పోలీసులు వెల్లడించారు.