దిశ చట్టానికి ఆమోదం రోజే దారుణం

ఐదేళ్ల బాలికపై దుండగుడి అఘాయిత్యం
గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద పార్టీల ఆందోళన..ఉద్రిక్తత
నిందితుడిని తక్షణం ఉరితీయాలని డిమాండ్‌
బాధిత బాలికను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
గుంటూరు,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): దిశ చట్టానికి రూపు దాలుస్తున్న  వేళ దారుణం జరగింది. ఓ దండుగుడు కామంతో కళ్లు మూసుకు పోయి ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటువంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించేందుకు తెచ్చిన దిశ బిల్లును అసెంబ్లీ ముక్తకంఠంతో ఆమోదించిన రోజే గుంటూరు సిటీలో ఈ ఘటన వెలుగు చూసింది. తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఉదంతంపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. బాధితురాలు చికిత్స పొందుతున్న జీజీహెచ్‌ ఆస్పత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకొని.. నిరసన తెలిపాయి. 'నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారా.. లేక రెడ్డి సామాజికవర్గంవాడని చెప్పి వదిలిపెడతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. వారితో టీడీపీ, బీజేపీ మహిళా నేతలు కూడా గొంతు కలిపారు. దీంతో జీజీహెచ్‌ ప్రాంతంలో కొద్దిగంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై జరిగిన అత్యాచారాన్ని టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం నేతలు ఖండించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికకు అండగా ఆయా పార్టీల నేతలు ఆస్పత్రి కాన్పుల వార్డు ఎదుట ధర్నాకు దిగారు. ¬ం మంత్రి తక్షణమే రావాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దిశా చట్టంలో గుంటూరు ఘటన తొలి చర్యగా చేపట్టాలన్నారు. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ మైనర్‌ బాలికపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. భాధితురాలి కుటుంబానికి జనసేన అండగా ఉంటుందన్నారు. నింధితుడిపై దిశ 2019 చట్టాన్ని 
తక్షణమే ఆమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి నిందితుల కేసులను రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు వాదనలు వినిపించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యాచారయత్నానికి గురై.. గుంటూరు జిజిహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ బాలికను ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె విూడియాతో మాట్లాడుతూ అత్యాచార యత్న ఘటన బాధ కలిగిస్తుందన్నారు. సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇలాంటి ఘటనకు పాల్పడడం దుర్మార్గమన్నారు. దిశ ఘటన నేపథ్యంలో ఎపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షలు ఉంటాయని, ప్రభుత్వం నేరాల రిజిష్టర్‌ను ఏర్పాటు చేసి మహిళలపై జరిగే నేరాలను నమోదు చేస్తుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. భవిష్యత్తులో చిన్న పిల్లలు, మహిళలపై అరాచకాలకు పాల్పడితే దిశ చట్టం, మహిళా కమిషన్‌ చూస్తూ ఊరుకోదన్నారు. దిశ చట్టంపై గ్రామ స్థాయిలో చర్చ జరగాలని, దిశ చట్టాన్ని మహిళా కమిషన్‌ ప్రజలలోకి తీసుకెళ్తుంద న్నారు. ఇప్పటికే బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకుంటామిని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వాసిరెడ్డి పద్మ హావిూ ఇచ్చారు.