విద్యార్థులకు టీ బెల్టులు అందించిన హోటల్ యజమాని
బిచ్కుంద జుక్కల్ జనవరి 24 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామవాసి, హోటల్ యాజమాని అపసివార్ గంగారాం తమ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలపై మమకారంతో 165 మంది విద్యార్థులకు టై,  బెల్ట్ లను స్వంత డబ్బుతో వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. సర్పంచ్ ఆస్పత్వార్ వినోద్, సింగిల్ వైస్ చైర్మన్ విజయ్ పాటెల్, ప్రధాన ఉపద్యాయులు చంద్రకాంత్ గౌడ్, ఉపసర్పంచ్ ఖాండే రావు చేతుల మీదుగా వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యా కమిటీ చైర్మన్ శివాజీ, వార్డ్ మెంబర్ రాజు, శ్రీనివాస్, రవీందర్, ఖండే రావు, పవన్, మంజుల మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.