మెక్సికో ప్రమాదంలో 16మంది మృత్యువాత

న్యూఢిల్లీ,జనవరి8(జనంసాక్షి):  మెక్సికోలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 16 మంది మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో రైలు వేగానికి బస్సు రెండుగా తునాతునకలైంది. తమావుపాలిస్‌ రాష్ట్రంలోని అనాహుక్‌ టౌన్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్‌ వద్ద స్టాప్‌ లైట్‌ ను బస్సు డ్రైవర్‌ గమనించకపోవడమే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. బస్సులో 40 మంది ప్రయాణికులకు మాత్రమే అవసరమైనన్ని సీట్లు ఉన్నప్పటికీ 60 మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే బస్సు డ్రైవర్‌ గాయాలతో బతికి బయటపడినట్టు సమాచారం. ఈ యాక్సిడెంట్‌ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.