నవాబ్ నర్ ఖాజ సలీముల్లా బహదూర్ (1871-1915)

స్వాతంత్ర్యం మాత్రమే కాకుండా స్వజనుల అభ్యున్నతి కోసం కృషిచేసిన నవాబ్ సర్ జా సలీముల్లా బహదూర్ 1871 జూన్ ఏడున ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జన్మించారు. తండ్రి నవాబ్ అహ్సనుల్లా. 1893లో 'డిప్యూటీ మెజిస్ట్రేట్' ఉద్యోగం చేపట్టిన సలీముల్లా స్వదేశీ వర్తకులకు ప్రజలను యూరోపియన్ వర్తకులు, అధికారులు దోచుకుంటున్న తీరును, సాగిస్తున్న ఆధిపత్య ధోరణులను చూసి ఉద్యోగానికి 1895లో రాజీనామా చేశారు. ఆ తరువాత వ్యాపారరంగం తోపాటుగా ప్రజాసేవారంగంలో ప్రవేశించి, పేద ముస్లిం జనసముదాయాల అభ్యున్నతికి ఆయన నడుం కట్టారు. విద్యాగంథం లేనందువల్ల ప్రజలు అన్ని విధాల నష్టపో తున్నారన్న భావనతో విద్యా వికాస కార్యక్రమాలకు చేయూత నిచ్చారు. అలీఘర్‌లోని 'ముహమ్మదన్ ఆంగ్లో ఓరి యంటల్ కాలేజి' అభివృద్ధికి భూరి విరా ళాలు అందజేశారు. 1901లో తండ్రి కన్నుమూయడంతో సర్ ఖాజా సలీముల్లా బహదూర్ ఢాకా కు నాల్గవ నవాబు అయ్యారు. భూస్వామ్య వర్గాల దోపిడికి గురవుతున్న పేద ముస్లిం రైతాంగానికి గురవుతున్న పేద ముస్లిం రైతాంగానికి 'బెంగాల్ విభజన' మేలు చేస్తుందని ఆయన భావించారు. ఆ కారణంగా 1906 నాటి 'బెంగాల్ విభజన'ను ఆయన పూర్తిగా సమర్థించారు. ముస్లిం జనసముదాయాలలో విద్యాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా 1906లో స్వయంగా 'తూర్పుబెంగాల్ - ఆస్సాం ప్రోవిన్షియల్ ఎడ్యుకేషనల్ కాన్ఫెరెన్స్' నిర్వహించారు. ముస్లింల విద్యావకాశాలను మెరుగుపర్చేందుకు ఢాకాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆయన చేశారు. ముస్లింల సామాజిక-రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రత్యేక రాజకీయ పక్షం అవసరమని భావించారు. భారత దేశంలోని సుమారు రెండువేల మంది ముస్లిం ప్రముఖులకు స్వయంగా ఆయన లేఖలు రాసి ఈ విషయమై చర్చించేందుకు తన రాజప్రాసాదం 'అహ్సన్ మంజిల్'కు ఆహ్వానించారు. అలీఘర్‌లోని 'ముహమ్మదన్ ఆంగ్లో ఒరియంటల్ కాలేజి' విజ్ఞప్తి మేరకు స్వంత ఖర్చుతో 'ఆల్ ఇండియా ముహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫెరెన్స్' ను 1906 డిసెంబర్ 27 నుండి 30 వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో భోపాల్ బేగం, అలీ సోదరులు, మౌలానా ఆజాద్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశం చివరి రోజున 'ఆల్ ఇండియా ముస్లిం లీగ్' ప్రతిపాదనను ఆయన ప్రవేశపెట్టి 'లీగ్' అవసరాన్ని వివరిస్తూ ప్రసంగించారు. ఖాజా సలీముల్లా బహదర్ ప్రయ త్నాల ఫలితంగా ఆవిర్భవించిన 'అల్ ఇండియా ముస్లిం లీగ్' కార్యక్రమాలకు చేయూతనిచ్చిన ఆయన పలు పదవులను కూడా నిర్వహించారు. 1911లో 'బెం గాల్ విభజన' ను ఆంగ్ల ప్రభుత్వం రద్దు చేయగా, ముస్లింల అభివృద్ధి-సంక్షేమం ఆశిస్తూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయన ఆంగ్ల ప్రభుత్వానికి అందచేశారు. 1914లో క్రియాశీలక రాజకీయాల నుండి వైదొలిగినా విద్యాలయాలు, విద్యార్థుల వసతి గృహాల ఏర్పాటుకు తన సంపదను వ్యయం చేయడం మాత్రమే కాకుండా ప్రభుత్వ నిధుల కోసం శ్రమించిన నవాబ్ సర్ ఖాజా సలీముల్లా బహదూర్ 1915 జనవరి 15న ఢాకాలో కన్నుమూశారు.