4న టిఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

మున్సిపల్‌ ఎన్నికలు లక్ష్యంగా కెసిఆర్‌ దిశా నిర్దేశం


పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్న గులాబీ బాస్‌


హైదరాబాద్‌,జనవరి2 (జనం సాక్షి) : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలోఈ నెల 4వ తేదీన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనుంది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 వరకు జరిగే ఈ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లకు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకు ఆహ్వానం పంపించారు. త్వరలోనే సిఎం కెసిఆర్‌తో సమావేశం ఉంటుందని బుధవారం మంత్రి కెటిఆర్‌ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ అన్ని పట్టణాలను కైవసం చేసుకునేందుకు వ్యూహం పన్నుతోంది. 2019లో జరిగిన సర్పంచ్‌ , జిల్లాపరిషత్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో అధిక స్థానాలు  టిఆర్‌ఎస్‌  గెలుచుకున్నది.  టిఆర్‌ఎస్‌ జిల్లాపరిషత్‌లన్నింటినీ గెలుచుకుని కాంగ్రెస్‌,బిజెపి ఉనికిని ప్రశ్నించేలా చేసింది. ఎన్నికలు ఏవైనా సిఎం కెసిఆర్‌ను ప్రజలు ఆశీర్వదిస్తూ విజయం చేకూర్చారని టిఆర్‌ఎస్‌ ధీమాగా ఉంది. టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించినప్పటినుంచి నేటివరకు అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసి, 60 లక్షల 


సభ్యత్వ నమోదుతో రికార్డు సృష్టించింది.  పార్టీల కొత్తకమిటీల నిర్మాణం గ్రామ,వార్డు,పట్టణ మండల కమిటీలను 98 శాతం ఏర్పాటు చేసుకుకుని అతిపెద్దరాజకీయపార్టీగా టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది.  ప్రస్తుతం జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లా పరిషత్‌ ఎన్నికల విజయం పునరావృతం అవుతుందని 


కూడా పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇకపోతే కొత్త జిల్లాల ఏర్పాటు తరవాత టిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాపార్టీ కార్యాలయాల నిర్మాణాలపై దృష్టి సారించింది. గతంలో కేవలం ఖమ్మంజిల్లాలోనే టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం 30 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. 90 శాతం వరకు పనులు పూర్తి అయ్యాయి. సంక్రాంత్రి అనంతరం పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌ పార్టీ కార్యాలయాను ప్రారంభించడం ద్వారా శ్రేణుల్లో జోష్‌ నింపనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలకు ఇప్పటికే ఇన్‌ఛార్జీలను నియమించారు. మున్సిపాలిటీల వారిగా నివేదికలను తెప్పించుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో టిఆర్‌ఎస్‌ నుంచి పోటీకి సిద్ధమంటున్న బలమైన నాయకులను కూడా గుర్తించారు.  కొన్ని మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌ నాయకుల మధ్యనే సీటును ఆశించేవారికి పోటీ ఉందని స్వయంగా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ¬దాలో కెటిఆర్పక్రటించారు. వారందరినీ ఓ దార్చి గెలిచే అభ్యర్థులకు ప్రస్తుతం పోటీ చేసే అవకాశం రాకున్నా భవిష్యత్‌లో నామిననేటెడ్‌ పోస్టులు కల్పిస్తామని చెపుతూ ఏకాభిప్రాయం సాధిస్తున్నామని కెటిఆర్‌ చెప్పారు. ఇకపోతే ఇప్పటివరకు మూడు పర్యాయాలు జరిగిన పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో మున్సిపాలిటీ ఎన్నికలపై మున్సిపాలిటీల వారిగా సవిూక్షించి నివేదికలను రూపొంచారు. ఈనివేదికలతో పాటు క్షేత్ర స్థాయి నివేదికలను పరిశీలించిన అనంతరం, టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులతో సంయుక్త సమావేశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన ఏర్పాటుచేశారు.  ఈసమావేశంలో సిఎం కెసిఆర్‌ పలు నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.  


---------------------