అంధుల కోసం ఆర్బిఐ కొత్త యాప్‌


ప్రారంభించిన గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌


 ముంబై,జనవరి 2 (జనం సాక్షి) : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సరికొత్త మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. కంటిచూపు సరిగ్గాలేని వారు కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా 'మనీ' పేరుతో ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను తీసుకు వచ్చింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈయాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను ఐవోఎస్‌ ఆపిల్‌ ప్లే స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌ వంటి వాటి నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు దీనిని ఉచిత డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంది ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది.


యాప్‌ స్టోర్‌ లేదా గూగుల్‌ ప్లే స్టోర్‌ కి వెళ్ళండి. మణి' అని టైప్‌ చేయండి. ఎయిడెడ్‌ నోట్‌ ఐడెంటిఫయర్‌ అప్లికేషన్‌ యాక్స్‌స్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఈ యాప్‌ను ఓసారి డౌన్‌ లోడ్‌ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో లేకపోయినా అంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా పని చేస్తుంది. వినియోగదారులు మాని అనువర్తనాన్ని డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత, మొబైల్‌ కెమెరాను ఉపయోగించి కరెన్సీ నోట్‌ను స్కాన్‌ చేస్తే, హిందీ, ఆంగ్ల భాషలలో నోట్‌ విలువ ఆడియో వినిపిస్తుంది. అయితే మని యాప్‌ నకిలీ నోట్లను గుర్తించలేదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. కాగా 2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్‌ తర్వాత ఆర్‌బీఐ 'మహాత్మా గాంధీ సిరీస్‌' కింద కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది. రంగు, డిజైన్‌, పరిమాణాలలో గణనీయమైన మార్పులతో కొత్త కరెన్సీ నోట్లను రూ .2000, రూ .500, రూ .200, రూ .100, రూ .50, రూ .20 రూ.10 నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని గుర్తించిడంలో అంధులు అనేక సమస్యలను ఎదుర్కొన్న నేపథ్యంలో తాజాగా ఈ యాప్‌ను తీసుకొచ్చింది.