"తెలుగుల క్రాంతి-వెలుగుల సంక్రాంతి"

సకినాల పండగ సంకురాతిరి పండగ

పంటలన్ని పండగ గాదెలెన్నొ నిండగ

తెలుగునాట ఆనందాలు పండగ

రవి చిమ్మును కొత్తకాంతి దండిగ

 

1.కళ్ళాపి జల్లిన పచ్చనైన వాకిళ్ళు

ఇంటింటి ముంగిట ముగ్గులు గొబ్బిళ్ళు

కుంకుడుకాయలతో తల అంటుళ్ళు

భోగి మంటలతో ఉదయాలు రాత్రుళ్ళు

 

2.ఆట పట్టించే అల్లరి మరదళ్ళు

జడపట్టుక లాగే అక్కల మొగుళ్ళు

నోరూరే అరిసెలు తీరొక్క  పిండి వంటలు

సరదాలు సందళ్ళు సంతోషం పరవళ్ళు

 

3.పరికిణీ వోణీలు కంచి పట్టు కోకలు

నోములూ వ్రతాలు ఇంతుల పేరంటాలు

బొడబొడరేణివళ్ళు చిన్నారుల కేరింతలు

పతంగులతొ నింగిలోన రంగుల హరివిల్లు

 

4.కోన సీమలోన కోడి పందాలు

రాయల సీమలో గిత్తల పందాలు

వాడావాడలో జూదాలు దందాలు

మునిమాపే కసిరేపే అందచందాలు
ఇది నా స్వంత రచన ,దేనికి అనువాదం కాని అనుసరణ/అనుకరణ కాని కాదు,ఏ ప్రింట్ మీడియా లోను వెబ్  మీడియా లోను,టెలీ మీడియా లోను ప్రచురింప బడలేదు,ప్రసారమూ కాలేదు పరిశీలన లోనూ లేదు .ఇదే నా హామీ.

భవదీయుడు,
డా.గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)
MOBILE NO:9849693324

H.NO:3-217/11,ROAD NO.14-North,PRASHANTHI HILLS, MEERPET,HYDERABAD-500097