పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలి


లక్ష్యాన్ని పూర్తి చేసిన పంచాయితీలకు ప్రోత్సాహకాలు


రెండోవిడత పల్లె ప్రగతిలో కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిట్‌


వరంగల్‌ అర్బన్‌,జనవరి 2 (జనం సాక్షి) : గ్రామాల్లో డంపింగ్‌ యార్డ్‌ వైకుంఠ దామం నిర్మాణాలతో పాటుగా ప్రతి ఇంటికి సోప్‌ ఫీట్స్‌ వందకు వందశాతం నిర్మాణాలు చేసిన గ్రామ పంచాయతీలకు ఐదు లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జె పాటిల్‌ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడి ఆవరణలో పరిసరాలను  పరిశుభ్రంగా చేసేందుకు  ప్రాధాన్యత  ఇవ్వాలన్నారు పాఠశాలల ఆవరణలో మొక్కలను ముళ్ల  పొదలను తొలగించగ్రౌండ్‌ ను లేవలింగు చేయలని అవరమైతే మొక్కలు నాటాలని ఆదేశించారు. రెండో దశ ప్లలె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌తో కలసి ఎల్కతుర్తి మండలం లోని బావుపేట, జిలుగుల జగన్నాథ్‌ పూర్‌ లో పర్యటించి నర్సరీలను డబ్బింగ్‌ యాడ్‌ సోప్‌ ఫీట్స్‌ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ గ్రామ ప్రగతికి చేపట్టవలసిన అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు దిశ నిర్దేశాలు జారీ చేశారు. గ్రామ నర్సరీలో  నిర్దేశిరచిన లక్ష్యం మేరకు బ్యాగ్‌  ఫిల్లింగ్‌  పక్రీయాను  పూర్తి చేయాలన్నారు  ప్రభుత్వ తరుపున ఈ సారి విత్తనాల సరఫరా లేనందున  గ్రామ గ్రీన్‌ ఎ/-లాన్‌ ప్రకారంగా  విత్తనాలను సేకరించి నర్సరీల పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు  అవెన్యూ  బండ్‌  గృహ అవసరాలకు సంభందించిన విత్తనాలను సేకరణ చేసి నర్సరీ లో పెంచాలని ఆదేశించారు. డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠ దామల నిర్మాణాలు గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు వంద కు వంద శాతం నిర్మాణాలను పూర్తి చేసిన గ్రామ పంచాయతీలకు   5లక్షల రూపాయల నగదు  ప్రోత్సాహకాన్ని అందజేస్తామని కలెక్టర్‌ వెల్లడించారు.  జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశయం మేరకు ప్లలె ప్రగతి ని విజయవంతం చేయాలని అన్నారు ఎన్నడూ లేనివిధంగా గ్రామాభివృద్ధికి నెల నెల నిధులు మంజూరు చేస్తున్నందున ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషిచేయాలని ఈ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం చేసి గ్రామ ప్రగతినీ ముందుకు తీసుకొని వెళ్ళాలని స్థానిక ప్రజా ప్రతినిధులను కోరారు ప్రభుత్వం ప్లలె ప్రగతి సూచించిన అంశాలను అమలు చేయాలన్నారు. బావుపెట గ్రామంలో పర్యటించి  గ్రామంలో గల అంగన్వాడి అంగన్వాడి ప్రాథమిక పాఠశాల నర్సరీని  పరిశీలించారు. పాఠశాల పరిసర ప్రాంతం లో గ్రౌండ్‌ పిచ్చిమొక్కలు తొలగించి చదను చేయలని అధికారులకు ఆదేశించారు. పదను లెవెలింగ్‌ ఉంటే విద్యార్థులకు అట స్థలంగా ఉపాయోగ పడుతుందన్నారు  రేపటిలోగా పూర్తి చేయలని ఆదేశించారు. అంగన్‌ వాడిలో ఎక్కువమంది పిల్లను చేర్పించి ప్రభుత్వ నిర్దేశిరచిన ప్రకారంగా మెనూను అమలు చేయలని అదేవిధంగా పాత శాలలో కూడా మధ్యాహ్నం భోజనంలో కూడా మెనూ అమలు చేయాలని స్థానిక  ప్రజా ప్రతినిధులు అప్పుడప్పుడు తనిఖీ చేయాలన్నారు. గ్రామ నర్సరీ లో 8500 మొక్కలకు పెంచాలని  నిర్దేశిరచిన దృష్ట్యా  గ్రీన్‌ ప్లాన్‌ ప్రకారంగా విత్తనాలను సేకరించి నర్సరీ లో మొక్కలు పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. సేకరించిన  చెత్తను డంపింగ్‌ యార్డులోనికి రోజు వారిగా తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. చెత్తను ఎలా సేకరిస్తున్న రని  జి పి పారిశుధ్య కార్మికులను  తెలుసుకొని   రోజుకు వార్డు వారిగా లేదా గల్లి గల్లి కి తిరిగి చెత్తను సేకరించి  నేరుగా డంపింగ్‌ యార్డుకు తరలించాలని చెప్పారు.యూరారం గ్రామం లో మొక్కల పెంపకం ను పరిశీలించి  చుట్టూ పిచ్చి మొక్కలను  తొలగించాలని  మొక్కలు పెరిగేందుకు అవసరమైన చర్యలు రెగ్యులర్‌గా మొక్కలకు విూరు పోసేందుకు చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్‌ తో పాటుగా  ట్యాంకర్‌ ను తీసుకుంటే మొక్కలకు నీరు పోసే అవకాశం ఉందన్నారు గ్రామంలో అవెన్యూ మొక్కలకు ఏర్పాటు చేసిన ట్రీ గార్డులను  దొంగలించిన వారిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ ఐ నీ ఆదేశించారు. అక్కడి నుండి జిలుగుల గ్రామంలో నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు జడ్పీ చైర్మన్‌ తో కలిసి కలెక్టర్‌ ఇంకుడు గుంత పనులను ప్రారంభించారు నర్సరీ స్మశాన వాటిక. నిర్మాణ స్థలం కోసం సేకరించిన స్థలాన్ని పరిశీలించారు.


జగన్నాధపురం లో సామూహిక చెట్ల పెంపకం క్షేత్రాన్ని నర్సరీ తో పాటుగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను పరిశీలించారు గ్రామంలో ఇంకా 130 ఇంకుడు గుంతలను గ్రౌండింగ్‌ చేసి ఇంకుడు గుంతలు స్మశాన వాటిక వందకు వందశాతం ఇంకుడు గుంతలను పూర్తి చేసినట్లయితే గ్రామానికి ఐదు లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని జిలుగుల జగన్నాధపురం లో వైకుంఠ గ్రామాలకు స్థల సేకరణ పూర్తి చేసి నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్లలె ప్రగతి మండల ప్రత్యేక అధికారి డీఎస్‌ఓ, ఎంపీపీ ఎంపీటీసీ శ్రీనివాస్‌ రెడ్డి గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.