ఉమ్మడి జిల్లాలో సత్తా చాటుతాం


మున్సిపల్‌ ఎన్నికల్లో బిజెపి బలమేమిటో చూపిస్తాం


కెటిఆర్‌ వ్యాఖ్యలు పట్టించుకునేది లేదు: బండి


కరీంనగర్‌,జనవరి2  జనంసాక్షి కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఉన్నమున్సిపాలిటీల్లో బిజెపి సత్తా చాటుతుందని


రీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. బిజెపి ఎక్కడా లేదన్న మంత్రికెటిఆర్‌ వ్యాఖ్యలపై ఎంపి మండిపడ్డారు. నాలుగు ఎంపి సీట్లు కోల్పోయినా వారు కళ్లుతెరవలేదన్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లోసత్తా చాటి తామేంటోమారు చూపిస్తామని అన్నారు. ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అంటున్న టిఆర్‌ఎస్‌, వారితో మిలాఖత్‌ అయ్యారని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే అవుతుందని హెచ్చరించారు. సీఏఏ బిల్లు ఆమోదం పొంది నెలరోజులు అవుతుండగా ఇన్నాళ్లు 


స్పందించని టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు తమ ఓటు బ్యాంక్‌ కోసం, మున్సిపల్‌ ఎన్నికలలో లబ్ది పొంద డానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. టీఆర్‌ ఎస్‌, ఎంఐఎం పార్టీలకు ఓటేసి గెలిపిస్తే తెలంగాణ ప్రజలు సీఏఏకు వ్యతిరేకమని దేశమంతా ప్రచారం చేసే అవకాశం ఉందని, ప్రతీ భారతీయుడు మున్సిపల్‌ ఎన్ని కల్లో బీజేపికి ఓటు వేయాలని కోరారు. ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు అనంతరం దేశంలో మత విద్వేశాలు, విధ్వంసాలను కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు కోరుకున్నాయని చెప్పారు. మున్సిపల్‌ ఎన్ని కల్లో బీజేపీ గెలుపునకుప్రతీ కార్యకర్త కృషి చేయలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ ఓటమి తప్పదన్నారు. ఎన్నికల  హావిూలను నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వాసితుల కన్నీళ్లతో మిడ్‌ మానేరు ప్రాజెక్టును నింపారని బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని స్వాగతిస్తూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను వెంటవెంటనే ఇచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వీటన్నింటిని మరిచిపోయి ప్రజలను మోసం చేయాలనే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. గతంలో సీఎం కేసీఆర్‌ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి మిడ్‌ మానేను నిర్వాసితులకు ఇచ్చిన హావిూలను మరిచిపోయారని అన్నారు. అనుపురంలో 57 మంది, సంకెపల్లిలో 16 మంది, చీర్లవంచలో 102 మందికి ఇంత వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. రూ.5 లక్షల నగదు, డబుల్‌ బెడ్‌రూంల హావిూలు నెరవేర్చలేదన్నారు. పేదలను ప్రాజెక్టుల పేరుతో మోసం చేస్తున్నారని, 12 ఏళ్లుగా మిడ్‌ మానేను నిర్వాసితులు ఇబ్బంది పడతున్నా సీఎం భరోసా కూడా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్‌ మానేరు నిర్వాసితులు తిరగబడాలని, మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అసదుద్దీన్‌ ఓవైసీ, సీఎం కేసీఆర్‌లు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని, మత విద్వేశాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. జిల్లా  ప్రజలు ఐక్యతను ప్రదర్శించి గత పార్లమెంట్‌ ఎన్నికల్లో తనను ఎంపిగా గెలిపించారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మరోసారి నిజాం పాలన తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని అన్నారు. కేంద్రంనుంచి నిధులు వస్తున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధన్యవాదాలు కూడా చెప్పడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుండా కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులను చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంగా తెలంగాణను ఏర్పాటు చేసుకోవాలని, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు.