మున్సిపాలిటీల్లో రాజుకుంటున్న వేడి


అభ్యర్థిత్వాల ఖరారయితే  మరింత జోరు


ఖమ్మం,జనవరి2 (జనంసాక్షి):    మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడదల కావడంతో ఉభయ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో  వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇన్నాళ్లు ఎన్నికల చర్చలో కాలం గడిపిన ప్రజలు ఇప్పుడు అభ్యర్థిత్వాల ఖరారు, మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఒకే విడతలోల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో వివిధ పార్టీల శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. తమ విధేయులకే పెద్దపీట వేసి గెలిపించుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరింత వేడెక్కనుంది.  మున్సిపల్‌,వార్డు కౌన్సిలర్ల  ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది.  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. చలికాలంలో ఎన్నికల వేడిని రాజేసింది. ఇదిలావుంటే ప్లాస్టిక్‌ రహిత ఖమ్మానికి నగర ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణ న్‌ పిలుపునిచ్చారు. ఖమ్మం నగరాన్ని పూర్తిగా మిషన్‌ ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆశావహ అభ్యర్థులు కూడా ఇదే ప్రచారం చేపట్టారు.  ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా మొక్కతో పాటు క్లాత్‌బ్యాగులను అందజేస్తున్నారు. నగరంలో ఇటీవల వాణిజ్య వ్యాపార సంస్థలతో సింగిల్‌యూజ్‌ ఎ/-లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించడం జరిగిందని, ప్రజలు కూడా చైతన్యవంతులై ప్లాస్టిక్‌కు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగిస్తున్నారన్నారు. ప్లాస్టిక్‌ మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఒక కేజి ప్లాస్టిక్‌కు బదులుగా ఒక క్లాత్‌బ్యాగ్‌, ఒక మొక్కను, అదే విధంగా 3 కేజీల ప్లాస్టిక్‌కు బదులుగా ఒక క్లాత్‌బ్యాగ్‌తో పాటు ఒక ఫుడ్‌ కూపన్‌ అందిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మొత్తంగా ప్లాస్టిక్‌ నిషేధం కూడా ప్రచారంలో భాగం కానున్నది.